Lifestyle

సెక్స్టింగ్: లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!

POPxo Team  |  Jan 16, 2019
సెక్స్టింగ్:  లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!

సెక్ట్సింగ్.. పరిణితి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే రొమాంటిక్ సందేశాల మార్పిడి. మెసేజ్‌కు కాస్త సెక్స్‌ను జోడిస్తే అదే సెక్స్టింగ్. మీకు తెలుసా.. సెక్స్టింగ్ అనే పదాన్ని తొలిసారిగా 2005లో ఓ ఆస్ట్రేలియన్ దినపత్రికలో ఉపయోగించారు. అప్పటి నుంచి ఇది చాలా పాపులర్ పదంగా మారిపోయింది. ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు చిలిపిగా పంపించుకొనే రొమాంటిక్ మెసేజ్‌లనే  సెక్స్టింగ్ అంటారు. ఇది ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య సర్వసాధారణంగా జరిగే అంశం. అంటే తమ భాగస్వామి తమ పక్కన లేకపోయినప్పటికీ లైంగికంగా తృప్తి పొందడానికి సెక్సీగా ఒకరికొకరు మెసేజ్ చేసుకొంటారు. సెక్స్టింగ్ సెక్స్‌కి ప్రత్యామ్నాయం కాదు. కానీ సెక్స్టింగ్ సరిగ్గా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

సెక్స్టింగ్ చేయడం ఎందుకు మంచిది?

ఇద్దరి మధ్య అనుబంధాన్ని సెక్స్టింగ్ మరింత దృఢంగా చేస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు లేదా భార్యాభర్తలు ఇద్దరు చెరో ప్రదేశంలో ఉంటే వారి అనుబంధం సెక్స్టింగ్‌తో కచ్చితంగా బలపడుతుంది. సెక్స్ విషయంలో మీకున్న ఫాంటసీలను మీ భాగస్వామికి తెలియజేయడానికి ఉన్న చిలిపి మార్గం ఇది. పైగా ఇది మీ ఇద్దరి మధ్య సెక్స్ విషయంలో ఎలాంటి బెరుకు లేకుండా చేస్తుంది. అంతేకాదు.. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మధ్య వాతావరణాన్ని హాట్ హాట్‌గా మార్చేస్తుంది.

శారీరకంగా దగ్గరవ్వాలనుకొనే వారు లైంగికంగా తామేం కోరుకొంటున్నారో నిర్భయంగా తమ భాగస్వామికి చెప్పగలిగే మార్గం సెక్స్టింగ్. దీని ద్వారా పడక గదిలో తామెలా ఉండాలనుకొంటున్నారో చెప్పడంతో పాటు.. వారి నుంచి ఏం కోరుకొంటున్నారో కూడా తెలపొచ్చు. అంతేకాదు.. తమనుంచి వారేం కోరుకొంటున్నారో తెలుసుకోవచ్చు. అంటే సెక్స్ విషయంలో ఒకరి ఇష్టాలు మరొకరికి తెలుస్తాయి. ఫలితంగా ఇద్ధరి మధ్య లైంగికంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తొలుత కాస్త ఇబ్బందిగానే అనిపించినా.. అలవాటయ్యే కొద్దీ చాలా సరదాగా అనిపిస్తుంది.

సెక్స్టింగ్ ఎవరు చేయచ్చు?

సెక్స్టింగ్ చేయాలనుకొంటే ముందు మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న అనుబంధం ఏ దశలో ఉందో గుర్తించాలి. అంతకు మించి మానసిక పరిణతి ఉండాలి. అలాగే సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారు నిరభ్యంతరంగా సెక్స్టింగ్ చేయచ్చు. అంటే సహజీవనం, పెళ్లికి సిద్ధమైతేనే సెక్స్టింగ్ చేయడానికి ప్రయత్నించండి. సెక్స్టింగ్ చేయడం మీ లైంగిక జీవితానికి మంచిదే అయినా దీనికీ కొన్ని పరిధులున్నాయి. ఇలా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే దీనికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే మీకు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామి బలవంతంతో ..సెక్స్టింగ్ చేయవద్దు. ఎందుకంటే బలవంతంగా చేసే పని ఏదైనా సరే దాన్ని ఆస్వాదించలేం. అలాగే మీ రిలేషన్ షిప్ వూగిసలాడుతున్నా.. సెక్స్టింగ్ చేయకపోవడమే మంచిది. లేదంటే మున్ముందు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందే కాస్త మెలకువతో వ్యవహరించడం మంచిది.

సెక్స్టింగ్ ఎలా చేయాలి?

ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా, నేర్పుగా చేయాలని చెబుతుంటారు. ఈ సూత్రం సెక్స్టింగ్‌కూ వర్తిస్తుంది. ఎందుకంటే సమయం, సందర్భానికి అనుగుణంగా చేసే సెక్స్టింగ్ వల్ల మొదటికే మోసం రావచ్చు. అలాగే అర్థరహితమైన సెక్స్టింగ్ వల్ల కూడా అనుబంధంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. అలా జరగకూడదనే ఈ విషయంలో మేం మీతో కొన్ని టిప్స్ పంచుకోవాలనుకొంటున్నాం. మీ భాగస్వామితో సెక్ట్సింగ్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి మెసేజ్‌లోనే రొమాన్స్ చేసేయండి.

సెక్స్టింగ్ వల్ల ప్రయోజనాలు

1. సెక్స్ విషయంలో మీ భాగస్వామి కోరికలపై మీకు అవగాహన పెరుగుతుంది. ఆ విషయంలో వారి ఇష్టాయిష్టాలు తెలుసుకోవచ్చు.

2. మీ భాగస్వామిని మెచ్చుకోవడానికి, వారి మెప్పు పొందడానికి సెక్స్టింగ్ మంచి మార్గం. ఓ సారి ఊహించుకోండి.. మీ ఒంపుసొంపులను మీ భాగస్వామి పొగుడుతుంటే ఎంత బాగుంటుందో కదా..!

3. మీరు సెక్స్ విషయంలో మీ కోరికలను మీ భాగస్వామికి నేరుగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే సెక్స్టింగ్ ద్వారా వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు.

4. బెడ్రూంలో ఈ రోజు మీరేం కావాలని కోరుకొంటున్నారో మీ భాగస్వామికి చెప్పచ్చు. అంతేకాదండోయ్.. సెక్స్టింగ్ చేయడం ద్వారా డల్‌గా ప్రారంభమైన మీ రోజు చాలా ఉత్సాహంగా మారిపోతుంది.

5. మీరెక్కడున్నా.. ఏ సమయంలోనైనా మీ భాగస్వామితో సెక్స్టింగ్ చేయచ్చు.

6. దీంతో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. మెసేజ్ ద్వారా మీరు ఓ విషయం మీ భాగస్వామికి చెబుతున్నారంటే.. అది వారితో నేరుగా చెబుతున్నట్టే అర్థం.

సెక్స్టింగ్ చేయడానికీ ఓ పద్ధతి ఉంది..

1. సెక్స్టింగ్ చేయడానికి ముందు మీ మూడ్ సరిగ్గా ఉండాలి. అలాగే నేరుగా అసలు విషయంలోకి వెళ్లిపోకుండా.. మీ భాగస్వామి మూడ్ కూడా సెక్స్టింగ్ చేయడానికి వీలుగా మార్చాలి. దీనికోసం ‘నీకోసం నేనేం చేయాలనుకొంటున్నానో తెలుసా?’, ‘పడక గదిలో మనం ఎలా ఉంటే బాగుంటుంది?’ ఇలా మీ సంభాషణ ప్రారంభించాలి.

2. మీరు మీ భాగస్వామిని అనుక్షణం కోరుకొంటున్నారనే విషయం వారికి తెలిస్తే చాలా ఆనందిస్తారు. అందుకే వారి సాంగత్యం మీకు ఆనందాన్ని కలిగిస్తుందని వారికి తెలియజేయాలి. ‘డియర్.. ఆ సమయంలో నన్ను నేను హాట్‌గా ఫీలయ్యేలా చేస్తున్నావు’ అని చెప్పండి. ఇది కచ్చితంగా మీ భాగస్వామిని ఉత్సాహంగా మార్చేస్తుంది.

3. సెక్స్టింగ్ చేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూసి.. నిదానంగా చేయడం ప్రారంభించండి.

4. ఆ విషయంలో మీకు ఏదైనా కావాలనిపిస్తే.. సెక్స్టింగ్ ద్వారా దాన్ని మీ భాగస్వామికి తెలియజేయవచ్చు. బహుశా మీ పార్టనర్ కూడా దాని గురించి తెలుసుకోవడానికి ఎదురుచూస్తూండవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరే లీడ్ తీసుకొని వాటి గురించి చెప్పండి. ముఖ్యంగా మీ సెక్స్ ఫాంటసీ గురించి చెబుతూ ‘డూ దిస్ టూ మీ’ అని కొంటెగా అడిగేయండి.

5. మీ భాగస్వామితో సెక్స్టింగ్ చేసేటప్పుడు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ చాట్ చేయద్దు. ఎందుకంటే ఒకరికి పంపాల్సినది మరొకరి పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొరపాటున మీ భాగస్వామికి కొంటెగా పంపాల్సిన మెసేజ్ పొరపాటున ఇతరులకు పంపితే వారు మిమ్మల్ని ప్రశ్నార్థకంగా చూడొచ్చు.

6. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు సెక్స్టింగ్ చేయండి. ఇది మీ లైంగిక జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళుతుంది.

7. సెక్స్టింగ్ ద్వారా మీరు ఏం చెప్పారు? ఎలా చెప్పారనేది కాకుండా.. ఆ సందేశాల్లో మీ కాన్ఫిడెన్స్ ప్రతిఫలించేలా చూసుకోండి. ఇది మీ భాగస్వామిలోనూ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఫలితంగా మీ ఇద్దరి మధ్య సెక్స్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పడు సిగ్గు పడాల్సిన అవసరం లేదు.

8. కొంటెగా మాట్లాడటానికి ముందు దానికి అనువైన చిలిపి వాతావరణాన్ని కల్పించుకోవాలి.

9. మీ మనసులో రేగే లైంగికపరమైన కోరికలన్నింటినీ మీ భాగస్వామికి తెలియజేయడానికి సెక్స్టింగ్ ఒక మార్గం. కాబట్టి మీ ఊహలను మీలోనే దాచేసుకోకుండా మీ భాగస్వామికి తెలియజేయండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రిలేషన్ షిప్ విషయంలో ఎంత నిజాయతీగా ఉండాలో సెక్స్టింగ్ విషయంలోనూ అలాగే ఉండాలి.

10. ఎమోజీలను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీ ఇద్దరి మధ్య జరిగే రొమాన్స్‌ను మరో మెట్టు ఎక్కించొచ్చు. మాటల ద్వారా చెప్పాలనుకొంది ఒక్క ఎమోజీ ద్వారా వారి మనసులో ముద్ర పడేలా చేయచ్చు.

11. సెక్స్టింగ్ చేసే ముందు మీరు ఆ విధమైన మెసేజ్ పంపిస్తున్నానని మీ పార్టనర్‌కి ముందుగానే సంకేతం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే.. ఇతరుల ముందు మీరు పంపిన రొమాంటిక్ ఇమేజ్ ఓపెన్ చేస్తే.. అతడు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

12. సెక్స్ విషయంలో మీ ఊహలను మీ భాగస్వామికి తెలియజేసే ముందు అవి వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. అన్ని ఊహలు నిజజీవితంలో అనుభవించాలంటే అవి ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.

13. సెక్స్టింగ్ చేసేటప్పుడు అలసత్వం ప్రదర్శించకండి. మీ భాగస్వామి నుంచి వచ్చిన మెసేజ్‌కు సమయోచితంగా స్పందించండి. ఇప్పుడు మీకు సందేశం వచ్చిందనుకొంటే.. ఓ గంట తర్వాత దానికి రిప్లై ఇస్తే అది అంత ప్రభావం చూపించకపోవచ్చు.

అమ్మాయిలూ.. మీ పార్టనర్ కోసమే ఈ రొమాంటిక్ సందేశాలు..

అమ్మాయిలూ మీ సందేహం మాకు అర్థమైంది. సెక్స్టింగ్ కోసం ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తే బాగుంటుందనేదే కదా మీ ప్రశ్న. అందుకే మీ క ోసం కొన్ని ఉదాహరణలు..

1. రాత్రి నాకో కల వచ్చింది. ఆ కలలో నువ్వు చాలా చిలిపి పనులు చేశావు. వాటి గురించి నీకు ఇప్పుడే చెప్పాలనుంది.

2. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా దగ్గర ఉంటే.. 

3. ఇప్పుడే వేన్నీళ్లతో స్నానం చేసి వచ్చా. నన్ను వేడెక్కించేదేంటో నీకు తెలుసా? నీ స్పర్శ.

4. నువ్వు నా మెడ ఒంపులో ముద్దు పెట్టుకొంటే చాలా ఇష్టం. ఆ సమయంలో నాకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

5. నువ్వు ఎలా ఉన్నావో అని కళ్లు మూసుకొని ఆలోచించా. నువ్వెలా కనిపించావో తెలుసా? న్యూడ్‌గా..

6. అత్యంత రుచికరంగా ఉండేదేంటో తెలుసా? నీ శరీరంపై ఒలికిన చాక్లెట్ సాస్.

7. ఏదైనా చేసే స్వాతంత్య్రం నీకు నేనిస్తే.. ఈ క్షణంలో నువ్వేం చేస్తావు?

8. ఈ రోజంతా నీ ధ్యాసలోనే ఉన్నా.. ఎందుకో నీకర్థమైందా?

9. ఇప్పుడే భోజనం చేశా. డిజర్ట్‌గా నిన్ను తిందామనుకొంటున్నా.. నువ్వేమంటావ్?

10. నా నాలుకతో నీ శరీరాన్ని స్పృశిస్తున్నట్టుగా ఊహించుకొంటున్నా. ఆ అనుభూతి ఎంత కొత్తగా ఉందో తెలుసా?

11. ఇప్పుడే స్నానం చేసి వచ్చా.. ఏదైనా చేస్తే బాగుంటుంది కదా..!

12. ప్యాంట్ నీ ఒంటి మీద బాగానే ఉంటుంది. తీసేస్తే ఇంకా బాగుంటుంది.

13. నీ ఫేవరెట్ బ్రా వేసుకొన్నా. నువ్వొచ్చి తీస్తే సంతోషిస్తా.

14. ఈ మెసేజ్ పంపించే ముందు నీకు నచ్చిన బ్లాక్ థోంగ్ వేసుకొన్నా.

15. నిన్న రాత్రి బెడ్ మీద నువ్వు చేసింది గుర్తుందా? నాకు మళ్లీ అది కావాలి.

16. నీ అల్టిమేట్ సెక్సువల్ ఫాంటసీ ఏంటి? నువ్వేదడిగినా ఈ రోజు నేను కాదనను.

17. ఇక చాలు అని నువ్వనేంత వరకు ఈ రోజంతా నీతో గడుపుతా.

ఇప్పుడు తెలిసింది కదా.. సెక్స్టింగ్ ఎలా చేయాలో. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీ అనుభవాలకు తగినట్టుగా మీ భాగస్వామికి రొమాంటిక్ మెసేజ్ పంపించండి. సెక్స్టింగ్ ఎలా చేయాలో తెలుసుకొన్నప్పుడు.. ఎలా చేయకూడదో కూడా తెలుసుకోవాలి కదా..

సెక్స్టింగ్‌లో చేయకూడనివి.. మాట్లాడకూడనివి..

మీ భాగస్వామితో మీకు లైంగికపరమైన కలయిక లేనట్లయితే వారితో సెక్స్టింగ్ చేయకండి. ఇలా చేస్తే మీ భాగస్వామి ఉత్సాహాన్ని నీరుగార్చినట్లయిపోతుంది. ఎందుకంటే తొలిసారి ఆ అనుభూతిని ఆస్వాదించాలనే మూడ్ చెడిపోతుంది. నిజమే..సెక్స్టింగ్ మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా చేస్తుంది. కానీ అది మీ ఇద్దరి మధ్య సెక్స్ ప్రారంభమైన తర్వాత మాత్రమే.

మీ భాగస్వామి ప్రైవసీకి భంగం కలిగించేలా సెక్స్టింగ్ చేయద్దు. ప్రస్తుతం మీకు సెక్స్టింగ్ చేసే మూడ్ ఉంటే.. అదే సమయంలో మీ భాగస్వామి కూడా అదే మూడ్‌లో ఉండకపోవచ్చు. వారు వేరే పనిలో  ఉండొచ్చు. ఈ సమయంలో సెక్స్టింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇద్దరూ సెక్స్టింగ్ మజాని ఆస్వాదించే సమయంలో మాత్రమే మీ భాగస్వామికి సెక్స్ట్ చేయండి. అందుకే ముందుగానే వారి మూడ్‌ని తెలుసుకొనేందుకు వారికి మీరు సెక్స్టింగ్ చేస్తున్నాననే సంకేతాన్నివ్వండి. దానికి వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే దాన్ని కొనసాగించండి.

పరిణితి లేని భాగస్వామితో సెక్స్టింగ్ చేయద్దు. ఎందుకంటే సెక్స్టింగ్ అనేది ఇద్దరు ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య జరిగే విషయంగా చూడలేం. అది మానసికంగా పరిణతి చెందిన ఇద్దరు జీవిత భాగస్వాముల మధ్య ఫన్ కోసం జరిగే సందేశాల మార్పిడి. పైగా ఇది మీ ఇద్దరికి మాత్రమే పరిమితమైనవి. కాబట్టి దీన్ని స్వీకరించే పరిణతి మీ ఇద్దరిలోనూ ఉంటేనే సెక్స్టింగ్ చేయండి.

అంతా ఒకే మెసేజ్ లో చెప్పేయకండి. సెక్స్టింగ్ ఎప్పుడూ సూటిగా, క్లుప్తంగా ఉండాలి. అందులోనే మీ కొంటెదనం కనిపించాలి.  మీ భాగస్వామి కూడా సెక్స్టింగ్ చేయడానికి ఆసక్తి కలిగించేలా ఉండాలి. కాబట్టి పెద్ద పెద్ద మెసేజ్‌లు పంపించకండి.

పాప్-అప్ నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేయండి. ముందే మనం చెప్పుకొన్నాం కదా.. సెక్స్టింగ్ చేసేటప్పుడు మీ భాగస్వామితో తప్ప ఇతరులు పంపించే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వద్దని. అందుకే ముందుగానే మీ మెసేజింగ్ యాప్‌లో పాప్-అప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇది మీకు ప్రైవసీని అందించడంతో పాటు మీ మూడ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.

ఫిల్టర్స్ ఉపయోగించకండి. సెక్స్టింగ్ ఎప్పుడూ సహజంగానే ఉండాలి. కాబట్టి మీరు పంపే ఫొటోలను ఫిల్టర్స్ ఉపయోగించి కృత్రిమంగా మార్చకండి. ఇలా చేయడం వల్ల సమయం వృథా చేయ‌డం తప్ప కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా మీరు పంపించే ఫొటోలో సహజత్వం దెబ్బతింటుంది.

డిలీట్ చేయడం మరచిపోవద్దు. ముఖ్యంగా ఇతరులు మీ ఫోన్ ఉపయోగించే అవకాశాలున్నప్పుడు మీ భాగస్వామితో చేసిన సెక్స్టింగ్ గురించి ఇతరులకు తెలియకుండా ఉండటానికి వాటిని డిలీట్ చేయండి. లేదా యాప్ లాక్ సాఫ్ట్వేర్ ఉపయోగించండి. దీనివల్ల మీ సెక్స్టింగ్ ఇతరులకు తెలియకుండా ఉంటుంది.

భాగస్వామితో సెక్స్టింగ్ చేసేటప్పుడు కచ్చితంగా వాడాల్సిన పదాలు

సెక్స్టింగ్ చేసేటప్పుడు కొన్ని పదాలను ఉపయోగించడం ద్వారా మనం చెప్పాలనుకొనే విషయాన్ని సూటిగా వారికి అర్థమయ్యేలా చేయచ్చు. దీనికోసం మీ దగ్గర అలాంటి కొన్ని పదాలు ఉండాలి. అవే అవసరం(need), కావాలి(want), నువ్వు(YOU), నేను(me) ఈ పదాలు సెక్స్టింగ్‌లో ఎక్కువగా ఉపయోగించే పదాలు. అలాగే నాలుకతో స్పృశించడం(lick), ముద్దు(kiss), ఇలా చెయ్యి(do this to me) వీటిని కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఏ సమయంలో ఎలా వాడితే బాగుంటుందో తెలుసుకొని ఉపయోగించండి.

సెక్స్టింగ్ ఎందుకు చేయాలి?

ఇద్దరు ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య జరిగే సెక్స్టింగ్ వారి మధ్య అనుబంధాన్ని ఇంకాస్త బలపరుస్తుంది. వారి అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉండేలా చేస్తుంది. ఎందుకంటే మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న అంతరాన్ని సెక్స్ తగ్గిస్తుంది. అందుకే సెక్స్టింగ్ చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మీ భాగస్వామితో మీ సెక్స్ పరమైన కోరికల గురించి మాటల ద్వారా చెప్పలేకపోవచ్చు. కానీ దాన్ని మెసేజ్ ద్వారా ఇంకా ప్రభావవంతంగా తెలియజేయచ్చు. ఇది కేవలం సెక్స్ వరకే పరిమితం కాదు.. మానసికంగానూ  మిమ్మల్ని దగ్గర చేస్తుంది. సెక్స్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది. అంతేకాదు ఒకరిపై మరొకరికి నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి. సెక్స్టింగ్ అవసరమే కదా..

తల్లిదండ్రులుగా సెక్స్టింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

మీరు పేరెంటా? అయితే మీ పిల్లల విషయంలో కొన్ని విషయాల్లో ముందుగానే మీరు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఏ వయసులో ఇవ్వాలి? వారితో లైంగికపరమైన విషయాల గురించి ఎప్పుడు చర్చించాలి? వంటి వాటిపై మీకు స్పష్టత ఉండాలి. కానీ ఇది చెప్పుకొన్నంత సులభమేమీ కాదు. ఎందుకంటే మీ పిల్లలు టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత వారిని నిరంతరం గమనించడం కుదరదు. ఎందుకంటే అప్పటికప్పడు తల్లి లేదా తండ్రి స్థానం నుంచి స్నేహితుడిగా మారాల్సి వస్తుంది. ఉరకలెత్తే ఉత్సాహంతో పరిగెడుతున్నవారికి ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. టీనేజ్‌లో తమ శరీరంలో వచ్చే మార్పుల గురించి వారు తెలుసుకోవాలనుకొంటారు. అలాగే లైంగికపరమైన అంశాలనూ వీలైనంత తెలుసుకోవడానికే ప్రయత్నిస్తారు. ఈ విషయంలో కొంతమంది పిల్లలు మరో అడుగు ముందుకేసి సెక్స్టింగ్ చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు పనికొచ్చే కొన్ని చిట్కాలు..

ఇది సహజమని గుర్తించండి..

లైంగికపరమైన విషయాలపై మీ అమ్మాయి లేదా అబ్బాయి ఆసక్తి కనబరుస్తుంటే.. వారిని కోప్పడకండి. ఇది సహజమని గుర్తించండి. ఈ విషయంలో మీరు ఏం చేయాలంటే.. వారితో ఈ విషయం గురించి ఫ్రాంక్‌గా మాట్లాడండి. వారికి తప్పొప్పుల గురించి అనునయంగా చెప్పే ప్రయత్నం చేయండి.

వారితో చర్చించండి..

టీనేజ్‌లో ఉన్నవారు కొన్నింటిపై చాలా సులభంగా ఆకర్షణకు గురవుతారు. అందుకే లైంగికపరమైన విషయాల్లో ఏది మంచి ఏది చెడు.. అనే విషయం వారికి వివరంగా తెలియజేయాలి. అప్పుడే వారు పెడదారి పట్టకుండా ఉంటారు.

సెల్ఫ్ డౌట్ పెరగనీయద్దు..

టీనేజ్‌లోని పిల్లలకు ప్రతి విషయంలోనూ ఇతరులతో తమను పోల్చుకొనే అలవాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులకంటే తాము తక్కువగా ఉన్నామనే భావనలోకి వెళ్లిపోతుంటారు. దీని కారణంగా వారిలో ఆత్మన్యూనత, అభద్రతాభావం పెరిగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో తమపై తామ సందేహాలు పెంచుకొంటారు. వారిలో ఈ రకమైన మార్పులు మీరు గుర్తిస్తే.. వారిలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. ఇతరులతో పోలిస్తే వారెలా ప్రత్యేకమో వివరించండి.

మీ పార్టనర్ సెక్స్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకోవడమెలా?

ఈ విషయాన్ని గుర్తించడం చాలా సులభం. మీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు సెక్సీగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా.. సెక్సీ పిక్చర్స్, నాటీ జోక్స్ పంపుతున్నా.. సెక్స్టింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లుగా భావించాలి. ఈ తరహా మెసేజ్‌లు పంపుతూ మిమ్మల్ని కూడా అలాగే మెసేజ్ చేయమని సూచనలు ఇస్తున్నారు. ఈ విషయంలో మీరు అతన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అతనికిష్టమైన పని మీక్కూడా నచ్చుతుంది. కావాలంటే మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

ఎమోజీలతో ఫైర్ మరింత పెంచండి

ఈ రోజుల్లో టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జరిగే సంభాషణల్లో ఎమోజీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ అభిప్రాయాలను చెప్పడానికి సైతం వీటినే  ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరూ ఎమోజీలతో సెక్ట్స్ చేయండి.

కన్ను గీటే ఎమోజీ

ఫ్లర్టీ, ఫన్ మెసేజ్‌లు పెట్టేటప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తారు. మీ పార్టనర్ చెప్పే దానికి మీరు అంగీకరించారని చెప్పడానికి దీన్ని పంపిచొచ్చు. అలాగే కొంటెగా మీరు ఓ విషయాన్ని వారికి చెప్పడానికీ ఉపయోగించవచ్చు.

వంకాయ ఎమోజీ

సెక్స్టింగ్ ప్రపంచంలో ఈ ఎమోజీకి చాలా ప్రాధాన్యం ఉంది. పురుషాంగానికి సూచికగా దీన్ని వాడతారు. మీ బాయ్ ఫ్రెండ్‌ని మీరు కోరుకొంటున్నారని చెప్పడానికి ఈ ఎమోజీ ఉపయోగించవచ్చు.

పీచ్ ఎమోజీ

సెక్స్టింగ్ ఎమోజీ భాషలో పీచ్ అంటే పిరుదులు. Anal sex ని ఇష్టపడేవారు దీన్ని ఉపయోగిస్తారు.

టంగ్ ఎమోజీ

మీ పార్టనర్ని నాలుకతో స్పృశించాల‌నే మీ కోరికను తెలియజేయడానికి.. వారినీ అలాగే చేయమని చెప్పడానికి పంపిస్తారు. ఫ్రెంచ్ కిస్ కావాలని అడగడానికి సైతం ఈ ఎమోజీని పంపిస్తారు. సందర్భాన్ని బట్టి దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు.

ఫ్లేమ్ ఎమోజీ

సెక్స్ బాగా కావాలనిపిస్తున్న సమయంలో ఈ ఫ్లేమ్ ఎమోజీ పంపించవచ్చు. మీ భాగస్వామి మరింత హాట్‌గా ఉండాలని చెప్పడానికి కూడా దీన్ని సెండ్ చేస్తారు.

వాటర్ డ్రాప్స్ ఎమోజీ

ఈ ఎమోజీ ఆర్గాజమ్ గురించి చెప్పడానికి వాడతారు. మరి కొంతమంది స్పెర్మ్‌ని సూచించడానికి ఈ ఎమోజీ వాడతారు.

సెక్స్టింగ్ ని ఫోర్ ప్లేగా పరిగణించవచ్చా?

అసలు పనికి ముందు మీలో వేడిని పుట్టించడానికి సెక్స్టింగ్‌ను చాలా జంటలు ఉపయోగిస్తున్నాయి. సుదూర ప్రేమబంధంలో ఉన్నవారు సెక్స్‌కి ప్రత్యామ్నాయంగా సెక్స్టింగ్ చేస్తుంటారు. పనిలో బిజీగా ఉన్నప్పుడు మీరో సెక్స్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకొంటే.. మీ సెక్స్ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది.  అందుకే సెక్స్ ముందు సెక్స్టింగ్ మంచి ఫోర్ ప్లే(foreplay)గా పనిచేస్తుందని చెబుతున్నాం.

సుదూర ప్రేమ బంధంలో ఉన్నవారికి సెక్స్టింగ్ మేలు చేస్తుందా?

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారు చాలా సందర్భాల్లో తాము ఇష్టపడుతున్న వ్యక్తి పక్కన లేకపోవడం వల్ల ఒంటరితనానికి గురవుతుంటారు. ముఖ్యంగా ఆ విధమైన ఆలోచనలు మనసులో మెదిలినప్పుడు ఈ భావన మరింత ఎక్కువ అవుతుంది. అలాంటి సమయంలో కోరుకొన్న వ్యక్తి నుంచి డర్టీ మెసేజ్ అందుకొంటే ఒక్కసారిగా శరీరంలో ఉత్సాహం పొంగుకొస్తుంది. మరో వైపు మిమ్మల్ని వారు మిస్సవుతున్న సందేశాన్నిస్తుంది. ఇది వారిపై మీకున్న ప్రేమను మరింత పెరిగేలా చేస్తుంది.

సెక్స్టింగ్ ఎంజాయ్ చేయలేకపోవడం సాధారణమేనా?

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సెక్స్టింగ్ హృద‌యాన్ని మీటేలా ఉండాలి. అలా కాకుండా మీ ఇద్దరిలో ఎవరైనా దాన్ని ఆస్వాదించలేకపోతుంటే దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. రిలేషన్ షిప్‌ను మరింత హాట్‌గా మార్చడానికి ఉన్న మార్గాల్లో సెక్ట్సింగ్ కూడా ఒకటి. కానీ అదొక్కటే మార్గం కాదు. కాబట్టి ఈ విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ విషయాన్ని మీ భాగస్వామితో చర్చించండి. దీనికి బదులుగా మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఏం చేయాలో గుర్తించి వాటిని అనుసరించండి.

చివరిగా మేం చెప్పేదేంటంటే.. ప్రతి జంటకూ సెక్స్టింగ్ విషయంలో తమవైన అభిప్రాయాలుంటాయి. కొందరికి ఇది నచ్చుతుంది. మరికొందరికి ఇది రుచించకపోవచ్చు. కాబట్టి మీకు, మీ భాగస్వామికి ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే సెక్స్టింగ్ కొనసాగించండి. ఎందుకంటే ఇష్టం లేకుండా చేసే పని ఏదైనా సరే దాన్ని ఆస్వాదించలేం. కాబట్టి ఇష్టంతో సెక్స్టింగ్ చేయడానికి ప్రయత్నించండి. మెసేజ్ లోనే హాట్ హాట్ రొమాన్స్ చేసేయండి.

Happy Sexting

Images: Pexels

ఇవి కూడా చదవండి

సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన 15 ఆసక్తికర విషయాలివే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

సెక్స్ గురించి ఆలుమగలు తెలుసుకోవాల్సిన విషయాలివే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

11 సెక్స్ పొజిషన్స్.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

Read More From Lifestyle