ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఐదేళ్లకోసారి ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎన్నుకొనే ప్రయత్నంలో ఉన్నాం. అధికార పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. దాని కోసమే ప్రతి పార్టీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే వివిధ రకాల హామీలతో కూడిన మ్యానిఫెస్టోలను విడుదల చేస్తుంటాయి.
వాటిని చాలా జాగ్రత్తగా, ఆకర్షణీయంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తాయి. తొలి షెడ్యూల్ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. అన్ని పార్టీల మాదిరిగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఏప్రిల్ 8న మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ మ్యానిఫెస్టోలో చేర్చిన ఓ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో #WomenBewareOfBJP అంటూ మహిళలను బీజేపీ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు ట్విట్టరాటీస్.
బీజేపీ మ్యానిఫెస్టోలో సుమారుగా 75 అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు.. వాటిని 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో జమ్ము కశ్మీర్ అంశం, ఉగ్రవాదం, దేశ భద్రత, రైతు ఆదాయం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత అంశంలో బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో బీజేపీ చేసిన హామీ ముక్కున వేలేసుకొనేలా చేసింది. సాధారణంగా మహిళలపై నేరాలకు పాల్పడకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలి.
కానీ బీజేపీ మాత్రం తన మ్యానిఫెస్టోలో మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అనువుగా చట్టాలను మారుస్తానని చెబుతోంది (‘for transferring the laws in order to commit crimes against women’). ఇలాగే మరో ప్రామిస్ కూడా చేసింది. అత్యాచారం జరిపిన వారిపై నిర్ణీత వ్యవధిలో విచారణ పూర్తి చేస్తామని చెప్పడానికి బదులుగా నిర్ణీత వ్యవధిలో మహిళలపై అత్యాచారం జరిపే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది (time-bound ‘trail’ for rape instead of ‘trial’ for rape).
బీజేపీ పార్టీ ఉద్దేశం ఇది కాకపోయినప్పటికీ ఆంగ్లంలో రూపొందించిన మ్యానిఫెస్టోలో ఉన్న అక్షర, వ్యాకరణ దోషాల కారణంగా వీటి అర్థం పూర్తిగా మారిపోయింది. ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ తప్పులను ఎత్తి చూపింది. ట్విట్టర్లో దీని గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ మ్యానిఫెస్టోలో ఉన్న ఈ హామీ వారి అసలు స్వరూపాన్ని తెలియజేస్తోందని చెబుతూ #BJPJumlaManifesto హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసింది.
బీజేపీ మ్యానిఫెస్టోలో అక్షర, వ్యాకరణ దోషాల వల్ల అర్థం మారిపోయినప్పటికీ.. ప్రజలు మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొన్నారు. మ్యానిఫెస్టో స్క్రీన్ షాట్‌ను #WomenBewareOfBJP హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వాటిని మీరు కూడా పరిశీలించండి.
మరో విషయం ఏంటంటే మ్యానిఫెస్టో సాఫ్ట్ కాపీలో ఈ తప్పులు లేవు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు కథనాలు చదవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.