ADVERTISEMENT
home / వెెడ్డింగ్
వెడ్డింగ్ లెహెంగాను.. ఇలా కూడా ధరించవచ్చని మీకు తెలుసా??

వెడ్డింగ్ లెహెంగాను.. ఇలా కూడా ధరించవచ్చని మీకు తెలుసా??

పెళ్లి (Wedding).. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన ఘట్టం ఇది. ఇలాంటి స్పెషల్ అకేషన్‌లో అందరిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోవాలని.. భారీగా డిజైన్ చేసిన లెహెంగా (Lehenga), దుపట్టాలు.. వంటివి కొనుగోలు చేయడం సహజమే. మరి, పెళ్లి తర్వాత వాటిని తిరిగి ఎప్పుడైనా ధరించడానికి వీలవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే చాలామంది కాస్త తక్కువ ధరలోనే హెవీగా డిజైన్ చేసిన దుస్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కానీ మనకి ఉన్న క్రియేటివిటీకి కొంచెం పదును పెడితే చాలు.. హెవీగా ఉండే లెహెంగా, దుపట్టాలను సైతం పలు సందర్భాలకు అనుగుణంగా భిన్నంగా ధరించవచ్చు. అదెలాగంటే..

ప్లెయిన్ షర్ట్ జతగా..

మీ వద్ద ఉన్న లెహెంగాకు మ్యాచ్ అయ్యే విధంగా ఉన్న.. ప్లెయిన్ షర్ట్ ఒకటి ఎంపిక చేసుకుని ఆ రెండింటినీ జతగా ధరించి చూడండి. పైగా ఇది ప్రస్తుతం బాగా ఆదరణ పొందుతోన్న ట్రెండ్స్‌లో ఒకటి కూడా. మీ ప్రాణ స్నేహితురాలి సంగీత్ లేదా మీ బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఇది చక్కని ఎంపిక. పైగా దీనికి ఒక బెల్ట్  కూడా జత చేస్తే ఆ లుక్ అదిరిపోవాల్సిందే..

టర్టిల్ నెక్ లేదా స్లిప్ టాప్ జతగా..

పెళ్లిలో ధరించిన హెవీ లెహెంగాకు టర్టిల్ నెక్ లేదా బ్లాక్ కలర్ స్లిప్ టాప్‌ని జత చేసి చూడండి. పైగా ఈ అవుట్ ఫిట్‌కి దుపట్టా ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. లెహెంగా, దానికి జతగా మీరు ఉపయోగించే టాప్‌కి మ్యాచింగ్ చక్కగా కుదిరితే ..చూడడానికి ఇదొక లాంగ్ మ్యాక్సీ డ్రస్‌లా కనిపిస్తుంది.

ADVERTISEMENT

లాంగ్ కుర్తాతో..

ఈ రోజుల్లో బాగా ఆదరణ పొందుతోన్న ట్రెండ్స్‌లో లాంగ్ కుర్తా కూడా ఒకటి. దీనికి అనుగుణంగానే మీ లెహెంగాను కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే లెహెంగాకు మ్యాచయ్యే విధంగా ఉన్న కుర్తాని ఎంపిక చేసుకోవడం లేదా లెహెంగానే కుర్తా లేదా స్కర్ట్‌గా మార్చుకోవడం ద్వారా.. దీనిని మరింత సునాయాసంగా ధరించవచ్చు. చూడడానికి ఇది ఫ్యూజన్ ఫ్యాషన్‌లా కనిపిస్తుంది. అయితే లెహెంగాకు జతగా కుర్తాని ఎంపిక చేసుకొనేటప్పుడు లేదా లెహెంగాను కుర్తాగా మార్చిన తర్వాత.. దానికి మ్యాచయ్యే స్కర్ట్‌ని ఎంపిక చేసుకొనేటప్పుడు అది కాంట్రాస్ట్ కలర్ ఉండేలా జాగ్రత్తపడితే చాలు..

అనార్కలీగా రీస్టైల్ చేయండి..

హెవీగా ఉండే లెహెంగాకు జతగా కోర్సెట్ టాప్, బంద్ జాకెట్.. కొనుగోలు చేస్తే చాలు.. వీటిని ధరించడం ద్వారా సింపుల్‌గా ఉండే అనార్కలీ లుక్‌ని మన సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో భారీగా డిజైన్ చేసిన అనార్కలీ డ్రస్‌లకు సైతం చక్కని డిమాండ్ ఉన్న విషయం మనకు విదితమే. పైగా వాటితో పోలిస్తే.. మనకు మనం స్వయంగా డిజైన్ చేసుకునే ఈ లెహెంగా అనార్కలీ క్యారీ చేయడానికి కూడా చాలా వీలుగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

దుపట్టా వదిలేయండి..

చూడచక్కని లెహెంగాకు లాంగ్ స్లీవ్డ్ జాకెట్ జత చేసి చూడండి. చూడడానికి ఇది మొఘల్ తరహా వస్త్రధారణలా కనిపిస్తుంది. అయితే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో ధరించేటప్పుడు.. హెవీ వర్క్ ఉన్న లెహెంగాకు ప్లెయిన్ జాకెట్, ప్లెయిన్ లెహెంగాకు హెవీ లుక్ ఉన్న జాకెట్ జత చేయాల్సి ఉంటుంది. అప్పుడే లుక్ చాలా బాగుంటుంది.

ADVERTISEMENT

Instagram

ఛోళీని కూడా..

ఏంటీ?? పెళ్లి దుస్తుల్లో కేవలం లెహెంగాను మాత్రమే తిరిగి ధరించే వీలు ఉందా?? ఎంతో కష్టపడి ఇష్టంతో డిజైన్ చేయించుకున్న ఛోళీ సంగతి ఏంటి?? అని ఆలోచిస్తున్నారా?? అక్కడికే వస్తున్నామండీ.. లెహెంగానే కాదు.. ఛోళీని సైతం కొన్ని సందర్భాల్లో ధరించే వీలు ఉంటుంది. హెవీ వర్క్ ఉన్న ఛోళీ అయితే ప్లెయిన్ శారీకి జతగా ధరించండి. అలాగే ప్లెయిన్ ఛోళీ అయితే హెవీ డిజైన్ ఉన్న చీరకు మ్యాచ్ చేసి ధరించండి. ఇవే కాదు.. ఫ్లేర్డ్ స్కర్ట్, పలాజో లేదా గాగ్రా.. వంటి వాటికి కూడా చోళీని జతగా ధరించవచ్చు.

ADVERTISEMENT

ప్లెయిన్ దుస్తులకు జతగా..

పెళ్లి దుస్తుల్లో భాగంగా తీసుకునే దుపట్టా కూడా కొందరు హెవీగా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. అయితే దానిని కేవలం లెహెంగాతోనే ధరించాలని ఎవరు చెప్పారు?? ఇలాంటి దుపట్టాను ప్లెయిన్ సల్వార్ సూట్స్ లేదా కుర్తీలకు జతగా ధరిస్తే వాటి లుక్‌ని పెంచడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది.

హాఫ్ శారీగా..

మనం కాస్త మనసు పెట్టాలే కానీ.. పెళ్లి లెహెంగాకు జతగా తీసుకునే దుపట్టాను సైతం రకరకాలుగా ధరించవచ్చు. ఉదాహరణకు దుపట్టాకు మ్యాచయ్యే కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి జత చేస్తే.. దుపట్టాను హాఫ్ శారీగా ధరించవచ్చు. అలాగే దుపట్టాకు జతగా చీర తీసుకొని పైట కొంగు లేదా కుచ్చిళ్ల భాగంలో దుపట్టా వచ్చేలా కుట్టించుకున్నా బాగుంటుంది.

క్రాప్ టాప్‌గా..

లెహెంగాను ముక్కలుగా కత్తిరించి ఉపయోగించాలంటే మన మనసు అందుకు ఒప్పుకోదు. కానీ టైలర్ లేదా డిజైనర్ సహాయంతో లెహెంగాకు చిన్న చిన్న మార్పులు- చేర్పులు చేసి క్రాప్ టాప్‌గా మార్చడం లేదా ప్యాంట్‌గా కుట్టించుకోవడం.. వంటివి చేయచ్చు. ఇవి చూడడానికి క్యాజువల్‌గా ఉండడంతో పాటు ధరించడానికి సౌకర్యవంతంగానూ ఉంటాయి.

ADVERTISEMENT

చిన్న చిన్న మార్పులు..

మీ లెహెంగాను టైలర్ లేదా డిజైనర్‌కు ఇచ్చి.. దానికి ఉన్న భారీ వర్క్‌ను తగ్గించడంలో భాగంగా.. కుచ్చిళ్లు, లోపల ఉన్న లేయర్స్, దానికి జత చేసిన కలీస్.. వంటివన్నీ తొలగించమని చెప్పండి. ఇప్పుడు దానికి లైట్ వర్క్ ఉన్న ఛోళీ, దుపట్టాలను జత చేస్తే దానిని ఎప్పుడైనా, ఎక్కడైనా సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఏమంటారు??

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ ట్రెండ్స్: టాప్ 10 బ్రైడల్ మేకప్ ఆర్టిస్టుల వివరాలు మీకోసం

పెళ్లి సమయంలో ధరించే దుస్తులు, నగలు ఎలా ఉండాలంటే..? (నవ వధువుల చిట్కాలు)

ADVERTISEMENT

పెళ్లి కూతురుని మరింత.. అందంగా మార్చే పెళ్లి పట్టుచీరలు..!

07 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT