నాకు చిన్నతనం నుండి మిలిటరీ, నేవీ రంగాలలో ఉద్యోగాలు చేసే వ్యక్తులంటే ఎంతో గౌరవం. సినిమాలు చూస్తున్నప్పుడు.. అందులో నేవీ, మిలిటరీ ఆఫీసర్ల పాత్రలలో నటించే వారిని చూసి ఎంతో ప్రేరణను పొందేదాన్ని. భవిష్యత్తులో ఎలాగైనా సరే.. నావికా దళాలలో పనిచేసే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.
నేను పెద్దయ్యాక ఆ ఆశ అడియాసే అయ్యింది. నేను స్నేహం చేసిన వ్యక్తుల్లో ఒక్కరు కూడా ఈ రంగాలకు చెందినవారు లేకపోవడం నాకు బాధనిపించింది. కేవలం గర్ల్స్ స్కూల్లో చదివి.. ఆ తర్వాత ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేసి ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాకు.. అలాంటివారు దొరుకుతారని కూడా ఊహించడం కష్టమే. అందుకే ఆ ఆశను వదిలేసుకున్నాను. నాకు నా రంగంలోనే పనిచేసే ఓ ఫొటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్‌గా (Boy Friend) ఏర్పడ్డాడు. పరిచయమైన కొద్ది రోజులలోనే తను నాకెంతో ప్రత్యేకం అనిపించాడు. అందుకే.. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా.
ఓరోజు రాత్రి మేం వైన్ తాగుతున్నప్పుడు. నాకు చిన్నతనం నుండీ ఉన్న ఓ కోరిక గురించి తనకు చెప్పుకొచ్చాను. దాని గురించి చెప్పినప్పుడు తను విపరీతంగా నవ్వాడు. ‘నీకు నేవీకి చెందిన బాయ్ ఫ్రెండ్ దొరకకపోయినా.. ఒక్కసారైనా నీకోసం నేవీ బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసిన అనుభవాన్ని కలిగిస్తానని’ చెప్పాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు నా పుట్టిన రోజు వచ్చింది. కానీ నేను దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు. అప్పుడు నాకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. నేను చేసిన ప్రాజెక్ట్‌లో తప్పులున్నాయని.. నాకు రావాల్సిన ప్రమోషన్ ఆపేయడంతో చాలా బాధలో ఉన్నా. ఆ రోజు శనివారం కావడంతో ఇంట్లోనే ఉండిపోవాలనుకున్నా. నా స్నేహితులంతా ఫోన్ చేసి కనీసం డిన్నర్ చేయడానికైనా బయటకు రమ్మని అడిగారు. వాళ్లకు కూడా ‘నో’ చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను.
నా బాయ్ ఫ్రెండ్ మాత్రం ఓ కొత్త అసైన్‌మెంట్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నానేమోనని అనిపించింది. పగలంతా జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ.. ల్యాప్ టాప్‌లో సినిమాలు చూస్తూ కూర్చున్నా. ఆ తర్వాత సాయంత్రం నాలుగింటికి లేచి స్నానం చేయడానికి వెళ్లాను. నేను స్నానం చేసి బయటకు వచ్చానో లేదో కాలింగ్ బెల్ మోగింది.
అబ్బా.. ఈ సమయంలో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చారు అని తిట్టుకుంటూ వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా నా బాయ్ ఫ్రెండ్.. వెంటనే సంతోషం పట్టలేకపోయాను. తన పుట్టిన రోజుకి ఎవరైనా ‘సర్ ప్రైజ్’ ఇస్తే దాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు? నేను కూడా ఆనందించాను. కానీ తను సాయంత్రం ఐదింటికే ట్రెంచ్ కోట్‌లో వచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అదేంటని నేను అడుగుతుండగానే తను నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ట్రెంచ్ కోట్ తీసేశాడు.
అది చూడగానే నా కళ్లను నేను నమ్మలేకపోయాను. తను నేవీ యూనిఫాం వేసుకొని ఉన్నాడు. వైట్ షర్ట్, ప్యాంట్, నలుపు రంగు షూస్, క్యాప్‌తో పాటు మిగిలినవన్నీ నేవీ వాళ్లు వేసుకునేవే.. అలా ‘సర్ ప్రైజ్.. హ్యాపీ బర్త్ డే’ అంటూ గట్టిగా అరిచి నన్ను హత్తుకున్నాడు. నాకు నచ్చినట్లు తను రడీ అయ్యాడన్న ఆనందంలో తన మీద పడిపోయాను.
తన షర్ట్ విప్పుతూ తనకి ముద్దులు పెడుతూ.. కాస్త కొంటెగా కొరుకుతూ.. నవ్వుతూ ఉన్న ఆ సమయంలో తను కూడా నా డ్రెస్ విప్పుతూ తన చేతులతో నన్ను సుతారంగా తాకసాగాడు. ఆ సమయంలో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నా భర్త అయితే చాలు.. యూనిఫాంతో పనిలేదు అని నాకు అనిపించింది.
మేం ఆనందంగా ఉన్న ఆ సమయంలోనే డోర్ బెల్ మరోసారి మోగింది. ఆ సమయంలో తనని వదిలి ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్లాలనిపించలేదు. తను కూడా నన్ను మరింత గట్టిగా హత్తుకున్నాడు. కానీ ఆ డోర్ బెల్ రింగ్ ఆగడం లేదు. దీంతో ‘నువ్వు బెడ్ రూంలోకి వెళ్లు.. నేను ఎవరొచ్చారో చూసి వాళ్లను పంపించేసి వస్తా’ అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్లాను. కంగారులో ఎవరో చూడకుండానే డోర్ తీసేశాను. ఎదురుగా అమ్మానాన్న.. అప్పుడు నాకేం చేయాలో తోచలేదు. నేను బాత్ రోబ్‌లో ఉండడం చూసి అమ్మా, నాన్న ‘ఓహ్.. స్నానం చేస్తున్నావా? అందుకే ఆలస్యమైందా?’ అంటూ లోపలికి వచ్చారు.
నా పుట్టిన రోజున నాకు ‘సర్ ప్రైజ్’ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు అమ్మానాన్న. కానీ అది నాకు చాలా పెద్ద షాక్. బెడ్ రూంలో ఉన్న నా బాయ్ ఫ్రెండ్‌ని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. డ్రస్ మార్చుకునే నెపంతో బెడ్ రూంలోకి వెళ్లి కిటికీ నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పాలనుకున్నా. కానీ తను తన బ్యాగ్, ట్రెంచ్ కోట్‌తో పాటు.. నేవీ క్యాప్ కూడా హాల్లో సోఫాలో వదిలేశాడు. అవి చూసి నాన్న అడిగేశాడు. ‘ఇవి ఎవరివమ్మా అని.’. అప్పటికే అమ్మా, నాన్నలకు మా స్నేహం గురించి తెలుసు. కానీ మా బంధం పెళ్లి చేసుకునేంత సీరియస్ అని తెలీదు. నేను కంగారులో అవి నా బాయ్ ఫ్రెండ్‌వని.. తను బెడ్ రూంలో ఉన్నాడని చెప్పేశాను.
నేవీ యూనిఫాం చూసి.. తను నేవీలో పనిచేస్తాడేమోనని అనుకున్నారు మా నాన్న. తనని బయటకు తీసుకొచ్చి పరిచయం చేశాను. ‘నువ్వు నేవీలో పనిచేస్తావని నాకు తెలీదు’ అని నాన్న అనగానే.. ‘అంకుల్.. నేను నేవీలో పనిచేయట్లేదు. నేనో ఫొటోగ్రాఫర్‌ని.. నేను, మా స్నేహితులందరూ నిత్య కోసం ఫ్యాన్సీ డ్రెస్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఈ డ్రస్ వేసుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పొద్దూ.. అప్పుడు నాకు తనంటే ఉన్న ప్రేమ మరింత పెరిగిపోయింది. ‘ఇప్పుడు మేం కూడా ఇలా ఫ్యాన్సీ డ్రస్ వేసుకోవాలా?’ అని అమ్మా, నాన్న అడిగారు.
‘మీ ఇష్టం’ అనడంతో వాళ్లు నవ్వేశారు. అతికినట్లుగా అబద్ధం చెప్పడంతో.. ఆ ఆనందంలో నేను కూడా నవ్వేశాను. ఆ తర్వాత తను, మా అమ్మా, నాన్న మాట్లాడుకుంటూ ఉండగా.. నేను నా స్నేహితులకు ఫోన్ చేసి ఫ్యాన్సీ కాస్ట్యూమ్ వేసుకొని బిర్యానీ, వైన్ పట్టుకొని మా ఇంటికి రమ్మని చెప్పాను. పార్టీ వాళ్లు ఏర్పాటు చేసినట్లే ఉండాలని.. కారణాలు తర్వాత చెబుతానని చెప్పాను.
దాంతో కాసేపట్లోనే వాళ్లంతా మా ఇంటికి వచ్చేశారు. ఆరోజు అలా గడిచిపోయింది. మా అమ్మా,నాన్న ఆ తర్వాత రెండు రోజులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మా రోల్ ప్లే (Role Play) గురించి జరిగిన కథంతా చెప్పిన తర్వాత.. మా స్నేహితులు మా ఇద్దరినీ కొన్ని నెలల వరకూ టీజ్ చేస్తూ ఉండిపోయారు. అమ్మా,నాన్నకు తను చాలా బాగా నచ్చడంతో.. తర్వాత కొన్ని నెలలకే వాళ్ల పెద్దవారితోనూ మాట్లాడారు. అలా మా ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.