Entertainment

వరుణ్ తేజ్, అదితి రావుల.. స్పేస్ మ్యాజిక్ “అంతరిక్షం” ఎందుకు చూడాలంటే?

Sandeep Thatla  |  Dec 19, 2018
వరుణ్ తేజ్, అదితి రావుల.. స్పేస్ మ్యాజిక్ “అంతరిక్షం” ఎందుకు చూడాలంటే?

మెగా హీరో వరుణ్ తేజ్  హీరోగా తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPH (Antariksham 9000KMPH) చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సినిమా మన తెలుగులో నిర్మితమైన తొలి స్పేస్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఘాజి (Ghazi) చిత్రంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోవడమే కాకుండా జాతీయ అవార్డుని సైతం సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తీసిన రెండవ చిత్రం ఈ అంతరిక్షం.

సాంకేతికంగా ఈ చిత్రం మనకి అద్భుతంగా వచ్చేందుకు ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ రాజీవ్ రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక పనులు చేయడం జరిగింది. అలాగే టాలెంటెడ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రశాంత్ విహారి సంగీతం అందించడం జరిగింది. అదేసమయంలో లావణ్య త్రిపాఠి & అదితి రావు హైదరిలు ఈ సినిమాలు రెండు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది.

 

ఇక ఈ చిత్రం ప్రేక్షకులు తప్పకుండా ఎందుకు చూడాలో మీకు తెలియజేస్తున్నాం. 

 * “అంతరిక్షం” తెలుగులో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్.

 * ఈ సినిమా కోసం మొదటిసారిగా “జీరో గ్రావిటీ” లో షూటింగ్ చేయడం జరిగింది.

* అంతరిక్షం చిత్రంలో ఉండే “జీరో గ్రావిటీ” సన్నివేశాలలో నటించడానికి నలుగురు ప్రధాన పాత్రధారులు ఒక నెల పాటు విదేశీ నిపుణుల పర్యవేక్షణలో  ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

 * దాదాపు 1200-1500 వరకు VFX షాట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి .

 * ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

 * ఈ సినిమాలో  ఒక సీక్వెన్స్‌లో దాదాపు 20 నిమిషాల పట్టు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం హావభావాలతో కథనం సాగుతుందట.

 * ఇంతటి క్లిష్టమైన కథతో కూడుకున్న చిత్రాన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. 

 * తొలిసారిగా ఒక తెలుగు హీరో “వ్యోమగామి ” పాత్రలో ఈ చిత్రంలో మనకి కనిపిస్తాడు.

 

Read More From Entertainment