ADVERTISEMENT
home / సౌందర్యం
కొబ్బరి నూనె (Coconut Oil) కేశ సంరక్షణకు మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యానికీ ముఖ్యమే..!

కొబ్బరి నూనె (Coconut Oil) కేశ సంరక్షణకు మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యానికీ ముఖ్యమే..!

అందమైన చర్మం.. నల్లగా నిగనిగలాడే జుట్టు.. ఇవి కావాలని కోరుకోని వాళ్లు ఎవరైనా ఉంటారా? అవును.. ప్రతి ఒక్కరూ తాము అందంగా కనిపించాలనే కోరుకుంటారు. అందంగా మెరిసిపోయేందుకు అందుబాటులో ఉన్న ప్రతి పద్ధతిని పాటిస్తారు. అయితే మీ జుట్టునే కాదు.. చర్మాన్ని అద్భుతంగా మార్చడంలో కొబ్బరినూనెకు (coconut oil) ఏదీ సాటి రాదని మీకు తెలుసా.. కొబ్బరి మనకు ప్రకృతి అందించిన వరం. రోజూ మన ఇంట్లోనే ఉండే ఈ కొబ్బరి నూనెతో మన చర్మాన్ని, జుట్టును అందంగా మార్చుకోవచ్చు. దానికి ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

కొబ్బరి నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

కొబ్బరి నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలెన్నో. అందులో కొన్ని.. 

ADVERTISEMENT

Shutterstock

1. జుట్టును సిల్కీగా మారుస్తుంది

మీ జుట్టు చాలా రఫ్‌గా.. దువ్వడానికి కూడా ఇబ్బందిగా అనిపించేలా ఉంటే.. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అది సిల్కీగా మారుతుంది. తలస్నానానికి ముందు తలకు నూనె రాసుకోవడం వల్ల.. జుట్టు సిల్కీగా మారడంతో పాటు బలంగా కూడా తయారవుతుంది.

2. మెరుపును అందిస్తుంది.

ఆర్గానిక్ కొబ్బరి నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసుకోవడం వల్ల.. జుట్టు మరింత నల్లగా మారడంతో పాటు మెరుస్తూ ఉంటుంది.

ADVERTISEMENT

Shutterstock

3. చుండ్రును తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లలో ఫంగస్ పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. దీనికోసం ఆర్గానిక్ కొబ్బరి నూనెను రెండు మూడు టీస్పూన్లు తీసుకొని.. కాస్త వేడి చేసి కుదుళ్లకు అప్లై చేసుకుంటే సరిపోతుంది.

4. కండిషనింగ్ చేస్తుంది.

చాలావరకూ హెయిర్ కండిషనర్స్‌లో కొబ్బరి నూనె ఉంటుంది. ఎందుకంటే ఇది జుట్టు ప్రతి వెంట్రుక కుదుళ్ల లోపలికి వెళ్లిపోయి జుట్టును కండిషన్ చేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. జుట్టు కుదుళ్లకు కొబ్బరినూనెను బాగా పట్టించి.. వేడి నీటిలో ముంచిన టవల్‌తో జుట్టును చుట్టి.. గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

కొబ్బరి నూనె వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

కొబ్బరి నూనె కేవలం జుట్టుకు మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎన్నెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అవేంటంటే.. 

Shutterstock

1. తేమను అందిస్తుంది.

చలి కాలంలో పొడి చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కొబ్బరి నూనె చర్మంలో తేమను నింపుతుంది. ముఖం కడుక్కోవడానికి కొన్ని నిమిషాల ముందు.. కొబ్బరి నూనె రుద్దుకొని మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కుంటే చాలు.. చర్మం అందంగా మెరిసిపోతుంది.

ADVERTISEMENT

2. మేకప్ తొలగించేందుకు..

చర్మంపై ఉన్న మేకప్‌ను తొలగించే క్రమంలో.. మామూలుగా నీళ్లతో కడిగేస్తుంటారు. కానీ అలా చేసినా కాస్త మేకప్ ఉండిపోతుంది. అందుకే ముందు మేకప్‌ని కొబ్బరి నూనెతో తుడిచేస్తే చాలు.. ఇట్టే తొలిగిపోతుంది. దీంతో ఐమేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్‌ని కూడా తొలిగించుకోవచ్చు. ఆ తర్వాత.. నూనెలో ముంచిన కాటన్‌తో తుడుచుకున్న తర్వాత.. ముఖం కడుక్కుంటే సరిపోతుంది.

3. మొటిమలను తగ్గిస్తుంది.

మొటిమల నివారణ కోసం ఎక్కువగా ఉపయోగించే బెంజోయిల్ పెరాక్సైడ్ కంటే.. కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అంతేకాదు.. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది.

4. మంచి స్క్రబ్ మాదిరిగా..

మార్కెట్లో లభించే స్క్రబ్స్ అన్నింటిలోనూ కొబ్బరినూనె ఉంటుంది. అటు స్క్రబ్ చేయడంతో పాటు.. మృదుత్వాన్ని అందించడం కోసం కొబ్బరినూనె ఉపయోగపడుతుంది. సాధారణంగా కొబ్బరినూనె, చక్కెర, తేనె కలిపి స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది.

ADVERTISEMENT

Shutterstock

5. లిప్ గ్లాస్ మాదిరిగా

పెదాలు పగిలినప్పుడు కూడా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా దీన్ని లిప్ బామ్ మాదిరిగా వాడాలి. లేదా లిప్ గ్లాస్ కోసం మీ పాత లిప్ స్టిక్‌లో కొబ్బరినూనె కలిపి.. ఓ డబ్బాలో నింపి పెట్టుకుంటే.. అటు మాయిశ్చరైజేషన్‌తో పాటు ఇటు మెరుపు కూడా మీ సొంతమవుతుంది.

6. హైలైట్ చేసేలా..

కొబ్బరి నూనె మంచి హైలైటర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం చాలా తక్కువ మోతాదులో కొబ్బరినూనె తీసుకొని మేకప్ పై నుంచి బ్రష్‌తో రుద్దుకోవాలి. మీ ముఖం మరింత మెరిసినట్లుగా కనిపిస్తుంది.

7. షేవింగ్ సమయంలో..

పెదాలపై.. అలాగే ఇతర శరీర భాగాల్లో వచ్చిన అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలామంది షేవింగ్ చేస్తుంటారు. అలాగే చంకల్లోని వెంట్రుకలను తొలగించేందుకు షేవింగ్ క్రీమ్‌కి బదులు కొబ్బరినూనెను ఉపయోగించడం వల్ల.. హానికారకమైన కెమికల్స్ వాటిలోపలికి వెళ్లకుండా చూసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో నూనె రుద్ది షేవ్ చేసుకోవడమే దీనికి మార్గం.

ADVERTISEMENT

కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్స్

జుట్టు పెరుగుదలకే కాదు.. జుట్టు సమస్యలను తొలగించడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. అయితే దాన్ని నేరుగా కాకుండా.. ఈ హెయిర్ ప్యాక్స్‌లో భాగంగా ఉపయోగించి చూడండి.

Shutterstock

ADVERTISEMENT

1. కొబ్బరి నూనె, కలబంద, రోజ్ మేరీ ఆయిల్ హెయిర్ ప్యాక్

కావాల్సినవి

ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
కలబంద జెల్ – టేబుల్ స్పూన్
రోజ్ మేరీ ఆయిల్ – 5 నుంచి 8 చుక్కలు

ప్యాక్ వేసుకునే పద్ధతి

ముందుగా పదార్థాలన్నీ ఓ బౌల్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో హెయిర్ డై బ్రష్ ముంచి.. దాంతో జుట్టుకు మాస్క్‌లా వేసుకోవాలి. కుదుళ్ల వద్ద మొత్తం అప్లై చేసుకున్న తర్వాత.. జుట్టు మొత్తానికి పట్టించి పావు గంట పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

ప్రయోజనాలు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పద్ధతి ఇది. కలబంద యాంటీమైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తలభాగంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. రోజ్ మేరీ నూనె.. తలలో రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేస్తుంది. ఇక కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్యాక్ వల్ల మీ జుట్టు చాలా పొడుగ్గా తయారవుతుంది.

2. కొబ్బరి నూనె, అరటి పండు, తేనె హెయిర్ ప్యాక్

కావాల్సినవి

ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
తేనె – రెండు టేబుల్ స్పూన్లు
అరటి పండు – ఒకటి
కొబ్బరి పాలు – రెండు టేబుల్ స్పూన్లు

ADVERTISEMENT

ప్యాక్ వేసుకునే పద్ధతి

ముందుగా బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకొని.. మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. అందులో కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే హ్యాండ్ బ్లెండర్ కూడా ఉపయోగించవచ్చు. దీన్ని తలభాగంలో కుదుళ్లకు బాగా పట్టించాలి. ఆ తర్వాత.. జుట్టును పాయలుగా చేసి జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. దీన్ని అరగంట పాటు ఉంచుకొని.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి మాస్క్ వేసుకోవచ్చు.

ప్రయోజనాలు

అరటి పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన తలను, జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి తలభాగంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. ఇక కొబ్బరి నూనె తలను కండిషనింగ్ చేస్తుంది.

ADVERTISEMENT

Shutterstock

3. కొబ్బరి నూనె, గుడ్డు హెయిర్ ప్యాక్

కావాల్సినవి

ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె – రెండు టేబుల్ స్పూన్లు
గుడ్డులోని పచ్చసొన – ఒకటి
తేనె – టేబుల్ స్పూన్

ADVERTISEMENT

ప్యాక్ వేసుకునే పద్ధతి

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను ఓ బౌల్‌లో వేసి.. ఆ తర్వాత అందులోనే గుడ్డు పచ్చ సొనను కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత తేనె కూడా వేయాలి. ఈ మూడింటినీ బాగా కలిపి..  డ్యామేజ్ అయిన జుట్టుకు పట్టించాలి. ఒకవేళ మీ జుట్టు పొడుగ్గా ఉంటే.. ఈ కొలతలను రెట్టింపు కూడా చేసుకోవచ్చు. జుట్టు కుదుళ్ల నుంచి అంచుల వరకూ దీనిని పట్టించిన తర్వాత.. వేళ్లతో జుట్టును బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ గంట పాటు షవర్ క్యాప్ పెట్టుకొని ప్యాక్‌ని ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని లేదా చన్నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల జుట్టు అందంగా తయారవుతుంది.

ప్రయోజనాలు

మీ జుట్టు బాగా డ్యామేజ్ అయ్యి పొడిబారిపోతే.. ఈ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని ప్రొటీన్లు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. జుట్టును బలంగా మార్చి.. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. దీనివల్ల జుట్టు మెత్తగా, పట్టులా మెరుస్తూ కూడా తయారవుతుంది.

ADVERTISEMENT

4. కొబ్బరి నూనె, లావెండర్ నూనె హెయిర్ ప్యాక్

కావాల్సినవి

ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
లావెండర్ నూనె – ఐదారు చుక్కలు

ప్యాక్ వేసుకునే పద్ధతి

కొబ్బరి నూనెను ఓ బౌల్‌లో తీసుకొని.. అందులో లావెండర్ ఆయిల్‌ని వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు అంచుల వరకూ రాసుకోవాలి. కావాలంటే షవర్ క్యాప్ పెట్టుకోవచ్చు. దీన్ని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే కొబ్బరి పాలతో చేసిన షాంపూ, కండిషనర్ ఉపయోగించి తలస్నానం చేస్తే.. మీ జుట్టు అందంగా మెరిసిపోతుంటుంది. ఇలా వారానికోసారి.. రెండు మూడు నెలల పాటు ఈ మాస్క్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ADVERTISEMENT

ప్రయోజనాలు

జుట్టుకు సాధారణంగా చాలా స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తాం. స్ట్రెయిటనింగ్, ఐరనింగ్, కర్లింగ్ అంటూ .. చాలా రకాల స్టైలింగ్ పద్ధతులను ఉపయోగిస్తుంటాం. దీనివల్ల జుట్టు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హెయిర్ రిపేర్ మాస్క్ ద్వారా.. ఇలా పాడైన జుట్టులో తిరిగి జీవం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

5. కొబ్బరి నూనె, నిమ్మరసం హెయిర్ ప్యాక్

Shutterstock

ADVERTISEMENT

కావాల్సినవి

ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
నిమ్మరసం – టీస్పూన్

ప్యాక్ వేసుకునే పద్ధతి

ముందుగా టీస్పూన్ నిమ్మరసం తీసుకొని.. కొబ్బరి నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత.. కొబ్బరి నూనె కొద్దిగా రంగు మారేవరకూ.. దీన్ని జుట్టు కుదుళ్లలో అప్లై చేసుకోవాలి. కావాలంటే జుట్టు మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకొని.. షవర్ క్యాప్ పెట్టుకున్నాక కనీసం అరగంట పాటు వేచి చూడాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం తర్వాత జుట్టులోని తేమ బయటకు పోకుండా టవల్‌తో చుట్టుకోవడం.. డ్రయ్యర్ కాకుండా సహజంగా ఆరేలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

ADVERTISEMENT

ప్రయోజనాలు

జుట్టులోని చుండ్రును తగ్గించేందుకు ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి మన తలలో ఉన్న ఫంగస్‌ని దూరం చేస్తుంది. దీనివల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ కూడా దూరమవడం వల్ల.. జుట్టు కుదుళ్లలో ఉండే జిడ్డుదనాన్ని ఇది తొలగిస్తుంది. అలాగే కొబ్బరినూనె జుట్టు కుదుళ్ల నుంచి లోపలికి ఇంకిపోయి.. జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.

కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్స్

కేశ సంరక్షణకు కొబ్బరినూనె వాడడం సర్వసాధారణం. కానీ దాన్ని వివిధ ఉత్పత్తులతో కలిపి.. రకరకాల ఆయిల్స్ రూపంలో రాసుకునేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. కానీ చర్మానికి.. ముఖ్యంగా ముఖానికి కూడా కొబ్బరి నూనె ప్యాక్స్ ఉపయోగించవచ్చు తెలుసా? అవెలాగో తెలుసుకుందాం.

ADVERTISEMENT

Shutterstock

1. కొబ్బరి నూనె, బేకింగ్ సోడా ఫేస్ ప్యాక్

కావాల్సినవి

కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా – టీస్పూన్

ADVERTISEMENT

ప్యాక్ వేసుకునే పద్ధతి

కొబ్బరినూనెలో బేకింగ్ సోడా వేసి మిశ్రమంగా కలుపుకోవాలి. మరీ వదులుగా ఉంటే.. ఇంకొద్ది సోడాను కలుపుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని.. ఓ ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత సున్నితంగా, గుండ్రంగా.. వేళ్లతో రుద్దుకోవడం వల్ల మురికి తొలగిపోతుంది. ఇలా బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల అవి కూడా తొలగిపోతాయి. ఇలా స్క్రబ్ చేసి చల్లని నీటితో ముఖం కడిగేసుకొని పొడి టవల్‌తో తుడుచుకుంటే.. బ్లాక్ హెడ్స్ అన్నీ టవల్ పైకి రావడం చూడచ్చు. ఇలా వారానికి మూడు సార్లు చేయవచ్చు.

ప్రయోజనాలు

చర్మంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉండేవారు.. ఈ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి, వైట్ హెడ్స్, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గించేందుకు కూడా ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

2. కొబ్బరి నూనె, కాఫీ ఫేస్ ప్యాక్

కావాల్సినవి

కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
కాఫీ పౌడర్ – టీస్పూన్

ప్యాక్ వేసుకునే పద్ధతి

కొబ్బరి నూనెలో కాఫీ పొడి వేసి రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని.. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా కాసేపు మసాజ్ చేసి.. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఉంచుకొని.. గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

ADVERTISEMENT

ప్రయోజనాలు

కొబ్బరి నూనెలో మాత్రమే కాదు.. కాఫీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలిగిస్తాయి. 

Shutterstock

ADVERTISEMENT

3. కొబ్బరి నూనె, నిమ్మరసం, పెరుగు ఫేస్ ప్యాక్

కావాల్సినవి

కొబ్బరి నూనె – అర టేబుల్ స్పూన్
పెరుగు – టేబుల్ స్పూన్
నిమ్మరసం – అర టేబుల్ స్పూన్

ప్యాక్ వేసుకునే పద్ధతి

తొలుత నిమ్మరసం, కొబ్బరినూనె బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత.. అందులో పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. అది ఆరేవరకూ ఓ పావు గంట పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయవచ్చు.

ADVERTISEMENT

ప్రయోజనాలు

కొబ్బరి నూనె, పెరుగు చర్మంలో తేమను పెంచుతాయి. మన చర్మంపై ఉన్న రంధ్రాల్లో ఏదైనా మురికి చేరి ఉంటే .. అవి వాటిని తొలిగిస్తాయి. అలాగే.. నిమ్మరసంలో ఉన్న యాస్ట్రింజెంట్ గుణాలు చర్మంపై ఉన్న మచ్చలను తొలగిస్తాయి. అయితే నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు.. చర్మానికి మంటను కలిగించకుండా మీ చర్మ తత్వాన్ని బట్టి ఆ మోతాదు ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు.

4. కొబ్బరి నూనె, అవకాడో ఫేస్ ప్యాక్

కావాల్సినవి

కొబ్బరి నూనె – టేబుల్ స్పూన్
అవకాడో – పావు టేబుల్ స్పూన్
జాజికాయ పొడి – అర టీస్పూన్

ADVERTISEMENT

ప్యాక్ వేసుకునే పద్ధతి

ముందుగా అవకాడోను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. తర్వాత జాజికాయ పొడి వేసి కలుపుకొని.. ఆఖర్లో కొబ్బరినూనె వేసి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకొని పదిహేను, ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.

ప్రయోజనాలు

కొబ్బరినూనె, అవకాడో రెండూ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తాయి. తద్వారా చర్మం మెరిసేలా చేయడంతో పాటు ముడతలను కూడా తగ్గిస్తాయి.

ADVERTISEMENT

5. కొబ్బరి నూనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్

Shutterstock

కావాల్సినవి

కొబ్బరి నూనె –టీస్పూన్
దాల్చిన చెక్క –టీస్పూన్

ADVERTISEMENT

ప్యాక్ వేసుకునే పద్ధతి

కొబ్బరినూనెలో దాల్చిన చెక్క పొడి వేసి పూర్తిగా కలిసిపోయేలా చేయాలి. దీన్ని మొటిమలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో రుద్ది అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడుక్కుంటే సరిపోతుంది. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.

ప్రయోజనాలు

కొబ్బరినూనె, దాల్చిన చెక్క రెండింట్లోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలను తగ్గించడంతో పాటు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి.

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

Shutterstock

1. జుట్టుకు కొబ్బరినూనె అప్లై చేసేందుకు మంచి పద్ధతి ఏది?

సాధారణంగా తలస్నానానికి ముందు.. జుట్టుకు కొబ్బరినూనె అప్లై చేసుకోవడం వల్ల.. జుట్టుకు దాని మాయిశ్చరైజేషన్ అందడంతో పాటు.. మీకు జిడ్డుగా కూడా అనిపించకుండా ఉంటుంది. అందుకే మీ జుట్టు పొడవును బట్టి రెండు నుంచి నాలుగు టీస్పూన్ల నూనెను తీసుకొని దాన్ని కొద్దిగా వేడిచేయాలి. ఇలా వేడి చేసిన నూనె.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకొని.. వేడి నీటిలో ముంచి టవల్‌తో జుట్టును కట్టుకోవాలి. తర్వాత కనీసం ఓ గంట పాటు అలాగే ఉంచుకొని.. తర్వాత గోరువెచ్చని నీరు.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

2. కొబ్బరినూనె.. అన్ని కేశ తత్వాలకూ అనువైనదేనా..?

సాధారణంగా మన కేశాల తత్వం ఎలా ఉన్నా సరే.. కొబ్బరి నూనె అప్లై చేసుకోవచ్చు. అయితే జుట్టు మరీ జిడ్డుగా ఉన్నవారు కొబ్బరినూనెతో రుద్దుకోవడం వల్ల.. చుండ్రు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం తలస్నానానికి ముందు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇక జుట్టు  పొడిగా ఉన్నవారు కూడా కొబ్బరినూనెను నేరుగా అప్లై చేసుకోవడం వల్ల.. అది మరింత బిరుసుగా తయారవుతుంది. అందుకే కలబంద, అవిసె గింజల పొడి వంటివాటితో కలిపి తలకు పెట్టుకోవాలి.

Shutterstock

3. కొబ్బరి నూనె చర్మానికి అప్లై చేసుకొని ఎంతసేపు ఉండొచ్చు?

కొబ్బరి నూనెను రాత్రి ముఖం, ఇతరత్రా భాగాలకు రాత్రి అప్లై చేసుకొని ఉదయం వరకూ ఉంచుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు.. చర్మ కణాల రిపేర్ కూడా జరుగుతుంది. అయితే మీ చర్మం మరీ ఆయిలీగా ఉంటే మాత్రం.. ఇలా అప్లై చేసుకోకపోవడం మంచిది. ఆయిలీ చర్మం ఉన్నవారు తక్కువ సేపు అప్లై చేసుకోవడం లేదా రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్‌లో కలుపుకొని అప్లై చేసుకోవడం మంచిది. ఇలా నూనెను ముఖానికి  ప్రతి రోజూ  అప్లై చేసుకోవచ్చు.

ADVERTISEMENT

4. ఏ తరహా కొబ్బరినూనె అయితే చర్మానికి మంచిది?

సాధారణంగా కొబ్బరినూనెలో రిఫైన్డ్, అన్ రిఫైన్డ్, వర్జిన్, ఎక్స్ ట్రా వర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ అంటూ చాలా రకాలుంటాయి. తయారుచేసే పద్ధతిని బట్టి ఈ మార్పులు ఉండడం విశేషం. అయితే వీటన్నింటిలోకి ఆర్గానిక్ అన్ రిఫైన్డ్ కొబ్బరి నూనె చర్మానికి అప్లై చేయడానికి తగినది అని చెప్పుకోవచ్చు. ఇందులో సహజసిద్ధమైన ఫైటో న్యూట్రియంట్స్, పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వర్జిన్ కొకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ అని రాసి ఉన్న అన్ రిఫైన్డ్ కొబ్బరి నూనె చర్మానికి ఉపయోగించడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

26 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT