Beauty

New Year Makeover Tips: ‘కొత్త’ సంవత్సరంలో.. మీ ‘కొత్త’ లుక్ కోసం.. ఇలా మేకోవర్ చేసేయండి

Soujanya Gangam  |  Dec 17, 2019
New Year Makeover Tips:  ‘కొత్త’ సంవత్సరంలో.. మీ ‘కొత్త’ లుక్ కోసం.. ఇలా మేకోవర్ చేసేయండి

New Year Special : Makeover Tips for new look 

కొత్త సంవత్సరం వస్తుందనగానే ప్రతి ఒక్కరిలో.. కొత్త ఎక్సైట్‌మెంట్ ప్రారంభమైపోతుంది. అలాగే ప్రతి ఒక్కటీ కొత్తగా ప్రారంభించాలన్న కోరిక కూడా మొదలవుతుంది. కొత్త రిజల్యూషన్స్‌తో.. కొత్త లైఫ్ స్టైల్‌కి శ్రీకారం చుట్టడానికి కూడా కొందరు రడీ అయిపోతారు. మరి ఇదే క్రమంలో, బ్యూటీ లేదా ఫ్యాషన్‌కు కూడా సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ.. కొత్త లుక్  ఎందుకు సొంతం చేసుకోకూడదు?

అవును.. ఈ కొత్త సంవత్సరం వేళ..  కొత్తగా కనిపించేలా మీరు కొత్త మేకోవర్‌ను ప్రయత్నించండి. ఓ కొత్త లుక్ ట్రై చేసి మిమ్మల్ని మీరు కొత్తగా అందరికీ చూపించండి. ఆ విధంగా కొత్త ఉత్సాహంతో.. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి.

1. లిప్ స్టిక్ షేడ్ మార్చేయండి..

మనలో చాలామంది లిప్ స్టిక్ అనగానే పింక్, న్యూడ్ లేదా అప్పుడప్పుడూ రెడ్ ఎంచుకుంటారు. కానీ వాటిపై ప్రయోగాలు చేయడానికి మాత్రం ముందుకు రారు. అయితే ఈ సంవత్సరం డీప్ వైన్, మెటాలిక్ గోల్డెన్ లేదా మీకు నచ్చిన ఇంకేదైనా రంగును ప్రయత్నించండి. అలాగే బోల్డ్ కలర్స్‌ని కూడా ప్రయత్నించండి. ఇంకేముంది.. మీ లుక్‌కి అందరూ ఫిదా అయిపోతారు. 

2. డిప్ డై చేయండి.

ఇది మీ లుక్‌ని అప్‌డేట్ చేయడానికి చాలా సులువైన పద్ధతి. ఈ మధ్యకాలంలో హైలైట్స్, హాఫ్ అండ్ హాఫ్ అంటూ చాలా హెయిర్ కలర్ ట్రెండ్స్ వచ్చాయి. వాటిలో ఏదైనా ప్రయత్నించాలని ఉన్నా.. భయంగా ఉంటే దీనిని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆ రంగు బోర్ కొడితే.. అక్కడి వరకూ మీ జుట్టును కత్తిరించుకుంటే సరిపోతుంది. సహజసిద్ధమైన డైలను ఎంచుకోవడం వల్ల.. అటు ఫంకీగా కనిపించినా.. ఇటు జుట్టుకు హాని కలగకుండా చూసుకోవచ్చు. బ్రౌన్, పర్పుల్, పింక్, రెడ్ వంటి రంగులే కాదు.. మీకు నచ్చిన రంగేదైనా ఎంచుకోవచ్చు.

3. ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్

ఇది చాలా సులభమైనది. ఖర్చు లేనిది. మీ స్టైల్‌ని ఎంతగానో పెంచుతుంది. మెనిక్యూర్ వంటివి ట్రై చేసినా.. చేయకపోయినా.. చక్కటి నెయిల్ ఆర్ట్  వల్ల.. మీ చేతుల లుక్ మారిపోతుంది. సింపుల్‌గా మెరిసిపోతూ కనిపిస్తుంది.

4. చక్కటి ఫేస్ మాస్క్

మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి.. దానికి కాస్త సమయాన్ని కేటాయించాలి. కాలుష్యం, హానికరమైన యూవీ కిరణాల బారిన పడుతూ రోజూ మన చర్మం పలు రుగ్మతలకు గురువుతోంది. అందుకే ప్రతి వారం.. చక్కటి ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ ట్రై చేయండి. తద్వారా చర్మ ఛాయను మెరుగు పర్చుకోండి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వంటివి కూడా తగ్గుతాయి.

5.కళ్లతో మాట్లాడేయండి.

చక్కగా రెడీ అయ్యి పార్టీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అయితే కాస్త డిఫరెంట్ ఐ మేకప్‌ను ప్రయత్నించండి. అలాగే గ్రాఫిక్ ఐ లైనర్ కూడా ట్రై చేయండి. అలాగే మీ కనురెప్పలపై విభిన్నమైన డిజైన్లు వేయించి.. కొత్తగా ప్రయత్నించండి. అంతే..  ప్రతి పార్టీలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.

6.పెదాలు నిండుగా ఉండేలా..

అందమైన పౌట్ కావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కొత్త మేకప్ ప్రక్రియను ఉపయోగించి మీ పెదాలు లావుగా కనిపించేలా చేయవచ్చు. అందుకోసం లిప్ కాంటూరింగ్ ట్రై చేయండి. ఈ ప్రక్రియలో భాగంగా.. మీ పెదాల బయట డార్క్ రంగు లిప్ లైనర్‌తో గీసుకుంటూ రండి. తర్వాత అక్కడి వరకూ లిప్ స్టిక్ అప్లై చేసుకోండి. లిప్ స్టిక్ అప్లై చేసేటప్పుడు కూడా.. చుట్టూ డార్క్ రంగుతో పాటు.. మధ్యలో లైట్ రంగును అప్లై చేసుకోవడం మంచిది.

7. మంచి స్కిన్ కేర్ ఉత్పత్తులతో

చర్మ ఉత్పత్తులపై మీ డబ్బును ఎడాపెడా ఉపయోగించే బదులు.. మంచి క్వాలిటీ ఉత్పత్తులను ట్రై చేయడం మంచిది. మీరు ఈ  ఉత్పత్తులను కొనేముందు.. ఇంటర్నెట్‌లో ప్రొడక్ట్ రివ్యూలు చదవండి. అలాగే మీ చర్మ తత్వానికి ఆ ఉత్పత్తులు నప్పుతాయో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ ప్యాక్స్‌ను ప్రయత్నించండి. 

8. కొత్త హెయిర్ కట్

కొత్త సంవత్సరం వేళ.. మీరు కొత్త లుక్‌తో మెరిసిపోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ జుట్టును కాస్త విభిన్నంగా కట్ చేయించుకోండి. జీవితం చాలా చిన్నది. బోరింగ్‌గా జీవించడం కంటే.. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ట్రై చేయడం మంచిది. మీ జుట్టు తిరిగి మళ్లీ పెరుగుతుంది కాబట్టి… ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.

9. పాదాలను మర్చిపోవద్దు

మీ పాదాలు మీ గురించి చాలా చెబుతాయి. మీరు మీ గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో వివరిస్తాయి. అందుకే తరచూ పెడిక్యూర్ చేయించుకోండి. నెయిల్ పాలిష్ వేసుకొని.. పాదాలు అందంగా కనిపించేలా చేయండి. పట్టీలు, మెట్టెల్లోనూ మీకు నచ్చిన డిజైన్లు కొని ఉపయోగించండి.

10.హైలైట్ చేయండి.

ఫౌండేషన్, కన్సీలర్, కరెక్టర్, కాంటూరింగ్ వంటివన్నీ వేసుకుంటేనే.. మేకప్ అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే మంచి బేస్ కోట్ వేసుకొని.. హైలైటర్ సాయంతో దవడ ఎముకను హైలైట్ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మేకప్ వేసిన లుక్ వస్తుంది. మరి, మీరూ హైలైటర్ మ్యాజిక్‌ని ఓసారి ప్రయత్నించి చూడండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Beauty