Fashion

ఈ కొత్త డ్రస్‌లతో.. కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్పేయండి..!

Soujanya Gangam  |  Dec 12, 2019
ఈ కొత్త డ్రస్‌లతో.. కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్పేయండి..!

New Year Party Dress Ideas

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా వేడుకలు.. పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువమంది అమ్మాయిలు లిటిల్ బ్లాక్ డ్రెస్‌లు, మెరుపులతో నిండిన పొట్టి దుస్తులు వేసుకొని కనిపిస్తున్నారు. అయితే అందరిలా మీరు కూడా అవే ధరిస్తే మీ స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే కొత్త సంవత్సరం రాత్రిని సంవత్సరమంతా మర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాలనుకుంటే.. కొత్త డ్రస్‌‌తో మీ స్నేహితులకు కొత్త లుక్ అందించండి. అందరిలోనూ మీరే ప్రత్యేకంగా మెరిసిపోయేలా చేయండి. అందుకే న్యూ ఇయర్ పార్టీకి లిటిల్ బ్లాక్ డ్రెస్‌ని పక్కన పెట్టి.. ఈ సరికొత్త దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి. 

1. అందమైన జంప్ సూట్

న్యూ ఇయర్ పార్టీకి అందంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అసలే చలికాలం. దానికి తోడు రాత్రి పార్టీలు. ఆ సమయంలో పొట్టి దుస్తులు వేసుకుంటే చలి చంపేస్తుందేమోనని అనిపిస్తుంది. అందుకే చలికాలంలో వీలైనంత సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలని చాలామంది భావిస్తారు. అలాంటివారికి కేప్ జంప్ సూట్ అనేది మంచి ఆప్షన్. ఇటు జంప్ సూట్, అటు కేప్ రెండింటి కలయికగా తయారైన.. ఈ సూట్ మీ శరీరం మొత్తాన్ని కవర్ చేస్తుంది. వీటితో పాటు  పెద్దసైజు షోల్డర్ డస్టర్ ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల ప్రత్యేకమైన లుక్ మీ సొంతమవుతుంది.

2. క్లాసిస్ శాటిన్ డ్రస్

శాటిన్ డ్రస్ చాలా అందంగా ఉంటుంది. చూసేందుకు ప్రత్యేకంగా కూడా కనిపిస్తుంది. ఇందులో స్టేట్ మెంట్ రంగులను ఎంచుకోవడం వల్ల.. అందరిలోనూ మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు. అందుకే నీలం, ఎరుపు, గులాబీ వంటి రంగులలో ప్లెయిన్‌గా  ఉండే వాటిని లేదా రెండు రంగుల కలబోతలో కనిపించే దుస్తులను ట్రై చేయవచ్చు. అలాగే టక్సెడో స్టైల్ శాటిన్ డ్రస్‌ని చక్కటి మెటాలిక్ హీల్స్, పెద్ద షోల్డర్ డస్టర్స్ లేదా హూప్ ఇయర్ రింగ్స్‌తో జత చేయండి. స్ట్రాప్స్ ఉంటే మెడలో సన్నని ప్లాటినం చైన్ వేసుకున్నా బాగుంటుంది. దీనికి జతగా నలుపు రంగు జాకెట్ కూడా ధరించవచ్చు. దీనివల్ల అటు స్టైల్‌తో పాటు ఇటు చలి నుంచి రక్షణ కూడా ఉంటుంది.

3. ప్లంజ్ నెక్ ప్యానెల్ డ్రస్

ఈ కొత్త సంవత్సరం వేళ.. పాత మోడల్స్‌‌ను పక్కన పెట్టి.. సరికొత్త డిజైనర్ దుస్తులతో మీ స్నేహితులకు కనిపించాలని భావిస్తున్నారా? అయితే ప్లంజ్ నెక్ ఉన్న డ్రస్ ట్రై చేయండి. పొడవాటి నెక్ ఉండి.. ఫుల్ స్లీవ్స్‌తో ఉన్న షార్ట్ డ్రస్‌ను ఎంచుకుంటే.. అందరిలోనూ బోల్డ్‌గా కనిపిస్తారు. ఈ తరహా డ్రస్ వేసుకున్నప్పుడు బంగారు రంగు మెటాలిక్ చోకర్‌తో పాటు.. స్టేట్ మెంట్ ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల లుక్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది పార్టీల వంటి వాటి కంటే.. మీ స్నేహితులతో కలిసి చేసుకొనే న్యూ ఇయర్ డిన్నర్ లాంటి వాటికి అటెండ్ అయ్యేటప్పుడు ధరిస్తే బాగుంటుంది. 

4. వెల్వెట్ డ్రస్

వెల్వెట్ ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనిపించుకోదు. పైగా దీనిపై కనిపించే చక్కటి క్లాసీ ఫ్లోరల్ ప్రింట్ కూడా మంచి ఫ్యాషన్. దీన్ని సంవత్సరం మొత్తం మాత్రమే కాదు.. కొత్త సంవత్సరపు పార్టీలో కూడా ధరించి ప్రత్యేకమైన లుక్ సొంతం చేసుకోవచ్చు. పొట్టి దుస్తులు వేసుకోవడానికి వెనుకాడని అమ్మాయిల కోసం ఈ డ్రస్ బాగుంటుంది. ఫుల్ హ్యాండ్, ఫుల్ నెక్‌తో ఈ డ్రస్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ డ్రస్ వేసుకున్నప్పుడు.. మంచి హై హీల్స్‌ను ధరించడంతో పాటు.. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. మెడలో చిన్న చైన్ లాంటిది వేసుకోవచ్చు. లేదా అలాగే వదిలేయొచ్చు. సింపుల్‌గా సన్నని డిజైన్‌తో ఉండే క్లచ్‌ని తీసుకెళ్లడం వల్ల.. మీ డ్రస్ హైలైట్ అవుతుంది. అందరిలో మీ లుక్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

5.స్టేట్‌మెంట్ డ్రస్

ఓ మంచి స్టేట్‌మెంట్ డ్రస్ మనకు ఇచ్చే అందం ఇంకేదీ ఇవ్వలేదు. అందుకే చక్కటి ట్యూల్ డ్రస్ వేసుకోండి. ఇది చూసేందుకు కూడా అందంగా ఉండి.. మీకు ప్రిన్సెస్ లుక్‌ని అందిస్తుంది. ఈ డ్రస్‌కి  క్లాసిక్ బ్లూ లేదా నీలం రంగులోని షేడ్స్ ఏవైనా ఎంచుకోండి. ఈ డ్రస్‌తో పాటు చక్కటి స్ట్రాపీ హీల్స్, డైమండ్ నెక్లెస్‌తో పాటు మంచి రాళ్లు పొదిగిన క్లచ్ ధరించాలి. దీంతో పాటు మంచి హెయిర్ స్టైల్ వల్ల మీ లుక్ అద్భుతంగా కనిపిస్తుంది.

Image: https://www.instagram.com/rashmigautam

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Fashion