Lifestyle

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? – ఈ 40 కొటేషన్లు మీకోసం (Telugu Quotations On Success)

Babu Koilada  |  May 23, 2019
విజేతగా నిలవాలంటే ఏం చేయాలి?  – ఈ 40 కొటేషన్లు మీకోసం (Telugu Quotations On Success)

“జీవితం వడ్డించిన విస్తరికాదు. జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండదు. కష్టాలు పడితేనే సుఖం లభిస్తుంది. విజయానికి వెల చెల్లించాలి. ఊరకనే విజయం రాదు. ఒకవేళ ఊరకనే విజయం వస్తే.. అది ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే కష్టపడి విజయం సాధించండి” అన్నారు ఎవరో మహా రచయిత. నిజమే విజయాలన్నీ అనుకున్నంత మాత్రాన సిద్ధించవు. ఎంతో శ్రమ పడితేనే గానీ.. ఈ లోకంలో విజేతగా నిలవడం అసాధ్యం.  మరి.. మనం కూడా విజేతగా మారాలంటే.. ఏం చేయాలో ఈ కొటేషన్లు (success quotes) ద్వారా తెలుసుకుందామా

కార్యసాధకుల కోసం ఈ కొటేషన్లు ప్రత్యేకం (Telugu Quotations On Success)

ఏ ఒక్కరికీ విజయం ఒక్క రోజులోనే సిద్ధించదు. అహర్నిశలు కష్టపడి.. ఓటముల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. అలా విజయాన్ని కాంక్షించే వారి కోసం ఈ కొటేషన్లు ప్రత్యేకం

1. శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుంది. 

2. మీరు మీ కలను నిర్మించుకోకపోతే.. ఇతరులు తమ కలలను నిర్మించుకోవడం కోసం మిమ్మల్ని నియమించుకుంటారు – ధీరుభాయ్ అంబానీ

3. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా పనులను మొదలు పెట్టవద్దు – చాణక్యుడు

4. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. పదే పదే క్రింద పడుతున్నామని ప్రయత్నాన్ని ఆపితే.. మనం ఎప్పటికీ విజేతలం కాలేం – డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్

5. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వస్తే.. విజయం పది అడుగులు ముందుకు వస్తుంది – రవీంద్రనాథ్ ఠాగూర్

6. జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి.. మిమ్మల్ని నిజంగా ఎంతమంది ప్రేమిస్తున్నారన్నదే మీ విజయానికి కొలమానం – వారెన్ బఫెట్

7. స్థిరమైన గమ్యం.. కచ్చితమైన మార్గం.. రాజీలేని ప్రయత్నం నీదవ్వాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది – వివేకానంద

8. సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. అలాగే ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి – చాగంటి

9. నన్ను నేను నమ్ముకున్న ప్రతీసారి విజయం నన్ను వరించేది. కానీ ఒకరిపై ఆధారపడిన ప్రతీసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరకు నాకు అర్థమైంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని – షేక్స్‌పియర్

10. సంతృప్తి సాధనలో ఉండదు. ప్రయత్నంలో ఉంటుంది. పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తే.. విజయం కూడా పూర్తి స్థాయిలోనే అందుతుంది – మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

 

 

11. ప్రతీ పనిలో విజయం సాధించాలంటే.. ముందు చేసే పనిని ప్రేమించాలి – మోక్షగుండం విశ్వేశ్వరయ్య

12. ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరోదారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం – అలెగ్జాండర్ గ్రాహంబెల్

13. ఆశావాదమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నమ్మకం, ఆత్మ విశ్వాసం లేకుండా ఏ పనిలోనూ విజయం సాధించలేం – హెలెన్ కిల్లర్

14. చివరి వరకూ పోరాడే ధైర్యం ఉంటేనే .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు – చేగువేరా

15. ఓటమి గురించి భయపడితే.. నువ్వు విజయానికి దూరమైనట్లే – సిసిరో

16. విజేతలు వైవిధ్యమైన పనులు చేయరు. వారు పనులను వైవిధ్యంగా చేస్తారు – శివ్ ఖేరా

17. మీ విజయం పట్ల ఎవరైనా సందేహాన్ని వ్యక్తపరిస్తే.. వారి మాటలు వినపడనంత దూరం ప్రయాణించండి – మిచెల్ రూయిజ్

18. విజయం మంచి డియోడరెంట్ లాంటిది – ఎలిజబెత్ టేలర్

19. విజేతగా నిలవాలంటే.. మన అవకాశాలను మనమే సృష్టించుకోవాలి – బ్రూస్ లీ

20. విజేతలు గెలుపు గురించి పెద్దగా ఆలోచించరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచిస్తారు – అబ్రహాం లింకన్

21. విజేత అంటే ఎవరో కాదు. కలను కని దానిని సాకారం చేసుకొనే క్రమంలో.. రాజీ పడని వ్యక్తి  – నెల్సన్ మండేలా

22. విజేత అనేవాడు యాక్సిడెంటల్‌గా పుట్టడు. తను ఏర్పాటు చేసుకున్న లక్ష్యం గురించి అధ్యయనం చేయడం.. అవసరమైతే దాని కోసం త్యాగానికి పాల్పడడం.. అంతకు మించి దానిని ప్రేమించడం కూడా చేస్తాడు – పీలే

23. నువ్వు చేసే పనికి ఎన్ని ఎక్కువ విమర్శలొస్తే.. అన్నే అవకాశాలు నిన్ను విజయానికి దగ్గర చేస్తున్నట్లు భావించాలి – మాల్కామ్ ఎక్స్

24. విజయానికి, అపజయానికి మధ్యనున్న తేడా కేవలం బలం లేకపోవడం లేదా తెలివితేటలు లేకపోవడం వల్లో కనిపించదు. అన్నింటికన్నా మించి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడమే అపజయాలకు మూల కారణం – విన్స్ లోంబార్డీ

25. విజయానికైనా, అపజయానికైనా రహదారి ఒకటే – కొలీన్ డేవిస్

26. విజయమనేది దాని కోసం అహర్నిశలు తపించే వారికి మాత్రమే దొరుకుతుంది – హెన్నీ డేవిడ్ తొరియో

27. ఒకరు ప్రయత్నించి మధ్యలో వదిలేసిన పనులను.. శక్తివంచన లేకుండా మరల ప్రయత్నించి పూర్తిచేసిన వారే అసలైన విజేతలు – జిమ్ రాన్

28. విజేతగా మారాలని పదే పదే అనుకోకూడదు. విలువలతో బతకాలని మాత్రమే అనుకోవాలి. అప్పుడు విజయం దానంతట అదే సిద్ధిస్తుంది – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

29. పదే పదే అపజయాలను చవిచూస్తున్నా.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగేవాడే అసలైన విజేత – విన్‌స్టన్ చర్చిల్

30. అపజయాలు ఎప్పుడూ మనకు గొప్ప పాఠాలనే నేర్పుతాయి. అలా నేర్చుకున్న పాఠాల సూత్రాలను ఆచరణలో పెట్టినప్పుడే విజయం దక్కుతుంది – బరాక్ ఒబామా

31. విజయమనేది ఒక్క రోజులోనే సిద్ధించదు. ఎన్నో రోజులు కష్టపడి.. రాటుదేలిన తర్వాతే విజేతలవుతారు – స్టీవ్ జాబ్స్

32. నీకు కలలు కనే శక్తి ఉందా.. అయితే ఇంకేం.. నీకు విజేతగా మారగల శక్తి కూడా ఉంది – వాల్ట్ డిస్నీ

33. ఏడు సార్లు కుప్పకూలిపోయినా.. ఎనిమిదవ సారి లేచి నిటారుగా నిలబడ్డ వాడే విజేత – జపాన్ సామెత

34. విజేతగా నిలవాలంటే.. కష్టపడగానే సరిపోదు. కొన్నిసార్లు లౌక్యంగా కూడా వ్యవహరించాలి – రూజ్‌వెల్ట్

35. జేబులో చేతులు పెట్టుకొని.. దర్జాగా నిచ్చెన ఎక్కాలంటే కుదరదు. విజయం కూడా అలాంటిదే – ఆర్నాల్డ్ ష్వాజ్‌నెగ్గర్

36. ఒక విజేతగా మారాలంటే.. కావాల్సినవి మాట్లాడే సామర్థ్యం, మనుషులతో మమేకమయ్యే తత్వం – పాల్ జే మేయర్

37. అపనమ్మకంతో వచ్చిన గెలుపు కంటే.. నమ్మకంతో వచ్చిన ఓటమే ఎక్కువ సంతృప్తిని అందిస్తుంది – యండమూరి

38. ఓటమి నీ రాత కాదు.. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు

39. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో.. తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే

40. ఓర్పు ఎంతో చేదుగా ఉంటుంది. దాని నుండి వచ్చే ప్రతిఫలం మాత్రం చాలా తియ్యగా ఉంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి

బ్యూటీ కొటేషన్లు ఆంగ్లంలో చదివేయండి

మహిళా దినోత్సవం కొటేషన్లు ఆంగ్లంలో చదివేయండి

ఈ కొటేషన్లు బాయ్ ఫ్రెండ్స్‌కి ప్రత్యేకం – ఆంగ్లంలో చదివేయండి

 

 

 

 

 

Read More From Lifestyle