ADVERTISEMENT
home / Budget Trips
బీచ్‌లో ఎంజాయ్ చేయాలంటే  గోవా వరకు ఎందుకు? పక్కనే మన వైజాగ్ ఉండగా…!

బీచ్‌లో ఎంజాయ్ చేయాలంటే గోవా వరకు ఎందుకు? పక్కనే మన వైజాగ్ ఉండగా…!

చాలామంది తాము నివసించే ఇంటికి బీచ్ వ్యూ కావాలని కోరుకుంటారు. ఇంకొందరైతే .. వాళ్ళ ఇంటి కిటికీ తీయగానే.. సముద్రం కనిపిస్తే బాగుంటుందని భావిస్తారు. తీర ప్రాంతాలనేవి తుఫాన్లు లేదా అలల తాకిడి ఎక్కువైనప్పుడు భయంకరంగా కనిపిస్తాయి కానీ.. లేదంటే మనిషిలోని ప్రశాంతతని తట్టి లేపాలంటే మాత్రం సముద్రాన్ని మించిన ప్రదేశం ఈ భూమండలం పైన ఇంకొకటి ఉండదంటే అతిశయోక్తి కాదేమో!

వైజాగ్ ట్రెండ్స్: ప్రముఖ పబ్స్ & బార్స్ వివరాలు మీకోసం…!

అందుకనే ఇప్పటికీ చాలా సినిమాల్లో బీచ్ సన్నివేశాలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమాల్లో బీచ్ సాంగ్ అంటే అందరి కళ్లూ వైజాగ్ మీదే పడతాయి. అలాగే ఏదైనా బీచ్‌లో రొమాంటిక్ సన్నివేశం తీయాలన్నా కూడా వైజాగే అన్న స్టాంప్ పడిపోయింది. అదే సమయంలో మనం కూడా సముద్రతీరాన్ని చూడగానే.. మనంతటికి మనమే ఒడ్డుని తాకుతూ వెళుతున్న అలలని చూస్తూ ఉండిపోతాం. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదేశాలున్న వైజాగ్‌ని కాదనుకుని.. ఎందుకు అందరూ గోవా వెళతారు? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తినా… కేవలం సహజమైన తీర ప్రాంతపు అందాలను వీక్షించాలంటే మాత్రం వైజాగ్ వెళ్లినా చాలు..!

సాధారణంగా వైజాగ్ వచ్చే చాలామందికి తెలిసింది రామకృష్ణ బీచ్ ఒక్కటే! అయితే ఈ  ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా.. విశాఖపట్నానికి (Vizag) చెందిన మరొకొన్ని బీచ్‌లు కూడా నగర వాసులతో పాటు.. పర్యాటకులని సైతం ఎంతగానో  అలరిస్తున్నాయి. వాటి వివరాలు మీకోసం ప్రత్యేకం

ADVERTISEMENT

* రామకృష్ణ బీచ్ (Ramakrishna Beach) –  విశాఖ సముద్ర తీరం .. ఈ మాట వినగానే ఎవరికైనా గుర్తొచ్చే తొలి పేరు రామకృష్ణ బీచ్. వైజాగ్ వెళ్ళినవారు ఎవ్వరూ కూడా ఈ బీచ్‌ని సందర్శించకుండా వెనక్కి రారంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో ఈ ఆర్కే బీచ్‌లో చాలామంది కుటుంబసభ్యులు.. ప్రధానంగా తమ పిల్లలను తీసుకువచ్చి సాయంత్రాలు సేదతీరుతుంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ పర్యాటకుల సందర్శనార్థం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఐఎన్ఎస్ కురుసురా సబ్ మెరైన్‌ను నావికాదళ అధికారులు ప్రదర్శనకు ఉంచారు. 

అన్నట్టు చిరంజీవి మొదలుకుని.. ఎంతో మంది తెలుగు స్టార్ హీరోలు ఇదే బీచ్‌లో పాటలకి స్టెప్పులు వేశారు.  ఈమధ్యకాలంలో ఎన్నో సినిమాలకి సంబంధించి ఆడియో లాంచ్, ప్రీ -రిలీజ్, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఈ బీచ్ ప్రాంగణం వేదికవుతోంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్, సింహాచలం ప్రాంతాల నుండి 28 నెంబర్ బస్సు ఈ ప్రాంతానికి వెళ్తుంది. 

ఋషికొండ బీచ్ (Rushikonda Beach) –  ఈ ఋషికొండ బీచ్ … వాటర్ స్పోర్ట్స్‌కి నిలయం అని చెప్పాలి. చూడచక్కని లొకేషన్స్, గోల్డెన్ సాండ్స్.. ఎటు వైపు చూసినా కూడా మైమరిపించే అందమైన ప్రకృతి ఈ బీచ్‌కి అదనపు ఆకర్షణలు. ఇక ఎవరైనా విశాఖకు వచ్చి వాటర్ స్పోర్ట్స్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఈ బీచ్‌కి వస్తే సరిపోతుంది. ఇక ఈ బీచ్ చుట్టూ టూరిజం శాఖ వారు పర్యాటకులని ఆకర్షించేలా కాటేజస్‌ని నిర్మించడంతో..  సందర్శకుల తాకిడి మరింతగా ఎక్కువైంది. ఇక ఈ బీచ్ సౌత్ ఇండియాలోని  అతికొద్ది ‘వర్జిన్ బీచ్’ లలో ఒకటిగా పేరుపొందింది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 900 K బస్సు ఎక్కి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. 

యారాడ బీచ్ (Yarada Beach) –  ఈ బీచ్  విశాఖపట్నం నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యారాడ ఓ గ్రామం పేరు. ఆ పేరు మీదుగానే ఈ బీచ్‌కి నామకరణం చేశారు. అయితే ఇది ఆర్కే బీచ్‌లా జనాలతో కిక్కిరిసి ఉండదు. అయితే ఆ ప్రాంతం నావికదళం వారి పర్యవేక్షణలో ఉండడం వల్ల.. పర్యాటక శాఖ వారు చేసిన ఏర్పాట్లు కూడా పెద్దగా ఏమి ఉండవు! అయితే ఈ బీచ్‌కి, గంగవరం పోర్టుకి మధ్యలో డాల్ఫీన్ నోస్ అనే కొండ ఉంది.

ADVERTISEMENT

ఈ కొండ చూడడానికి డాల్ఫిన్ అనే చేప ముక్కు ఆకారంలో ఉంటుందట. అందుకే దానికి ఆ పేరు పెట్టారట. ఇక ఈ బీచ్‌కి వెళ్ళడానికి సౌకర్యాలు కాస్త తక్కువే ఉన్నప్పటికి..  సందర్శిస్తే మాత్రం ఒక ప్రైవేట్ బీచ్ లో ఉన్న అనుభూతి మాత్రం తప్పక కలుగుతుంది. పూర్ణా మార్కెట్, గాజువాక డిపో ప్రాంతాల నుండి 16వ నెంబర్ బస్సు ఈ ప్రాంతానికి వెళ్తుంది. అయితే సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న ప్రాంతంలో ఉండడం వల్ల ఎలాంటి బస్ పాసులు కూడా యారాడ బస్సులలో చెల్లవు. కచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్లాల్సిందే.

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Gift Ideas In Telugu)

లాసన్స్ బే బీచ్ (Lawsons Bay Beach) –  ఈ బీచ్‌ని మనం ఆర్కే బీచ్ నుండి కైలాసగిరి కొండకి వెళ్ళే దారిలో చూడొచ్చు. అయితే ఈ బీచ్‌ని ఆర్కే బీచ్‌కి కొనసాగింపుగా మాత్రమే చెబుతుంటారు. ఒకప్పుడు ఈ బీచ్‌ని ఎక్కువగా ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి ఉపయోగించేవారట! అయితే ఇప్పుడు మాత్రం కేవలం చేపలు పట్టడానికి మాత్రమే వాడుతున్నారట.

 

ADVERTISEMENT

గంగవరం బీచ్ (Gangavaram Beach) –  విశాఖపట్నంలోని దిబ్బపాలెం గ్రామం వద్ద బొర్రెమ్మ గెడ్డ నది సముద్రంలో కలిసిన ప్రాంతం నుండి ఈ బీచ్ మొదలవుతుంది. అయితే గంగవరం పోర్టు పనులు ప్రారంభమయ్యాక.. పర్యాటకుల రాక తగ్గింది. ఈ ప్రాంతంలో జాలర్లు, బెస్తవాళ్లు ఎక్కువగా నివసిస్తుంటారు. అనేక సినిమా షూటింగ్‌లు ఈ ప్రాంతంలో జరిగాయి. 

 

భీమిలి బీచ్ (Bheemili Beach) – భీమిలి లేదా భీమునిపట్నం విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో ఉండే ప్రముఖ పర్యటక ప్రాంతం.  ఈ తీర ప్రాంతంలో సముద్రం లోతు తక్కువ కాబట్టి.. ఈ బీచ్‌లో ఈత కొట్టడానికి వచ్చే పర్యటకుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రముఖ బౌద్ధకేత్రం పావురాళ్ళకొండ భీమిలి బీచ్‌కు దగ్గరలోనే ఉంది. 

 

ADVERTISEMENT

తెలుసుకున్నారుగా… విశాఖపట్నంలోని సముద్రతీరాల వివరాలు. మరింకెందుకు ఆలస్యం.. త్వరలోనే లేదా వీకెండ్‌లో.. మీ కుటుంబసభ్యులతో వైజాగ్ ట్రిప్‌ని ప్లాన్ చేసుకోండి. ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకాలని మీ మనసులో భద్రపరుచుకోండి.

వర్షాకాలంలో మనం తప్పక సందర్శించాల్సిన.. పర్యాటక ప్రదేశాలు ఇవే..!

Featured Image: Wikimedia commons

30 Jul 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT