ADVERTISEMENT
home / సౌందర్యం
కొత్త సంవత్సరంలో.. ఇలాంటి ‘బ్యూటీ’ రిజల్యూషన్స్ తీసుకోండి..!

కొత్త సంవత్సరంలో.. ఇలాంటి ‘బ్యూటీ’ రిజల్యూషన్స్ తీసుకోండి..!

Beauty Resolutions to make in 2020

నూతన సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా అనేకమంది మహిళలు కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా  ఈ ఏడాది ఏవైనా కొత్త తీర్మానాలు చేసుకుంటున్నారా? ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్‌లో అనూహ్యమైన మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది వాటిని పాటించకుండా మర్చిపోయే అవకాశం ఉంది.

నేనూ ప్రతి సంవత్సరం అలాగే చేసేదాన్ని. ముఖ్యంగా గత సంవత్సరం నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలని రిజల్యూషన్ తీసుకున్నా. అది పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి.. పాటించగలిగా. కానీ కొన్ని రిజల్యూషన్స్ చాలా కష్టంగా ఉంటాయి. అందుకే ఒక్కసారిగా కష్టమైన టాస్క్ వైపు మొగ్గు చూపకుండా.. సులభంగా ఉండే వాటి వైపు మొగ్గు చూపాలి. ఇక బ్యూటీ రిజల్యూషన్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన చర్మ సౌందర్యం మెరుగుపడాలన్నా… సంవత్సరం అంతా మనం అందంగా, ఫ్రెష్‌గా కనిపించాలన్నా.. మనం తీసుకొనే నిర్ణయాలే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

ఈ సంవత్సరం.. ఈ బ్యూటీ రిజల్యూషన్స్‌ని మీరూ ట్రై చేయండి

ADVERTISEMENT

1. ‘నేను ప్రారంభించాను కాబట్టి.. దాన్ని కొనసాగిస్తాను’ అనే భావనతోనే మీరు ముందుకు పోవాలి. ముఖ్యంగా ప్రతి రోజు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలని తీర్మానం చేసుకున్నాక..  ఆ అలవాటును మానడానికి ప్రయత్నించకండి. మీరెంత ఎక్కువ నీరు సేవిస్తే.. అంత మంచిది. చర్మ రుగ్మతల బారిన పడకుండా ఉండేందుకు కూడా.. చాలామంది ఈ అలవాటును తమ దినచర్యలో భాగంగా చేసుకుంటారు. అలాగే మీ బరువును బట్టి.. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి. కనీసం రోజుకి పది గ్లాసులైనా తాగితే మంచిది.

2. పాత ఉత్పత్తులు పూర్తవ్వకముందే.. కొత్త బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగించకపోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల చాలా వరకూ ఖర్చులు తగ్గుతాయి.

3. చర్మం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించడం.. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో పాటు తరచూ స్క్రబ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి .

ADVERTISEMENT

4. రోజూ బయటకు వెళ్లే ముందు.. సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ బారిన పడకుండా ఉండడం మాత్రమే కాదు.. యూవీ కిరణాల బారి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుకునే వీలుంటుంది.

5.మీ చర్మ తత్వం ఎలాంటిదో మీకు తెలుసా? పొడి చర్మం.. ఆయిలీ స్కిన్.. కాంబినేషన్ స్కిన్.. ఇలా ప్రతీ చర్మానికీ ఓ తత్వం ఉంటుంది.  ఈ తత్వాన్ని బట్టే.. మీరు మీ చర్మ సంరక్షణకు సంబంధించిన రిజల్యూషన్ తీసుకోవాల్సి ఉంటుంది.  అందుకే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి.

6. అలాగే రోజూ రాత్రి తప్పనిసరిగా చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంలో తేమ పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది.

ADVERTISEMENT

7. పెదాలు, ఇతర భాగాల్లో చర్మం ఎండిపోయి పొరలుగా కనిపిస్తే దాన్ని తొలగించడం మానేయాలి.

8. బ్యూటీ ఉత్పత్తుల ఎక్స్ పైరీ డేట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ.. డేట్ అయిపోయిన వాటిని బయట పడేస్తూ ఉండాలి.

9. మీ బ్యూటీ ఉత్పత్తులు తరచూ మార్చడం ఆపేయాలి. ఇలా మార్చడం వల్ల.. చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. మీ చర్మతత్వానికి సరిపడే ఉత్పత్తిని ఉపయోగిస్తూ ఉండడం మంచిది.

ADVERTISEMENT

10. రాత్రంతా అందమైన బ్యూటీ స్లీప్ తప్పనిసరి. అందుకే కంటి నిండా నిద్ర పోవాలి.

11. మీ కేశాల తత్వాన్ని బట్టి.. జుట్టుకు తరచూ నూనె పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ అయినా సరే.. గోరు వెచ్చని నూనె పట్టించిన అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

12. మీ మేకప్ బ్రష్‌లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయకపోవడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి.. మీ చర్మానికి మరింత హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.

13. కెమికల్ ఫ్రీ, నేచురల్ ఉత్పత్తులను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. తద్వారా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.

ADVERTISEMENT

14. మీ ఆహారంలో మాత్రమే కాదు.. మీ బ్యూటీ రొటీన్‌లో కూడా ‘విటమిన్ ఇ, విటమిన్ బి’లను భాగం చేసుకోవాలి. అలాగే విటమిన్ క్యాప్సూల్స్ కూడా ఉపయోగించడం మంచిది.

 

15. ‘అయ్యో దేవుడా.. ఎందుకింత అందం ఇచ్చావయ్యా? (మే అప్నీ ఫేవరెట్ హూ).. నేను నా ఫేవరెట్’ అన్న మాటలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉపయోగించండి. అద్దంలో చూసుకుంటూ.. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడం అలవాటు చేసుకోండి. కేవలం మీ డ్రస్, మీ లుక్ మాత్రమే కాదు.. మేకప్ లేకపోయినా అద్దంలో కనిపించే వ్యక్తిని ప్రశంసించడం అలవాటు చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు.

చూశారా? ఎంత సులభమో.. మరి, మీరూ వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు కదూ..

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

13 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT
good points logo

good points text