బ్రెడ్ – ఆమ్లెట్.. సులువుగా పూర్తయ్యే ఈ వంటకం బ్రేక్ ఫాస్ట్ గా, సాయంత్రాల స్నాక్ గా తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటు గుడ్లలోని ప్రోటీన్లు, పోషకాలతో పాటు.. అటు బ్రెడ్ లోని కార్బొహైడ్రేట్లు కూడా అందే ఈ పదార్థం ఓ ఆరోగ్యకరమైన ఆహారం. ఈ బ్రెడ్ – ఆమ్లెట్ ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సెంటర్ల దగ్గర మాత్రం అద్భుతమైన రుచి కోసం దాన్ని ఓసారి ప్రయత్నించాల్సిందే. అలాంటి వాటిలో ముఖ్యమైంది ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్. అయితే హైదరాబాద్ (hyderabad) – సికింద్రాబాద్ జంటనగర వాసులకి ఎంతో సుపరిచితమైన ఈ సామాన్యుడి బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ కి ఇంత స్థాయిలో ఫాలోయింగ్ రావడానికి కారణమేంటి? అసలు ఈ ఫుడ్ సెంటర్ ప్రస్థానం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ప్రాముఖ్యత తెలుస్తుంది.
హైదరాబాదీ ఫేమస్.. నోరూరించే పాయా ఎలా చేయాలో తెలుసుకుందామా?
మరి ఈ ఫేమస్ (famous) బ్రెడ్ – ఆమ్లెట్ (bread-omelette) సెంటర్ గురించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం.
* 1983లో అక్బర్ అనే యువకుడు ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ని హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంలో ఉన్న మహేశ్వరి థియేటర్ దగ్గర ఒక తోపుడు బండి పైన మొదలుపెట్టడం జరిగింది.
* అలా మొదలుపెట్టినప్పుడు, ఆ బండి వద్ద బ్రెడ్ – ఆమ్లెట్ సింగల్ ప్లేట్ ధర రూ 1/- & ఫుల్ ప్లేట్ ధర రూ 2/- ఉండేది. ప్రస్తుతం ఇక్కడ బ్రెడ్ – ఆమ్లెట్ సింగిల్ ప్లేట్ ధర రూ 20/- కాగా ఫుల్ ప్లేట్ ధర రూ 40/- గా ఉంది.
* ఇక ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లే సిగ్నల్ లో కాచిగూడ బిగ్ బజార్ కి ముందు ఉంటుంది.
* ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి సుమారు 10 గంటల వరకు ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ అందుబాటులో ఉంటుంది.
* ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ (famous bread-omelette center) కి జంట నగరాల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా వారు ఏదైనా పని మీద సుల్తాన్ బజార్, కాచిగూడ లేదా నారాయణ గూడ వస్తే తప్పకుండా ఈ బ్రెడ్ – ఆమ్లెట్ రుచి చూడకుండా వెళ్లడం జరగదు.
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!
* ప్రస్తుతం అక్బర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి వీరి బిజినెస్ పెరుగుతుండడం విశేషం. దీనికి వారు తయారుచేసే బ్రెడ్ ఆమ్లెట్ ప్రత్యేకమైన రుచి కూడా కారణం అని చెప్పుకోవచ్చు.
* ఇప్పటికి ఎన్ని ఫుడ్ యాప్స్ వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చినా సరే, నేరుగా ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ వద్దకు వచ్చి ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ రుచి చూస్తేనే తప్ప దీని ప్రత్యేకత అర్ధం కాదు.
* వీరి బ్రెడ్ – ఆమ్లెట్ చేసే విధానం చాలా సాదాసీదాగానే ఉంటుంది, అయినప్పటికి కూడా రుచి చూస్తే మాత్రం ఏదో తెలియని ఒక మంచి పదార్దాన్ని రుచి చూసిన అనుభవం కలుగుతుంది.
* ఇక ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ – తాము ఈ పదార్థం తయారికి ఉపయోగించే నూనె, బ్రెడ్ & గుడ్లు వంటివి వాటిలో ఎక్కడ కూడా నాణ్యత లోపించకుండా.. మంచి నాణ్యత కలిగిన వస్తువులనే వాడుతుంటాము. దానివల్లే తమ సెంటర్ లో రుచి విభిన్నంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది.
* దాదాపు 37 ఏళ్ళుగా నిరాటకంగా కొనసాగుతున్న ఈ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ ప్రస్తుతం హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న ప్రముఖ ఫుడ్ సెంటర్ లలో ఒకటిగా మారిపోయింది. జంటనగర వాసుల్లో చాలామంది ఫేమస్ బ్రెడ్ -ఆమ్లెట్ సెంటర్ లేదా కాచిగూడ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ అని ఆంటే టక్కున అడ్రస్ తో సహా చెప్పేస్తారు. అంతగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ సెంటర్ ప్రాచుర్యం సంపాదించుకుంది.
తెలుసుకున్నారుగా.. ఈ ఫెమసైనా ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ గురించి, ఇంకెందుకు ఆలస్యం మీకు వీలు చిక్కినప్పుడు ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ లో మంచి బ్రెడ్ – ఆమ్లెట్ ని రుచి చూసి వహ్వా అనండి.
హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!