ADVERTISEMENT
home / Home & Garden
ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితంలోకి.. పాజిటివిటీని ఆహ్వానించండి..!

ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితంలోకి.. పాజిటివిటీని ఆహ్వానించండి..!

ప్రస్తుతం అందరి జీవితాలు బిజీబిజీగా.. గజిబిజిగా గడుస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న చిన్న అంశాలు సైతం మనకు పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోపం కలిగిస్తున్నాయి. వెరసి జీవితంలో సానుకూల దృక్ప‌థాన్ని.. మరచి ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా చూడటం అలవాటు చేసుకొన్నాం. ఎంతలా అంటే.. ఎవరైనా చిన్న మాట అన్నా సరే.. తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మరి మన జీవితంలోకి మళ్లీ పాజిటివిటీ (Positivity) తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? 

ఆఫీసులో బాస్‌తో గొడవ అవడం, ట్రాఫిక్లో ఎక్కువ సమయం ఇరుక్కుపోవడం, బస్సు లేదా ట్రెయిన్‌లో ఎవరో ఒకరు మనతో దురుసుగా ప్రవర్తించడం, భాగస్వామితో చిన్నపాటి గొడవ..  ప్రతిరోజూ ఇలాంటి సంఘటనల్లో ఏదో ఒకటి మనకు ఎదురవుతూనే ఉంటుంది. వీటి ప్రభావం మనపై చాలా ఎక్కువగానే పడుతుంది. ఆ రోజంతా దాదాపు ఏదో చికాకుతో, ఆందోళనతో సమయం గడుపుతుంటాం. అయితే ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కాస్త సంయమనంతో వ్యవహరించి.. మిమ్మల్ని మీరు కూల్‌గా మార్చుకోవడం ద్వారా రోజంతా సానుకూలంగా గడపచ్చు. దీని కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీ ధోరణిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పాజిటివ్‌గా ఉండచ్చు.

1. ఇల్లు శుభ్రంగా

Pinterest

ADVERTISEMENT

రోజంతా ఆఫీసులో పనిచేసి వచ్చిన తర్వాత ఇంటిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ తలుపు తీయగానే ఎక్కడికక్కడ చెత్త కనబడితే మళ్లీ నీరసం వచ్చేస్తుంది. దాంతో పాటే కోపం కూడా వస్తుంది. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుభ్రమైన ఇంటి వాతావరణం మనసుకి ప్రశాంతతను అందిస్తుంది.

IKEA

ఆఫీసుకి వెళ్లే హడావుడిలో చాలామంది మాసిన బట్టలను పక్కన పడేయడం, బెడ్ సర్దకపోవడం, ఉతికిన బట్టలను మడతపెట్టకపోవడం చేస్తుంటారు. వాటిని ఏ కుర్చీ లేదా మంచం మీద వేసి.. తర్వాత మడత పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఆఫీసుకి వెళిపోతుంటారు. తీరా వచ్చిన తర్వాత మళ్లీ ఇంటి పని, వంట పని పూర్తి చేసేసరికి ఉన్న ఓపిక కాస్తా అయిపోతుంది. దీంతో ఎక్కడి బట్టలు అక్కడే ఉంటాయి. అందుకే రెండు లాండ్రీ బాస్కెట్స్ కొనండి.

ADVERTISEMENT

ఒకదానిలో మాసిన దుస్తులు, మరొక దానిలో ఉతికిన దుస్తులు వేయండి. ఇలాంటి బాస్కెట్స్ ప్రతి రూమ్‌లోనూ పెట్టండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో వాటిని మడత పెట్టండి. ఇల్లు నీట్‌గా ఉండటంతో పాటు పని చేశామనే శ్రమ కూడా అనిపించదు. అలాగే డైనింగ్ టేబుల్ మీద సైతం అవసరమైనవి మాత్రమే ఉంచండి. మిగిలినవాటిని టేబుల్ పై ఉంచొద్దు. ఇదే సూత్రం డ్రెస్సింగ్ టేబుల్‌కి కూడా వర్తిస్తుంది.

2. బల్బులతో అందంగా

మీ ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశం ఏంటి? బెడ్రూమా? లివింగ్ రూమా? మీకు నచ్చిన ప్రదేశంలో అందమైన రంగురంగుల బల్బులను అమర్చండి. అవి మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా మీ క్రియేటివిటీని సైతం ప్రతిబింబిస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే కాంతి మీ మూడ్‌ను మార్చేస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే లేదా ఇంటి పని పూర్తయిన తర్వాత కాసేపు ఈ లైట్స్ ఆన్ చేసుకొని.. మీకు నచ్చిన వెబ్ సిరీస్ చూడండి. మనసు తేలికపడుతుంది.

3. ఇండోర్ ప్లాంట్స్

ఇంట్లో మనం పెంచుకొనే అలంకరణ మొక్కలు గాలిని శుద్ధి చేయడం మాత్రమే కాదు.. ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి. అలాగే నిద్ర బాగా పట్టేందుకు సహకరిస్తాయి. ఈ రెండింటి వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి ఇంట్లో మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. అలంకరణ మొక్కలు మాత్రమే కాకుండా ప్రకాశవంతమైన రంగుల్లో పూలు పూచే ఇండోర్ ప్లాంట్స్ సైతం ఎంచుకోండి. ఇవి మీ ఇంటిని అందంగా మార్చడమే కాదు.. మిమ్మల్ని ఉత్సాహంగా మార్చేస్తాయి. మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటికి హాని కలిగించని మొక్కలను ఎంచుకోండి.

4. అరోమా థెరపీ

మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం ఒక మార్గం. అయితే ధ్యానం చేయడానికి ఇష్టపడని వారు అరోమాథెరపీతో మనసును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా.. అరోమా ఆయిల్ డిఫ్యూజర్‌ను కొనుగోలు చేయడమే. దీనిలో మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. డిఫ్యూజర్ గది అంతటినీ పరిమళభరితంగా మార్చేస్తుంది.

ADVERTISEMENT

5. స్ఫూర్తిని కలిగించే డెకరేటివ్ పీసెస్

ఇంటిని అందంగా ఉంచడంతో పాటు మీలో కాస్త స్ఫూర్తిని కలిగించే విధంగా.. కొన్ని డెకరేటివ్ పీసెస్‌ను ఎంచుకోండి. వాటితో ఇంటిని అలకరించండి. వాటిపై మిమ్మల్ని ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచే వాక్యాలు ప్రచురించండి. వాటిని మీరు చూసినప్పుడల్లా మీలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది.  ఇంటి అలంకరణ వస్తువులే కాదు.. లాప్ టాప్ స్లీవ్స్, కాఫీ మగ్స్ వంటి వాటిని కూడా అలాంటివే అయి ఉండేలా చూసుకోండి. అలాగే వాల్ క్లాక్వాల్ పోస్టర్స్ విషయంలో కూడా మీకు స్ఫూర్తిని కలిగించేవే ఎంచుకోండి.

6. జర్నీలోనే ఎక్కువ సమయం గడుపుతుంటే..

ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం మీరు బస్సు లేదా ట్రైన్‌లో జర్నీ చేయాల్సి ఉంటుందా? అయితే ఆ సమయాన్నే మీరు మీలో పాజిటివిటీ నింపుకోవడానికి ప్రయత్నించండి. దీని కోసం పోడ్  కాస్ట్స్, వెబ్ సిరీస్‌లు చూడటానికి ప్రయత్నించండి. మనసు ఆహ్లాదంగా మారడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT