ADVERTISEMENT
home / సౌందర్యం
15 రకాల బెస్ట్ బీబీ క్రీమ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..

15 రకాల బెస్ట్ బీబీ క్రీమ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..

15 రకాల బెస్ట్ బీబీ క్రీమ్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి..

అమ్మాయిల మేకప్ కిట్‌లో మల్టీ టాస్కింగ్ చేయగల ఉత్పత్తి ఏదైనా ఉందంటే అది కచ్చితంగా బీబీ క్రీమ్స్ (BB Creams) అని చెప్పుకోవాలి. ఇది చర్మానికి మెరుపునిస్తుంది. సన్ స్క్రీన్‌లా పనిచేస్తుంది. మొటిమల మచ్చలను కనబడకుండా చేసే కన్సీలర్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. అందుకే రోజువారీ మేకప్‌కు ఎక్కువ మంది అమ్మాయిలు బీబీ క్రీంనే ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా దీన్ని ఉపయోగించి అందంగా మెరిసిపోవాలనుకొంటున్నారా? అందుకే.. మీకు కొన్ని బెస్ట్ బీబీ క్రీంలను పరిచయం చేస్తున్నాం. మీకు చర్మానికి సరిపోయేది ఎంచుకొని వాడడం మొదలుపెట్టండి.

1. మేబిలీన్ న్యూయార్క్ బీబీ క్రీం

చర్మం సహజంగా మెరిసిపోవాలని భావిస్తున్నారా? అయితే మేబిలీన్ న్యూయార్క్ బీబీ క్రీంను ఓ సారి ప్రయత్నించి చూడండి. ఇది మీ చర్మాన్ని మెరిపించడం మాత్రమే కాదు.. ముఖంపై ఉన్న మచ్చలను కనబడకుండా చేస్తుంది. ఈ ఫలితాన్ని పొందాలంటే.. మీరు కొంత క్రీంను చేతిలోకి తీసుకొని బాగా కలిపి ముఖంపై సమానంగా పరచుకొనేలా రాయండి. మేకప్ లేకపోయినా మీ చర్మం చక్కగా మెరిసిపోతుంది. అంతేకాదు రోజంతా మీ చర్మం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది.

ADVERTISEMENT

ధర: రూ. 180.

2. గార్నియర్ స్కిన్ నేచురల్స్ ఇన్స్టంట్లీ పర్ఫెక్ట్ స్కిన్ ప్రొటెక్టర్ బీబీ క్రీం

బీబీ క్రీం ఉపయోగించడం వల్ల మనకు కలిగే లాభమేంటో తెలుసా? అది చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటు చక్కటి మేకప్ బేస్ మాదిరిగా ఉపయోగపడుతుంది. అంతే కాదండోయ్..! చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేసి మనం కోరుకొనే లుక్ మనకు అందిస్తుంది. ఇంత మంచి చేసే బీబీ క్రీం అందుబాటు ధరలో లభిస్తే ఇంకేముంది? యస్.. గార్నియర్ అందిస్తోన్న ఈ బీబీ క్రీం తక్కువ ధరలో లభించడం మాత్రమే కాకుండా.. మనం కోరుకొన్న లుక్‌ని అందిస్తుంది.

ADVERTISEMENT

ధర: రూ. 144.

3. మెగ్లోవ్ బీబీ క్రీం

మీరు బీబీ క్రీంను రోజూ ఉపయోగించాలనుకొంటున్నారా? తద్వారా మీ ముఖంపై ముడతలు, మచ్చలు కనబడకుండా చేయాలనుకొంటున్నారా? ఈ క్రమంలో మీ ముఖానికి చక్కటి మేకప్ లుక్ కూడా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే మీ అవసరాన్ని మెగ్లోవ్ బీబీ క్రీం తీరుస్తుంది.

ADVERTISEMENT

ధర: రూ. 140.

4. అస్యూర్ బీబీ క్రీం విత్ ఎస్పీఎఫ్ 30

ఈ బీబీ క్రీం మీ చర్మాన్ని అందంగా మలచడంతో పాటు.. అతినీలలోహిత కిరణాల నుండి మీకు రక్షణ కల్పిస్తుంది. ఎందుకంటే ఇది ఎస్సీఎఫ్ 30 కలిగి ఉంది. పైగా మీకు చక్కటి మేకప్ లుక్‌ను కూడా అందిస్తుంది.

ADVERTISEMENT

ధర: రూ. 309.

5. లోరియల్ ట్రూ మ్యాచ్ బీబీ క్రీం

మీ చర్మం ఎప్పుడూ పొడిబారిపోయినట్లుగా ఉంటుందా? అయితే మీరు లోరియల్ బీబీ క్రీంను ఉపయోగించాల్సిందే. ఇది చర్మానికి మేలు చేసే విటమిన్లు, కొల్లాజెన్లతో నిండి ఉంది. దీన్నిచర్మానికి రాసుకోవడం వల్ల పోషణ అందుతుంది.

ADVERTISEMENT

ధర: రూ. 489.

6. ఎల్.ఏ. గర్ల్ హెచ్ డీ ప్రో బీబీ క్రీం ఫౌండేషన్

అరచేతిలో ఇమిడిపోయేలా ఉండే ఈ ప్యాక్ నిత్యం మన వెంట ఉంచుకోవడానికి అనువుగా ఉంటుంది. చాలా తేలికగా అనిపించే ఈ బీబీ క్రీంలో విటమిన్ బీ3, విటమిన్ సి, విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణ అందిస్తాయి.

ADVERTISEMENT

ధర: రూ. 650.

7. కలర్ బార్ (colorbar) పర్ఫెక్ట్ మాచ్ బీబీ క్రీం

చందనం, కలబంద, ఆపిల్, కీరా దోస వంటి చర్మానికి మేలు చేసే పదార్థాలన్ని తనలో నింపుకొంది ఈ బీబీ క్రీం. రాసుకుంటే తేలికగా అనిపించే ఈ బీబీ క్రీం చర్మాన్ని జిడ్డుగా మారకుండా కాపాడుతుంది. అలాగే చక్కటి లుక్‌ని కూడా అందిస్తుంది.

ADVERTISEMENT

ధర: రూ. 550.

8. రెవ్లాన్ ఫొటో రెడీ బీబీ క్రీం ఫౌండేషన్

ఫౌండేషన్, బీబీ క్రీం రెండూ కలిపి మనకు అందిస్తోంది రెవ్లాన్. ఈ బీబీ క్రీం చర్మానికి కన్సీలింగ్, మాయిశ్చరైజింగ్ అందించడంతో పాటు.. సన్ స్క్రీన్ లోషన్ గానూ పనిచేస్తుంది.

ADVERTISEMENT

ధర: రూ. 650.

 

9. ఒరిఫ్లేమ్ స్కిన్ డ్రీమ్ బీబీ క్రీం

ADVERTISEMENT

సున్నితమైన, ప్రకాశంతమైన చర్మం కావాలని కోరుకోని అమ్మాయి ఉంటుందా? ఆ కోరికను తీర్చేదే ఒరిఫ్లేమ్ స్కిన్ డ్రీమ్ బీబీ క్రీం. ఇది మీ స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే మొటిమల కారణంగా ముఖంపై ఏర్పడిన మచ్చలను కనిపించకుండా కవర్ చేస్తుంది.

ధర: రూ. 629.

10. మాక్ బీబీ క్రీం

ADVERTISEMENT

కాస్త ఖరీదు ఎక్కువైనా ఫర్వాలేదు. మంచి బీబీ క్రీం కావాలనుకొనే వారికి మాక్ బీబీ క్రీం మంచి ఎంపిక అవుతుంది. ఇది మీ మేకప్ లుక్‌ని చాలా పర్ఫెక్ట్‌గా కనిపించేలా చేస్తుంది. మీ ముఖాన్ని జిడ్డుగా మారకుండా చేసి.. రోజంతా ఫ్రెష్‌గా కనిపించేలా చేస్తుంది.

ధర: రూ. 2,550.

11. ఈఎల్ఎఫ్ బీబీ క్రీం విత్ ఎస్పీఎఫ్ 20

ADVERTISEMENT

అందంగా కనిపించడంతో పాటు.. వయసు కారణంగా ముఖంపై వచ్చే ముడతలు తగ్గించే బీబీ క్రీం ఉంటే ఎంత బాగుంటుందో కదా..! మన ఆలోచనను ఈ ఎల్ ఎఫ్ గుర్తించినట్టుంది. అందుకే దానికి తగిన బీబీ క్రీంను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ క్రీం సన్ స్క్రీన్ లోషన్‌గా కూడా పనిచేస్తుంది.

ధర: రూ. 999.

12. ది బాడీ షాప్ ఆల్ ఇన్ వన్ బీబీ క్రీం

ADVERTISEMENT

ఈ బీబీ క్రీం రంగు తెల్లగా ఉన్నప్పటికీ ముఖానికి అప్లై చేసుకొన్న తర్వాత అది మన చర్మం రంగుకి తగినట్లుగా మారిపోతుంది. అంటే ఇది ఏ రంగు చర్మానికైనా నప్పుతుంది. అలాగే మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

ధర: 1,445

13. ఎన్ వై ఎక్స్ కాస్మెటిక్స్ బీబీ క్రీం

ADVERTISEMENT

ఆయిల్ ఫ్రీ, విటమిన్లతో నిండి ఉన్న బెస్ట్ బీబీ క్రీమ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ చర్మ (skin) అవసరాన్ని ఎన్ వై ఎక్స్ బీబీ క్రీం కచ్చితంగా తీరుస్తుంది. పైగా ఇది మీ చర్మం తేమ కోల్పోకుండా చేస్తుంది.  అలాగే సున్నితంగా మారుస్తుంది.

ధర: రూ. 1,475.

14. బర్ట్స్ బీస్ బీబీ క్రీం విత్ ఎస్పీఎఫ్ 15

ADVERTISEMENT

యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలను తనలో నింపుకొన్న ఉత్పత్తి బర్డ్స్ బీస్ బీబీ క్రీం. ఇది చక్కటి మేకప్ బేస్‌గా, కన్సీలర్‌గా కూడా పనిచేస్తుంది.

ధర: రూ. 1,456.

15. స్కిన్ ఫుడ్ పీచ్ సేక్ పోర్ బీబీ క్రీం

ADVERTISEMENT

మీ చర్మం రంగుకి సరిపోయేలా ఉండటంతో పాటు పాలిష్ లుక్ ఇచ్చే బీబీ క్రీం కోసం చూస్తున్న వారికి ఈ క్రీం చక్కగా సూటవుతుంది. పైగా ఆహ్లాదకరమైన సువాసనలను వెదజల్లుతుంది.

ధర: రూ. 1,517.

ఇక మీరు చెప్పండి అమ్మాయిలు.. పైన మనం చర్చించుకొన్న బీబీ క్రీంల్లో మీకేది నచ్చింది?

ADVERTISEMENT

Featured Image: Shutterstock

POPxo World ని చెక్ చేయడం మరచిపోకండి. ఎందుకంటే అది మీ ప్రపంచం. అక్కడ మీరు మా కథనాలు చదవచ్చు. వీడియోలు చూడొచ్చు. మీకు కావాల్సిన వస్తువులను shop సెక్షన్ లో కొనుగోలు చేయెచ్చు. ఇంకా Hangout లో మీలాంటి ఎంతో మంది మహిళలను కలుసుకోవచ్చు. మరింకెందుకాలస్యం వెంటనే POPxo కి సైన్ ఇన్ అవ్వండి. 

 

 

ADVERTISEMENT

 

 

14 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT