ADVERTISEMENT
home / Bollywood
దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!

దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!

ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం.. ఇవేవీ అడ్డుగోడలు కావు..! ఈ డైలాగ్ కేవ‌లం సినిమాల్లో చెప్ప‌డ‌మే కాదు.. కొంద‌రు హీరోయిన్లు నిజ జీవితంలో కూడా ఇది నిజ‌మేన‌ని నిరూపించారు. ఇత‌ర దేశాల‌కు చెందిన అబ్బాయిల‌ను పెళ్లాడి త‌మ ప్రేమ‌ను పండించుకున్నారు. అమెరికాకు చెందిన నిక్ జొనాస్‌ను పెళ్లాడిన ప్రియాంక ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌. అలాగ‌ని ఈ జాబితాను ప్రారంభించింది.. ఆమే అనుకుంటే మీరు పొర‌ప‌డిన‌ట్లే. ఎందుకంటే ఆమె కంటే ముందు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసిన కొంద‌రు నటీమ‌ణులు (Actresses) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అదేనండీ.. విదేశాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను మ‌నువాడారు. ఇంత‌కీ ఆ క‌థానాయిక‌లు ఎవ‌రో మ‌న‌మూ తెలుసుకుందామా..

actressmadhavi

మాధవి (Madhavi)

ద‌ర్శ‌క ర‌త్న దాసరి నారాయణ రావు తెలుగు తెర‌కు పరిచయం చేసిన నటీమణులలో మాధవి ఒకరు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి కాగా ఆమె నటిగా పరిచయమైంది మాత్రం మాధవిగానే. తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు ఆయన శిష్యుడు రాల్ఫ్ శర్మని 1996లో వివాహమాడిన మాధవి తన కుటుంబంతో న్యూ జెర్సీ‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

ADVERTISEMENT

అపర్ణ (Aparna)

వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రం గుర్తుందిగా… అందులో వెంకటేష్‌ను ఆటపట్టించే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రలో నటించిన నటి పేరే అపర్ణ. ఆ సినిమా తరువాత ఆమె మరలా ఏ ఇతర చిత్రంలోనూ నటించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.

actressrambha

Image: https://www.instagram.com/rambhaindran

ADVERTISEMENT

రంభ (Rambha)

“బావ‌గారండీ..” అంటూ మెగాస్టార్‌ని కొంటెగా పిలిచే మరదలిగా.. తెలుగునాట అందరికి సుపరిచితురాలు రంభ. నటనకు స్వస్తి చెప్పి 2010లో కెనడాకి చెందిన ఇంద్ర కుమార్‌ని వివాహం చేసుకున్న తరువాత అక్కడే సెటిలైంది. ఆ తరువాత కొంత కాలానికి వారిరువురి మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చినప్పటికి.. చివరికి మళ్ళీ ఇద్దరు ఒకటై ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్ల‌లు సంతానం.

actresslaya

లయ (Laya)

ADVERTISEMENT

టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హీరోయిన్‌గా దూసుకుపోయిన నటి లయ. 2006లో తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి.. అమెరికాకు చెందిన శ్రీ గణేష్ అనే డాక్టర్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు. వీరు ప్రస్తుతం అమెరికాలోనే నివ‌సిస్తున్నారు.

lisaray

Image: https://www.instagram.com/lisaraniray/

లీసా రే (Lisa Ray)

ADVERTISEMENT

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “టక్కరి దొంగ” చిత్రంలో హీరోయిన్‌గా నటించిన లీసా రే గుర్తుందా?? ఆమె క్యాలిఫోర్నియాకు చెందిన మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ అయిన జేసన్‌ను పెళ్లాడింది. 2012లో జ‌రిగిన వీరి వివాహం అప్ప‌ట్లో కాస్త సంచ‌లనాన్నే సృష్టించింది. అయితే పెళ్లికి మూడేళ్ళ క్రితం అనగా 2009లో ఆమె క్యాన్సర్ బారిన ప‌డింది. అయినా ఆమె ఒక సంవ‌త్స‌ర కాలం పాటు ఆమె క్యాన్స‌ర్‌తో ధైర్యంగా పోరాడి విజ‌యం సాధించగ‌లిగింది. ఈ జంట గ‌తేడాది స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జన్మనివ్వడం విశేషం. 

radhikaapte-1

రాధికా ఆప్టే (Radhika Apte)

రక్త చరిత్ర 1 & 2లో పరిటాల సునీత పాత్రలో కనిపించి తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న రాధికా ఆప్టే ఆ తరువాత బాలకృష్ణ పక్కన లెజెండ్ చిత్రంలో కూడా నటించి అందరి మన్ననలు పొందింది. ఈ అమ్మ‌డు 2013లో తన మిత్రుడు అయిన బెనెడిక్ట్ టేలర్‌ని వివాహమాడింది. బెనెడిక్ట్ లండన్‌కి చెందిన ఒక థియేటర్ ఆర్టిస్ట్.

ADVERTISEMENT

preity-1

ప్రీతి జింటా (Preity Zinta)

ఈ సొట్ట బుగ్గల సుందరి మన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితురాలే. విక్టరీ వెంకటేష్‌తో “ప్రేమంటే ఇదేరా” & సూపర్ స్టార్ మహేష్ బాబు‌తో “రాజకుమారుడు” వంటి సూపర్ హిట్స్‌లో నటించి తెలుగు వారికి ఎంతగానో దగ్గరయింది. ఆ తరువాత హిందీలో కూడా వీర్ జారా, కల్ హో న హో, కోయి మిల్ గయా వంటి చిత్రాలలో నటించి.. త‌ను క‌థానాయిక‌గా ఉన్న స‌మయంలోనే టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె 2016లో అమెరికాకు చెందిన జీనీ గుడ్ ఇనఫ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అమెరికా & ఇండియా మ‌ధ్య చక్కర్లు కొడుతూ తన వివాహ బంధాన్ని సంతోషంగా గడిపేస్తోంది.

మీరా జాస్మిన్ (Meera Jasmine)

ADVERTISEMENT

గుడుంబా శంకర్, భద్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువయిన మలయాళ నటి మీరా జాస్మిన్. 2014లో దుబాయ్ ప్రాంతానికి చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది. 

ileanadcruz

ఇలియానా (Ileana)

“దేవదాస్‌”తో సూపర్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత “పోకిరి” చిత్రంతో ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అందుకున్న నటి ఇలియానా. తెలుగులో అగ్రతారగా ఎదిగిన ఈమె, ఆ తరువాత బాలీవుడ్‌కి సైతం వెళ్ళి అక్కడ కూడా తన సత్తా చాటింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆండ్రూ అనే ఓ ఫోటోగ్రాఫర్‌తో సహజీవనం చేస్తోంది. ఇతను ఆస్ట్రేలియా దేశస్థుడు. అయితే వీరు ఇప్పటికే వివాహం చేసుకున్నార‌నే వార్త‌లు కూడా ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికీ ఇల్లూ బేబీ మాత్రం వాటిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు.

ADVERTISEMENT

Image: https://www.instagram.com/ileana_official/

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ ఏడాది మోస్ట్ గ్లామ‌ర‌స్ స్టార్స్‌గా.. ఎంపికైన షారూఖ్ ఖాన్, దీపికా ప‌దుకొణె..!

ఒక రాజ‌కీయ నాయ‌కుడిని.. ప్ర‌జా నేత‌గా మార్చిన “యాత్ర” (సినిమా రివ్యూ)

ADVERTISEMENT

ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!

11 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT