Fashion

పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

Lakshmi Sudha  |  May 20, 2019
పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

నిన్నమొన్నటి వరకు పట్టు చీర(silk sarees) కట్టుకోవడానికి అమ్మాయిలు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పట్టు చీరలు చాలా ఇష్టంగా కట్టుకొంటున్నారు. రకరకాల పట్టుచీరలను తమ వార్డ్రోబ్‌లో చేర్చుకొంటున్నారు.

మీరు కూడా పట్టు చీరలు కట్టుకోవాలనుకొంటున్నారా? అయితే ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్ అవుతోన్న కొన్ని రకాల పట్టుచీరల గురించి తెలుసుకొందాం. ముఖ్యంగా ఈ పట్టు చీరలు కొత్త పెళ్లి కూతురికి మరింత శోభనద్దుతాయి.

1. బెనారస్ చీరలు:

వీటినే బెనారసీ, బనారసీ చీరలని కూడా అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి వీటి పుట్టిల్లు. ఇవి ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా ప్రసిద్ధి చెందిన పట్టుచీరలు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ చీరల ప్రత్యేకత ఏంటో తెలుసా? సన్నని బంగారు, వెండి దారాలతో వీటిని తయారుచేస్తారు.

మొఘలు రాజవంశస్థుల కోసం ఈ చీరలను తయారుచేసేవారు. అందమైన పువ్వుల డిజైన్లతో రాజసం ఒలికించే ఈ చీరలు నేటితరం యువతుల అభిరుచికి తగినట్టుగా రూపుదిద్దుకొంటున్నాయి. బెనారస్ చీరల్లో జంగ్లా, తానోచీ, టిష్యూ, బుటీదార్, కట్ వర్క్, వస్కత్, జందానీ రకాలున్నాయి. డిజైన్ల ఆధారంగా వీటిని విభజించారు. ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. పండగలు, ప్రత్యేకమైన సందర్భాలు, వివాహాది శుభకార్యాలు ఇలా ఏ సందర్భానికైనా సరే ఈ చీరలను కట్టుకోవచ్చు.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 2459

2. కంచి పట్టు చీరలు:

పెళ్లి కూతురి కోసం ఏ చీర కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు మొదట స్ఫురించేది కంచిపట్టు చీరే. బంగారపు జరీతో నేసే ఈ చీరకు డిమాండ్ చాలా ఎక్కువ. తమిళనాడులోని కాంచీపురంలో తయారయ్యే ఈ చీరలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. ప్రతి చీర అంచులోనూ టెంపుల్ డిజైన్ భాగంగా ఉంటుంది. అందమైన డిజైన్లతో ఆకట్టుకొనేలా ఉండే ఈ చీరలు చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. సాధారణంగా కంచి పట్టు చీరలు నూలుతో తయారవుతాయి.

కాబట్టి వీటిని రోజువారీ కట్టుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. మిగిలినవాటి మాదిరిగానే కంచి పట్టు చీరలు సైతం ఆధునిక హంగులను అద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగానే కంచి సిల్క్ చీరలు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని కాంచీవరం సిల్క్ శారీస్ అని పిలుస్తున్నారు. చాలా ట్రెండీగా ఉండే ఈ చీరలు ఏ వయసువారికైనా.. ఏ సందర్భానికైనా సరే చక్కగా సరిపోతాయి.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 1419

3. పోచంపల్లి చీరలు:

సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన పోచంపల్లిలో ఈ చీరలు తయారవుతాయి. నల్గొండ జిల్లా‌లో ఉంది ఇది. దారాలకే రంగులు అద్ది వాటినే డిజైన్లుగా మలిచే ఈ చీరలు చాలా అందంగా ఉంటాయి. ఈ చీరలపై ఉన్న డిజైన్‌ను ఇక్కత్ డిజైన్ అని పిలుస్తారు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉడంటంతో పాటు ఎక్కువ కాలం మన్నుతాయి.

ముఖ్యంగా వేసవిలో ధరించడానికి ఈ చీరలు చాలా అనువుగా ఉంటాయి. పోచంపల్లిలో తయారైన పట్టు, సిల్క్, కాటన్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. పోచంపల్లి చీరలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రయత్నిస్తోంది.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 5409.

4. చెట్టినాడ్ సిల్క్ చీరలు

ఒకప్పుడు ఈ చీరలను కొనుగోలు చేయడానికి అంతగా ప్రాధాన్యమిచ్చేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో చెట్టినాడ్ చీరలను కట్టుకోవడానికి నేటితరం అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. తేలికగా, ట్రెండీగా ఉండే ఈ చీరలు మిగిలిన వాటితో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కువగా కాటన్‌తోనే ఈ చీరలను నేస్తారు. కాంట్రాస్ట్ రంగుల్లో  చెక్స్(గడులు), స్ట్రిప్స్(గీతలు) తో ఉండే ఈ చీరలు చాలా ట్రెండీగా ఉంటాయి. ప్యూర్ సిల్క్, కాటన్ సిల్క్‌లో ఈ చీరలు మనకు లభ్యమవుతున్నాయి.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 2099.

5. మైసూర్ సిల్క్ శారీ

మైసూర్ రాజదర్పానికి ప్రతీక మైసూర్ సిల్క్ చీరలు. చాలా సున్నితమైన ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ చీరలు కట్టుకొంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఈ జరీ చీరలు చాలా తేలికగా ఉంటాయి. డిజైన్లు కూడా ట్రెండీగా ఉండటంతో.. ఎక్కువ మంది మహిళలు మైసూర్ సిల్క్ చీరలను కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ఈ చీర కట్టుకొన్నప్పుడు, శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చీర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కాబట్టి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 699.

6. టస్సార్ సిల్క్

సహజసిద్ధమైన బంగారు వర్ణం కలిగిన పట్టు దారాలను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, బిష్ణుపూర్లో వీటిని తయారుచేస్తారు. టస్సార్ సిల్క్ చీరలు వేసవిలో ధరించడానికి చాలా అనువుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ చీరలను మెయింటైన్ చేయడం చాలా సులభం. ఈ చీరల డిజైన్లు సైతం నేటి తరం అభిరుచికి తగినట్లుగా ఉండటంతో అమ్మాయిలు ఈ చీరలను ధరించడానికి ఇష్టపడుతున్నారు.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 3380.

7. గద్వాల్ చీర

ఆంధ్రప్రదేశ్‌లోని గద్వాల్ పట్టణంలో తయారయ్యే ఈ చీరలు ప్రపంచ ప్రసిద్ది గాంచినవి. అందమైన డిజైనల్లో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చీరలు చూడటానికి మాత్రమే కాదు.. కట్టుకోవడానికి సైతం చాలా బాగుంటాయి. సిల్క్, కాటన్, కాటన్ సిల్క్ కలగలిపి వీటిని తయారుచేస్తారు. పెళ్లి పట్టుచీరల్ల ో వీటికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ వయసువారికైనా సరే ఈ చీర చాలా అందంగా ఉంటుంది.

ఇక్కడ కొనండి.

ధర: రూ. 999.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

 క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన వస్తువులను కొనేయండి

ఇవి కూడా చదవండి

అమ్మ చీరతో అందంగా ఇలా

కాలేజ్ ఫంక్ష‌న్స్‌లో.. ఈ శారీ లుక్స్‌తో అద‌రగొట్టేయండి..!

వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!

Read More From Fashion