మనం అందంగా కనిపించాలంటే ఆకర్షణీయమైన డ్రస్ ఎలా అవసరమో.. ఒక డ్రస్ అందంగా కనిపించడానికి ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్ కూడా అంతే అవసరం. ఈ కాంబినేషన్ సరిగ్గా కుదిరితేనే ఏ డ్రస్ అయినా అందంగా కనిపించేది.. అందుకే వీటిలోనూ రకరకాల షేడ్స్, ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చినా, ట్రెండ్స్ సృష్టించినా కొన్ని మాత్రమే ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అనిపించుకుంటాయి.
ఈ జాబితాలో అన్నింటి కంటే ముందు వచ్చే కాంబో – బ్లాక్ అండ్ వైట్ (Black and White). క్లాసీ కాంబినేషన్స్‌లో ఒకటిగా చెప్పుకునే ఈ ట్రెండ్‌ను ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొందరు కేవలం ఈ కలర్స్ కాంబోనే ఎంచుకుంటే.. ఇంకొందరు మాత్రం ఈ కాంబినేషన్‌కు మరొక కలర్‌ను కూడా జోడించి కలర్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు.
హైదరాబాదీ బ్యూటీ అదితీరావు హైదరి కట్టుకున్న ఈ చీరను చూడండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కు ఎరుపు రంగు కూడా జోడించి ఎంత అందంగా మెరిసిపోతోందో! సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కట్టుకున్న ఈ చీరను పాయల్ ఖండ్వాలా డిజైన్ చేయగా, అదితి దానికి ఆమ్రపాలి రూపొందించిన సిల్వర్ జ్యుయలరీ జత చేసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా ధరించిన ఈ అవుట్ ఫిట్ చూస్తే.. కాలేజ్ అమ్మాయిలు తప్పకుండా తమ వార్డ్ రోబ్‌లో చేర్చుకుంటారు. సరదాగా స్నేహితులతో కలిసి అవుటింగ్కు వెళ్లినప్పుడు, చిన్న చిన్న పార్టీలకు హాజరయ్యే సందర్భాలకు ఇది చక్కని ఎంపిక. పైగా ఈ అవుట్ ఫిట్‌కు పెద్దగా యాక్సెసరీస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని సోనాని చూస్తే మనకు అర్థమైపోతోంది!
రఫెల్స్ అంటే ఇష్టపడని అమ్మాయిలుంటారా చెప్పండి? అందులోనూ ఈ ట్రెండ్‌లో రూపొందించిన ఫ్రాక్స్‌కు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి, ఇలా రఫెల్స్ తరహాలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ స్టైల్లో ఫ్రాక్ రూపొందిస్తే ఎలా ఉంటుందో తెలుసా?? ఇదిగో.. బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ ధరించిన అవుట్ ఫిట్లానే అందంగా ఉంటుంది కదూ!
ప్రస్తుతం బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్స్‌లో ప్యాంట్ సూట్స్ కూడా ఒకటి. మరి, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా?? అయితే అదితీరావు హైదరీ ధరించిన ఈ సూట్ చూస్తే సరి!! బ్లాక్ కలర్ సూట్‌కి వైట్ కలర్ కాలర్, హ్యాండ్స్ మంచి లుక్‌ని ఇచ్చాయి కదూ!
ప్యాంట్ సూట్ తర్వాత కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ట్రెండ్స్‌లో జంప్ సూట్ కూడా ఒకటి. ఈ ట్రెండ్ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చూడచక్కగా ఉంటుంది. కావాలంటే అదితీరావు ధరించిన బ్లాక్ ప్రింటెడ్ ఫ్లేర్డ్ జంప్ సూట్ చూడండి.
ప్లెయిన్ బ్లాక్ కలర్ డ్రస్ వేసుకున్నాక.. దానిపై బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కేప్ లేదా కోట్ ధరించినా ఆ లుక్ చాలా బాగుంటుంది. క్యూట్ బ్యూటీ కృతీసనన్ ధరించిన డ్రస్ చూస్తే మీరు కూడా ఈ మాట నిజమే అనక మానరు! బ్లాక్ డ్రస్‌కు బ్లాక్ ప్రింటెడ్ కేప్‌ను జత చేసిన ఈ భామ భలే అందంగా మెరిసిపోతోంది కదూ!
చూశారుగా.. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రకరకాల ఫ్యాషన్స్‌ను ఫాలో అవుతూ అందంగా ఎలా మెరిసిపోవచ్చో! మీరు కూడా వీటిలో మీకు నచ్చిన ఫ్యాషన్స్ ఎంపిక చేసుకుని ఫాలో అయిపోండి మరి..!
ఇవి కూడా చదవండి
కాలేజ్ ఫంక్షన్స్‌లో.. ఈ శారీ లుక్స్‌తో అదరగొట్టేయండి..!
స్టైలిష్‌గా కనిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!