లంగా ఓణీ (langa voni)అంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరూ ఉండరేమో..సంప్రదాయబద్ధమైన తెలుగు దుస్తులు అంటే ముందుగా గుర్తొచ్చేది చీర, ఆ తర్వాత లంగా ఓణీ.. అసలే తెలుగువారికి అతి పెద్ద పండగ సంక్రాంతి వచ్చేస్తుంది. ఈ పండక్కి అమ్మాయిలందరూ నచ్చిన పరికిణీలు కొనుక్కొని ధరించడానికి సిద్ధమైపోతుంటారు. అయితే ప్రతి ఏడాది లంగా ఓణీ కొనుక్కోవడం దాన్ని అలా పక్కకు పెట్టేయడం తప్ప.. పెద్దగా చేసేదేం ఉండదు. ముఖ్యమైన ఫంక్షన్లు, పండగల సమయంలో వేసుకోవడం తప్ప లంగా ఓణీ వేసుకోవడానికి మరో ఆప్షన్ ఉండదు. అయితే దాన్ని కాస్త మార్పులు చేసుకుంటే చాలు.. లంగా ఓణీని రోజు వారీ ఫ్యాషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ఇటు ఇండియన్ స్టైల్ తో పాటు అటు వెస్ట్రన్ (western)కూడా ట్రై చేయవచ్చు. అదెలాగో చూద్దాం రండి..
ఈ అవుట్ ఫిట్స్‌తో.. మీ దసరా ట్రెండీగా జరుపుకోండి ..!
1. కేప్ తో స్కర్ట్ లా..
లంగా ఓణీ కొనుక్కునేటప్పుడే దాని లుక్ మార్చుకోవడానికి వీలుగా ఉందా? లేదా? చూసుకొని ఎంచుకోవడం మంచిది. దీనివల్ల దానిపై ఎలాంటి అవుట్ ఫిట్స్ ధరించి దాన్ని ఎలా మార్చినా చూసేందుకు అందంగా ఉంటుంది. దీనికోసం లెహెంగా మంచి డిజైన్ తో ఉండి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉండేలా చూసుకోవాలి. కావాలంటే బ్లౌజ్ కూడా కాస్త ఎంబ్రాయిడరీతో ఉండేలా చూసుకోవాలి. రంగులు కూడా మ్యాచింగ్ లేదా వ్యతిరేక రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల లంగా ఓణీ చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది. లంగా ఓణీ ని ప్రత్యేకంగా ట్రెండీగా మార్చుకోవడానికి దానిపై ఉన్న బ్లౌజ్, ఓణీ తీసేసి చక్కటి కేప్ లాంటి పొడవాటి చేతులున్న టాప్ వేసుకోవడం వల్ల వెస్ట్రన్ లుక్ మీ సొంతం అవుతుంది.
2. చున్నీతో స్పెషల్ లుక్
లంగా ఓణీ అంటే సాధారణంగా చీరలా నడుము దగ్గర దోపుకొని పవిట కొంగులా వేసుకునే అలవాటే మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈసారి ఏదైనా ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు కాస్త ప్రత్యేకమైన లుక్ కోసం లంగా ఓణీ వేసుకున్నా ఓణీని కొంగులా కాకుండా ఒక పక్కకి ఒక వైపు చున్నీలా వేసుకొని ప్రయత్నించండి. మీ లుక్ చాలా అందంగా కనిపిస్తుంది. నడుము కనిపించకూడదు అనుకుంటూ మీ బ్లౌజ్ ని కాస్త కిందకు కుట్టించుకోవడం లేదా లెహెంగా ను పైకి కట్టుకోవడం వంటివి చేయడం మంచిది.
3. కుర్తా వేసేయండి.
లంగా ఓణీ కి ట్రెండీ లుక్ ఇస్తే బాగానే ఉంటుంది కానీ దాన్ని క్యాజువల్ గా వేసుకోవాలంటే కాస్త వేరుగా ఉంటే బాగుంటుంది కదా.. అందుకే లంగా ఓణీ లో ఓణీ, బ్లౌజ్ పక్కన పెట్టి లెహెంగా పై ఓ మంచి కుర్తీ వేసుకోండి. క్యాజువల్ ఫ్యాషన్ అయిపోతుంది. మీ లెహెంగా ప్రింటెడ్ అయితే ప్లెయిన్ కుర్తీ, ప్లెయిన్ గా ఉంటే ప్రింటెడ్ కుర్తీ వేసుకోవడం చేయడం వల్ల లుక్ కంప్లీట్ గా ఉంటుంది. దీని పై మంచి సిల్వర్ లేదా గోల్డ్ జ్యుయలరీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
4. కోట్ తో కొత్త లుక్
లేయరింగ్ ఎప్పుడూ ప్రతి డ్రస్ ని ప్రత్యేకంగా మారుస్తుంది. లంగా ఓణీ కి కూడా అలాంటి లేయరింగ్ టచ్ ఇవ్వండి. ఓణీ తీసేసి దానిపై లాంగ్ జాకెట్ వేయండి. దీంతో మీ సంప్రదాయబద్ధమైన లంగా ఓణీ ఒక్క నిమిషంలో ట్రెండీగా మారిపోతుంది. ఈ డ్రస్ తో అటు సంప్రదాయబద్ధమైన ఫంక్షన్, ఇటు కాక్ టెయిల్ పార్టీ రెండూ ఒకే డ్రస్ తో పూర్తి చేసుకొని రావచ్చు. లంగా ఓణీ రంగులకు జాకెట్ రంగు మ్యాచ్ అవ్వడం లేదా వ్యతిరేక రంగుల్లో ఉండడం వల్ల మరింత అద్బుతమైన లుక్ సొంతం చేసుకోవచ్చు.
5. మ్యాక్సీ స్కర్ట్ లా..
ఎలాంటి ప్రయత్నం లేకుండా మీ సింపుల్ లంగా ఓణీ ని కొత్తగా, ట్రెండీగా కనిపించేలా చేయాలనుకుంటే బ్లౌజ్ ని హుక్స్ లేకుండా క్రాప్ టాప్ లా కుట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల లంగా ఓణీ వేసుకోవాలనుకున్నప్పుడు అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఓణీ లేకుండా క్రాప్ టాప్, లెహెంగా రెండూ కలిపి వేసుకోవచ్చు. సంప్రదాయబద్ధంగా ఒక లుక్ లో అల్ట్రా మోడ్రన్ గా మరో లుక్ లో మెరిసిపోవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన.. ఈ అద్బుతమైన చేనేత చీరల గురించి మీకు తెలుసా?
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.
Read More From Celebrity Style
హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!
Lakshmi Sudha