Entertainment
విద్యార్థులకే నా మద్దతు : జేఎన్‌యూలో దాడికి గురైన స్టూడెంట్స్‌కి.. దీపికా పదుకొణే పరామర్శ

దీపికా పదుకొణే (Deepika Padukone) – ఈ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది ఓ అందమైన అభినేత్రి. దీపిక ఎంపిక చేసుకున్న చిత్రాలు.. అలాగే తన ఎనలేని ప్రతిభ కారణంగానే ఆమెకు ఆ పేరు వచ్చింది. తాజాగా ఆమె యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఛపక్’ చిత్రంలో నటించింది.
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?
ఈ చిత్రంలో దీపిక యాసిడ్ బాధితురాలిగా నటించడమే కాకుండా.. ఆ పాత్రకి తగ్గట్టుగా ప్రొస్థెటిక్ మేకప్‌ను కూడా వేసుకుంది. తన పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకువచ్చే ప్రయత్నమే ఇదని ఈ సందర్భంగా తెలిపింది దీపిక. ఛపక్ (Chhapaak) చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ సినిమా ప్రచార నిమిత్తం.. ప్రస్తుతం దీపిక దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటిలోనూ పర్యటిస్తోంది. ఇదే క్రమంలో నిన్న ఆమె ఢిల్లీకి కూడా వచ్చింది. ఆ సమయంలోనే ఆమె చేసిన ఓ పని ఇప్పుడు ఆమెని న్యూస్ మేకర్‌గా చేసేసింది. అదేంటి ఇప్పటికే సూపర్ హీరోయిన్ అయిన దీపిక.. మరలా కొత్తగా న్యూస్ మేకర్ అవ్వడమేంటని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం.
గత కొన్నిరోజులుగా ఢిల్లీ (Delhi) జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం కేంద్రంగా.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పౌరసత్వం బిల్ పై అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఆ నిరసన కార్యాక్రమాలు కాస్త హింసాత్మకంగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి.
ఇక ఇటీవలే ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన దుండగులు కొందరు జేఎన్ యూ (JNU) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించి.. నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై ఇష్టానుసారంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో జేఎన్‌యూ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ అయిషీ గోష్ తలకి తీవ్రంగా గాయమైంది. దానితో ఈ సంఘటనని అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సినీ తారలు కేవలం ఈ దాడిని ఖండిస్తుండగా.. దీపిక మాత్రం ఏకంగా జేఎన్‌యూ క్యాంపస్‌కి వెళ్లి.. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు అయిషీ గోష్‌ని పరామర్శించడం గమనార్హం. దీపిక అక్కడికి చేరుకునే సమయానికి విద్యార్థుల మీటింగ్ జరుగుతోంది. ఆమె ఆ మీటింగ్ పూర్తయ్యాక వారితో మాట్లాడి.. సంఘీభావం తెలిపి అక్కడి నుండి వెళ్లిపోయింది.
అదే సమయంలో దీపిక ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఆమె అయిషీని పరామర్శించడానికి గల కారణాలను తెలియపరచకుండానే వెళ్లిపోయారు. అప్పటికే ఈ అంశం పైన సోషల్ మీడియా వేదికగా ఎందరో సెలబ్రిటీలు & సినీ స్టార్స్ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తుండగా.. దీపిక ఏకంగా అక్కడికే వెళ్లి వారిని పరామర్శించడంతో అందరి దృష్టి ఆమె పైన పడింది.
దీపిక పదుకొణే ‘ఛపాక్’ చిత్రం ఎందుకు చూడాలంటే ..?
ఇక దీపిక విద్యార్థులను పరామర్శించాక.. #IStandWithDeepika అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం విశేషం. దర్శకుడు అనురాగ్ కశ్యప్ లాంటి వారైతే.. దీపిక తాను నిర్మించిన సొంత సినిమా విడుదలకి రెండు రోజుల ముందు ఇటువంటి సాహసం చేయడం నిజంగా ఒక స్ఫూర్తి రగిల్చే అంశం అని.. ఆమెకు సెల్యూట్ అని ట్వీట్ చేశారు.
ఇక నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్ అయితే .. రీల్ లైఫ్‌లోనే కాకుండా.. రియల్ లైఫ్‌లో కూడా దీపికను ‘బోల్డ్’ అంటూ పొగిడారు. సినీ పరిశ్రమ నుండి సోనమ్ కపూర్, స్వర భాస్కర్, వరుణ్ గ్రోవర్ లాంటివారు కూడా ఆమెకి తమ మద్దతు తెలిపారు.
ఆమె విద్యార్థులకు మద్దతు తెలిపిన కొద్ది నిమిషాలలోనే.. ‘ఆమె సినిమాని బహిష్కరించండి’ అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా క్యాంపెయిన్స్ చేయడం గమనార్హం. ఏదేమైనా సరే, దీపిక చూపిన తెగువ మాత్రం చాలా మందికి స్ఫూర్తిదాయకమని పలువురు నెటిజన్లు సైతం ఆమెను కొనియాడారు.
లెజెండరీ విమెన్ క్రికెటర్ ‘మిథాలీ రాజ్’ బయోపిక్‌లో.. తాప్సీ పన్ను
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla