ADVERTISEMENT
home / Budget Trips
ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!

ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!

చాలామంది ట్రెక్కింగ్, హైకింగ్ అనే పదాల మధ్య తేడా తెలియక తికమకపడుతుంటారు. కానీ ట్రెక్కింగ్ అంటే – అడవులు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని వెళ్లాలి. అలా వెళుతూ వివిధ వాకింగ్ పోల్స్ సహాయంతో ఎత్తైన శిఖరాలు, కొండలను ఎక్కాలి. కానీ హైకింగ్ అనేది పూర్తిగా వేరే పద్దతి. హైకింగ్ అంటే నడవడానికి అనువుగా ఉన్న దారులలో ప్రయాణించడం.  పైగా ఎటువంటి ఛాలెంజింగ్ కాకుండా హాయిగా తమ నడకని కొనసాగించడం. 

ఇక ఇప్పుడు మనం ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఈ మధ్యకాలంలో మన దేశ యువత దీనిపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్నారు. కారణం మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కి అనువైన ప్రదేశాలు ఉండడం. అక్కడ కొందరు ఔత్సహికులు నిర్వాహకులుగా కూడా మారి ఆ ట్రెక్కింగ్‌కి ప్రచారాన్ని కలిగిస్తున్నారు. ఈ తరుణంలో మన దేశంలో ట్రెక్కింగ్‌కి అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి.. అక్కడకు ఎలా చేరాలి అనే అంశంపై సమగ్రమైన సమాచారం మీకోసం..

"ఉత్తర భారతదేశం"లో ట్రెక్కింగ్‌కి అనువైన ప్రదేశాలు

ఉత్తర భారతదేశంలోని హిమాలయాల వద్ద ఈ ట్రెక్కింగ్ సంస్కృతి బాగా ఉంది. వాటి వివరాలు మీకోసం

* ఇంద్రాహార్ పాస్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ధౌలాదార్ ప్రాంతంలో మనం ఇంద్రాహార్ పాస్‌ని చూడచ్చు. ఈ ట్రెక్కింగ్ సుమారు 35 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీనిని సందర్శించడానికి కనీసం 9 రోజుల సమయం పడుతుంది.  ఇక ఈ ప్రయాణంలో లహెష్ కేవ్ క్యాంపు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ క్యాంపు సహజంగా ఏర్పడిన కొండల క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంద్రాహార్ పాస్ 4342 మీటర్ల ఎత్తులో ఉండగా.. ఇది కాంగ్ర & చంబల్ జిల్లాలని ఆనుకుని ఉంటుంది.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – సెప్టెంబర్, అక్టోబర్

Indrahar Pass Trek

* సెవెన్ సిస్టర్స్ , మనాలి

మనాలి నుండి ట్రెక్కింగ్ చేయగలిగే మరొక ఆసక్తికర పీక్ ఈ సెవెన్ సిస్టర్స్. ఇక ఇక్కడికి చేరుకోవాలంటే మనం ముందుగా మనాలి నుండి దుండికి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక రోజు సేదతీరాక.. అక్కడి నుండి సోలాంగ్ వ్యాలీ చూస్తూ ముందుకి కదలాలి. దాదాపు 15500 ఫీట్ల ఎత్తున్న ఉన్న ఈ పీక్‌ని ఎక్కడం ట్రెక్కింగ్ పైన కాస్త పట్టుంటే.. చాలా సులువే అని చెబుతారు.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి అక్టోబర్ వరకు

Seven Sisters Peak

* హాంప్తా పాస్ – మనాలి

ఈ హాంప్తా పాస్ ట్రెక్ వేరే ఇతర ట్రెక్స్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రయాణించే విధానం లేదా ఆ ప్రయాణ మార్గం కానీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. కులు వ్యాలీలని సైతం దాటుకుంటూ ముందుకి సాగిపోతుంటుంది ఈ ట్రెక్. అలాగే ఈ ట్రెక్‌కి బేస్ క్యాంపుగా జోబ్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. 14035 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ పాస్ కోసం ఆరు రోజుల ట్రెక్‌ని సిద్ధం చేసుకుంటారు. మనాలిలో వీరు ప్రారంభించిన ఈ ట్రెక్.. మరల మనాలిలోనే ముగుస్తుంది.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి సెప్టెంబర్ వరకు

Hampta Pass

* కువారి పాస్, ఉత్తరాఖండ్

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేద్దామనుకునే ఆలోచన వచ్చిన ఎవరైనా.. తొలుత ఈ కువారి పాస్ ట్రెక్‌ను సందర్శించాల్సిందే. ఈ ట్రెక్ చేయడానికి కనిష్టంగా 8 ఏళ్ళు నిండి ఉంటే చాలు. అదే సమయంలో 12516 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ పీక్‌ని చేరుకునేందుకు ప్రయాణం కూడా చాలా సాఫీగానే సాగుతుందని చెబుతారు. నందా దేవి వద్ద ఈ ట్రెక్‌కి బేస్ క్యాంపు ఉంటుంది.

ADVERTISEMENT

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి సెప్టెంబర్ వరకు

Kuari Pass Trek

* డూన్ వ్యాలీ ట్రెక్, గర్హ్వాల్

ముస్సోరి నుండి ఈ డూన్ వ్యాలీ ట్రెక్‌కి వెళ్ళడానికి వీలుంది. ముస్సోరి నుండి సంకిరి వరకు వెళితే అక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. ఇక అక్కడ ప్రారంభమైన ట్రెక్కింగ్.. బేస్ క్యాంపు వరకూ సాగుతుంది. ఆ తరువాత 3510 మీటర్ల ఎత్తులో ఉన్న డూన్ వ్యాలీకి చేరుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ పూర్తి ప్రయాణానికి 5 నుండి 6 రోజులు పడుతుంది. ఈ ప్రయాణంలో ఎక్కువగా ఆకర్షించేది మాత్రం యాపిల్ తోటలు.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్

Doon Ki Valley

* హర్ కి డూన్

ఈ హర్‌కి డూన్ ట్రెక్, తొలిసారి ట్రెక్కింగ్ చేస్తున్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కారణం ఈ ప్రయాణం వారు తరువాత చేయాలనుకునే ట్రెక్కింగ్స్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హర్ కి డూన్‌ని “వ్యాలీ అఫ్ గాడ్స్” అని కూడా అంటారు. ఈ ట్రెక్కింగ్లో మనకి సంక్రి, సౌద్, తాలూకా వంటి గ్రామాలు ఎదురవుతాయి. అలాగే జలంధర్ గ్లేషియర్ & మొరిండా సరస్సు‌ని కూడా మనం చూడవచ్చు.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్

Har Ki Dun Trek

* నాగ్ టిబ్బా – డెహ్రాడూన్

దాదాపు రెండు రోజుల్లో పూర్తి చేయగలిగిన ట్రెక్ ఈ నాగ్ టిబ్బా. డెహ్రాడూన్ నుండి పంత్వరి వరకు వెళ్ళాక అక్కడి నుండి ట్రెక్ ప్రారంభమవుతుంది. తొలి బేస్ క్యాంపుగా మొదటి రోజు ఖైతాన్‌ని ఎంపిక చేస్తారు. ఆ తెల్లవారి.. అక్కడి నుండి ప్రయాణం చేసి నాగ్ టిబ్బాకి చేరుకోవడం జరుగుతుంది. 9914 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ పీక్‌ని చేరుకోవడానికి రెండు రోజుల సమయం చాలు. ఇక ఈ ట్రెక్‌లో పాల్గొనడానికి కనిష్ట వయసు 8 ఏళ్ళు.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ట్రెక్‌కి వెళ్లొచ్చు.

Nag Tibba Trek

* రూప్ కుంద్ ట్రెక్

ఈ రూప్ కుంద్ ట్రెక్ అంటే చాలా ఫేమస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రెక్‌లోనే పెద్ద మిస్టరీగా చెప్పుకునే రూప్ కుంద్ సరస్సుని మనం చూడొచ్చు. పైగా ఈ సరస్సు ఒడ్డున సుమారు 500 మంది అస్థిపంజరాలు లభించగా.. అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఎవరివి? అనే పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ రూప్ కుంద్ ట్రెక్‌ని కొన్ని కారణాల దృష్ట్యా మూసి వేసింది.

ADVERTISEMENT

Roop Kund Trek

* చాదర్ ట్రెక్ – ఫ్రోజెన్ రివర్ జాన్సకర్

ఈ పేరును బట్టే చెప్పేయచ్చు.. ఇది ఎటువంటి ట్రెక్ అని! జాన్సకర్ నది ఫిబ్రవరి నెలలో గడ్డ కట్టుకుపోయి ఉన్న సమయంలో దాని పై నుండి ట్రెక్కింగ్ చేయడమే ఈ ట్రిప్ ప్రత్యేకత. అయితే గడ్డ కట్టుకుపోయిన నది పైన నడవడమనేది చాలా సాహసంతో పాటు ఎంతో ప్రమాదకరం అని కూడా చెప్పాలి. కారణమేంటి అంటే – నడిచే సమయంలో ఎప్పుడైనా కాళ్ళ క్రింద ఉన్న మంచు బీటలు వారి కరిగిపోయే ఆస్కారం చాలా ఉంది. దీనిని చాలా రిస్క్‌తో కూడిన ట్రెక్‌గా పరిగణిస్తారు. ఈ ట్రెక్‌కి వెళ్ళడానికి లేహ్ ఎయిర్ పోర్ట్‌లో దిగి అక్కడి నుండి ప్రయాణించాల్సి ఉంటుంది.

ట్రెక్కింగ్‌‌‌కి అనువైన నెలలు – ఫిబ్రవరి

ADVERTISEMENT

హైదరాబాద్‌లో ఆడవారి షాపింగ్‌కి కేర్ అఫ్ అడ్రస్ – లాడ్ బజార్

Frozen Zanskar River Trek

దక్షిణ భారతదేశంలోని ట్రెక్కింగ్ ప్రదేశాల సమాచారం (South Indian Trekking Spots)

దక్షిణాది ట్రెక్కింగ్ ప్రాంతాలు & వాటి వివరాలు

ADVERTISEMENT

* నీలిగిరి హిల్స్, తమిళనాడు

ఊటీ కేంద్రంగా ఈ సాగే నీలిగిరి హిల్స్ ట్రెక్కింగ్.. దాదాపు ఆరు రోజుల పాటు సాగుతుంది. ఈ ట్రెక్కింగ్‌లో పార్సన్స్ పీక్, పోర్తిముండ్, ముకుర్తి నేషనల్ పార్క్, పాండియర్ హిల్స్, పైకారా ఫాల్స్ & మదుమలై నేషనల్ పార్క్‌లని చుడుతూ.. ఈ ట్రెక్కింగ్ కొనసాగుతుంది. దాదాపు వాతావరణం కూడా ట్రెక్కింగ్‌కి చాలా అనువుగా ఉంటూ.. ప్రకృతి అందాల నడుమ ప్రయాణం కావడంతో ఎంతోమంది ఔత్సాహికులు ఈ ట్రెక్కింగ్‌లో పాలుపంచుకుంటున్నారు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి డిసెంబర్.

Nilgiri Hills

ADVERTISEMENT

* కూర్గ్, కర్ణాటక

పశ్చిమ కనుమల్లోని ఈ కూర్గ్ ప్రాంతం కూడా పర్యాటకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈమధ్యకాలంలో కూర్గ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. అలా వచ్చేవారిలో ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వచ్చే వారు కూడా ఉంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ 2 నుండి 3 రోజుల పాటు క్యాంప్ చేసి ట్రెక్కింగ్ చేసేందుకు వీలుంది. దాదాపు ప్రతి వ్యక్తి రూ. 5 నుండి 7 వేల  ఖర్చుతో ఈ ట్రెక్కింగ్‌ని పూర్తి చేయొచ్చు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జనవరి, మార్చ్

Coorg Trek

ADVERTISEMENT

* పీర్మీడీ, కేరళ

కేరళలోని పీర్మిడికి పర్యాటకులు కేవలం సాహసోపేతమైన క్రీడలు – ప్యారాగ్లైడింగ్ వంటి వాటి కోసమే కాకుండా ట్రెక్కింగ్ చేయడానికి కూడా వస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు ట్రెక్కింగ్ చేసే సమయంలో పీరు కొండలు, కుట్టికణం, కలతొట్టి వంటి ప్రదేశాలు దాటుకుంటూ వెళతారు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి డిసెంబర్

Peermeede Kerala

ADVERTISEMENT

* అనంతగిరి హిల్స్, ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలకి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ లోకల్‌గా ఉండే గైడ్‌తో పాటుగా ఇక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్లచ్చు. అదే సమయంలో తొలిసారిగా ట్రెక్కింగ్ చేసేవారికి ఇది అనువైన చోటుగా చెబుతారు. ఈ ట్రెక్కింగ్‌లో మనం జలపాతాన్ని వీక్షించవచ్చు. అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన బొర్రా గుహలని కూడా చూడవచ్చు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు

Ananthagiri Hills

ADVERTISEMENT

* కొడచాద్రి, కర్ణాటక

కర్ణాటక రాష్టంలోని షిమోగా జిల్లాలో ఉన్న ఈ కొడచాద్రి ప్రాంతం ట్రెక్కింగ్‌కి చక్కగా సరిపోయే ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి.. అలాగే రాత్రి పూట క్యాంపు వేసుకోవడానికి కూడా ఫారెస్ట్ అధికారుల అనుమతి ఉంది. ఇక దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉన్న ఈ ప్రదేశంలో 7 నుండి 8 గంటల్లో ఈ సందర్శనను పూర్తి చేయవచ్చు.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు.

 

ADVERTISEMENT

Kodachadri Trek

* మున్నార్, కేరళ

ఇక్కడ ట్రెక్కింగ్‌ని నాలుగు స్థాయిల్లో విభజించడం జరిగింది. తొలి స్థాయిని చాలా సులువుగా దాటిన వారు.. ఆ తరువాత చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రకృతి‌తో మమేకమై.. కాస్త కష్టంగా ఉన్నా కూడా ఈ ట్రెక్కింగ్‌ని పూర్తి చేస్తుంటారు.

లక్ష్మి హిల్ ట్రెక్ – ఇది మున్నార్‌లో చాలా ప్రముఖమైన పీక్. ఇక్కడికి చాలా మంది ట్రెక్కింగ్‌కి వస్తుంటారు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు

ADVERTISEMENT

Munnar Trek

* చెంబ్రా పీక్, కేరళ

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో ఉన్న ఈ చెంబ్రా పీక్ అంటే ట్రెక్కింగ్ చేసే ఎంతోమందికి ఒక ప్రత్యేక ఆకర్షణ.  చెంబ్రా పీక్ ప్రాంతంలో ట్రెక్ చేయడానికి తగిన సామాగ్రిని.. అక్కడి టూరిజం శాఖ వారే ఇవ్వడం విశేషం. ఈ పీక్ పైకి చేరుకున్న తరువాత క్రిందకి చూస్తే గుండె ఆకారంలో ఉన్న ఒక సరస్సు మనకి కనిపిస్తుంది.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – వర్షాకాలంలో తప్పించి మిగిలిన సమయాల్లో…

ADVERTISEMENT

Chembra Peak

* నాగలాపురం ట్రెక్ – చిత్తూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూర్ జిల్లా నాగలాపురం జలపాతాలకి ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు మూడు జలపాతాలు.. వాటి పక్కనే సరస్సులు ఉండడంతో వీటిని చూసే పర్యాటకులు పెరిగారు.

దీని ద్వారా ఇక్కడ ట్రెక్కింగ్ సంస్కృతి పెరిగింది. ఏ స్థాయిలో పెరిగిందంటే పక్కనే ఉన్న చెన్నై రాష్ట్రం నుండి వందల సంఖ్యలో.. రోజూ ఇక్కడికి పర్యాటకులు రావడం జరుగుతోంది. దాదాపు 6 కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో చాలామంది ఔత్సాహికులు ఈ జలపాతాలని చూస్తూ ముందుకి కదులుతుంటారు.

ADVERTISEMENT

 

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

Nagalapuram Trek

ADVERTISEMENT

"ఉత్తర-ఈశాన్య" రాష్ట్రాల్లోని.. ట్రెక్కింగ్ ప్రదేశాలు

సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే 7 రాష్ట్రాల్లోని ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశాల గురించిన సమాచారం మీకోసం

* భియుల్ అఫ్ పేమకో – అరుణాచల్ ప్రదేశ్

దాదాపు సముద్ర మట్టం నుండి 14000 అడుగుల ఎత్తున ఉన్న ఈ “భియుల్ అఫ్ పేమకో” గురించి ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టతరం. ఎంతో ఓర్పు, నేర్పు ఉంటే తప్ప ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి సాధ్యపడదు. ఇక ఈ పీక్ పైకి వెళ్ళాక ఇక్కడి నుండి మరొక ఎతైన పీక్ అయిన నమకా బర్వాని కూడా చూడవచ్చు.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఆగష్టు నుండి నవంబర్ వరకు.

ADVERTISEMENT

Beyul Pemako Trek

* నాథులా పాస్ – సిక్కిం

సిక్కింలో ఉన్న ఈ నాథులా పాస్ దగ్గర ట్రెక్కింగ్ చేసే సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ మనకి కావాల్సినంత స్థాయిలో ఆక్సిజన్ లెవల్స్ దొరకవు. అందుకనే మనతో పాటు ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సీలిండర్స్‌ని కూడా తీసుకువెళ్ళడం మంచిది. ఈ పీక్ దాదాపు 14140 అడుగుల పొడువు ఉంది.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి మే వరకు.

 

ADVERTISEMENT

Nathula Pass Trek

* జుకౌ వ్యాలీ – నాగాలాండ్

ఈ జుకౌ వ్యాలీలో ట్రెక్కింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అదే స్థాయిలో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తున్న సమయమంతా కూడా మనకి ఎప్పుడూ చూడని అనేక పూల మొక్కలు, తల తిప్పుకో లేని ప్రకృతి అందాలు & పచ్చటి మైదానాలు మనకి దర్శనమిస్తాయి.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి సెప్టెంబర్ వరకు.

ADVERTISEMENT

Dzukou Valley Trek

* రీక్ మౌంటెన్ – మిజోరం

ఈ రీక్ మౌంటెన్ పైకి ట్రెక్కింగ్‌కి వెళ్ళడం చాలా సులువు. మొదటిసారి ట్రెక్కింగ్‌కి గనుక ఇక్కడికి వెళితే, వారికి ఈ అనుభవం చాలా తేలికగా ఉండటమే కాకుండా.. మరొక ట్రెక్‌కి వెళ్ళాలి అన్నంత ఉత్సాహం వస్తుంది. ఇక ఈ మౌంటెన్ పైకి వెళుతుంటే అక్కడ గడ్డి మనకన్నా ఎత్తుగా పెరిగి వింతగా కనిపిస్తుంది.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు.

ADVERTISEMENT

Reiek Mountain Mizoram

* గోయెక్ లా – సిక్కిం

సిక్కిం రాష్ట్రంలో ఉన్న గోయెక్‌లా చేరుకోవడానికి చేసే ఈ  ట్రెక్ దాదాపు 11 రోజుల పాటు సాగుతుంది. 15100 ఫీట్‌ల ఎత్తున్న ఈ పీక్‌ని చేరుకోవడానికి చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రెక్కింగ్ చేయాలంటే కొన్ని అర్హతలు, ట్రెక్కింగ్‌‌లో అనుభవం కూడా ఉండాలి. వర్షాకాలంలో ఇక్కడ ట్రెక్కింగ్‌కి  సరిపోయే పరిస్థితులు ఉండవు.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి జూన్ వరకు.

ADVERTISEMENT

Goechala Trek

ఇండియాలో ‘తూర్పు’ భాగాన ఉన్న ట్రెక్కింగ్ ప్రదేశాలు

డార్జిలింగ్ కేంద్రంగా ఉన్న ట్రెక్కింగ్ ప్రదేశాల వివరాలు మీకోసం 

* టైగర్ హిల్, డార్జీలింగ్

ఈ టైగర్ హిల్ నుండి సూర్యోదయాన్ని చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు. డార్జిలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు దాదాపు ఈ టైగర్ హిల్ నుండి సూర్యోదయాన్ని చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ టైగర్ హిల్ పాయింట్ డార్జిలింగ్ నుండి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక సూర్యోదయం సమయానికి ఆకాశంలో ఎటువంటి మేఘాలు లేకపోతే కంచెన్ జంగా పీక్‌ని స్పష్టంగా చూడవచ్చు. ట్రెక్కింగ్ చేసేవారు ఈ 14 కిలోమీటర్ల దూరాన్ని తిరుగు ప్రయాణంలో పూర్తి చేస్తారు.

ADVERTISEMENT

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – ఏప్రిల్ నుండి మే వరకు

Tiger Hill

* సింఘాలియా రిడ్జ్ – డార్జీలింగ్

ఈ సింఘాలియా రిడ్జ్ ట్రెక్ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పాలి. కారణం – ఈ ట్రెక్‌లో మనం ఎవరెస్ట్, హోట్స్, కంచన్ జంగా & మకాలు వంటి పర్వతాలని చూసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ ట్రెక్కింగ్ కాస్త జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అలాగే కావాల్సిన అనుమతులని కూడా ముందే పొంది ఉండాలి. ఎందుకంటే మార్గమధ్యంలో మనం నేపాల్ సరిహద్దుల నుండి వెళ్లాల్సి వస్తుంది.

ADVERTISEMENT


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – మార్చ్ నుండి మే వరకు (తొలి సీజన్)

సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు (సెకండ్ సీజన్)

Singalila Ridge Trek

ADVERTISEMENT

* కుర్సియాంగ్

ఈ కుర్సియాంగ్ పట్టణం డార్జీలింగ్‌కి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కుర్సియాంగ్‌కి వెళ్లి ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి.. చుట్టుపక్కల ప్రదేశాలైన దిలారం, అంబూటియా టీ ఎస్టేట్ పార్క్ నుండి వాహనాలు లభిస్తాయి.

దిలారంకి వెళ్లాల్సి వస్తే దాదాపు 5 కిలోమీటర్ల మేర అడవి మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రయాణం చాలా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అంబూటియా టీ ఎస్టేట్ పార్క్‌కి మాత్రం దాదాపు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. ఈ దారిలో ట్రెక్కింగ్‌కి ఇదే ఎక్కువగా సమయం పట్టే ప్రయాణం.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – మార్చ్ నుండి జూన్ వరకు

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు

ADVERTISEMENT

Kurseong Trek

పశ్చిమాన ట్రెక్కింగ్ ప్రదేశాలు

మహారాష్ట్రలో మనకి ట్రెక్కింగ్ చేసేందుకు వీలుగా చాలా ప్రదేశాలు ఉన్నాయి. 

* భీమశంకర్

భీమశంకర్ ట్రెక్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ భీమశంకర్ మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటి. అదే సమయంలో భీమా నది కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఇక ఇక్కడికి చేరుకోవడానికి పూణే నుండి ప్రభుత్వ బస్సుల సౌకర్యం ఉంది. అలాగే ముంబై నుండి కూడా సొంత వాహనాల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

ADVERTISEMENT

ఇక్కడ ట్రెక్కింగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. కొద్దిసేపు రాళ్ల పైన.. మరికొంత సేపు పొలాల మధ్య నుండి.. ఆ తరువాత కర్రలతో నిర్మించిన వంతెనల గుండా ఈ ప్రయాణం సాగుతుంది. కొత్తగా ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ట్రిప్ చాలా మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఈ ట్రెక్‌కి బేస్ క్యాంపు – ఖండాస్‌లో ఉంది

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి సెప్టెంబర్ వరకు

Bhimashankar

ADVERTISEMENT

* ప్రభలఘడ్

ముంబై నగరానికి 70 నుండి 80 కిలోమీటర్ల దూరంలో పన్వేల్, మథెరన్‌ల మధ్యలో ఉన్నదే ప్రభల ఘడ్. చాలామంది ఔత్సాహికులు ట్రెక్కింగ్ చేయడానికి వర్షాకాలంలో ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ ట్రెక్కింగ్ చాలా సులువుగానే ఉన్నప్పటికి, అధిక వర్షపాతం నమోదైనప్పుడు.. మనం వెళ్ళే దారి చాలా సున్నితంగా ఉంటుంది. మనం పట్టు తప్పి కింద పడిపోయే ఆస్కారం కూడా ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి పన్వేల్ నుండి బస్ సౌకర్యం ఉంది.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి నవంబర్ వరకు

Prabhalghad

ADVERTISEMENT

* హరిశ్చంద్ర ఘడ్

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న ఈ హరిశ్చంద్ర ఘడ్ చాలా ప్రత్యేకమైనది. మరి ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఒక ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఇక్కడ పొలాలు, అడవుల మధ్య నుండి ట్రెక్కింగ్ సాగుతుంటుంది. ముందుగా చెప్పినట్టే ఈ ప్రాంతం వర్షాకాలంలో చూడముచ్చటగా ఉంటుంది. అదే సమయంలో ట్రెక్కింగ్‌లో ఎక్కడైనా కాస్త తప్పు చేస్తే.. ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికి వర్షాకాలంలోనే ఎక్కువ మంది ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇక ట్రెక్కింగ్ చేస్తూ పైకి చేరుకున్న తరువాత మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గాలులు చాలా బలంగా వీస్తుంటాయి.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి నవంబర్ వరకు (తగిన జాగ్రత్తలు తీసుకోవాలి).

Harischandragadh

ADVERTISEMENT

* టకమాక్ ఫోర్ట్

తాండూల్ వాడి ఫోర్ట్ అలియాస్ టకమాక్ ఫోర్ట్ మనకి ముంబై నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం అని చెబుతుంటారు. కారణం – ఇక్కడ లోకల్ గైడ్ లేకుండా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, దారి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే ఈ ట్రెక్‌కి బేస్ క్యాంపు అయిన సక్వార్ గ్రామానికి సాయంత్రం అయిదింటికి ముందే చేరుకోవాలి.. లేదంటే చాలా కష్టం అని చెబుతారు.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జులై నుండి నవంబర్ వరకు.

Takmak Fort

ADVERTISEMENT

* కల్సు భాయ్

మహారాష్ట్రలోనే అతి ఎతైన పీక్‌గా దీన్ని పరిగణిస్తారు. దాదాపు 5400 ఫీట్ ఎత్తులో ఉన్న ఈ పీక్‌ని చేరుకోవడానికి దాదాపు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఇది ముంబై నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక చాలామంది ఇక్కడికి వారాంతాల్లో ట్రెక్కింగ్‌కి వస్తుంటారు. శనివారం రాత్రి బయల్దేరి మళ్ళీ తిరిగి ఆదివారం రాత్రి ముంబైకి చేరుకునేలా ఇక్కడ ట్రెక్కింగ్‌ని ప్లాన్ చేసారు. ఈ ట్రెక్కింగ్‌కి బేస్ క్యాంపు – బరి గ్రామం.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి నవంబర్ వరకు.

Kalsubai Trek

ADVERTISEMENT

* రాజ్ ఘడ్

పూణె నగరానికి దగ్గరలోనే ఉండే ఈ రాజ్ ఘడ్‌కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ రాజ్ ఘడ్‌లో శివాజీ మహారాజు తాను ఛత్రపతి అవ్వకముందు ఉండేవాడట. ఆ తరువాత ఆయన ఛత్రపతి అయ్యాక ఈ కోటను విడిచిపెట్టాడట. దీనితో ఈ కోటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక పూణే నగరానికి ఇది దగ్గరగానే ఉండటంతో పర్యాటకులు చాలామంది ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇక ఈ ట్రెక్కింగ్‌కి బేస్ క్యాంపు – గుంజవనే గ్రామం, పాలి గ్రామం.


ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – దాదాపు అన్ని రోజులు ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు.

Rajgad Fort

ADVERTISEMENT

* టోర్నా ఫోర్ట్

వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ఫోర్ట్ ఈ టోర్నా ఫోర్ట్. ఇక్కడికి ట్రెక్కింగ్‌కి వచ్చేవారు మాత్రం ముందుగానే ఈ ప్రయాణం కాస్త ఛాలెంజింగ్‌గా, సాహసోపేతంగా ఉంటుంది అని ఫిక్స్ అయితే బెటర్. ఇక ఈ ఫోర్ట్ ట్రెక్కింగ్‌లో బేస్ క్యాంపుగా వెల్హే గ్రామం ఉంటుంది. చాలామంది మాత్రం పున్నమిరోజు రాత్రి ఇక్కడ క్యాంపు చేసేందుకు ఇష్టపడుతుంటారట! ఇక ఈ బేస్ క్యాంపుకు చేరుకోవడానికి పూణే నుండి రవాణా సౌకర్యం ఉంది.

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – వర్షాకాలం.

Torna Fort

ADVERTISEMENT

* దేవ్ కుంద్ జలపాతం

80 ఫీట్ల ఎత్తు నుండి నీళ్లు జాలువారే అద్భుతమైన సన్నివేశం.. మీరు ఈ దేవ్ కుంద్ జలపాతం వద్ద చూడవచ్చు. కుడలిక నది కూడా ఇక్కడ నుండే ఉద్భవించినట్లు ఇక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. ఈ జలపాతం గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. ట్రెక్కింగ్ పుణ్యమా అని ఈ ప్రదేశానికి చాలా ప్రాచుర్యం లభించింది. దీనితో పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చి వెళుతుంటారు

ట్రెక్కింగ్‌కి అనువైన నెలలు – జూన్ నుండి నవంబర్ వరకు.

Devkund Waterfalls

ADVERTISEMENT

ట్రెక్కింగ్‌కి బయలుదేరేముందు.. ఈ టిప్స్‌ని తప్పనిసరిగా పాటించండి

ఇప్పటి వరకూ ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రాంతాలను గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు ట్రెక్కింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తీసుకెళ్లాల్సిన వస్తువుల తెలుసుకుందాం –

* ట్రెక్కింగ్‌కి ముందే సన్నద్ధం కావాలి

* సరైన పాదరక్షలు ఎంపిక చేసుకోవాలి

* మన శరీరాన్ని ఈ ట్రెక్కింగ్‌కి సమాయత్తం చేయాలి

ADVERTISEMENT

* వాకింగ్ పోల్స్ తీసుకెళ్లాలి

* బ్యాక్ ప్యాక్‌తో నడవడం చేయాలి

* నీటిని ఎక్కువగా తీసుకోవాలి

* ట్రెక్కింగ్ కోసం ఉపయోగించే షూస్

ADVERTISEMENT

* 3 నుండి 5 వరకు సాక్స్ జతలు

* రెయిన్ కోట్

* లైట్ టవల్

* స్కార్ఫ్

ADVERTISEMENT

* విండ్ ప్రూఫ్ జాకెట్

వీటితో పాటే ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్ లైట్, హాట్ వాటర్ మగ్ & మర్చిపోకుండా వాటర్ బాటిల్.

 

హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!

ADVERTISEMENT

ట్రెక్కింగ్‌కి సంబంధించి Q & A

ఇక ట్రెక్కింగ్‌కి సంబంధించి.. ఎక్కువగా అడిగే ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు చదివేద్దాం

మేము ట్రెక్కింగ్ కి వెళ్లే సమయంలో మాతో తీసుకువెళ్ళాల్సిన వస్తువులు ఏంటి?

ట్రెక్కింగ్ చేసే సమయంలో మీతో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు – విండ్ ప్రూఫ్ జాకెట్ , వాటర్ బాటిల్ , ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్ లైట్, హాట్ వాటర్ మగ్ , రెయిన్ కోట్ , లైట్ టవల్ & స్కార్ఫ్.

ట్రెక్కింగ్ సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చా?

ట్రెక్కింగ్ అనేది మీరు వెళ్లే ప్రదేశాన్ని బట్టి.. అలాగే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. మీరు ఎక్కడైతే ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారో.. ఆ ప్రదేశం గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది.

ట్రెక్కింగ్‌కి వెళ్లేముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ట్రెక్కింగ్‌కి బయలుదేరేముందు, మీరు మానసికంగా సిద్ధం కావాలి. దానితో పాటు శారీరకంగా కూడా ఫిట్‌గా ఉంటేనే ట్రెక్కింగ్‌కి ఉపక్రమించాలి. సరైన ట్రెక్కింగ్ షూస్‌ని ఉపయోగించాలి.

ADVERTISEMENT

ట్రెక్కింగ్ చేసే సమయంలో.. ఎటువంటి దుస్తులు ధరించాలి?

ట్రెక్కింగ్‌కి వెళుతున్నప్పుడు టి షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, ట్రౌజర్స్ & థర్మల్ ఇన్నర్ వేర్ ధరిస్తే మీకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ట్రెక్కింగ్ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా?

సాధారణంగా ట్రెక్కింగ్ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. మిమ్మల్ని ట్రెక్కింగ్‌కి తీసుకెళ్ళిన వారికి ఎటువంటి బాధ్యత ఉండదు. మీ భద్రత పట్ల పూర్తి బాధ్యత మీదే.. అని కూడా సదరు ట్రెక్కింగ్ నిర్వాహకులు సైతం ముందుగానే చెబుతారు. అందుకే మీరు ట్రెక్కింగ్‌కి వెళ్లేముందు అన్ని వివరాలు ముందుగానే తెలుసుకుని వెళ్లడం మంచిది.

ట్రెక్కింగ్ చేసే సమయంలో.. ధూమపానం లేదా మద్యపానానికి అనుమతి ఉంటుందా?

అనుమతి లేదు. మీరు గనుక ధూమపానం లేదా మద్యపానం చేస్తే.. నిర్వాహకులు మిమ్మల్ని ట్రెక్కింగ్ చెయ్యనివ్వరు.

 

ADVERTISEMENT

ఇవీ.. మన ఇండియాలో ట్రెక్కింగ్ చేయడానికి వీలున్న ప్రదేశాలు వాటి వివరాలు. పైన చెప్పిన వాటిల్లో ఇంకేదైనా మీకు జతపరచాలి అని అనిపిస్తే క్రింది కామెంట్ సెక్షన్‌లో తెలపండి.

 

 

27 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT