Lifestyle

వైజాగ్ ట్రెండ్స్: ప్రముఖ పబ్స్ & బార్స్ వివరాలు మీకోసం…!

Sandeep Thatla  |  Jul 9, 2019
వైజాగ్ ట్రెండ్స్:  ప్రముఖ  పబ్స్ & బార్స్ వివరాలు మీకోసం…!

విశాఖపట్నం (Vizag) అంటే మనకి ఠక్కున గుర్తొచ్చేది సముద్రం. అందుకే ఎవ్వరు వైజాగ్ వెళ్ళినా సరే.. తప్పకుండా బీచ్‌కి వెళ్ళకుండా తిరిగి రారు. మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన వైజాగ్‌లో తెలుగు వారితో పాటు.. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా నివసిస్తుంటారు. కారణం – ఇక్కడ నావికా దళానికి చెందిన ఈస్టర్న్ నావెల్ కమాండ్ కేంద్రీకృతమై ఉంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలు జరుపుకునేందుకు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

అలా విశాఖపట్నం మనకి దాదాపు ఒక మినీ ఇండియాని తలపిస్తుంది. దీన్ని వల్ల ఇక్కడి ప్రజలు తీరిక వేళల్లో తమ అభిరుచులకు తగ్గట్టుగా కాలక్షేపం చేయడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఉదాహరణకి వారాంతాల్లో ఎక్కువ శాతం మంది యువత సరదాగా గడపడానికి ప్రఖ్యాత పబ్స్, బార్స్, రెస్టారెంట్స్  పదుల సంఖ్యలో విశాఖ తీరాన కొలువుతీరాయి. 

వైజాగ్‌ పబ్స్ & బార్స్ వివరాలు –

ఈ కథనంలో ప్రముఖ పబ్స్ & బార్స్.. విశాఖపట్నంలో ఎక్కడ ఉన్నాయి? వాటి వివరాలు? తెలుసుకుందాం

* డస్క్ పామ్ బీచ్ బార్

ఉడా పార్క్‌కి సమీపంలోని బీచ్ రోడ్డులో ఉన్న ‘డిస్క్ పామ్ బీచ్ హోటల్’కి మంచి పేరుంది. దానికి తగ్గట్టుగానే సాయంత్రాలు చాలామంది ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. ఇక ఈ బార్, రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ కూడా ఉండడంతో ఎక్కువమంది ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతుంగటారు. బీచ్‌కి ఎదురుగా సాయంత్రం ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడికి వస్తుంటారు.

చిరునామా – డస్క్ పామ్ బీచ్ బార్ & రెస్టారెంట్, ఉడా పార్క్‌కి సమీపంలో, బీచ్ రోడ్, విశాఖపట్నం.

Dusk Palm Beach Bar

* మార్కో పోలో లాంజ్ బార్ – వెల్కమ్ హోటల్ గ్రాండ్ బే

ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.. ఈ బార్ విశాఖ వాసులందరికీ అందుబాటులో ఉంటుంది. వెల్కమ్ హోటల్ గ్రాండ్ బేలో ఉన్న ఈ మార్కో పోలో లాంజ్ బార్ ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధం. విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులలో ఇక్కడికి చాలామందే వస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ లాంజ్ చాలా సౌకర్యవంతంగా ఉండడమే.

చిరునామా – వెల్కమ్ హోటల్ గ్రాండ్ బే, బీచ్ రోడ్, జగదాంబ జంక్షన్, విశాఖపట్నం.

Marco Polo Bar

* ఎక్స్‌స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్

పేరుకి తగ్గట్టుగానే స్పోర్ట్స్ అంటే పడిచచ్చే వాళ్ళకి.. ఈ ఎక్స్‌స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్ పక్కాగా సెట్ అవుతుంది. తమ స్నేహితులతో కలిసి క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసేందుకు.. ఒక అడ్డా క్రింద ఈ బార్ & రెస్టారెంట్ ఎంతోమందికి ఇష్టమైన ప్లేస్‌గా మారిపోయింది. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడే రోజున ఈ బార్ కిక్కిరిసి పోయి ఉంటుంది.

చిరునామా – 3rd ఫ్లోర్, శ్రీ కన్య కణోపి, వాల్తేర్ క్లబ్‌కి ఎదురుగా, సిరిపురం, విశాఖపట్నం.

Xtreme Sports Bar

* ట్రైబ్ – ది పార్క్

‘ట్రైబ్’ – పేరుకి తగ్గట్టుగానే ఈ పబ్ చాలా వినూత్నంగా ఉంటుందట. సెలబ్రిటీ డీజేలు ఎక్కువగా వచ్చే ఈ పబ్  విశాఖపట్నంలో మంచి క్రేజ్ పొందిందనే చెప్పాలి. అలాగే నూతన సంవత్సర వేడుకలకి కూడా ఈ పబ్ చాలా ఫేమస్ అని చెబుతుంటారు. ఫ్రెండ్స్, కపుల్స్ ఎక్కువగా ఈ ట్రైబ్ – ది పార్క్‌కి వస్తుంటారు.

చిరునామా – ది పార్క్, బీచ్ రోడ్, లాసన్స్ బే, విశాఖపట్నం.

ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!

Tribe

* వుడ్ హౌజ్

వుడ్ హౌజ్ బార్ & పబ్ … ఇది విశాఖపట్నం వాసులని అమితంగా ఆకట్టుకునే పబ్స్‌లో ఒకటి. లైవ్ బ్యాండ్ ఈ వుడ్ హౌజ్ ప్రత్యేకత కాగా.. ఇక్కడికి వారాంతాల్లో చాలామంది విదేశీ పర్యాటకులు కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే కపుల్స్ కూడా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలోనే రావడం జరుగుతుంది.

చిరునామా – డాల్ఫీన్ హోటల్, డాబా గార్డెన్స్, జగదాంబ జంక్షన్, విశాఖపట్నం.

Wood House

* ముస్టాంగ్ బార్

వైజాగ్‌లోని హోటల్ గ్రీన్ పార్క్‌లో ఉన్న ఈ ముస్టాంగ్ బార్‌కి.. యువతలో మంచి క్రేజ్ ఉంది. కారణం – ఇక్కడ స్టాగ్స్‌కి ఎంట్రీ ఉండడమే. అదే సమయంలో ఎంట్రీ ఫీజ్ కూడా ఇక్కడ లేదు. దీనితో చాలామంది యువత వారాంతాల్లో ముస్టాంగ్ బార్‌కి రావడం జరుగుతుంటుంది.

చిరునామా – గ్రీన్ పార్క్ హోటల్, వాల్తేర్ మెయిన్ రోడ్డు, విశాఖపట్నం.

Mustang Bar

* ఐరన్ హిల్ బ్రూవరీ

విశాఖపట్నంలో ఉన్న అతికొద్ది బ్రూవరీస్లో ఐరన్ హిల్ ఒకటి. వైజాగ్లో ఈ బ్రూవరీకి చాలా పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉండగా రాబోయే రోజుల్లో.. హైదరాబాద్, నెల్లూరు వంటి నగరాలకు దీనిని విస్తరించాలి అని ఆలోచనల్లో ఉన్నారని సమాచారం.

చిరునామా – ప్లాట్ నెం 25, PMJ జువెలర్స్, సిరిపురం, విశాఖపట్నం.

Iron Hill Brewery

* సమ్ ప్లేస్ ఎల్స్ – ది పార్క్

విశాఖపట్నంలో ఉన్న పార్క్ హోటల్‌లో ఉన్న పబ్ పేరు – సమ్ ప్లేస్ ఎల్స్. పార్క్ హోటల్‌లో బస చేసే ప్రతి ఒక్కరు ఈ సమ్ ప్లేస్ ఎల్స్‌కి రావడం జరుగుతుంటుంది. యువత పెద్ద సంఖ్యలో ఈ పబ్‌కి వస్తుంటారు అని అంటారు.

చిరునామా – పార్క్ హోటల్, బీచ్ రోడ్, విశాఖపట్నం.

Someplace Else Bar

* ఇన్ఫినిటీ బార్

విశాఖపట్నం నోవొటెల్ హోటల్ రూఫ్ టాప్ పైన ఏర్పాటు చేసిన.. ఈ ఇన్ఫినిటీ బార్ గురించి విశాఖపట్నంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా బాగా తెలుసు. అంతటి పేరు దీనికి ఉంది. 

చిరునామా – నోవొటెల్ విశాఖపట్నం, మహారాణి పేట, విశాఖపట్నం.

Infinity Bar

* G బార్

బీచ్ రోడ్‌లోని గేట్ వే హోటల్‌లో ఉన్న ఈ “G బార్ & రెస్టారెంట్” అటు విశాఖ ప్రజలనే కాకుండా.. ఇటు పర్యాటకులని సైతం ఆకట్టుకోవడంలో ముందుంది. బీచ్ రోడ్డులో ఉన్న బార్, రెస్టారెంట్స్‌లో G బార్ కూడా ప్రముఖమైనదిగా ఉంది.

అడ్రస్ – గేట్ వే హోటల్, మహారాణి పేట, విశాఖపట్నం.

G bar

* సోమా రెస్టోబార్

లైవ్ మ్యూజిక్ స్పెషలిటీగా ఈ సోమా రెస్టోబార్ నడుస్తుంది. విశాఖపట్నంలో ఉన్న పబ్స్, బార్స్ లో ఇది కాస్త విలక్షణంగా ఉంటుంది. ప్రైవేట్ డైనింగ్ ఏరియా సౌకర్యం ఈ బార్‌లో ఉంది.పేరులోనే కాదు బార్ & రెస్టారెంట్ లోపల కూడా చాలా విలక్షణంగా ఇంటీరియర్స్ ఉంటాయి.

చిరునామా – 4th ఫ్లోర్, VIP సెంటర్, VIP రోడ్డు, ఆశీలు‌మెట్ట, విశాఖపట్నం.

Soma Restobar

ఇవి… విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ బార్స్ & పబ్స్ గురించిన వివరాలు. ఈ కథనం చదివాక, వైజాగ్‌లో ఈ వారాంతం పబ్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వారు.. పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోని మీ ప్రియమైన వారితో సరదాగా గడపండి.

ఆనందంగా.. ఆహ్లాదంగా ఈ పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేసేద్దామా..

Featured Image: Pixabay

Read More From Lifestyle