Food & Nightlife

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

Sandeep Thatla  |  Jul 5, 2019
హైదరాబాద్  ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

హైదరాబాద్ (Hyderabad) అంటే మనకి గుర్తొచ్చేది బిర్యాని, హలీం. అయితే హైదరాబాద్‌‌లో ఈ రెండు ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇంకా మరెన్నో ఉన్నాయి. అందులో ప్రముఖంగా హైదరాబాద్‌లో లభించే టిఫిన్స్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉస్మానియా బిస్కెట్, ఇరానీ ఛాయ్‌తో తమ రోజుని ఎంతమంది ప్రారంభిస్తారో అదే స్థాయిలో ఇడ్లీ, దోస, వడ, పూరితో కూడా రోజుని ప్రారంభించేవారు ఉంటారు.

ఇక పైన పేర్కొన్న ఇడ్లి, వడ, దోస, పూరి వంటి అల్పాహారాన్ని అద్భుతమైన రుచిలో అందించే  కొన్ని హైదరాబాద్ టిఫిన్ సెంటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

హైదరాబాద్‌లో ఆడవారి షాపింగ్‌కి కేర్ అఫ్ అడ్రస్ – లాడ్ బజార్

హైదరాబాద్‌లో ఉండే బెస్ట్ టిఫిన్ సెంటర్స్

హైదరాబాద్‌లో మంచి టిఫిన్ అందించూ పలు బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్, టిఫిన్ సెంటర్ల వివరాలివి..!

* మహాలక్ష్మి రెడ్డి బ్రదర్స్ టిఫిన్స్

హైదరాబాద్‌లోని మెహదీపట్నం ప్రాంతంలో బాగా పేరుపొందిన టిఫిన్ సెంటర్‌గా.. మహాలక్ష్మి టిఫిన్స్‌కు ఆదరణ ఉంది. అయితే అక్కడ జనసామాన్యంలో మాత్రం దానికి రెడ్డి బ్రదర్స్ అనే పేరు మరో పేరు కూడా ఉంది. కారణం ఇద్దరు అన్నదమ్ములు కలిసి.. ఈ టిఫిన్ సెంటర్‌ని నిర్వహిస్తుండడమే. ఇక ఈ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ, వడతో లభించే చట్నీ చాలా ఫేమస్. ఎక్కువశాతం మంది ఇక్కడ చట్నీని రుచి చూడడానికి వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

అడ్రస్ – సెయింట్ ఆన్స్ కాలేజ్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్.

Sri Mahalaxmi Reddy Brothers Tiffin Centre

* రామ్ కి బండి

ఈ “రామ్ కి బండి” గురించి తెలియనివారు దాదాపు హైదరాబాద్‌లో ఎవరు ఉండరు. నాంపల్లి ఏరియాలో మొజంజాహి మార్కెట్‌కి ఎదురుగా.. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఒక బండి పైన అల్పాహారం తయారుచేస్తుంటారు. అలా దీనికి “రామ్ కి బండి” అని పేరు వచ్చింది. ఇక ఈ బండి దగ్గర టిఫిన్ చేయడానికి హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగరాల నుండి కూడా ఉద్యోగులు వస్తుంటారు. సిటీలో నైట్ డ్రైవ్ చెసేవారు.. తెల్లవారుజామున ఇక్కడ టిఫిన్ చేయడానికి  ఆసక్తి చూపుతుంటారు.

అడ్రస్ – కరాచీ బేకరీ ముందు, మొజంజాహి మార్కెట్ దగ్గర, నాంపల్లి, హైదరాబాద్.

Ram Ki Bandi

* రాంభరోసే భండార్

కాచిగూడ ప్రాంతంలో ఉన్న ప్రముఖ టిఫిన్ సెంటర్స్‌లలో రాంభరోసే భండార్ ఒకటి. ఇక ఈ హోటల్‌లో లభించే “భత్తడ్ కి ఇడ్లి” చాలా ఫెమస్. దీనికోసం చాలా మంది ఫుడ్ లవర్స్ ఇక్కడికి వస్తుంటారు, అదే వారాంతాల్లో అయితే.. ఈ హోటల్‌లో తాకిడి ఎక్కువగా ఉంటుంది.

అడ్రస్ – గణేష్ టెంపుల్ దగ్గర, రిలయన్స్ స్టోర్ కి సమీపంలో, కాచిగూడ, హైదరాబాద్.

రంజాన్ అంటే హలీం ఒక్కటే కాదు.. ఈ వంటకాలు కూడా ప్రత్యేకమే..!

Rambharose Bhandar

* రామ్స్ దోస హౌస్

హైదరాబాద్‌లో పిజ్జా దోస తినాలంటే రామ్స్ దోస హౌస్‌కి రావాల్సిందే. రొటీన్‌కి భిన్నంగా ఏదైనా రుచి చూడాలనుకునే వారు ఈ హోటల్ కి వస్తే … పిజ్జా దోస, మాసాల దోస, తవా ఇడ్లీ వంటి పదార్ధాలు ఇక్కడ రుచి చూడవచ్చు.

అడ్రస్ – రోడ్ నెంబర్ 14, BNR కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్.

Rams Dosa House

* ప్రగతి టిఫిన్ సెంటర్

రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా దోస తినాలంటే మీరు వెళ్ళాల్సింది ప్రగతి టిఫిన్ సెంటర్‌కే. కోఠిలో ఉన్న ఈ ప్రముఖ టిఫిన్ సెంటర్‌కి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. అందుకే ఉదయం సమయంలో ఈ ప్రాంతానికి వచ్చేవారు తప్పక ఇక్కడ అల్పాహారం తీసుకుంటారు.

అడ్రస్ – హనుమాన్ టెక్డి, ప్రగతి కాలేజ్, కోఠి, హైదరాబాద్.

Pragathi Tiffin Centre

* కామత్ హోటల్

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో కామత్ హోటల్ ఒకటి. హైదరాబాద్‌లో మూడు శాఖలుగా విస్తరించి ఉన్న కామత్ హోటల్.. ఇక్కడ భోజన ప్రియులకి ఎప్పుడైనా ప్రియమైన హోటలే! శాకాహార హోటల్స్‌లో ఇది ప్రముఖమైనది కావడంతో.. ఇక్కడికి చాలా మంది వచ్చి టిఫిన్ చేస్తుంటారు.

అడ్రస్ – బిర్లా మందిర్ బస్టాప్ ముందు, రవీంద్ర భారతి దగ్గర, హైదరాబాద్.

Kamat Hotel

* చట్నీస్

దాదాపు ఒక ఆరేడేళ్ళుగా ఈ చట్నీస్ బ్రాండ్ హైదరాబాద్‌లో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చట్నీస్‌లో దాదాపు పదుల సంఖ్యలో టిఫిన్స్, పదుల సంఖ్యలో చట్నీస్ మనకి లభిస్తుంటాయి. అందుకనే ఈ రెస్టారెంట్‌కి చట్నీస్ అని పేరు పెట్టారు. అలాగే ఈ పేరుకి తగ్గట్టు మంచి రుచికరమైన చట్నీస్ ఇక్కడ రుచి చూడవచ్చు. ఇక ఈ చట్నీస్ రెస్టారెంట్స్ పలు సంఖ్యల్లో హైదరాబాద్ నగరంలో ఉన్నాయి.

అడ్రస్ – నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, హైదరాబాద్.

Chutneys

* గోవింద్ కి బండి

చార్మినార్‌కి సమీపంలో మనం రుచికరమైన అల్పాహారం రుచి చూడాలంటే ఠక్కున గుర్తొచ్చేది “గోవింద్ కి బండి”. ఇక్కడ లభించే స్పెషల్ దోశలు, ఇడ్లీలు, వడలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ లభించే పదార్దాల ధరలు కూడా సామాన్యులకి అందుబాటులో ఉండడం కూడా// ఈ బండి దగ్గరికి భోజన ప్రియులని వచ్చేలా చేస్తోంది.

అడ్రస్ – చార్ కమాన్, ఘాన్సీ బజార్, చార్మినార్ దగ్గర, హైదరాబాద్.

Govind Ki Bandi

* కాకతీయ టిఫిన్స్

ఎగ్ దోసతో పాటుగా కారం దోస, ఊతప్పం వంటి పదార్ధాలని.. దాదాపు అయిదారు చట్నీలతో కలిపి తింటే ఆ మజానే వేరు. బంజారా హిల్స్‌లో ఉన్న ఈ కాకతీయ టిఫిన్స్‌కి ఆ చుట్టుపక్కల  ప్రాంతాల యువకులు & విద్యార్ధులకి.. వారి ఆకలిని తీర్చే భోజనశాలగా మంచి పేరుంది. 

అడ్రస్ – రోడ్డు నెంబర్ 11, బంజారా హిల్స్, హైదరాబాద్.

Kakatiya Tiffins

* రాయల్ టిఫిన్ సెంటర్

అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ టిఫిన్ సెంటర్స్‌లలో రాయల్ టిఫిన్ సెంటర్ ఒకటి. ఈ టిఫిన్ సెంటర్‌లో జనసామాన్యం ఎక్కువగా ఇష్టపడే అల్పాహారంతో పాటుగా.. మరికొన్ని ఆసక్తికరమైన పదార్దాలు ఇక్కడ లభిస్తాయి. ఉదాహరణకి – పిజ్జా దోస, మంచూరియన్ దోస & బటర్ మసాలా దోస.

అడ్రస్ – శ్రీ రామ టవర్స్, బొగ్గులకుంట, అబిడ్స్, హైదరాబాద్.

Royal Tiffins

* నారాయణ టిఫిన్ సెంటర్

యూసఫ్ గూడ ప్రాంతంలో ఉన్న వారిలో.. నారాయణ టిఫిన్ సెంటర్ అంటే తెలియని వారుండరు. దీన్నిబట్టి ఆ టిఫిన్ సెంటర్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పొచ్చు. ఇక ఇక్కడ లభించే “ఘీ ఉప్మా దోస”కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అదే సమయంలో స్పెషల్ పెసరట్టుకి కూడా పెద్ద ఫాలోయింగే ఉంది. ఇక్కడ నివసించే బ్యాచిలర్స్ & ఫ్యామిలీస్‌కి ఆహారాన్ని అందించే.. ఒక మంచి టిఫిన్ సెంటర్‌గా పేరు సంపాదించుకుంది.

అడ్రస్ – వెంకటగిరి వాటర్ ట్యాంక్, యూసఫ్ గూడ, హైదరాబాద్.

Narayana Tiffin Centre

* శ్రీ పూర్ణ టిఫిన్ సెంటర్

యూసఫ్ గూడలో ఉన్న మరొక ప్రముఖ టిఫిన్ సెంటర్ – పూర్ణ టిఫిన్ సెంటర్. ఈ టిఫిన్ సెంటర్‌లో ఘీ ఇడ్లీ, ఉప్మా దోస & ఉప్మా పెసరట్టు ఇక్కడ స్పెషల్‌గా లభిస్తాయి. కృష్ణ నగర్, యూసఫ్ గూడ వాసులకి ఉదయాన్నే రుచికరమైన టిఫిన్ కావాలంటే.. ఈ టిఫిన్ సెంటర్‌కి వచ్చేస్తుంటారు.

అడ్రస్ – శ్రీకృష్ణ నగర్, యూసఫ్ గూడ, హైదరాబాద్.

Sri Poorna Tiffins Centre

ఇడ్లీ డాట్ కామ్:  ఇవే కాకుండా విఐపి హిల్స్ (మాదాపూర్) ప్రాంతంలో ఉండే వివిధ వెరైటీల ఇడ్లీ రెసిపీలకు పెట్టింది పేరు.

 

 

హైదరాబాద్‌లో రుచికరమైన, నోరూరించే టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయో తెలిసిందిగా… మరింకెందుకు ఆలస్యం వెంటనే పైన పేర్కొన్న వాటిలో.. మీకు నచ్చిన హోటల్‌కి బయల్దేరండి.  

హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..

 

Read More From Food & Nightlife