Celebrity Life

మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్ ఫొటోస్ భలే బాగున్నాయి.. మీరూ ఓ లుక్కేయండి..!

Lakshmi Sudha  |  May 23, 2019
మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్ ఫొటోస్ భలే బాగున్నాయి.. మీరూ ఓ లుక్కేయండి..!

మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. రైతుల సమస్యలను నేపథ్యంగా  తీసుకొని అల్లిన ఈ సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ను తన అభిమానులతో కలసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్.

ఇక ఇప్పుడు తన కుటుంబంతో కలసి మహర్షి విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నాడు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలసి విదేశాలకు కుటుంబంతో సహా.. విహారయాత్రకు (family tour) వెళ్లి ఆయన ఉత్సాహంగా గడుపుతున్నారు.

మహర్షి సినిమా విజయవంతమైన తర్వాత మహేశ్ తన కుటుంబంతో కలసి జర్మనీకి టూర్‌కి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కొన్నింటిని సూపర్ స్టార్ మహేశ్, ఆయన భార్య నమ్రత Instagram లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహేశ్ బాబు ‘కుటుంబంతో మరో మెమెరబుల్ హాలిడే’ అని ఆయన పోస్ట్ కూడా చేశాడు.

టూర్లో సితార తీసుకొంటున్నసెల్ఫీల గురించి నమ్రత సైతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరించింది. ‘సితార ఇప్పుడు కొత్త పని చేస్తోంది. అదే సెల్ఫీలు తీసుకోవడం’ అంటూ పోస్ట్ చేసింది నమ్రత. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మహేశ్ తన కుటుంబంతో కలిసి గడుపుతున్న ఫొటోలు చూస్తుంటే.. మనకు కూడా ఫ్యామిలీతో కలసి అలా సరదాగా గడపాలనిపిస్తుంది. కావాలంటే మీరు ఈ ఫొటోలను చూడండి. కచ్చితంగా మీకూ అలానే అనిపిస్తుంది.

 

 

Read More From Celebrity Life