మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPH (Antariksham 9000KMPH) చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సినిమా మన తెలుగులో నిర్మితమైన తొలి స్పేస్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఘాజి (Ghazi) చిత్రంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడమే కాకుండా జాతీయ అవార్డుని సైతం సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీసిన రెండవ చిత్రం ఈ అంతరిక్షం.
సాంకేతికంగా ఈ చిత్రం మనకి అద్భుతంగా వచ్చేందుకు ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజీవ్ రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక పనులు చేయడం జరిగింది. అలాగే టాలెంటెడ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రశాంత్ విహారి సంగీతం అందించడం జరిగింది. అదేసమయంలో లావణ్య త్రిపాఠి & అదితి రావు హైదరిలు ఈ సినిమాలు రెండు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది.
ఇక ఈ చిత్రం ప్రేక్షకులు తప్పకుండా ఎందుకు చూడాలో మీకు తెలియజేస్తున్నాం.
* “అంతరిక్షం” తెలుగులో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్.
* ఈ సినిమా కోసం మొదటిసారిగా “జీరో గ్రావిటీ” లో షూటింగ్ చేయడం జరిగింది.
* అంతరిక్షం చిత్రంలో ఉండే “జీరో గ్రావిటీ” సన్నివేశాలలో నటించడానికి నలుగురు ప్రధాన పాత్రధారులు ఒక నెల పాటు విదేశీ నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
* దాదాపు 1200-1500 వరకు VFX షాట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి .
* ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
* ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌లో దాదాపు 20 నిమిషాల పట్టు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం హావభావాలతో కథనం సాగుతుందట.
* ఇంతటి క్లిష్టమైన కథతో కూడుకున్న చిత్రాన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.
* తొలిసారిగా ఒక తెలుగు హీరో “వ్యోమగామి ” పాత్రలో ఈ చిత్రంలో మనకి కనిపిస్తాడు.
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla