Advertisement

Bigg Boss

బాబా భాస్కర్ సూపర్ స్టార్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్.. మరి, శ్రీముఖి ఏంటి ?

Sandeep ThatlaSandeep Thatla  |  Oct 30, 2019
బాబా భాస్కర్ సూపర్ స్టార్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్.. మరి, శ్రీముఖి ఏంటి ?

Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇంకొక మూడు రోజుల్లో పూర్తికాబోతోంది. ఆఖరి వారం కావడంతో ఇంటిలో మిగిలి ఉన్న అయిదుగురు సభ్యులకి వారి బిగ్ 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణాన్ని వీడియో రూపంలో చూపెట్టడం జరుగుతోంది. దీనికి సంబంధించి నిన్నటి ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ & బాబా భాస్కర్ (baba bhaskar) లకి సంబందించిన వీడియోస్ చూపించడం జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్

అందులో బాబా భాస్కర్ కి సంబంధించిన వీడియో మాత్రం వీక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆయన వీడియో లో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయనిపించింది. అదే సమయంలో బాబా భాస్కర్ ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక చిన్న పిల్లాడిలా నవ్వడం, ఏడవడం ఇలా అనేక రకాలైన ఎమోషన్స్ ఆయనలో కనిపించాయి.

మరి ముఖ్యంగా బిగ్ బాస్ (bigg boss) ని గురువు గారు అని సంబోధించడం తనకెంతగానో నచ్చింది అంటూ బిగ్ బాస్ కామెంట్ చేయడంతో బాబా భాస్కర్ థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఇక అదే సమయంలో ఇంటిలో వారు మిమ్మల్ని ఎంతగా విమర్శించినా సరే, మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి ప్రతి విమర్శ చేయకుండా ఉండిపోయారు అని అభినందించారు బిగ్ బాస్. అలాగే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరిని ప్రేమించినప్పటికి వారిలో కొందరే తిరిగి మీకు ప్రేమ పంచడం జరిగింది, అయినప్పటికి మీరు వారి పట్ల వ్యతిరేకత చూపెట్టకపోవడం మిమ్మల్ని అందరికి చేరువ చేసింది.

అలాగే మీరు వంట చేసి అటు ఇంటిసభ్యులని ఇటు ప్రేక్షకులని ప్రేమని పొందారు. ఇక మీ హాస్య చతురతతో హౌజ్ లోపల మాత్రమే కాకుండా బయట ఉన్న వారిని ఎంతగానో అలరించారు అని చెప్పారు.   ఆయనకి సంబంధించి వేసిన వీడియో లో ‘సూపర్ స్టార్ అఫ్ ది హౌస్’ (superstar), ‘ఎంటర్టైనర్’, ‘రియల్ మ్యాన్’ అంటూ పేర్కొనడం జరిగింది.

ఇదంతా చూసి ఆయన తన కన్నీళ్లని ఆపుకోలేకపోయారు. అందరూ అనుకున్నట్టుగా తాను ఎవరు ఏమన్నా సరే పట్టించుకోను అనుకుంటుంటారు.. కాని తన మనసు చాలా సున్నితమైనది అని.. అయితే అందరూ తనని అపార్ధం చేసుకుని ఒక స్ట్రాటజీ తో ఇలా ఉంటున్నాను అని అనడం బాధకి గురిచేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈయన చెప్పినదానికి సమాధానంగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ లో మాట్లాడాల్సి ఉంది.

ఫ్యాన్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం అందుకున్న వరుణ్ సందేశ్

అలాగే ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో శ్రీముఖి & అలీ రెజా లకి సంబంధించిన వీడియోలను చూపించబోతున్నారు. మరి వారి ప్రతిస్పందన ఎలా ఉండబోతుందో అన్నది వేచి చూడాలి.

ఇదిలావుండగా వరుణ్ సందేశ్ వీడియో చూపిస్తూ, బిగ్ బాస్ చెప్పిన మాటలని.. విధించిన నియమాలని ఎక్కువశాతం పాటించిన వ్యక్తి అంటూ వరుణ్ పొగిడారు బిగ్ బాస్. అలాగే వరుణ్ సందేశ్ ఆటతీరు పై బయట ప్రజల్లో మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ కూల్ అంటూ రకరకాల ట్యాగ్ లైన్స్ ఇవ్వడం జరిగిందని తెలుపుతూ.. తన భార్య ని కూడా ఒక కంటెస్టెంట్ గానే చూడడం.. అయితే తన భార్య పైన ఎవరైనా కామెంట్ చేస్తే వారికి సమాధానం చెప్పడం వంటి వాటితో చాలా మంది మనసులు గెల్చుకున్నాడు అని తెలియచేశారు. ఇక ఈయన వెండితెర పైనే కాదు బుల్లితెర లోనూ మంచి హీరో అనిపించుకున్నాడు అని వీడియో ముగించారు.

వరుణ్ సందేశ్ తరువాత రాహుల్ సిప్లిగంజ్ గురించిన వీడియో ప్రసారం చేశారు. రాహుల్ వీడియో లో బిగ్ బాస్ ఇంటిలో అలవాటు పడడానికి ఆయన పడిన కష్టం, వరుణ్ సందేశ్ తో స్నేహం, పునర్నవి తో ఒక చక్కటి అనుబంధం & శ్రీముఖితో వాగ్వాదం వంటివి చూపెట్టడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ (bigg boss house) లోకి తనని కలవడానికి వచ్చి తన తల్లి సుధారాణి చెప్పిన మాటలతో ఆయనలో వచ్చిన మార్పుని స్పష్టంగా చూపెట్టడం జరిగింది. తన ఆటతీరు మార్చుకుని ఫైనల్ కి రావడం & అదే సమయంలో ఇప్పుడు టైటిల్ రేసులో కూడా ఉండడం చాలా మంచి పరిణామాలు అని చెప్పడం జరిగింది.

ఆఖరుగా 100 రోజుల తమ ప్రయాణాన్ని చూశాక అటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు ఇటు షో చూస్తున్న ప్రేక్షకులు కూడా భావోద్వేగాలకు లోనవ్వడం జరుగుతున్నది.

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?