Fashion
బాలీవుడ్ భామలు ధరించిన.. ఈ బ్లౌజ్ డిజైన్లు మనకూ బాగుంటాయి (Latest Blouse Designs From Bollywood)
ఇప్పుడు మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏ విషయమైనా.. చాలా త్వరగా అందరికీ చేరుతోంది. ఫ్యాషన్ విషయంలో అయితే ఈ వేగం మరీ ఎక్కువగా ఉంది. సెలబ్రిటీలు తమ ఫొటోలు ఇలా సామాజిక మాధ్యమాల్లో పెట్టగానే.. ఈ డ్రస్ బాగుంది… ఆ నెక్లెస్ బాగుందంటూ.. షేర్‌ల మీద షేర్‌లు చేస్తున్నారు యువతులు. అంతేకాదు ఫ్యాషన్ విషయంలో వారిని ఫాలో అవుతున్నారు కూడా. ప్రస్తుతం పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో చీరపై ఎలాంటి బ్లౌజ్ ధరిస్తే బాగుంటుంది? ఏ మోడల్ అయితే నాకు నప్పుతుంది? అనుకోని వారెవరైనా ఉంటారా? అందుకే బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించిన కొన్ని మోడళ్లను మీకు మేం అందిస్తున్నాం. ఇవి పెళ్లికూతురి దగ్గరి నుంచి ఆమె స్నేహితురాలి వరకు ఎవరికైనా సరే నప్పుతాయి.
లాంగ్ స్లీవ్స్ (Long SLeeves Blouse)
లాంగ్ స్లీవ్స్ నేటి తరం యువతులను బాగా ఆకట్టుకొంటున్న ఫ్యాషన్. మన బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఈ విషయంలో మనకు ఆదర్శమని చెప్పుకోవాలి. ఎలాంటి ప్యాట్రన్ ధరించాలన్నా ఆమె వాల్‌ని ఒక్కసారి పరిశీలిస్తే సరిపోతుంది.
ఉత్తమమైన లెహంగా డిజైన్ల కోసం ఈ ఆర్టికల్ చదవండి
క్రాప్ ఆర్ట్ (Crop Art Blouse)
సంప్రదాయానికి కాస్త ఆధునిక హంగులు అద్దాలంటే క్రాప్ ఆర్ట్ బ్లౌజ్‌తోనే సాధ్యమవుతుంది. ప్రియాంక చోప్రాని చూడండి. సవ్యసాచి డిజైన్ చేసిన చీరపై ప్రింటెడ్ టీషర్ట్ బ్లౌజ్ ధరించి ఎలా మెరిసిపోతోందో? మీరు కూడా ఈ స్టయిల్‌ని ఒకసారి ప్రయత్నించండి.
ఆఫ్ షోల్డర్ (Off Shoulder Blouse)
స్నేహితురాలి పెళ్లికి వెళుతున్నారా? అందరి చూపూ మీ మీదే నిలవాలనుకొంటున్నారా? అయితే మీరు ఈ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ వేసుకోవాల్సిందే. మీ కాలర్ బోన్ అందాలను చూపిస్తూ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కృతి సనన్‌ను చూడండి. ఎమరాల్డ్ గ్రీన్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్‌లో ఎంత చక్కగా మెరిసిపోతోందో? ఆమె లాంగ్ స్కర్ట్ పై ధరించినా.. చీరలకు కూడా ఇది బాగా నప్పుతుంది.
సరికొత్త బ్లౌజ్ డిజైన్ల కోసం ఈ ఆర్టికల్ చదవండి
కోల్డ్ షోల్డర్ (Cold Shoulder Blouse)
ఇటీవలి కాలంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు ధరిస్తున్న బ్లౌజ్ మోడల్ ఇది. స్నేహితురాలి పెళ్లికి లేదా ఏదైనా కుటుంబ సంబంధమైన ఫంక్షన్లో ధరించడానికి ఈ మోడల్ బాగా సూటవుతుంది. బాలీవుడ్ నటి అలియాభట్ ను చూడండి. చమ్కీలతో మెరిసిపోతున్న మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ చీరపై కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ ధరించి ఎంత క్యూట్‌గా మెరిసిపోతోందో?
బెలూన్ హ్యాండ్స్ (Balloon Hands Blouse)
నలుగురిలోనూ ప్రత్యేకంగా కనపడాలనుకొనే వారికి సరిగ్గా నప్పే మోడల్ ఇది. జాకెట్ చేతులు పొడవుగా, వదులుగా ఉండి..మణికట్టు దగ్గర కుచ్చుల మాదిరిగా ఉంటుంది. హైనెక్ బ్లౌజ్‌కి ఈ రకమైన చేతులను జోడిస్తే వింటేజ్ లుక్ వస్తుంది.
టీ షర్ట్ జాకెట్ (Tea Shirt Jacket Blouse)
ఫ్యాషన్ ట్రెండ్ సృష్టించడంలో మన హైదరాబాదీ దియామీర్జాకు సాటి ఎవరూ లేరు. దానికి నిదర్శనం ఇదే. రీతూకుమార్ డిజైన్ చేసిన చీరపై టీ షర్ట్ బ్లౌజ్ ధరించి అందరినీ ఆకట్టుకొంది దియా. అది కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది కదా. మీరు కూడా దియాను స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఫ్యాషన్ ఫాలో అయిపోండి.
బెస్ట్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ల కోసం ఈ వ్యాసం చదవండి
షీర్ బ్లౌజ్ (Shear Blouse)
సోనాక్షి సిన్హా మాదిరిగా మీరు కూడా చక్కగా స్ట్రాప్స్‌తో ఉన్న బ్లౌజ్ ధరించి అందరినీ మెప్పించండి. అది మీ అందానికి మరింత సొబగులనద్దుతుంది.
లేస్ బ్లౌజ్ (Lace Blouse)
కోల్డ్ షోల్డర్ మోడల్ హంగులతో రూపు దిద్దుకొన్న లేస్ బ్లౌజ్‌లో బాలీవుడ్ సొగసరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసిపోతోంది కదా. ఫంక్షన్లో మీరు కూడా ఇలాంటి బ్లౌజ్ ధరిస్తే మీ నుంచి చూపు ఎవరూ తిప్పుకోలేరు.
క్యాప్డ్ బ్లౌజ్ (Capped Blouse)
మీ బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్‌తో నిండి ఉంటే దానికి క్యాప్డ్ హ్యాండ్స్ వచ్చేలా కుట్టించండి. ఈ మోడల్ ఎవరికైనా బాగా సూటవుతుంది. ప్లెయిన్, ఎంబ్రాయిడరీ, నెట్ ఏ చీర మీదకైనా ఈ బ్లౌజ్ బాగుంటుంది.
మెగా స్లీవ్డ్ బ్లౌజ్ (Mega Sleeved Blouse)
బాలీవుడ్ (Bollywood) బ్యూటీ అదితీ రావు హైదరీ ధరించిన ఈ బ్లౌజ్‌ని చూస్తే మీకేమనిపిస్తుంది. పాత సినిమాల్లో హీరోయిన్లు ధరించే వాటి మాదిరిగా అనిపిస్తోంది కదా.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు కదండి. ఈ బ్లౌజ్‌లో అదితి చాలా అందంగా కనిపిస్తోంది కదా. పగలు జరిగే పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఈ రకం బ్లౌజ్ ధరిస్తే చాలా బాగుంటుంది. ఓ సారి ట్రై చేసి చూడండి.