Self Help

వాటర్ బర్త్.. సులువైన ప్రసవం కోసం అద్భుతమైన ప్రక్రియ ..!

Soujanya Gangam  |  Oct 9, 2019
వాటర్ బర్త్.. సులువైన ప్రసవం కోసం అద్భుతమైన ప్రక్రియ ..!

వాటర్ బర్త్ (water birth).. ప్రస్తుతం ఎక్కువ మంది సుఖ ప్రసవం (delivery) కోసం పాటిస్తున్న పద్ధతి. మన దేశంలో ఇప్పటివరకూ ఈ పద్ధతిపై పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. కానీ విదేశాల్లో మాత్రం.. ఈ పద్ధతినే ఎక్కువగా పాటిస్తున్నారు. ఈ పద్ధతిలో భాగంగా.. గోరు వెచ్చని నీటి తొట్టెలో పడుకొని ప్రసవం కోసం ప్రయత్నిస్తారు గర్భిణులు. ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ తారలు.. ఇదే పద్ధతిని అనుసరించిన సందర్భాలున్నాయి.

తాజాగా నటి బ్రూనా అబ్దుల్లా.. తన ప్రసవ సమయంలో ఇదే పద్ధతిని అనుసరించింది. మరో అందాల తార కల్కి కొచ్లిన్ కూడా ప్రసవ సమయంలో వాటర్ బర్త్ పద్ధతిని అనుసరించాలని.. ప్రెగ్నెన్సీ రాకముందే నిర్ణయించుకుంది. దీని బట్టి చూస్తే వాటర్ బర్త్ ప్రాధాన్యమేమిటో ఎవరికైనా అర్థమవుతుంది. ఈ క్రమంలో మనం కూడా వాటర్ బర్త్ పద్ధతి గురించి తెలుసుకుందాం.. 

వాటర్ బర్త్ అనేది ప్రసవం కోసం గర్భిణులు అనుసరించే పద్ధతుల్లో ఒకటి. ఇది సహజ ప్రసవం కోసం ఉపయోగించే ఓ మోడ్రన్ ప్రక్రియ. ఇందులో గోరు వెచ్చని నీటిని ప్రసవం కోసం ఉపయోగిస్తారు. గోరు వెచ్చని నీటిని.. ఓ పెద్ద వాటర్ టబ్‌లో పోసి అందులో గర్భిణిని కూర్చో బెడతారు. ప్రసవం నొప్పులు ప్రారంభయ్యాక.. ఈ పద్ధతిని అనుసరిస్తే చాలు.. నొప్పుల తీవ్రత తక్కువగా ఉండడంతో పాటు.. ప్రసవం కూడా తేలిగ్గా, వేగంగా జరుగుతుంది.

నీళ్లలో మునగడం వల్ల గర్భిణీ స్త్రీల శరీరంలో.. ఎండార్ఫిన్లు ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు.. వేడి నీటిలో మునగడం వల్ల.. ఆ సమయంలో వచ్చే ఒంటి నొప్పి కూడా తగ్గుతుంది.  పెయిన్ కిల్లర్ ఉపయోగించినట్లు.. యాభై శాతం మేర నొప్పులు తగ్గుతాయి. దీనివల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలేంటంటే..

 

 

ఒత్తిడిని తగ్గిస్తుంది.

సాధారణంగా ప్రసవించే సమయంలో మహిళలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఆ నొప్పుల ప్రభావం వల్ల రక్త పోటు కూడా పెరుగుతుంది. అయితే వాటర్ బర్త్ ప్రక్రియ వల్ల.. సాధారణంగా ఎదురయ్యే ఒత్తిడి కంటే అరవై శాతం తక్కువ ఒత్తిడికి గురవుతారట. దీనికి కారణం వేడినీటిలో ఉండడం వల్ల కణజాలాలు మెత్తగా మారడమే. దీనివల్ల ప్రసవం వేగవంతమవడంతో పాటు.. నొప్పి కూడా తక్కువగా ఉంటుందట.

ఇన్ఫెక్షన్లు ఉండవు.

వాటర్ బర్త్ ప్రక్రియలో ప్రసవం జరిగితే.. తల్లీ బిడ్డలిద్దరికీ వచ్చే ఇన్ఫెక్షన్లలో 80 శాతం తగ్గుతాయట. అంతేకాదు.. వేడి నీటిలో ఉండడం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది. నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. పైగా ప్రసవం జరగగానే.. బిడ్డ అచ్చం అమ్మ కడుపులో ఉన్నట్లుగానే నీటిలో ఉంటాడు కాబట్టి.. బిడ్డ రక్త ప్రసరణ కూడా సజావుగా సాగుతుంది. ఫలితంగా డెలివరీ సమయంలో.. బిడ్డకు కూడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఉంటుంది.

వాటర్ బర్త్ ప్రక్రియలో ముందుగా.. ఓ ప్రత్యేకమైన టబ్ తీసుకొని.. అందులో దాదాపు 500 లీటర్ల వరకూ నీటిని పోస్తారు. ఆ టబ్‌లో నీరు బయటకు పోకుండా ఉండడంతో పాటు.. నీటి ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలు కూడా ఉంటుంది. గర్భిణి శరీరం అందించే సిగ్నల్స్‌ని బట్టి ఉష్ణోగ్రతను తగ్గించడం.. పెంచడం చేస్తుంటారు. నొప్పులు ప్రారంభం కాగానే గర్భిణిని అందులో కూర్చోబెడతారు.

అలా పూల్‌లో గర్భిణి నాలుగైదు గంటల పాటు కూర్చొని.. నొప్పులు పూర్తయ్యే వరకూ ఉండాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల సాధారణ ప్రసవంతో పోల్చితే.. నొప్పులు తక్కువ సమయంలోనే వేగంగా వస్తాయి. దాంతో ప్రసవం వేగంగా జరిగిపోతుంది. అందుకే దీనిని డెలివరీ కోసం చాలా ఉత్తమమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు.

వాటర్ బర్త్ ప్రక్రియ మంచిదే అయినా సరే.. దీనివల్ల కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. దీనివల్ల బిడ్డ కంటే ముందు పేగు బయటకు రావడం.. బిడ్డ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అందుకే ఈ ప్రక్రియ అందరికీ నప్పదు. అందుకే అందరూ ఈ వాటర్ బర్త్ ప్రక్రియను.. ప్రయత్నించకపోవడం మంచిది.

18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలు.. 35 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పద్థతిని ఫాలో అవ్వకపోవడమే మంచిదట. .అంతేకాదు.. ప్రీఎక్లాంప్సియా, డయాబెటిస్ ఉన్నవారు.. కవలలను మోస్తున్న వారు  ఈ పద్దతిని ఫాలో అవ్వడం మంచిది కాదు.

అలాగే బిడ్డ ప్రీమెచ్యూర్ అవుతుందని తెలిసినప్పుడు.. లేదా తను బ్రీచ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, బిడ్డ బరువు ఎక్కువగా ఉన్నప్పుడు.. లేదా గర్భిణికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఎంచుకోకపోవడం మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Self Help