(Greta Thunberg Speech on Climate Change inspired Priyanka Chopra)
ఐక్యరాజసమితి సదస్సులో ఓ 16 ఏళ్ల బాలిక.. తన ప్రసంగంతో ఏకంగా ప్రపంచ నాయకులకే ముచ్చెమటలు పట్టించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికైనా అందరూ ఏకం కావాలని.. అంతే కానీ అర్థం పర్థం లేని మాటలతో.. రేపటి తరానికి చెందిన వారి కలల్ని, బాల్యాన్ని దోచుకోవద్దని ఆమె హితవు పలికింది. ఆమె పేరే గ్రెటా థన్‌బర్గ్.
“నేడు వాతావరణ మార్పులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మా బాధను అర్థం చేసుకోండి. మా భవిష్యత్తు ప్రమాదంలో పడబోతోంది. హౌ డేర్ యూ. మీకెంత ధైర్యం. మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే.. మేం మిమ్మల్ని క్షమించం” అంటూ స్వీడన్‌కి చెందిన గ్రెటా థన్‌బర్గ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు.. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది.
ఎంతో ఉద్వేగంతో గ్రేటా థన్ బర్గ్ చేసిన ప్రసంగం పట్ల అనేకమంది సెలబ్రిటీలు ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా.. గ్రెటా ఆలోచనల పై తనదైన శైలిలో స్పందించారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. “థ్యాంక్యూ గ్రెటా. మీ తరాన్ని ఒక చోట చేర్చి.. మా మొహంపై గుద్దినట్లు మాట్లాడావు. పర్యావరణం గురించి మేము.. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం గురించి తెలిపావు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం” అని ప్రియాంక చోప్రా బదులిచ్చింది.
#MeToo ఉద్యమం : మనుసుని కదలించే యదార్థమైన సంఘటనలు ఇవి..
ఈ క్రమంలో ప్రియాంక.. #howdareyou అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా షేర్ చేసింది. అలాగే మరో నటి అలియా భట్ కూడా గ్రెటా ప్రసంగం పై స్పందించింది. “వినండి.. నేర్చుకోండి.. ఆలోచించండి.. పనిచేయండి” అంటూ ఆమె నెటిజన్లకు హితవు పలికింది. అలాగే క్రికెటర్ రోహిత్ శర్మ కూడా గ్రెటా ప్రసంగానికి మద్దతిచ్చారు. “గ్రెటా.. నీ ఆవేదనలో అర్థం ఉంది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడం మన బాధ్యత. నువ్వే మాకు ఆదర్శం. ఈ క్షణం నుండే అందరిలో మార్పు రావాలి” అని తెలిపారు.
గ్రెటా థెన్‌బర్గ్ స్వీడన్‌కి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని. ఆమె పర్యావరణ ప్రేమికురాలు కూడా. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె పర్యావరణ పరిరక్షణ కార్యకర్తగా కూడా పనిచేస్తోంది. రేపటి తరం కాలుష్యం వల్ల ఎలాంటి నష్టాలు పొందనుందో తెలియజేస్తూ.. అందుకోసం పలు ఉద్యమాలు కూడా చేస్తోంది. గత సంవత్సరం సాక్షాత్తు తన దేశ పార్లమెంటు ఎదురుగా కూర్చొని.. ఆమె ధర్నా చేయడంతో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ విధంగా ఆమె ప్రపంచాన్ని కూడా ఆకర్షించింది.
రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?
ఇటీవలే “టైమ్స్” మ్యాగజైన్ గ్రెటాను “నెక్స్ట్ జనరేషన్ లీడర్”గా పేర్కొంటూ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. అలాగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ “అంబాసిడర్ ఆఫ్ కన్‌సైన్స్” అవార్డును అందించింది. గ్రెటా థన్‌బర్గ్ చేసే ప్రసంగాలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. ఆమె నిజాలను నిర్భయంగా.. నిర్మొహమాటంగా కూడా చెబుతుందని కొందరు అంటారు. అయితే ఆమె భావజాలం ర్యాడికల్ ఆలోచనలకు దగ్గరగా ఉందని కూడా పలువురు నాయకులు విమర్శలు చేయడం గమనార్హం.
సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!
Featured Image: Instagram.com/GretaThunberg & Instagram.com/PriyankaChopra
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.