Fashion
ఈ 9 రకాల బ్లాక్ ఫ్యాషన్ ఐటమ్స్.. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే.. (Black Coloured Fashion Items For Every Girl)
ఎరుపు, తెలుపు,పసుపు.. ఇలా రంగులెన్నున్నా నలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు వచ్చే అందమే వేరు. మరో విధంగా చెప్పాలంటే మన ఫ్యాషన్ అవసరాలను బ్లాక్ కలర్ తీర్చినట్లుగా ఇంకో రంగు చేయలేదు. సన్నగా కనబడాలన్నా.. పొడవుగా అనిపించాలన్నా.. మరింత సౌందర్యంగా కనిపించాలన్నా అది నలుపు రంగు దుస్తుల్లోనే సాధ్యమవుతుంది.
బ్లాక్ లో ఫ్యాషన్ అంశాలు (Fashion Items In Black Colour)
పార్టీ వేర్, క్యాజువల్ వేర్ ఏదైనా సరే నలుపు రంగుకి సాటి లేదు. అందుకే Black fashion ఇష్టపడే ప్రతి అమ్మాయి తన వార్డ్ రోబ్ లో కచ్చితంగా బ్లాక్ కలర్ దుస్తులు, యాక్సెసరీస్ చోటు కల్పిస్తుంది.
1. లిటిల్ బ్లాక్ డ్రస్ (Black Dress)
నలుపు రంగు మీకు బాగా ఇష్టమైతే.. మీ దగ్గర ఒకటీ అరా బ్లాక్ డ్రస్ లు ఉండవు. మీ వార్డ్ రోబ్ మొత్తం వివిధ రకాల డిజైన్లలో ఉన్న నలుపురంగు దుస్తులతో నిండిపోయి ఉంటుంది. ఈ రంగుల్లోని దుస్తులు దాదాపుగా అన్ని రకాాల డిజైన్లు, ప్యాట్రన్ లలో లభిస్తాయి. వీటిని ఫార్మల్ మీటింగ్ నుంచి లేట్ నైట్ పార్టీల వరకు సందర్భమేదైనా సరే ధరించవచ్చు. కాబట్టి లేడీస్.. నలుపు రంగు దుస్తులతో మీ స్టయిల్ ను మరింత పెంపొందించుకోండి.
2. బ్లాక్ టాప్ (Black Top)
ప్రతి అమ్మాయి దగ్గర కచ్చితంగా బ్లాక్ టాప్ ఉండే ఉంటుంది. ఏం ధరించాలో తెలియని సందర్భంలో ఆ టాప్ వేసుకొనే ఉంటారు కదా. మీరెప్పుడు బ్లాక్ టాప్ వేసుకొన్నా.. దానిపై నెక్ పీస్ ధరించండి. మీరు మరింత స్టయిల్ గా కనిపిస్తారు.
3. బ్లాక్ బ్యాగ్ (Black Bag)
నలుపు రంగు యాక్సెసరీస్ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అవి అన్ని రకాల దుస్తులపై ధరించడానికి నప్పుతాయి. అందుకే ప్రతి అమ్మాయి తన దగ్గర ఉన్న దుస్తులకు మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ బాగ్ ఎంపిక చేసుకొంటుంది. అది మరింత స్టయిలిష్ గా కనిపించాలంటే దానిని కీచైన్లు, స్మైలీ స్టిక్కర్ల వంటి వాటితో అలంకరించండి.
4. బ్లాక్ సెల్ ఫోన్ (Black Phone)
మనం ఉపయోగించే సెల్ ఫోన్ మన వ్యక్తిత్వానికి కొనసాగింపు లాంటిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ సమయం మనం మొబైల్ ఫోన్ తోనే గడుపుతున్నాం. అందుకే మనం ఉపయోగించే ఫోన్ కూడా మన స్టయిల్ ను ప్రతిబింబించేలా ఉండాలి. దానికి Oppo F3 Black మంచి ఎంపిక అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, డబుల్ వ్యూ గ్రూప్ సెల్ఫీ కెమెరా, బ్యూటిఫై మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఇది అమ్మాయిల చేతిలో ఉంటే ఫ్యాషనబుల్ గా కనిపిస్తుంది. అందుకే ఇది మీకు పర్ఫెక్ట్ గా సూటవుతుంది. దీంతో మీ గ్యాంగ్ అందరితో కలసి ఫర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు. సెల్ఫీ ఎక్స్ పర్ట్ Oppo F3 కొత్త TVC ని ఇప్పుడే వీక్షించండి.
5. బ్లాక్ జెగ్గింగ్స్ (Black Jeggings)
ప్రస్తుతం అమ్మాయిలందరి దగ్గరా ఒకటి కంటే ఎక్కువే బ్లాక్ జెగ్గింగ్స్ ఉంటున్నాయి. మన వార్డ్ రోబ్ లోని అన్ని రకాల టాప్ లకు మ్యాచింగ్ గా వాటిని ధరించవచ్చు.
6. బ్లాక్ చోకర్ (Black Choker)
ఈ ఏడాది ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫ్యాషన్ యాక్సెసరీస్ లో చోకర్ కూడా ఒకటి. పాప్ స్టార్ సెలెనా గోమెజ్ నుంచి కర్ధాషియన్ల వరకు వీటిని ధరించి మెప్ఫించారు. మీరు కూడా సింపుల్ గా ఒక బ్లాక్ చోకర్ ధరించండి. మీ స్టయిల్ మొత్తం మారిపోతుంది.
7. బ్లాక్ సన్ గ్లాసెస్ (Black sunglasses)
వేసవి కాలమైనా.. శీతాకాలమైనా.. నేరుగా తాకే సూర్య కిరణాలు కంటికి ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే ఓ అందమైన బ్లాక్ సన్ గ్లాసెస్ ఒకదాన్ని తీసుకోండి. ఇది మీకు సరికొత్త స్టయిల్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో పాటు కళ్లకు రక్షణగా ఉంటుంది.
8. పెన్సిల్ ఫిట్ బ్లాక్ స్కర్ట్ (Pencil Fit Black Skirt)
ఫార్మల్ మీటింగ్, స్నేహితురాళ్లతో నైట్ పార్టీ ఇలా సందర్భం ఏదైనా సరే పెన్సిల్ స్కర్ట్ ధరించవచ్చు. లావు, సన్నని అనే తేడా లేకుండా ఎవరైనా సరే స్కర్ట్లో అందంగా కనిపిస్తారు. వీటిపై ఏ రంగు టాప్ నైనా ధరించవచ్చు. ఎలాంటి షూస్ అయినా వేసుకోవచ్చు.
9. బ్లాక్ కుర్తా (Black Kurta)
ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో బ్లాక్ కుర్తా కచ్చితంగా ఉండే ఉంటుంది. జీన్స్, సల్వార్ పాంట్ ఏధైనా సరే దానిపై బ్లాక్ కుర్తాను ధరించవచ్చు. దీన్ని కాలేజ్, ఆఫీస్ ఎక్కడికైనా ధరించి వెళ్లచ్చు.
* ఇది Oppo ప్రాయోజిత కథనం.