Entertainment

F2 (ఫన్ & ఫ్రష్ట్రేషన్) సినిమాని ఎందుకు చూడాలంటే.. ?

Sandeep Thatla  |  Jan 11, 2019
F2 (ఫన్ & ఫ్రష్ట్రేషన్) సినిమాని ఎందుకు చూడాలంటే.. ?

పండగకి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. పైగా సంక్రాంతి అంటేనే సంబరం.. ఆ పైన వినోదం. ఇక వినోదం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది సినిమా. అందరికి అందుబాటులో ఉన్న ఏకైక సౌలభ్యం సినిమా. అందుకనే సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ‌తో కలిసి సినిమాలకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే మన దర్శక-నిర్మాతలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమని ఈ సీజన్‌లో అలాంటి ఒక కుటుంబ కథా చిత్రానైనా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంటారు.

ఇక అలాంటి ఒక చిత్రం గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో అని తెలియడానికి. అలాగే ఒక చిత్రం ట్రైలర్ చూస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది మనకి తెలిసిపోతుంది. ఈ రోజు విడుదలైన F2 (Fun & Frustration) చిత్రం గురించి ఇప్పుడు మేము ఈ మాట అంటున్నాం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ప్రచార చిత్రాలు, పోస్టర్స్, ట్రైలర్స్ & టీజర్స్ ప్రేక్షకులని ఆకట్టుకోగా.. ఈ సినిమా పక్కా హిట్ అనే టాక్ విడుదలకి ముందే సొంతం చేసుకుంది. విడుదల అయ్యాక కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందననే సొంతం చేసుకుంది.

 

ఈ తరుణంలో అసలు F2 చిత్రాన్ని మనం ఎందుకు చూడాలనేది.. ఈ క్రింద చెప్పబోయే పాయింట్స్ బట్టి మీకే అర్ధమవుతుంది.

* ఇది విక్టరీ వెంకటేష్ (Venkatesh) మరియ వరుణ్ తేజ్‌లు (Varun Tej) కలిసి నటించిన తొలిచిత్రం కావడం విశేషం.

* F2 ఈ మధ్యకాలంలో వచ్చిన తొలి మల్టీ స్టారర్ చిత్రం కావడం గమనార్హం. గతంలో కూడా వెంకటేష్ పలు మల్టీస్టారర్ చిత్రాలలో నటించారన్న సంగతి మనకు తెలిసిందే.

* రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్‌తో సహా సుమారు 25 మంది ప్రముఖ నటీనటులు కలిసి పనిచేసిన చిత్రం ఇది. ఇది కూడా ఒక వైవిధ్యమైన సంగతి అనే చెప్పుకోవచ్చు.
ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్టార్ కాస్టింగ్‌తో ఏ చిత్రం కూడా విడుదల కాలేదు.

* వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) నుండి వస్తున్న నాల్గవ చిత్రం ఇది.

* అలాగే దిల్ రాజు (Dil Raju) -అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న మూడవ చిత్రం ఈ F2.

* వెంకటేష్ -తమన్నా కలిసి నటించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

* 2 గంటల 26 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో.. దాదాపు 2 గంటల పాటు కథలో కామెడీనే పండించడానికి ప్రయత్నించారు దర్శకులు.

పైన చెప్పిన ఈ 7 పాయింట్స్ బట్టి ఈ సినిమాని కచ్చితంగా ఎందుకు చూడాలనే దాని పైన మనకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందిగా..!

ఇవి కూడా చదవండి

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?

Read More From Entertainment