Lifestyle

అబ్బాయిలను ఎలా పెంచాలన్న విషయం.. మనకు తెలీదు: కిరణ్ బేడీ

Babu Koilada  |  Dec 3, 2019
అబ్బాయిలను ఎలా పెంచాలన్న విషయం.. మనకు తెలీదు: కిరణ్ బేడీ

 Lieutenant Governor of Puducherry Kiran Bedi speaks on Hyderabad Rape, Murder Incident

దేశాన్ని మొత్తం కుదిపేసిన.. హైదరాబాద్ పశు వైద్యురాలి అత్యాచార ఘటన పై ఇప్పుడు సర్వత్రా చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖ మహిళలు ఈ ఘటనపై స్పందించారు. కారకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కొందరు అంటే.. మరికొందరు నేరస్తులను బహిరంగంగా ఉరి తీసి ఒక సందేశాన్ని ఇవ్వాలని.. ఆ విధంగా చేయడం వల్ల నరరూప రాక్షసులు తప్పు చేసేందుకు భయపడతారని అభిప్రాయపడ్డారు. అలాగే ఇదే ఘటనపై స్పందిస్తూ దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి.

అలాగే దేశంలోని అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు స్వాతీ మాలివాల్ ఈ రోజు నుండి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు తెలిపారు.  ఇక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ  కూడా ఈ ఘటనపై తనశైలిలో స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం.. తల్లిదండ్రులు తమ కొడుకులను సరిగ్గా పెంచకపోవడమే అని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిలో తొలుత మార్పు రావాలన్నారు. 

భయం అనేది.. కొత్త రూల్ కావాలి : హైదరాబాద్ ‘నిర్భయ’ ఘటనపై దర్శకుడు ‘సందీప్ రెడ్డి’ స్పందన

“మహిళలపై ఇలాంటి అరాచకాలు జరగడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు.. తమ కుమారులను పెంచుతున్న విధానంలోని లోపమే. చాలామంది ఇళ్లల్లో అమ్మాయిలను ఎలా నియంత్రించాలా..? అని ఆలోచిస్తుంటారు. ఇదే క్రమంలో అబ్బాయిలను గాలికొదిలేస్తుంటారు. పైగా వారిని ఎలా పెంచాలో కూడా ఆయా తల్లిదండ్రులకు తెలీదు. అందుకే అటువంటి మగపిల్లలు వారి నియంత్రణలో ఉండడం లేదు. అందుకే తమ పిల్లల జీవనశైలి పై తల్లిదండ్రులు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. వారికి ఉన్నత విలువలు నేర్పేందుకు ప్రయత్నించాలి” అని తెలిపారు. 

హైదరాబాద్‌లో మరో “నిర్భయ” ఘటన : ‘దిశ’ హత్య పై… సోషల్ మీడియాలో నిరసనల వెల్లువ

 

ఇక హైదరాబాద్ ఘటన జరిగాక.. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ) కూడా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదు వస్తే పోలీస్ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి కేసులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. “ఈ మధ్యకాలంలో ఓ మహిళ లేదా బాలిక కనిపించనప్పుడు బాధిత తల్లిదండ్రులు లేదా సన్నిహితులు ఫిర్యాదు చేయడానికి వస్తే.. “ఆమె ఎవరితోనో లేచిపోయుంటుందిలే” అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇలా అవమానకరంగా మాట్లాడడం కూడా నేరమే.. ఇలాంటి ధోరణికి స్వస్తి పలకాలి. పోలీస్ శాఖ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ తెలిపింది.                              

మహిళలూ.. ప్రమాదంలో చిక్కుకోకుండా ఈ రక్షణ చిట్కాలు పాటించండి

అలాగే దేశంలో మహిళల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాటులు చేసే క్రమంలో.. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ‘నిర్భయ నిధి’ వివరాలను.. ఈ పథకం అమలవుతున్న తీరుకి సంబంధించి వివరణను ఓ రిపోర్టు రూపంలో ఇవ్వాల్సిందిగా ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. “ఈ దేశంలో రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్దంగా నిబంధనలు ఉన్నా సరే.. మహిళలకు కావాల్సిన స్వేచ్ఛ, సమానవత్వం, హుందాతనం, జీవించే హక్కులను కల్పించడంలో వ్యవస్థ ఫెయిల్ అవుతుందని.. ఇలాంటి విషయాలలో దేశ పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయని” ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ పేర్కొంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

 

Read More From Lifestyle