ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప ‘బీట్రూట్’ (Benefits Of Beetroot In Telugu)

బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని అందించే.. బహు చక్కని దుంప ‘బీట్రూట్’ (Benefits Of Beetroot In Telugu)

అమ్మ ఎప్పుడైనా బీట్రూట్ (Beetroot) వండితే ఆ రోజు ఇంట్లో ఓ చిన్న సైజు యుద్ధం జరిగిపోతుంది. ‘ఈ కూర ఎందుకు వండావ్?’ అంటూ రుసరుసలాడేవారు ఎక్కువ మందే ఉంటారు. బీట్రూట్ జ్యూస్ తాగమంటే.. ముఖం ఆముదం తాగమన్నట్లుగా పెట్టేవారు సైతం ఉంటారు. అసలు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకొంటే.. మనం ఇలా మాట్లాడం. రక్తహీనతతో బాధపడేవారికి ఆహారంలో బీట్రూట్ భాగం చేసుకోమని, బీట్రూట్ జ్యూస్ తాగమని సూచిస్తారు వైద్యులు. అసలు.. అంత గొప్ప పోషకాలు ఏముంటాయి బీట్రూట్‌లో అని అనిపిస్తోంది కదా? 

బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు

చర్మం ఆరోగ్యానికి బీట్రూట్

కురుల ఆరోగ్యానికి బీట్రూట్

ADVERTISEMENT

బీట్రూట్ రెసిపీ

తరచూ అడిగే ప్రశ్నలు

బీట్రూట్‌లో ఉండే పోషకాలు (Nutrients In Beetroot)

బీట్రూట్‌లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బీట్రూట్‌లో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో బీటాలైన్స్, ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. విటమిన్ కె, క్యాల్షియం, ఫోలేట్(విటమిన్ బీ9), విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. 

మరి, బీట్రూట్‌ను ఆహారంగా ఎలా తీసుకోవాలి? అన్న విషయానికి వస్తే ఈ దుంప పచ్చిది తిన్నా.. వండుకొని తిన్నా.. జ్యూస్ చేసుకొని తాగినా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ ద్వారా బెటాలిన్స్ మనకు అందితే.. బీట్రూట్ తినడం ద్వారా మనకు అవసరమైన పీచుపదార్థం లభిస్తుంది. బీట్రూట్ దుంప మాత్రమే కాదు.. దాని ఆకులను ఆహారంగా తీసుకొన్నా.. మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది.

ADVERTISEMENT

సాధారణంగా మూడు రంగుల్లో బీట్రూట్లు ఉంటాయి. దేన్ని ఆహారంగా తీసుకొన్నా కూడా.. కలిగే ప్రయోజనం దాదాపుగా ఒకటే. తెలుపు, పింక్, బంగారు వర్ణంలో బీట్రూట్లు మనకు లభిస్తాయి. సాధారణంగా మన దేశంలో పర్పుల్ రంగులో ఉన్న బీట్రూట్లే లభిస్తాయి.

3-beetroot-health-beauty-benefits

బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Health Benefits Of Beetroot In Telugu)

1. రక్తపోటు(బీపీ) అదుపులోకి వస్తుంది (Control Blood Pressure)

ఒకప్పుడు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వయసుడిగినవారిలోనే కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాతికేళ్లకే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎందరో మనకు కనిపిస్తారు. దీనికి కారణం నేటి తరంపై పెరిగిపోతున్న ఒత్తిడే. చిన్నతనం నుంచి చదువుల ఒత్తిడి.. పెద్దయ్యాక ఉద్యోగం తెచ్చి పెట్టే ఒత్తిడి.. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల ఒత్తిడి. వీటన్నింటి వల్ల రక్తపోటుకు గురవుతున్నవారెందరో ఉన్నారు.

అయితే బీట్రూట్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీనిలో ఉన్న నైట్రేట్స్ శరీరంలోకి వెళ్లిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారడం జరుగుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింప చేసి రక్తపోటును అదుపులోకి తీసుకువస్తుంది. రోజుకి 250 మి.లీ. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. వైద్యున్ని సంప్రదించి వారి సలహా తీసుకొన్న తర్వాతే బీట్రూట్ జ్యూస్ తాగడం ప్రారంభించాలి.

ADVERTISEMENT

2. స్టామినా పెంచుతుంది (Increases Stimina)

అథ్లెట్లు బీట్రూట్‌ను ఆహారంగా తీసుకోవడానికి చాలా ప్రాధాన్యమిస్తారు. దీనిలో ఉండే డైటరీ నైట్రేట్స్ అందుకు కారణం. ఇవి మన శక్తిని మరింత పెంచుతాయి. దీని వల్ల అలసటకు దూరంగా ఉండటంతో పాటు మరింత ఎక్కువ సమయం సాధన చేయగలుగుతాం. కాబట్టి రెగ్యులర్‌గా  ఎక్సర్సైజ్ చేసేవారు బీట్రూట్ తినడం లేదా బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది.

బీట్రూట్‌లో ఇనార్గానిక్ నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేసే సమయంలో ఇవి శరీరం తక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకొనేలా చేస్తాయి. దీని వల్ల అలసట రాదు. శక్తి సన్నగిల్లినట్లుగా అనిపించదు. కాబట్టి మరింత ఎక్కువ సమయం వ్యాయామం చేయగలుగుతాం. వ్యాయామం చేయడానికి  రెండు మూడు గంటల ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలోకి చేరిన రెండు మూడు గంటల తర్వాత నైట్రేట్స్ తమ ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాయి.

3. నొప్పి, మంట తగ్గించడానికి (Reduce Inflammation)

ఫోలేట్, ఫైబర్, బీటాలైన్స్ ఈ మూడు పుష్కలంగా ఉండటం వల్ల.. బీట్రూట్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గుర్తింపు పొందింది. కొందరికి తరచూ కడుపులో మంట వస్తుంటుంది. ఇలాంటి వారు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. తరచూ కడుపులో నొప్పి లేదా మంట రావడం అనారోగ్యానికి సూచన. ఊబకాయం, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్య, క్యాన్సర్ల కారణంగా కడుపులో మంటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

5-beetroot-health-beauty-benefits

ADVERTISEMENT

4. కాలేయం ఆరోగ్యంగా.. (Keep Liver Healthy)

బీట్రూట్‌లో విటమిన్ బి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూడూ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి కాలేయం విడుదల చేసే బైలురసాన్ని పలచగా చేసి చిన్న పేగులోకి సులభంగా చేరేలా చేస్తాయి. బీట్రూట్‌లో ఉన్న బీటైన్, పీచుపదార్థం కాలేయంలోని టాక్సిన్లను బయటకు వెళ్లేలా చేస్తాయి. దీని వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో జింక్, కాపర్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణం చెందడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతినవచ్చు. బీట్రూట్‌లో ఉన్నఔషధ గుణాలు ఇలా జరగకుండా కాపాడతాయని ఓ అధ్యయనంలో తేలింది.

5. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది (Improves Heart Health)

బీట్రూట్ రక్తపోటుని తగ్గిస్తుందని మనం ముందుగానే తెలుసుకొన్నాం. రక్తపోటు అదుపులో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. NCBI వెబ్సైట్ ప్రకారం వారం రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి రావడం మాత్రమే కాకుండా.. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు తగ్గినట్టు తేలింది.  బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కండరాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. దీని వల్ల మనం చురుకుగా ఉండగలగుతాం. పనులు సైతం చక్కగా పూర్తి చేయగలుగుతాం. శరీరానికి చక్కటి వ్యాయామం లభిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం, పనితీరు మెరుగవుతాయి.

6. క్యాన్సర్‌ను నివారిస్తుంది (Prevent Cancer)

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల బీట్రూట్ క్యాన్సర్‌ను నివారించగలుగుతుంది. జంతువుల్లో పరిశోధన చేసినప్పుడు క్యాన్సర్ కణాల పెరుగుదలను బీట్రూట్ తగ్గించింది. దీనిలో ఉన్న బీటనిన్ ఈ ప్రభావాన్ని కలిగిస్తుంది. లుకేమియాతో బాధపడేవారు క్యారెట్, బీట్రూట్ కలిపిన జ్యూస్‌ని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. వైద్యులు సైతం ట్రీట్మెంట్ సమయంలో బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగమని సలహా ఇస్తుంటారు.

7. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది (Improve Your Digestion)

బీట్రూట్‌ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనకు కలిగే మరో లాభం ఏంటో తెలుసా? జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. బీట్రూట్‌లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య ఏర్పడదు.

ADVERTISEMENT

8. మెదడు ఆరోగ్యంగా.. (Improves Brain Function)

వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగిస్తుంది. అందుకే వయసు మళ్లిన వారిలో డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. బీట్ రూట్ తినడం వల్ల మెదడుకి సంబంధించిన ఇబ్బందులు మన దరికి చేరకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. బీట్రూట్‌లో ఉన్న నైట్రేట్స్ మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.

మెదడు ఆరోగ్యానికి మెంతులు ఏ విధంగా సహకరిస్తాయో ఇక్కడ చదవండి

9. రక్తహీనత తగ్గిస్తుంది (Reduce Anemia)

రక్తంలో ఐరన్ లోపం కారణంగా ఎనీమియా (రక్తహీనత) వస్తుంది. క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తాగడం లేదా బీట్ రూట్ తినడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. బీట్రూట్ దుంప మాత్రమే కాదు.. దాని ఆకులు సైతం రక్తహీనతను తగ్గించేందుకు తోడ్పడతాయి.

10. బరువు తగ్గడానికి (Beetroot For Weight Loss)

బరువు తగ్గాలనుకొనేవారు తమ ఆహారంలో బీట్రూట్‌ను భాగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్‌లో నీటిశాతం కూడా ఎక్కువే. ఇవి అదనపు బరువు తగ్గేలా చేస్తాయి. బీట్రూట్ ఆహారంగా తీసుకొంటే సరిపోదు. అవసరమైనంత మేర వర్కవుట్లు కూడా చేయడం తప్పనిసరి.

ADVERTISEMENT

2-beetroot-health-beauty-benefits

చర్మం ఆరోగ్యానికి బీట్రూట్ (Benefits Of Beetroot For Skin)

1. మొటిమలు తగ్గిస్తుంది (Reduces Acne)

సాధారణంగా జిడ్డు చర్మం కలిగినవారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఫలితంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి. బీట్రూట్‌తో ఫేస్ ప్యాక్ వేసుకొని మొటిమలను నయం చేసుకోవచ్చు. రెండు చెంచాల బీట్రూట్ జ్యూస్‌లో చెంచా పెరుగు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. పొడిచర్మం నుంచి విముక్తి (Protect Skin Health)

మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ కొన్ని సందర్బాల్లో చర్మం పొడిగానే కనిపిస్తుంది. మీది కూడా పొడి చర్మమేనా? అయితే బీట్రూట్ వాడటం ద్వారా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దీనిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి చర్మాన్ని పొడిగా మారకుండా చేస్తాయి. బీట్రూట్‌ని తరచూ మీ ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు.. అప్పుడప్పుడూ బీట్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రెండు చెంచాల బీట్రూట్ రసంలో చెంచా పచ్చిపాలు, రెండు చుక్కల కొబ్బరి నూనె వేసి మిశ్రమంగా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకొని బాగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మానికి అవసరమైన తేమ అందుతుంది.

3. చర్మం ప్రకాశవంతంగా (For Glowing Skin

మన ఆరోగ్యం ఎలా ఉందో చర్మాన్ని చూసి తెలుసుకోవచ్చు. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపించాలంటే బీట్రూట్ జ్యూస్ తాగాల్సిందే. ఇది చర్మ ఆరోగ్యాన్ని హరించే టాక్సిన్లను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీని వల్ల చర్మం హెల్తీగా తయారవుతుంది. ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోయినా.. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. తరచూ బీట్రూట్ జ్యూస్ ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలిగిపోయి అందంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

4. కళ్లకింద వలయాలు, మచ్చలు తగ్గిస్తుంది (Helps To Get Rid Of Dark Circle)

మొటిమల కారణంగా చర్మంపై ఏర్పడిన మచ్చలను తొలగించడం చాలా కష్టం. కానీ బీట్రూట్ సాయంతో వాటిని సులభంగా తగ్గించుకోవచ్చు. మచ్చలు మాత్రమే కాదు. కళ్ల కింద కనిపించే నల్లటి వలయాలను సైతం తగ్గించుకోవచ్చు. దీని కోసం బీట్రూట్ రసంలో కొద్దిగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె కలిపి కళ్ల కింద అప్లై చేసి మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. నూనెకు బదులుగా టమాటా రసం ఉపయోగించినా మంచి ఫలితం కనిపిస్తుంది. సమపాళ్లలో బీట్రూట్ రసం, టమాటా రసం కలిపి మచ్చలకు అప్లై చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

కళ్ల కింద నల్లటి వలయాలను రెడ్ లిప్స్టిక్ తో కవర్ చేసేద్దాం.

కురుల ఆరోగ్యానికి బీట్రూట్ (Benefits Of Beetroot For Hair)

1-beetroot-health-beauty-benefits

1. జుట్టు రాలడాన్ని అదుపు చేస్తుంది (Control Hair Fall)

ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి ఒత్తిడి, పోషకాహారలోపం కారణం. హార్మోన్ల అసమతౌల్యం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటికి బీట్రూట్ చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. బీట్రూట్‌ను వీలైనంత ఎక్కువ సార్లు సలాడ్ల రూపంలో, జ్యూస్ చేసుకొని తాగడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగేే బీట్రూట్ పేస్ట్ లేదా రసాన్ని తలకు అప్ల్లై చేసుకొని కాసేపాగిన తర్వాత తలస్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

2. చుండ్రు తగ్గిస్తుంది (Helps To Get Rid Of Dandruff)

చుండ్రు తగ్గడానికి ఎన్ని ఉత్పత్తులు వాడినా కొన్నిసార్లు ప్రయోజనం ఏమీ కనిపించదు. అప్పుడప్పుడూ మార్కెట్లో దొరికే ఉత్పత్తుల కంటే ఇంటి చిట్కాల ద్వారానే మంచి ఫలితం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. బీట్రూట్ సైతం చుండ్రుని చక్కగా తగ్గిస్తుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చుండ్రుతో పాటు దురదను సైతం తగ్గిస్తాయి. దీని కోసం బీట్రూట్ ముక్కలను నీటిలో వేసి బాగా వేడి చేయాలి. మరిగిన తర్వాత గిన్నెలోకి వడపోసి ముక్కలు, నీటిని వేరు చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ నీటిని గోరువెచ్చగా చేసి తలకు రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆపై షవర్ క్యాప్ పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. జుట్టు ఒత్తుగా మారడానికి (Helps In Hair Growth)

బీట్రూట్‌లో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కురుల పెరుగుదలను ప్రోత్సహించి ఒత్తుగా మారేలా చేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా బీట్రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బీట్రూట్‌తో వేసుకొనే హెయిర్ ప్యాక్ కూడా వెంట్రుకలు ఒత్తుగా అయ్యేలా చేస్తుంది. దీని కోసం బీట్రూట్‌ను మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని కోడిగుడ్డు తెల్ల సొనలో కలిపి మిశ్రమంగా చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు దీన్ని తలకు అప్లై చేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయమే తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ చిట్కాలు చిన్నవే కానీ మీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి

7-beetroot-health-beauty-benefits

ADVERTISEMENT

బీట్రూట్ ఎలా ఎంపిక చేసుకోవాలి? (Tips To Buy Beetroot)

మంచి బీట్రూట్‌ను మనం ఆహారంగా తీసుకొన్నప్పుడే.. మనం కోరుకొన్న ఫలితం వస్తుంది. అందుకే బీట్రూట్‌ను ఎంపిక చేసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండ్రంగా, నున్నటి ఉపరితలం కలిగిన, చిన్న సైజులో ఉన్న బీట్రూట్‌ను ఎంచుకోవాలి. వేర్లు ఎక్కువగా ఉన్నవాటిని తీసుకోవద్దు. ఇలా వేర్లు ఎక్కువగా వచ్చాయంటే అవి ముదిరిపోయాయని అర్థం. ఎంచుకొన్న బీట్రూట్ పై మచ్చలు లేకుండా చూసుకోవాలి.

బీట్రూట్ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? (Beetroot Recipes)

సాధారణంగా బీట్రూట్‌తో వేపుడు చేసుకొంటాం. హల్వా చేసుకొని తింటాం. జ్యూస్ చేసుకొని తాగుతాం. కానీ రోజూ బీట్రూట్ ఇలా తినాలంటే కష్టమే. అందుకే మీకోసం బీట్రూట్ తో చేసుకోదగిన కొన్ని టేస్టీ రెసిపీస్ పరిచయం చేస్తున్నాం. కాబట్టి బోర్ కొట్టకుండా చక్కగా రోజూ బీట్రూట్ తినేయచ్చు.

బీట్రూట్ పరోటా (Beetroot Paratha)

కావాల్సినవి: గోధుమ పిండి, రెండు కప్పులు సన్నగా తురిమిన బీట్రూట్, రెండు పచ్చిమిరప కాయలు, కొద్దిగా నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు, నూనె.

ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపిపెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి.. అది వేడెక్కిన తర్వాత దానిలో సన్నగా తురిమిన బీట్రూట్ ముక్కలు అందులో వేయాలి. సన్నని సెగ మీద ఐదు నుంచి ఆరు నిమిషాలు వేయించాలి. లేదా బీట్రూట్ ముక్కల్లోని తేమ పూర్తిగా ఆరిపోయేంత వరకు వేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా, సరిపడినంత ఉప్పు, తగినంత నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ADVERTISEMENT

చపాతీ పిండిని మధ్యస్థ పరిమాణంలో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న సైజులో చపాతీలా చేసి మధ్యలో రెండు, మూడు స్పూన్ల బీట్రూట్ మిశ్రమం వేసి.. మరోసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత దీన్ని పెనంపై వేసి రెండు వైపులా కాలిస్తే బీట్రూట్ పరోటా తయారవుతుంది.

బీట్రూట్ చట్నీ (Beetroot Chutney)

ఇడ్లీ, దోశ, పెసరట్టు, వడ ఏదైనా సరే మనకు చట్నీ కచ్చితంగా ఉండాల్సిందే. దీని కోసం రకరకాల చట్నీలు తయారుచేస్తూ ఉంటారు. వాటి మాదిరిగానే బీట్రూట్ చట్నీ తయారుచేసుకొంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మన సొంతమవుతాయి.

కావాల్సినవి: తురిమిన బీట్రూట్ కప్పు, పచ్చిమిర్చి – 5, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, కొన్నివెల్లుల్లి రేకలు, వేరుశెనగలు – కొద్దిగా, ఒకటిన్నర టీస్పూన్ చొప్పున శెనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, నూనె, నిమ్మరసం లేదా చింతపండు గుజ్జు, కరివేపాకు.

6-beetroot-health-beauty-benefits

ADVERTISEMENT

ముందుగా ప్యాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత వేరుశెనగ గుళ్లు, మినపప్పు, శెనగపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరికొంత సమయం వేయించాలి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్‌లో బీట్రూట్ వేసి.. రెండు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించాలి. చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకొన్న దినుసులు, బీట్రూట్ తురుము మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బీట్రూట్‌ను గ్రైండ్ చేయడానికి నీరు వేయాల్సిన అవసరం లేదు. నిమ్మరసం లేదా చింతపండు గుజ్జు వేసి మరోసారి బ్లెండ్ చేసుకొంటే బీట్రూట్ చట్నీ తయారవుతుంది.

బీట్రూట్ మిల్క్ షేక్ (Beetroot Milk Shake)

రెండు బీట్రూట్ దుంపలను తీసుకొని వాటి తొక్క తీయకుండా ఉడకబెట్టాలి. ఆ తర్వాత వాటి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనిలో 120 మి.లీ. పాలు, దాల్చిన చెక్కపొడి, తగినంత పంచదార వేసి బ్లెండ్ చేయాలి. చివరిగా వెనీలా ఐస్ క్రీం వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. దీన్ని గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకొంటే సరి. చల్ల చల్లగా బీట్రూట్ మిల్క్ షేక్ తాగేయొచ్చు. 

బీట్రూట్ బిర్యానీ (Beetroot Biryani)

సాధారణంగా మనం బిర్యానీ ఎలా చేసుకొంటామో అలాగే చేసుకొని.. చివరిలో కొద్దిగా తురిమిన బీట్రూట్ కలిపితే.. బీట్రూట్ బిర్యానీ సిద్ధమవుతుంది.

బీట్రూట్ వల్ల కలిగే దుష్ప్రభావాలు (Side Effects Of Beetroot)

ఏదైనా పరిమితికి లోబడి తీసుకొంటే ప్రమాదం జరగదు. అతిగా ఆహారంగా తీసుకొన్నప్పుడు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీట్రూట్ విషయంలోనూ అంతే. అధిక మోతాదులో బీట్రూట్ తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ADVERTISEMENT
  • మోతాదుకు మించి బీట్రూట్ ఆహారంగా తీసుకోవడం వల్ల కాలేయంలో మెగ్నీషియం, రాగి, ఐరన్ వంటి ఖనిజ లవణాలు పేరుకుపోతాయి. దీని వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది.
  • బీట్రూట్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో బీటూరియా వచ్చే అవకాశం ఉంది. ఇది హానికరమైనది కాకపోయినప్పటికీ బీట్రూట్‌లోని ఐరన్ కారణంగా మెటబాలిజంలో సమస్యలు ఉత్పన్నమైనట్లుగా భావించాలి.
  • బీట్రూట్‌లో అధిక మొత్తంలో ఉండే ఆక్సలేట్ కారణంగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
  • బీట్రూట్‌లో గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ షుగర్ సంబంధిత సమస్యలుంటే బీట్రూట్ తీసుకోకపోవడమే మంచిది.
  • బీట్రూట్‌లో ఉండే బీటైన్, నైట్రైట్స్ కారణంగా గర్భవతుల్లో తీవ్రమైన దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంది. ఇవి తల్లితో పాటు గర్భంలోని బిడ్డపై సైతం ప్రభావం చూపిస్తాయి. కాబట్టి గర్భవతులు దీనికి దూరంగా ఉండటమే మంచిది.
  • బీట్రూట్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కొందరిలో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

4-beetroot-health--beauty-benefits

Image: Unsplash.com

1. బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయా ?

మనం బీట్రూట్ర్ ఆహారంగా తీసుకొన్నప్పడు దానిలోని నైట్రేట్స్‌ను శరీరం నైట్రిక్ ఆక్స్సైడ్‌గా మార్చేస్తుంది. ఇది రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని సైతం పెంచుతుంది. దీని వల్ల శరీరభాగాలకు అవసరమైనంత మేర ఆక్సిజన్ అందుతుంది. అలాగే కణాల్లోని మైటోకాండ్రియాను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల తక్కువ ఆక్సిజన్‌తోనే అవి మెరుగ్గా పనిచేయగలుగుతాయి.

2. జ్యూస్ తాగడం మంచిదా? బీట్రూట్ తినడం మంచిదా ?

బీట్రూట్‌ను ఏ రూపంలోనైనా ఆహారంగా తీసుకోవచ్చు. తినడం కంటే జ్యూస్ తాగడం వల్ల మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే జ్యూస్ ద్వారా ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రైట్స్, ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవే పోషకాలు పచ్చి బీట్రూట్ తినడం వల్ల కూడా మనకు అందుతాయి. కాకపోతే మనం వాటిని వండుకొని తింటాం. ఈ పద్ధతిలో కొన్ని పోషకాలను బీట్రూట్ కోల్పోతుంది.

ADVERTISEMENT

3. బీట్రూట్ జ్యూస్ ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి.

బీట్రూట్ జ్యూస్‌ను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ రోజుకి రెండు కప్పులు తీసుకొంటే సరిపోతుంది. మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అయితే వ్యాయామానికి రెండు గంటల ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది.

4. బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందా ?

బీట్రూట్‌లో సహజమైన చక్కెరలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. అలాగే రక్తంలో చక్కెర శాతమూ పెరగదు. కానీ మధుమేహంతో బాధపడేవారు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే..

What is Beetroot in Hindi

Benefit of Beetroot in English

ADVERTISEMENT

Images: Pixabay

29 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT