ADVERTISEMENT
home / Dating
అవును.. ఐదు నెలల నుంచి అతడితో డేటింగ్ చేస్తున్నా : కృతి కర్బందా

అవును.. ఐదు నెలల నుంచి అతడితో డేటింగ్ చేస్తున్నా : కృతి కర్బందా

కృతి కర్బందా (Kriti Kharbanda).. తెలుగు తెర పై పెద్దగా హిట్లు సంపాదించుకోలేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం అద్భుతంగా రాణిస్తోందీ అందాల తార. పులకిత్ సమ్రాట్‌తో కలిసి నటించిన ‘వీరే కీ వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించింది కృతి. ప్రస్తుతం ఆమె నటించిన ‘పాగల్ పంతీ’ చిత్రం.. నవంబర్ 22 తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. తాను ప్రేమలో పడిన విషయం వెల్లడించింది కృతి.

తాను.. తన తోటి నటుడు పులకిత్ సమ్రాట్ (Pulkit Samrat) తో పాటు డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి కృతి మాట్లాడుతూ.. “అవి కేవలం పుకార్లు కాదు. అందులో నిజం ఉంది. మేమిద్దరం నిజంగానే ప్రేమించుకుంటున్నాం. కానీ నేను డేటింగ్ చేసే విషయం అందరికంటే ముందు మా తల్లిదండ్రులకు తెలియాలని.. ఆ తర్వాత వారి అంగీకారం ఉంటేనే ఆ విషయాన్ని బయటకు చెప్పాలని  భావించాను.

ప్రతి విషయాన్ని బయటకు చెప్పడానికి ఓ సరైన సందర్భం ఉంటుందని.. ఆ విషయం మాట్లాడేందుకు మనం సౌకర్యంగా ఫీలయ్యే సమయంలోనే మాట్లాడాలని నేను భావిస్తాను. కొన్ని సార్లు ప్రేమ విషయం బయటకు చెప్పేందుకు ఐదేళ్లు పట్టచ్చు.. మరికొన్ని సార్లు అది ఐదు నెలలకే జరగొచ్చు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను పులకిత్ సమ్రాట్‌ని ప్రేమిస్తున్నానని.. తనతో డేటింగ్ చేస్తున్నానని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు” అని తెలిపింది. 

ADVERTISEMENT

గతంలో తన ప్రేమ విషయం గురించి కృతి నేరుగా మాట్లాడకుండా.. నర్మగర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. ” మేం ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం అని పుకార్లను ప్రచారం చేసేవారిని నేను తప్పుబట్టలేను. మేమిద్దరం కలిసి ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ కూడా ఉంది. ఇవన్నీ చూసి మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాం అని ఎవరైనా అనుకుంటారు. వాళ్లను నేను తప్పుబట్టను.

కానీ అది నిజం కాదు. పులకిత్ నాకెంతో ప్రత్యేకం. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాడు కూడా. మేమిద్దరం చాలా క్లోజ్. ఎంతగా అంటే మేమిద్దరం మాట్లాడుతుంటే.. ఒకరి మాటలు ఒకరు పూర్తి కాకముందే అర్థం చేసుకోగలుగుతాం. తను మనసులో ఏం ఆలోచిస్తున్నాడో కూడా నేను చెప్పగలను. మేమిద్దరం అంత క్లోజ్ అయ్యాం. అంత బాగా మాట్లాడుకుంటాం. ప్రస్తుతం మేమిద్దరం ఒకరితో ఒకరం ఏం చెప్పుకోకపోయినా.. ఒకరినొకరం కచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం. గత సంవత్సరంలో తను ఎంతగానో మారిపోయాడు. తను ప్రస్తుతం ఉన్న తీరును చూస్తుంటే.. నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. తను ఎంతో మంచి వ్యక్తి. నాకో మంచి స్నేహితుడు” అంటూ చెప్పుకొచ్చింది కృతి.

వీరిద్దరూ గతంలో ‘వీరే కి వెడ్డింగ్’ సినిమాలో నటించినప్పటి నుంచి..  డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. దీనికి తోడు వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం.. స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవడం.. సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు ట్యాగ్ చేసుకుంటూ కామెంట్లు చేస్తూ అందరి ముందూ సన్నిహితంగా ఉండడం.. వీరు ప్రేమలో ఉన్నారేమో అన్న పుకార్లకు బలాన్ని మరింత పెంచాయి.

ADVERTISEMENT

2014లో సల్మాన్‌కు రాఖీ కట్టిన సోదరి శ్వేతా రొహిరాను పెళ్లాడిన పులకిత్.. 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. వీరిద్దరి విడాకులకు నటి యామీ గౌతమ్‌తో పులకిత్ సమ్రాట్ ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలొచ్చాయి. శ్వేత కూడా తమ విడాకులకు కారణంగా.. యామితో పులకిత్ వ్యవహారమే అని చెప్పడం విశేషం.

ఆ తర్వాత కొంత కాలానికే వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత కృతి, పులకిత్‌లు ప్రేమించుకుంటున్నారని మీడియా వర్గాలు కోడై కూశాయి. అయితే.. తమ గురించి వస్తున్న వార్తలను పట్టించుకోవడం కానీ.. వాటిని అబద్ధం అని చెప్పడం కానీ వీరెప్పుడూ చేయకపోవడం విశేషం.

ప్రస్తుతం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమ విషయాన్ని కృతి ఒప్పుకోవడంతో పాటు.. ఆమె తోటి నటుడు జాన్ అబ్రహాం కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పడం గమనార్హం. జాన్ మాట్లాడుతూ, వారి కుటుంబాల తర్వాత ఆ విషయం తెలిసిన మొదటి వ్యక్తిని తనేనని చెప్పడంతో.. వీరి ప్రేమ విషయం పుకారు కాదని అందరికీ తెలిసిపోయింది. 22 నవంబర్ తేదిన విడుదల కాబోయే ‘పాగల్ పంతీ’ చిత్రంలో జాన్ అబ్రహాం, ఇలియానా, కృతి కర్బందా, పులకిత్ సమ్రాత్, ఊర్వశీ రౌతెలా, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్, సౌరభ్ శుక్లాలు నటించారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

19 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT