ADVERTISEMENT
home / Bridal Makeup
హైదరాబాద్ ట్రెండ్స్: టాప్ 10 బ్రైడల్ మేకప్ ఆర్టిస్టుల వివరాలు మీకోసం

హైదరాబాద్ ట్రెండ్స్: టాప్ 10 బ్రైడల్ మేకప్ ఆర్టిస్టుల వివరాలు మీకోసం

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం. తనకు నచ్చిన వ్యక్తితో అందమైన భవిష్యత్తుకి అంకురార్పణ చేసే రోజు ఇది. అందుకే ఈ రోజు చాలా ప్రత్యేకం. ఇటీవలి కాలంలో పెళ్లి పట్టుచీరలు, నగలతో పాటు మేకప్‌కు సైతం చాలా ప్రాధాన్యమిస్తున్నారు నవ వధువులు. దీని కోసం బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ (bridal makeup artist) లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు.

అయితే హైదరాబాద్ (Hyderabad) లాంటి మహానగరంలో మీకు నప్పేలా మేకప్ వేయగలిగే బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌ను వెతికి పట్టుకోవడం కష్టమే. మీరు కూడా బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ గురించి వెతుకుతున్నారా? అయితే మీ కోసమే.. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో టాప్ 10 బ్రైడల్ మేకప్ ఆర్టిస్టుల జాబితా.. మీరూ ఓ లుక్కేయండి

అలియా బైగ్

Facebook

ADVERTISEMENT

వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న హైదరాబాదీ మేకప్ ఆర్టిస్ట్ అలియా బైగ్. పెళ్లి రోజున రాయల్ లుక్‌లో మెరిసిపోవాలనుకుంటే.. అలియా బైగ్‌తో మేకప్ వేయించుకోవాల్సిందే. ఈమె సర్టిఫైడ్ ఎయిర్ బ్రష్ మేకప్ ఆర్టిస్ట్. కస్టమర్ స్కిన్ టోన్‌కి సరిపోయే విధంగా మేకప్ ఉత్పత్తులను కస్టమైజ్ చేయడం ఆమె స్పెషాలిటీ. మీకో విషయం తెలుసా? ఆమె నవాబుల వంశానికి చెందినవారు.

షహనాజ్ హుస్సేన్ తర్వాత.. ఆమె కుటుంబం నుంచి మేకప్, బ్యూటీ రంగంలోకి అడుగు పెట్టిన రెండో వ్యక్తి అలియా బైగ్. ఆమె మేకప్ ఎంత బాగా వేస్తారో తెలుసుకోవడానికి ఆమె ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ ఖాతాలను చెక్ చేస్తే చాలు. ఆ ఫొటోల్లోని వధువులంతా.. రాయల్ లుక్‌లో హుందాగా, అందంగా కనిపిస్తారు.

చిరునామా: మేకప్ బై అలియా బైగ్, హారిజన్ ఎవెన్యూ, థర్డ్ ఫ్లోర్, రోడ్ నెం 10. రేషమ్ బాగ్, బంజారాహిల్స్, హైదరాబాద్.

ఫోన్ నెం: 098858 03119

ADVERTISEMENT

తమన్నా రూజ్

Facebook

నార్త్ ఇండియన్ వెడ్డింగ్ మేకప్, సౌత్ ఇండియన్ వెడ్డింగ్ మేకప్ రెండింటిని కలగలిపి పెళ్లి కూతురుని అందంగా తయారు చేయడంలో దిట్ట తమన్నా రూజ్. హైదరాబాదీ పెళ్లికూతుర్లు మాత్రమే కాకుండా.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర  రాష్ట్రాలకు చెందిన వారు సైతం తమ పెళ్లికి తమన్నాతో మేకప్ వేయించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఆమె మేకప్ చాలా సింపుల్‌గా ఉన్నా.. చాలా ఎలిగెంట్, క్లాసీ లుక్ ఇస్తుంది. బెస్ట్ బ్రైడల్ మేకప్ లుక్ కావాలనుకుంటే.. తమన్నా రూజ్ సరైన ఎంపిక. సైనా నెహ్వాల్ పెళ్లికి తమన్నానే మేకప్ వేశారు.

చిరునామా: జైబ్ ఆర్కేడ్, రోడ్ నెం 10, జేడ్&రితూ కుమార్ పైన, బంజారాహిల్స్, హైదరాబాద్.

ADVERTISEMENT

ఫోన్ నెం: 098661 21121

ఆయేషా ఎకె

Facebook

ఆయేషా ఎ కె ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. వధువులను అందంగా మలచడంలో ఆయేషాది అందె వేసిన చేయి. అరబిక్ ఐ మేకప్‌తో పాటు చర్మం ఫ్రెష్‌గా కనిపించేలా మేకప్ వేయడంలో ఆమెకు మంచి పేరుంది. హై ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్లకు చెందిన మోడల్స్‌కు ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె జంతు ప్రేమికురాలు కావడంతో.. ఆమె ఉపయోగించే మేకప్ ఉత్పత్తులన్నీ రసాయనరహితమైనవి, జంతువుల నూనెలు ఉపయోగించనివే ఉంటాయి.

ADVERTISEMENT

 

నరేశ్ తొగాటి

Facebook

తెలుగు చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా నరేశ్ తొగాటికి చాలా మంచి పేరుంది. ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లతో కలిసి పనిచేశారు నరేశ్. చాలామంది సెలబ్రిటీలకు ప్రొఫెషనల్, పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా నరేశ్ వ్యవహరిస్తుంటారు.

ADVERTISEMENT

టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే.. వారి ఫస్ట్ ఛాయిస్ నరేశ్ తొగాటినే. నాని, అల్లరి నరేశ్.. తదితర టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లకు బ్రైడల్ మేకప్ ఈయనే చేశారు. సెలబ్రిటీ టాప్ ఛాయిస్ కావడంతో.. హైదరాబాదీ పెళ్లికూతుర్లు సైతం తమ పెళ్లికి నరేశ్ తొగాటితో వెడ్డింగ్ మేకప్ వేయించుకోవాలని కోరుకుంటారు.

చిరునామా: శ్రీ క్రిష్ణా నగర్, యూసఫ్ గూడ, హైదరాబాద్.

ఫోన్ నం: 089770 20202

తనూజ, బబుల్స్ సెలూన్

ADVERTISEMENT

Facebook

హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ సెలూన్లలో బబుల్స్ సెలూన్ కూడా ఒకటి. ఈ సెలూన్ ఎంత ఫేమస్సో.. ఇక్కడ ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తనూజ కూడా మేకప్ ఆర్టిస్ట్‌గా అంతే ఫేమస్. చాలా సహజంగా అనిపించేలా ఆమె మేకప్ వేస్తారు.

చిరునామా: ప్లాట్ నెం 21B, జర్నలిస్ట్ కాలనీ బి, కేబీఆర్ పార్క్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరాబాద్.

ఫోన్ నెం: 9032765577

ADVERTISEMENT

సాయిరాజ్

Facebook

మాస్క్ మేకప్ పేరుతో మేకప్ సంస్థను నిర్వహిస్తున్నారు సాయిరాజ్. ఫ్యాషన్ రంగంలో సాయిరాజ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హెయిర్ స్టైలింగ్, మేకప్‌తో పాటు.. పెళ్లికూతురికి అందంగా చీర కట్టడంలో  ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మనలో సహజంగా కనిపించే అందాన్ని మరింత పెంచేలా సాయిరాజ్ మేకప్ వేస్తారు. మేకప్ వేయడానికి క్వాలిటీ ఉన్న మంచి బ్రాండ్ ఉత్పత్తులను వినియోగిస్తారు సాయిరాజ్.

ఫోన్ నెం. 084999 66661

ADVERTISEMENT

శాండీ

Facebook

టీవీ, సినీ రంగాలకు చెందిన వారికి బాగా పరిచయమున్న మేకప్ ఆర్టిస్ట్ శాండీ. సిటీలో టాప్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్టుల్లో శాండీ కూడా ఒకరు. ఏ సందర్భానికైనా సరే తగినట్లుగా మేకప్ వేయడంలో శాండీ దిట్ట అనే చెప్పుకోవాలి. స్నేహా ఉల్లాల్, నీతా లుల్లా, జుహీ చావ్లా.. వంటి సెలబ్రిటీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా శాండీ పనిచేశారు.

కె. మోహన్ రావు

ADVERTISEMENT

Facebook

మేకప్‌తో పాటు మెహందీ కూడా కావాలనుకొనేవారు మోహన్ రావుని సంప్రదించవచ్చు. బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌గా, ఫ్రీలాన్సర్‌గా పనిచేసే ఆయన హైదారాబాద్‌లో టాప్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు.

చిరునామా: నెం: 8-3-231/B/363, శ్రీకృష్ణాన‌గ‌ర్‌, యూసఫ్ గూడ, హైదరాబాద్.

యాన్నే

లాక్మే సెలూన్లో పని చేసే యాన్నే.. బ్రైడల్ మేకప్ వేయడంలో ఎక్స్పర్ట్. పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ బ్రైడ్ లుక్ కావాలని కోరుకొనేవారు.. హిమాయత్ నగర్లోని లాక్మే సెలూన్‌కి వెళ్లాల్సిందే. చాలా సింపుల్ మేకప్‌తో పెళ్లికూతురుని అందంగా మార్చేస్తుంది.

ADVERTISEMENT

చిరునామా: లాక్మే సెలూన్, షాప్ నెం: జీ 4, ఎ అండ్ ఎమ్ ట్రేడ్ సెంటర్, 3-6-561, హిమాయత్ నగర్, హైదరాబాద్.

డోరిస్

హెయిర్ స్టైలింగ్, బ్రైడల్ మేకప్ విషయంలో డోరిస్‌కు ట్విన్ సిటీస్‌లో మంచి పేరుంది. హైదరాబాద్‌లో బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్‌గా ఆమెకు పేరుంది. కావాలనుకుంటే మీ పెళ్లి జరిగే ప్రదేశానికే వచ్చి ఆమె మేకప్ వేస్తారు. లేదా సికింద్రాబాద్‌లో ఉన్న డోరిస్ సెలూన్‌కి వెళ్లినా సరే.. మిమ్మల్ని అందమైన పెళ్లికూతురిగా మార్చేస్తారు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్‌లతో పోలిస్తే.. చాలా తక్కువ ధరలకే అద్భుతమైన మేకప్ వేస్తారు.

చిరునామా: నెం. 5, వైష్ణవి రెడ్డీ కాంప్లెక్స్, సికింద్రాబాద్

జీలకర్ర-బెల్లం, అరుంధతీ నక్షత్రం.. పెళ్లి తంతు వెనుక ఉన్న అంతరార్థం ఇదే..

ADVERTISEMENT

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

19 Jul 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT