Humour

ఈ పనులు చేస్తున్నారా? అయితే మీరు పెద్దమనిషి అయిపోయినట్లే..!

Lakshmi Sudha  |  Jun 4, 2019
ఈ పనులు చేస్తున్నారా? అయితే మీరు పెద్దమనిషి అయిపోయినట్లే..!

వావ్.. ఈ ఆర్టికల్ చదువుతున్నారంటే మీరు పెద్దవారు అయ్యారన్న మాట..! నిజమే కదా.. మరి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ పక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో పక్క బ్రేకప్, ప్యాచప్ వంటివి చేస్తున్నారంటే.. పెద్దవాళ్లయినట్లే (adult) కదా. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించలేం. మనకు తెలియకుండానే ఇదే విషయం మనపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మార్పులనూ కలిగిస్తుంది. మరి ఆ మార్పులను గుర్తించడమెలా?

అవి చెప్పడానికేగా మేం ఉన్నది. ఇదుగో.. ఇక్కడ మేం చెప్పే లక్షణాలు మీలో ఉన్నట్లయితే మీరు పెద్దమనిషి అయినట్లే లెక్క. నిజం చెప్పాలంటే వీటిలో కొన్ని మీలోనూ ఉంటే ఉండొచ్చు.

1. ఇంట్లో హాయిగా కూర్చొని సమయాన్ని గడపాలనుకోవడం..

మీకు గుర్తుందా..? చిన్నతనంలో ఇంట్లో ఉండాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఎప్పుడు బయటకు వెళదామా? స్నేహితులతో కలిసి ఆటలాడుకుందామా? అనుండేది కదా..! కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే ఏదోలా అనిపిస్తుంది. చక్కగా కాళ్లు చాపుకొని కూర్చొని నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ సిరీసో చూడాలనిపిస్తుంది.

వీకెండ్ వచ్చిందంటే చాలు.. చక్కగా టీవీ చూస్తూ.. అమ్మ వండిన వంటలను తింటూ సమయం గడపాలనిపిస్తుంది. అదే చిన్నతనంలో అయితే ఒక రోజు సెలవొస్తే చాలు.. ఎక్కడికైనా వెళ్లాలని.. ఫ్రెండ్స్‌తో కలసి ఆడుకోవాలనిపించేది. మరి తేడా ఉన్నట్లే కదా. 

2. ఒంటరిగా ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుండటం

పర్యటక ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్లాలంటే.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి వెళుతుంటాం. అయితే పాతికేళ్లు దాటిన తర్వాత.. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో వెళ్లడం కంటే ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటాం. పైగా ఆ వయసులో ఉద్యోగంలో స్థిరపడి ఉంటాం కాబట్టి.. ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేయడం కూడా కష్టమే అవుతుంది.

ఇలాంటప్పుడే సెలవు పెట్టుకొనైనా సరే.. కొన్ని రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లి ప్రశాంతంగా గడిపితే బాగుండుననిపిస్తుంది. ఈ ఆలోచన మీకు వచ్చిందంటే చాలు.. మీరు పెద్దవాళ్లయినట్టే. పైగా ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. మీ కంపెనీను మీరు బాగా ఎంజాయ్ చేయడంతో పాటు మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు.

తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? అయితే ఈ ‘Got A Crush On The World’ Passport cover (Rs 749) మీకు కచ్చితంగా నచ్చుతుంది.

3. పబ్ కంటే డిన్నర్ బెటరనిపించడం..

కొంత వయసు వచ్చేంతవరకు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌లకు వెళ్లడం.. అక్కడ ఎంజాయ్ చేయడం చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తుంది. సంతోషమంతా అక్కడే ఉన్నట్టనిపిస్తుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పబ్, క్లబ్ వంటి వాటికి వెళ్లడానికి మనకు అంత ఆసక్తిగా అనిపించదు.

దానికి బదులుగా స్నేహితులతో కలసి ఇంట్లోనే భోజనం చేయడం, సరదాగా మాట్లాడుకోవడం, రాత్రంతా మేలుకొనైనా కబుర్లు చెప్పుకోవడం.. ఇలా అనుబంధాలను పెంచుకొనే పనులు చేయడం మొదలుపెడతారు. వాటిలోనే సంతోషం ఉందని గుర్తిస్తారు. మీలో ఈ మార్పు మీరు కూడా గమనించారా? అయితే మీరూ పెద్దమనిషి అయిపోయారు సుమా..

4. ఫర్నిచర్ కొనుగోలు చేయడం..

ఇంట్లోకి అవసరమైన ఫర్నిచర్, కిచెన్ అప్లయన్స్, ఇలా ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొంటూ మీ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. మీరు మానసికంగా ఎదిగినట్లే. పైగా ఇలాంటివి కొని ఇంటిని అలంకరించినప్పుడు కలిగే సంతోషం కూడా చాలా అందంగా అనిపిస్తుంది.

అల్ట్రా క్యూట్ హోమ్ కుషన్ కవర్(Rs 1,999) ఓసారి చూడండి. ఇది మీకు బాగా నచ్చుతుంది.

5. వంటలు ఎలా చేయాలో వీడియోలు చూడటం..

వంట రాకపోయినప్పటికీ వంటలు ఎలా చేస్తారనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. వివిధ రకాల వంటలు నేర్చుకోవాలని ఉంటుంది. అందుకే వివిధ రకాల వంటలకు సంబంధించిన వీడియోలను చూస్తూ.. వాటిలో తమక బాగా నచ్చిన వాటిని సేవ్ చేసి పెట్టుకొంటారు చాలామంది. తాము వంట చేసినప్పుడు అవి పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు.

6. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం..

చిన్నతనంలో వీధి చివరన ఉన్న దుకాణానికి వెళ్లి ఏదైనా తీసుకు రమ్మంటే.. పెద్ద బరువును నెత్త మీద పెట్టినంత బాధపడిపోయే ఉంటారుగా. అలాంటిది  ఇప్పుడు ఇంట్లోకి అవసరమైన వస్తువులను తీసుకురావడానికి ఆసక్తి చూపించడం.. అవసరమైతే అమ్మను వెంట తీసుకెళ్లి మరీ షాపింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల ఏదో తెలియని సంతృప్తి కలిగినట్లుగా అనిపిస్తుంది.

7. మొక్కల పెంపకంపై ఆసక్తి పెరగడం..

చిన్నప్పుడు మొక్కలు కనిపిస్తే వాటి ఆకులు పీకడం, పువ్వులను పెకలించడం లాంటి చిలిపి పనులు చేసిన మీరు.. ఇప్పుడు వాటి పెరుగుదల కోసం ఆరాటపడుతున్నారంటే మీరు పెద్దమనిషి అయినట్లే లెక్క.

8. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుండటం

టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లాలంటే.. అమ్మా, ంనాన్న బతిమాలో, బెదిరించో తీసుకెళ్లేవారు. ఇప్పుడు వారు మిమ్మల్ని బలవంతం పెట్టాల్సిన అవసరం లేకుండానే ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళుతున్నారు కదా. పైగా తల్లిదండ్రులను స్నేహితులుగా చూడటం సైతం అలవాటు చేసుకొనే ఉంటారు కదా.

9. వండింది తినడం..

ఈ రోజు ఏం వండావు? ఎప్పుడూ ఈ కాయగూరలేనా? ఏ చికెనో.. మటనో వండొచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలు, కామెంట్లు లేకుండా ఏది వండినా మీరు తింటున్నారంటే.. మీరు పెద్దవారైనట్లే కదా. వండిపెట్టేవారి కష్టాన్ని అర్థం చేసుకొన్నట్లే కదా.

10. ఆర్థిక వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడం

కొన్ని రోజుల క్రితం వరకు.. మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలని ఉన్నప్పటికీ.. అమ్మానాన్న కొనిచ్చిన వాటితోనే సర్దుకొనే ఉంటారు కదా.  కానీ ఇప్పుడు మీకు నచ్చిన వాటిని మీరు కొనుక్కొంటున్నారు. మీరు డబ్బు సంపాదించడం వల్లే ఇలా చేయగలుగుతున్నారు. అలాగే మీకు ఏది అవసరమో.. ఏది అవసరం లేదో తెలుసుకోగలుగుతున్నారు కదా.

11. మీకు నచ్చింది చేసుకోగలగడం..

తల్లిదండ్రుల పర్మిషన్ అవసరం లేకుండానే మీకు నచ్చిన పనిని మీరు చేయగలగుతున్నారు కదా. స్నేహితులతో కలసి బయటకు వెళ్లడం, రెస్టారెంట్లో డిన్నర్ చేయడం, కాఫీషాప్‌కి వెళ్లడం లాంటివి చేస్తున్నారు కదా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Humour