ADVERTISEMENT
home / Celebrity Life
అమీ జాక్సన్  ‘అమ్మ’ అయ్యింది .. ఆమె బుజ్జాయి ఫొటోలు చూశారా…?

అమీ జాక్సన్ ‘అమ్మ’ అయ్యింది .. ఆమె బుజ్జాయి ఫొటోలు చూశారా…?

(Celebrity Couple Amy Jackson and George Panayiotou welcome Baby Boy)

అమీ జాక్సన్  ‘ఐ, రోబో 2.0’ వంటి శంకర్ సినిమాల హీరోయిన్‌గా.. మంచి గుర్తింపు సాధించిన కథానాయిక. బ్రిటన్‌కి చెందిన ఈ అందాల రాశి దక్షిణాది సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ నటించి మంచి పేరు సంపాదించింది. బ్రిటన్‌కి చెందిన అమీ.. అక్కడి వ్యాపారవేత్త జార్జ్ పనాయొటో‌‌తో ఈ ఏడాది మొదట్లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు.. మదర్స్ డే సందర్భంగా తాను తల్లి కాబోతున్నానన్న వార్తను కూడా పంచుకుంది అమీ. తాజాగా సోమవారం (23 సెప్టెంబర్) నాడు.. ఆమె ఓ ముద్దుల బాబుకి జన్మనిచ్చింది. ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

తల్లి కాబోతున్న వార్తను వెల్లడించిన తర్వాత కూడా.. ప్రసవం వరకూ బిజీగా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది అమీ జాక్సన్. కొన్నాళ్ల క్రితం జరిగిన తన బేబీ షవర్‌కి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్న అమీ.. అందులోనే జెండర్ రివీలింగ్ పార్టీ నిర్వహించింది. ఇందులో భాగంగా తనకు బాబు పుట్టబోతున్నాడని.. తమకు పుట్టే అబ్బాయికి ఆండ్రియాస్ అనే పేరు పెట్టబోతున్నామని కూడా వెల్లడిచింది అమీ.

ADVERTISEMENT

తమ బాబు పుట్టిన రోజునే తనకు పాలు పడుతున్న ఫొటోను.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది అమీ. ఈ ఫొటోలో అమీ నుదుటన జార్జ్ ముద్దు పెడుతుంటే.. తన బాబుకి ఆమె పాలు పడుతూ కనిపించింది. హాస్పిటల్లో ఉన్న ఫొటోనే కావడంతో పుట్టిన వెంటనే తీసిన ఫొటోగా అందరూ భావిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘అవర్ ఏంజెల్, వెల్ కం టు ద వరల్డ్ ఆండ్రియాస్ (మా ఏంజెల్.. కొత్త ప్రపంచానికి స్వాగతం ఆండ్రియాస్)..’ అంటూ క్యాప్షన్ రాసింది అమీ. అంతే కాదు.. తన స్టేటస్‌లో ఆండ్రియాస్‌కి సంబంధించిన వీడియో పోస్టు చేసిన ఆమె.. ఆ తర్వాత తన స్నేహితులు, బంధువులతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేస్తోంది.

అమీ జాక్సన్ స్టేటస్ పెట్టిన కొన్ని గంటల్లోనే.. ఆ పోస్ట్ వైరల్‌గా మారిపోయింది. కొన్ని లక్షల మంది ఈ పోస్ట్‌ని లైక్ చేయగా.. బ్రిటన్‌కి, భారత్‌కి చెందిన సెలబ్రిటీలు,  స్నేహితులు, అభిమానులు ఆమెపై శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. మార్చిలో తాను తల్లి కాబోతున్నానని వార్త చెప్పినప్పటి నుంచి తన ఫొటోలతో, మెటర్నిటీ ఫ్యాషన్లతో ఆకట్టుకున్న అమీ ప్రసవానికి కొన్ని రోజుల ముందు వరకూ ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ వచ్చింది.

అంతకుముందు తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘మేం ప్రస్తుతం ఉన్న స్థితిలో అమ్మానాన్నలు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాం. మన జీవితంలో దేన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేయకూడదు. అది జరిగే సమయంలో జరిగిపోతుందని నా నమ్మకం. మేమిద్దరం చాలా దగ్గరయ్యాం. కలిసి ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఒకరి గురించి మరొకరికి చాలా బాగా తెలుసు.

ADVERTISEMENT

మంచి, చెడు విషయాలన్నీ పంచుకుంటాం. ఇంతకుముందు కూడా మేమిద్దరం క్లోజ్‌గా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మా మధ్య ఉన్న దగ్గరితనం చాలా విభిన్నమైంది. ఇప్పుడు మాకో అందమైన ఇల్లు ఉంది. ఇద్దరం అమ్మానాన్నలు ఎప్పుడవుతామా? అని ఎంతో ఆసక్తితో వేచి చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.

జార్జ్ పనాయొటోతో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న అమీ.. ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకుంది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నారట. తన పెళ్లి బీచ్‌లో జరగాలన్నది అమీ కోరిక. గ్రీస్‌లో వీరి పెళ్లి జరగనుందట. వీరి పెళ్లి కోసం బీచ్‌లో ఉన్న.. అద్భుతమైన బీచ్ సైడ్ రిసార్ట్‌లను వెతుకుతున్నారట ఈ జంట. మైకోనాస్ ఐలాండ్‌లోని బీచ్ దగ్గరలో ఉన్న విల్లాస్‌లో.. వారి పెళ్లి జరుగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.

గతేడాది వీరిద్దరూ అక్కడికి వెళ్లినప్పుడు.. అమీ జాక్సన్‌కి ఆ ప్రదేశం చాలా బాగా నచ్చిందట. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని అమీ భావిస్తోందట. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రీస్‌లో తన వివాహం జరుగుతుందట. పెళ్లి తర్వాత కూడా అమీ బ్రిటన్‌లోనే స్థిరపడుతుందట. కాబట్టి ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ముద్దులొలికే బాబుకి తల్లిదండ్రులైన అమీ, జార్జ్‌లకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

24 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT