
ఈ రోజు (ఆగస్టు 7, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీ ఆర్థిక సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మీ ఆస్తి వివాదాలు ఒక పరిష్కార దశకు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. వివాహితులు కూడా పొదుపు సూత్రాలు పాటిస్తే మంచిది. ఖర్చులను అదుపులో పెట్టుకుంటూ.. కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్డడానికి ప్రయత్నించండి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. తాము చేరాల్సిన లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులు.. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన అవకాశం. అలాగే ఉద్యోగులు మీ ప్రత్యర్థులతో అన్ని సమస్యలను పరిష్కరించుకొని.. ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా.. బిజినెస్‌ను విజయవంతంగానే నిర్వహిస్తారు.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు.. బాగా ఆలోచించడం మంచిది. ముఖ్యంగా నిరుద్యోగులు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు వివేకంతో వ్యవహరించాలి. బాండ్స్ పై సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు కూడా జాబ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. వివాహితులు స్థిరాస్తులు కొనడం లేదా కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చు. ఎంట్రప్రెన్యూర్స్ లేదా స్టార్టప్స్ నిర్వహించే వారు ప్రయత్నిస్తే.. ఈ రోజు మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనం, బద్ధకం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని విషయాలలో నిరక్ష్యాన్ని వీడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేస్తే బెటర్. వ్యాపారులు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. అప్పుడప్పుడు మనం తేలికగా తీసుకొనే విషయాలే.. మన కొంప ముంచే అవకాశముంది.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యంతో పాటు.. తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. అలాగే వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అదే విధంగా మీ డైట్‌లో మార్పులు చేసుకుంటే బెటర్. యోగా, వ్యాయామం చేయడం లేదా జిమ్‌లో చేరడం మొదలైన పనులకు ఈ రోజు నుండే శ్రీకారం చుట్టండి.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఒకరి సహాయాన్ని పొందడం లేదా ఒకరి మద్దతు పొందడం చేస్తారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో మీ స్నేహితులు లేదా కుటుంబీకులు అండగా ఉంటారు. ఆఫీసులో మీకు ఎదురైన విపత్కర పరిస్థితుల నుండి బయట పడేందుకు.. సహోద్యోగులు హెల్ప్ చేస్తారు. అలాగే వ్యాపారులు కూడా సలహాల కోసం నిపుణులను సంప్రదించే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు కళారంగంలోని వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సినిమాలపై ఆసక్తి ఉన్న నటీనటులు, మీడియా రంగ నిపుణులు కొంచెం కష్టపడితే.. ఊహించని ఆఫర్స్ మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ప్రత్యమ్నాయ రంగాల్లో రాణించాలని భావించే నిరుద్యోగులు, విద్యార్థులకు కూడా ఈ రోజు మంచిది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలని భావిస్తే.. భేషుగ్గా చేయచ్చు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ మనసును గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశముంది. అయినా ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. వాదోపవాదాలకు దిగవద్దు. ముఖ్యంగా కుటుంబీకులతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సహనం పాటించండి. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. మీ వైపు నుండే కాకుండా.. ఎదుటి వారి వైపు నుండి కూడా ఆలోచించండి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పూర్తి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. పూర్తి పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలను తమకు తామే సృష్టించుకుంటారు. అలాగే వివాహితులు కూడా తమ కుటుంబంతో హాయిగా గడుపుతారు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు కూడా ఈ రోజు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు కుటుంబ బంధాల విషయంలో నిరక్ష్యం కూడదు. ముఖ్యంగా మీ భాగస్వామితో మీకు మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది. కనుక.. ఇలాంటి సమయాలలో వాదోపవాదాలకు తావివ్వకండి. కోపాన్ని నియంత్రించుకోండి. శాంతంగా వ్యవహరించండి. అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఎదుటి వారి వైపు నుండి కూడా ఆలోచించండి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు కొంత వరకు అసహనానికి గురవుతారు. అలాగే నిద్రలేమి వల్ల కూడా ఇబ్బంది పడతారు. మీకు చికాకు కలిగించే సంఘటనలు కూడా మీరు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కాస్త వివేకంతో, సమయస్ఫూర్తితో ప్రవర్తించండి. ముఖ్యంగా మీకు సంబంధం లేని విషయాలలో తల దూర్చవద్దు. అలాగే వివాదాలకు దూరంగా ఉండండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.