డ్రస్ వేసుకున్నా లేదా చీర కట్టుకున్నా.. మనం ధరించే అవుట్ ఫిట్ చాలా ముఖ్యం. అయితే దానికి తగినట్లుగా మనం అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే చెవి రింగులు (Ear rings) కూడా ముఖ్యమే. మన అవుట్ ఫిట్‌కు ఇవి మ్యాచ్ కాకపోతే.. మన లుక్ అస్సలు ఇనుమడించదు. సరికదా.. ఇంకా ఎబ్బెట్టుగా కూడా కనిపించే అవకాశాలు లేకపోలేదు.
ఈ రోజుల్లో ఇయర్ రింగ్స్‌లో కూడా చాలానే ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. వాటికి తోడు స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. మరి, వాటిలో నుంచి స్టైలిష్‌గా ఉన్న ఇయర్ రింగ్స్‌ని ఎంపిక చేసుకునేదెలా? ఏ తరహా అవుట్ ఫిట్ పై ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి?? అని ఆలోచిస్తున్నారా??
అయితే కాస్త ఆగండి.. మన టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత (Samantha).. ఏ వేడుకకు హాజరైనా అందుకు తగిన విధంగానే తన డ్రస్సింగ్ కూడా ఉండేలా చూసుకుంటుంది. ఇక, ఈ అమ్మడు ఫాలో అయ్యే ఫ్యాషన్స్, ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇయర్ రింగ్స్ విషయంలో కూడా సామ్‌ని ఫాలో అయితే సరి..!
రంజాన్ ఫ్యాషన్‌కు.. కాస్త సెలబ్రిటీ టచ్ ఇద్దాం..!
హార్ట్ షేప్‌లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చూశారా?? సింపుల్‌గా ఒక స్టడ్‌లా ఉన్న దానికి.. ఈ హార్ట్ షేప్ డ్రాప్‌ని వేలాడదీశారు. చుట్టూ పెర్ల్స్‌తో లైనప్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ మనల్ని స్టైలిష్‌గా చూపించడమే కాదు. ఎదుటి వారి దృష్టిని సైతం చక్కగా ఆకర్షిస్తాయి.
వింటేజ్ తరహాలో రూపొందించిన ఈ ఇయర్ రింగ్స్ చూడండి. చాలా సింపుల్‌గా ఉన్నా.. మనకు క్లాసీ లుక్ ఇవ్వడంలో ఇవి ఏమాత్రం ఫెయిల్ కావు. వీటికి తోడు కళ్లను సైతం.. చక్కని ఐలైనర్‌తో తీర్చిదిద్దుకుంటే.. చూసేవారు మనపై నుంచి చూపు తిప్పుకోలేరంటే అతిశయోక్తి కాదు.
ఫ్యాషన్ క్వీన్ సోనమ్ కపూర్ అవుట్ ఫిట్స్ చూశారా??
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లే మహిళలు చాలా వరకు సింపుల్‌గా ఉండే స్టడ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. మీరూ అంతేనా?? అయితే సమంత పెట్టుకున్న ఈ సిల్వర్ అండ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ చూడండి. తప్పకుండా మీకు నచ్చుతాయి.
వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ ధరించినప్పుడు స్టడ్స్ ఒకే.. మరి, ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ధరించినప్పుడు మాత్రం హ్యాంగింగ్స్ లేదా డ్రాప్స్ తరహా ఇయర్ రింగ్స్ అయితే చక్కగా ఉంటాయి. అందుకే సమంత కూడా ఈ సూత్రాన్నే ఫాలో అయింది. ఎరుపు రంగు డ్రస్‌కు గోల్డ్ షెడెడ్ ఇయర్ రింగ్స్‌తో క్లాసీ టచ్ ఇచ్చింది.
కళ్లు చెదిరే అందమే కాదు.. చక్కని ఫ్యాషన్ సెన్స్ కూడా పాయల్ సొంతం..!
స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంలో.. ఈ అమ్మడి తర్వాతే ఎవరైనా. వాటిని తనదైన శైలిలో క్యూట్ లుక్స్‌తో మరింత స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది సామ్. కావాలంటే మీరే చూడండి.. పాలిగాన్ ఆకృతిలో ఉన్న ఈ ఇయర్ రింగ్స్‌తో ఎంత అందంగా మెరిసిపోతోందో!
ఒకప్పుడు చెవులకు మ్యాచింగ్ ధరించాలంటే మెడలో చోకర్ నెక్లెస్ లేదా చెయిన్ వంటివి వేసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే వాటికి బదులుగా చెవిరింగులకు మ్యాచ్ అయ్యేలా ఉంగరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సామ్ కూడా అదే పని చేసిందిక్కడ.
ఇయర్ రింగ్స్ స్టైలిష్‌గా కనిపించాలి. బరువు తక్కువగా ఉండాలి. మీరూ ఇలానే అనుకుంటున్నారా?? అయితే సామ్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్‌ని ఫాలో అయితే సరి!
హార్ట్ షేప్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ ఏ డిజైన్ అయినా సరే.. అమ్మాయిల అందాన్ని పెంచి చూపిస్తాయి. సామ్‌ని చూస్తే మీరు కూడా ఈ మాట నిజమేనని ఒప్పుకుంటారు.
అందరూ ఫాలో అయ్యే ఫ్యాషన్స్‌నే మేమూ ఫాలో అయితే ఎలా?? మాకంటూ ప్రత్యేకత ఉండాలిగా.. అంటారా? అయితే సామ్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ప్రయత్నించి చూడండి.
ట్రెడిషనల్ అవుట్ ఫిట్‌కు బుట్టలు మ్యాచయినట్లుగా ఇంకేవీ నప్పవనే చెప్పాలి. అందుకే ఈతరం అమ్మాయిలు సైతం వాటికే ఓటేస్తున్నారు. సామ్ కూడా అదే పని చేసింది.
చూశారుగా.. సామ్ ఫాలో అయిన ఇయర్ రింగ్ ఫ్యాషన్స్‌లో ఇవి కొన్ని మాత్రమే.. ఇప్పుడు చెప్పండి.. ఇయర్ రింగ్స్‌లో ఉన్న ట్రెండ్స్ మనకు తెలియాలంటే ఈ అమ్మడిని ఫాలో అయితే సరిపోదూ??