ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మీ ఫ్రెండ్స్‌తో గర్ల్స్ టూర్‌‌కి ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలే సరైన ఎంపిక..!

మీ ఫ్రెండ్స్‌తో గర్ల్స్ టూర్‌‌కి ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలే సరైన ఎంపిక..!

ప్రతి అమ్మాయి.. పెళ్లి కాక ముందు తన స్నేహితులతో కలిసి గర్ల్స్ టూర్‌కి (girls tour)  వెళ్లాలని భావిస్తుంది. అయితే ఇది ప్రతి అమ్మాయికి కుదిరే పని కాదు. వెకేషన్ అనగానే కొంతమంది విదేశాలకూ వెళ్లాలని భావిస్తుంటారు. అలాగే.. మన దేశంలో తొలుత ఎక్కడికైనా వెళ్లాలంటే.. ముందు గోవానే గుర్తొస్తుంది.

అలాగే పెళ్లి కుదిరిన తర్వాత.. అలాగే పెళ్లి అయ్యే లోపు మిగిలేది చాలా తక్కువ సమయం. ఈ సమయాన్ని మీకోసం మీరు గడపడం ముఖ్యం.  ఈ క్రమంలో మరీ ఎక్కువ ఖర్చులో కాకుండా.. మీ బడ్జెట్‌లో మీరూ.. మీ స్నేహితురాళ్లు (friends) మన దేశంలో సందర్శించదగ్గ కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

1. అంబోలీ

మహారాష్ట్రలో ఉన్న హిల్ స్టేషన్ అంబోలీ. ఇక్కడి జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ మీరు, మీ స్నేహితులు ఎంతో ఆనందంగా గడిపే వీలుంటుంది.

ADVERTISEMENT

చూడాల్సిన ప్రదేశాలు: ఇక్కడికి వెళ్లి చక్కటి పచ్చదనంలో సమయాన్ని గడపచ్చు. అలాగే షిర్గోంకర్ వ్యూ పాయింట్, అంబోలీ ఫాల్స్ వంటివి తప్పక చూడాలి. వానాకాలంలో అయితే ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా చూడాల్సిందే. ఇక్కడి లోకల్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ దగ్గర్లోని మాధవ్ ఘర్ కోటను చూసి రావచ్చు.

2. రిషికేశ్

దిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా రిషికేశ్‌కి సులభంగా చేరుకోవచ్చు. అడ్వెంచర్ ప్రేమికులకు ఇది చక్కటి ఎంపిక. ఇక్కడికి వెళ్తే మీ ఉత్సాహం ఉరకలేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చూడాల్సిన ప్రదేశాలు: గంగా హారతి చూడాలనుకునేవారు.. ఇక్కడి త్రివేణి ఘాట్‌ను సందర్శించవచ్చు. అలాగే రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, కయాకింగ్ వంటివి చేయడంతో పాటు.. యోగా ప్రేమికులకు ఇక్కడి ఆనంద్ ప్రకాశ్ ఆశ్రమం అనేది చక్కటి ప్రదేశం. అలాగే  లక్ష్మణ్ ఝూలాతో పాటు దాని దగ్గరున్న.. లిటిల్ బుద్ధ అనే ట్రీ హౌజ్ కూడా ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT

3. పోర్ట్ బ్లెయిర్

అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ నుంచి నాలుగు గంటల పాటు ఫెర్రీలో ప్రయాణిస్తే చాలు.. అద్భుతమైన స్వర్గం లాంటి హావ్లాక్ ద్వీపాన్ని చేరుకుంటారు. అందమైన నీలి రంగు సముద్రం, వజ్రాల్లా మెరిసిపోయే ఇసుక వంటివన్నీ మీ మనసుని ఆకట్టుకుంటాయి

చూడాల్సిన ప్రదేశాలు: ఇక్కడి బీచ్‌లో సరదాగా గడపడంతో పాటు.. ఇసుకలో కూడా హాయిగా నడుస్తూ ఎంజాయ్ చేయచ్చు. అలాగే నీటి అడుగు భాగంలో చేసే స్కూబా డైవింగ్, లాగూన్లు వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణలు. అలాగే కాలాపత్తర్ వంటి ప్రశాంతమైన బీచ్‌లలో ఆనందంగా, ప్రశాంతంగా సమయం గడపవచ్చు. అలాగే ఇక్కడి సీ ఫుడ్ తింటూ ఆనందంగా సమయాన్ని గడపవచ్చు.

4. ఉదయ్ పూర్

ADVERTISEMENT

మీరు, మీ స్నేహితురాళ్లు చరిత్ర అంతే ఇష్టపడతారా? మీకు రాజులు, రాణుల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టమా? కోటలు, ప్యాలెస్‌లు చూసి కళ్లార్పకుండా ఉండిపోతారా? అయితే మీరు ఉదయ్ పూర్ వెళ్లాల్సిందే. రాజస్థాన్‌లో ఉన్న ఈ ప్రాంతానికి ఒక్కసారి వెళ్తే చాలు.. తిరిగి వెనక్కి రావడానికి మనసు ఒప్పుకోదు.

చూడాల్సిన ప్రదేశాలు: జగ్ మందిర్ ప్యాలెస్, పిచోలా లేక్, సిటీ ప్యాలెస్ వంటివి చూస్తే.. అప్పటి రాజరికపు మర్యాదల గురించి బాగా తెలుస్తుంది. అంతేకాదు.. ఇక్కడి నోరూరించే వంటకాలను రుచి చూడాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఒంటె పై ప్రయాణం.. వింటేజ్ కార్ రైడ్ వంటివన్నీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తాయి.

5. లఢాఖ్

లఢాఖ్ అందాల గురించి ఇప్పటివరకూ వినని వారు ఎవరూ ఉండరేమో. చుట్టూ అందమైన కొండలు, కొండల మధ్య అందమైన రోడ్లు, చక్కటి చెరువులు.. పచ్చదనం ఒక్కటేంటి? అన్నీ ఆకట్టుకునేవే

ADVERTISEMENT

చూడాల్సిన ప్రదేశాలు: థిక్సే గొంపా అనేది లఢాఖ్‌లోని అతి పెద్ద బౌద్ధారామం. ఇక్కడి ఖార్దుంగ్లా పాస్ ప్రపంచంలోనే మోటార్ బైక్ ద్వారా చేరుకోగలిగే అత్యంత ఎత్తైన ప్రదేశం. లెహ్ ప్యాలెస్ అనేది పదిహేడో శతాబ్దంలో నిర్మించిన తొమ్మిది అంతస్థుల కట్టడం. ఇది రాజభవనంగా విలసిల్లింది. దీని  వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది.

6. అలెప్పీ

మీ స్నేహితురాళ్లు మీరు కలిసి బోట్ హౌజ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా.. అలెప్పీలో ఇవన్నీ చేసే వీలుంటుంది. కేరళలోని ఈ ప్రాంతంలో కనిపించే సరస్సులు, నీటి ప్రవాహాలు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

చూడాల్సిన ప్రదేశాలు: ఇక్కడి ఏనుగుల క్యాంప్‌లో వాటిని దగ్గర నుండి చూసే వీలుంటుంది. అలాగే వాటితో ఎక్కువ సమయం గడపచ్చు. ఇక్కడి ఆయుర్వేద చికిత్స తీసుకోవడానికివిధ ప్రాంతాల నుంచి  చాలా మంది వస్తుంటారు. అలాగే సందర్శకులు అలెప్పీ బీచ్‌కి కూడా తప్పనిసరిగా వెళ్లాల్సిందే.

ADVERTISEMENT

7. సిక్కిం

సిక్కిం అద్భుతాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఒకసారి అక్కడికి వెళ్తే చాలు.. తిరిగి రావాలనిపించదు. అవును.. మరికొన్ని రోజుల్లో మీ పెళ్లి కాబోతున్న విషయం కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడి అందాలు అలా ఉంటాయి మరి..

చూడాల్సిన ప్రదేశాలు: నాథులా పాస్, యంథాంగ్ వ్యాలీ, సోంగో, రంటెక్ బౌద్ధారామం.. ఏవీ మిస్సవకుండా చూడాల్సిందే. అడ్వెంచర్లంటే ఇష్టపడే వారు ఇక్కడ రోప్ వే, పారా గ్లైడింగ్ వంటివి చేయవచ్చు. ఇక ఇక్కడి కేఫ్ లైవ్ అండ్ లౌడ్‌లో లైవ్ మ్యూజిక్ వినచ్చు.

8. పాండిచ్చెరి

ADVERTISEMENT

ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, అందమైన బీచ్‌లు.. అద్భుతమైన మనుషులు ఇవన్నీ చూడాలంటే పాండిచ్చేరి వెళ్లాల్సిందే. ఇక్కడికి వెళ్తే అసలు మనం మన దేశంలోనే ఉన్నామా? అని అనిపిస్తుంటుంది. అందుకే మీ స్నేహితురాళ్లు అందరూ కలిసి ఇక్కడికి వెళ్లడానికి ప్రయత్నించండి.

చూడాల్సిన ప్రదేశాలు: ప్రొమెనేడ్ బీచ్, ఆరోవిల్లే బీచ్ చాలా అందంగా ఉంటాయి. వీటితో పాటు చాలా బీచ్‌లు ఉంటాయి. వాటన్నింటినీ చూడొచ్చు. ఇక్కడి చర్చిలు, పాత లైట్ హౌజ్ చూడచ్చు. స్కూబా డైవింగ్ చేయవచ్చు. అలాగే ఇక్కడి రోడ్డు పక్కన బజార్లలో షాపింగ్ చేస్తూ నచ్చిన ఆహారం తినచ్చు.

9. రాంథంబోర్

వైల్డ్ లైఫ్ సఫారీ అంతే ఎవరికి నచ్చదు చెప్పండి? మీకు కూడా జంతువులు లేదా వివిధ రకాల మొక్కలు చూడడం ఇష్టం అయితే అక్కడికి వెళ్లవచ్చు.

ADVERTISEMENT

చూడాల్సిన ప్రదేశాలు: రాంథంబోర్ నేషనల్ పార్క్ మొత్తాన్ని ఓపెన్ టాప్ జీప్‌లో చుట్టి రావడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఒకవేళ మీరు లక్కీ అయితే.. మిగిలిన జంతువులన్నింటితో పాటు పులులను కూడా చూడవచ్చు. అలాగే రాంథంబోర్ కోటను కూడా చూడవచ్చు. జంతువులతో పాటు అందమైన పక్షులు కూడా అక్కడ ఉంటాయట.

10. లావాసా

ముంబై నుంచి కొన్ని గంటల ప్రయాణంలోనే లావాసా చేరుకోవచ్చు. ఇక్కడ సంవత్సరం మొత్తం వాతావరణం బాగుంటుంది. ఇక్కడ మీరు చేయదగిన పనులు కూడా చాలా ఉంటాయి.

చూడాల్సిన ప్రదేశాలు: ముఖ్యంగా మినీ పడవ ప్రయాణం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాగే చక్కటి స్పాలు, భోజనం అందించే హోటళ్లు చాలా ఉంటాయి. నగరంలో ఉండే సౌకర్యాలతో పాటు హిల్ స్టేషన్ అనుభవం కూడా మీకు దక్కుతుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

12 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT