భారత్‌లో నాకు నచ్చే విషయాల్లో మొదటిది మన పెళ్లిళ్లే.. చుట్టాలందరూ చేరి వధూవరులను ఒక్కటిగా చేర్చే ఈ వేడుకలో సంప్రదాయంతో పాటు సరదా కూడా నిండి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది పెళ్లిళ్లలో ఎక్కువగా జరిగే సంగీత్, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్లు వధూవరులకు దగ్గరయ్యే అవకాశాన్ని పెంచుతాయి.
అందుకే ఇప్పుడు మన పెళ్లిళ్లలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. వీటన్నింటిలోనూ ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది సంగీత్(Sangeet).. వధువు, వరుడు కుటుంబాలు పోటాపోటీగా నృత్యాలు చేసే ఈ వేడుక కోసం పాట ఎంపిక చేసుకోవడం, స్టెప్పులు(steps), డ్రస్సులు(Dresses) నిర్ణయించుకోవడం.. ఇలా అన్నీ ఆసక్తిపెంచేవే.. ఇలా మీరూ మీ పెళ్లిలో సంగీత్ వేడుక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బ్లాగర్ సంగీత వేడుకలు మీకు చక్కటి స్ఫూర్తిని అందిస్తాయి..
జస్లీన్ గిల్(Jasleen gill).. ముంబైకి చెందిన ఫ్యాషన్ బ్లాగర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్.. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ జాషువా రావ్‌ని ఇటీవలే గోవాలో వివాహమాడింది. వీరిద్దరి పెళ్లి సందర్భంగా జరిగిన వేడుకలన్నీ ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఈ అమ్మడు తన పెళ్లి వేడుకల్లో స్నేహితురాళ్లతో కలిసి కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రంలోని లండన్ టుమక్కుదా.. అనే పాటకు చేసిన నృత్యం మాత్రం పెళ్లికే హైలైట్ అని చెప్పుకోవాలి.
ఆమె తన స్నేహితులతో కలిసి అద్బుతమైన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వధువు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్‌గా మారిపోయింది. ఆమె కొరియోగ్రాఫర్ విభా లుహాదియా పోస్ట్ చేసిన ఈ వీడియోను పలువురు షేర్ చేయడంతో ఈ వధువు ఒక్క రోజులోనే పాపులర్‌గా మారిపోయింది. పసుపు రంగు స్లీవ్‌లెస్ షరారా ధరించిన ఈ అమ్మడు తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి అందంగా నర్తించింది. ఆమె వేసిన స్టెప్పులతో వరుడి హృదయాన్ని మరోసారి దోచేసింది.
డ్యాన్స్ అంటే కేవలం అదేదో చేయాలన్నట్లుగా చేయడం కాదు.. ఫన్నీగా, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చేసేలా ఈ స్టెప్పులు ఉండడం విశేషం. తన స్నేహితురాళ్లతో కలిసి ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ వధువు ఈ నృత్యం చేయడం ఆ డ్యాన్స్‌కి మరింత కళను తీసుకొచ్చింది. జస్లీన్ గిల్‌కి ఎప్పటినుంచో నృత్యమంటే ఆసక్తి అని.. తన స్నేహితురాళ్ల పెళ్లిలోనూ అద్బుతంగా నర్తించిన ఆమెకోసం సులువైన స్టెప్పులను ఎంతో ఎంజాయ్ చేయగలిగేలా రూపొందించానని తన పోస్ట్ ద్వారా వివరించారు స్టూడియో ఇన్ ద హౌజ్‌కి చెందిన కొరియోగ్రాఫర్ విభా లుహాదియా.
మరి, వధువు అంత బాగా నృత్యం చేస్తే వరుడు మాత్రం వెనక్కి తగ్గుతాడా? తాను వధువు కంటే ఏమాత్రం తక్కువ తినలేదని నిరూపించాడు. సల్మాన్ ఖాన్ నటించిన ప్యార్ కియా తో డర్‌నా క్యా సినిమాలోని ఓ ఓ జానే జానా పాటకు నృత్యం చేస్తూ ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. ఈ పాట తర్వాత దలేర్ మెహెందీ పాడిన టునక్ టునక్ పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన విభా వీరి గురించి చెబుతూ కేవలం ఒకే ఒక్కసారి కొంతమందికి మాత్రమే ఈ స్టెప్పులు నేర్పించాను. కానీ అందరూ ఇంత బాగా చేస్తారని నేను వూహించలేదు అని రాసుకొచ్చారు.
ఒక్కసారిలోనే ఇంత చక్కటి స్టెప్స్‌ని వీరికి నేర్పిన కొరియోగ్రాఫర్ విభా లుహాదియాకి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. అయితే ఆమె నేర్పిన స్టెప్పులను అంతే అద్బుతంగా చేసిన ఈ వధూవరులు.. వారి స్నేహితుల ప్రదర్శన కూడా అద్బుతమనే చెప్పుకోవాలి. ఈ అందమైన జంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ వారి జీవితం కూడా వారి ప్రదర్శనలాగే ఎంతో అందంగా, ఆనందంగా కొనసాగాలని.. వారు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుందాం.
స్నేహితురాలి సంగీత్ వేడుకలో ఎలాంటి లిప్‌స్టిక్ వేసుకోవచ్చో ఆంగ్లంలో చదవండి
సంగీత్‌లో వధువు నృత్యం చేయడానికి తగిన పాటల గురించి ఆంగ్లంలో చదవండి.
సంగీత్ వేడుకలో ధరించాల్సిన షూల గురించి ఆంగ్లంలో చదవండి