ADVERTISEMENT
home / Accessories
బ్యాగ్ ట్రెండ్స్: ఈ సరికొత్త హ్యాండ్ బ్యాగులతో.. ట్రెండీగా మెరిసిపోండి..!

బ్యాగ్ ట్రెండ్స్: ఈ సరికొత్త హ్యాండ్ బ్యాగులతో.. ట్రెండీగా మెరిసిపోండి..!

ఈ వేసవిలో హాట్ ఫ్యాషన్స్ ఫాలో అవుతూ కూల్‌గా దర్శనమిస్తున్నారు మగువలు. ట్రెండీగా కనిపించే దుస్తులు, యాక్సెసరీస్ అందించిన సమ్మర్ లుక్‌తో అదరగొడుతున్నారు. సాధారణంగా సమ్మర్ ట్రెండ్స్ అంటే కాటన్ దుస్తులు, గాగుల్స్, క్యాప్ ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం అంతకు మించి అంటున్నారు.

హ్యాండ్ బ్యాగ్ (Handbags) లేనిదే సమ్మర్ లుక్ పూర్తి కాదని చెబుతున్నారు. దానికి తగినట్టుగానే వివిధ రకాల హ్యాండ్ బ్యాగులు మార్కెట్లో ధర్శనమిస్తున్నాయి. స్లింగ్ బ్యాగ్ దగ్గర నుంచి ఓవర్ సైజ్డ్ బ్యాగ్ వరకు ఎన్నో రకాలు సమ్మర్‌కి తగినట్టుగా ఉన్నాయి. ఈ బ్యాగ్ ట్రెండ్స్‌ను మీరు కూడా ఫాలో అయి ట్రెండీగా మెరిసిపోండి.

1. సర్క్యులర్ స్ట్రా బ్యాగ్ (Circular Straw Bag)

1-bag-trends-in-summer

ADVERTISEMENT

ఈ బ్యాగ్ మీరెప్పుడైనా చూశారా? బహుశా ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోనో చూసి ఉంటారు. అరె ఈ బ్యాగ్ భలే వెరైటీగా ఉందే.. అనుకొని ఉంటారు కదా.. దీన్ని ట్రెండీ హ్యాండ్ బ్యాగ్‌గా అభివర్ణిస్తున్నారు ఫ్యాషన్ నిపుణులు. వెదురుతో తయారైన ఈ బ్యాగ్ ఇన్ స్టాగ్రామ్ వరకే పరిమితమనుకొంటే పొరపాటే. ఈ సర్క్యులర్ స్ట్రా బ్యాగ్ సమ్మర్ వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు ధరించడానికి బాగుంటుంది

Image: Instagram

2. ట్రాన్సపరెంట్ బ్యాగ్ (Transparent Bag)

2-bag-trends-in-summer

ADVERTISEMENT

ఈ బ్యాగ్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల నుంచి ఓ వైపు చర్చ జరుగుతున్నప్పటికీ.. దీన్ని ఉపయోగించేవారు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. అందుకే కొన్ని బ్రాండ్లు ఈ తరహా బ్యాగులను మాత్రం తయారుచేసి వినియోగదారులకు అందిస్తూనే ఉన్నాయి. ఈ బ్యాగ్ చాలా ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. ఈ బ్యాగ్ తీసుకొనేటప్పుడు పర్యావరణం గురించి కాస్త ఆలోచించి కొనాలా? వద్దా? అనే నిర్ణయం మాత్రం మీరు తీసుకోవాల్సిందే.

Image: Instagram

3. నియాన్ బ్యాగ్ (Neon Bag)

3-bag-trends-in-summer

ADVERTISEMENT

ఎప్పుడూ ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా కనిపించే అమ్మాయిలంతా నియాన్ బ్యాగ్ ఉపయోగించడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రకాశవంతంగా కనిపించే రంగుల్లో ఉండే ఈ బ్యాగులు.. మీకు సరికొత్త లుక్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యాగ్ ధరించేటప్పుడు మీరు పాటించాల్సిన ఫ్యాషన్ రూల్ ఏంటంటే.. పూర్తిగా వైట్ లేదా బ్లాక్ డ్రస్ వేసుకొన్నప్పుడు ధరిస్తే చాలా బాగుంటుంది.

Image: Instagram

4. స్ట్రక్చర్డ్ వికర్ బ్యాగ్ (Structured Wicker Bag)

4-bag-trends-in-summer

ADVERTISEMENT

ఇది కూడా స్ట్రా బ్యాగ్ మాదిరిగానే వెదురుతో తయారైంది. ఇది ఫ్యాషనబుల్‌గా కనిపించడం మాత్రమే కాదు.. చాలా గట్టిగా కూడా ఉంటుంది. కాబట్టి కాస్త బరువైనవి కూడా దీనిలో పెట్టుకొని తీసుకెళ్లవచ్చు.

Image: Instagram

5. ఎంబ్రాయిడర్డ్ బ్యాగ్ (Embroidered Bag)

5-bag-trends-in-summer

ADVERTISEMENT

ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులంటే అమ్మాయిలకు బాగా ఇష్టం. అందుకే బ్యాగులపై సైతం ఎంబ్రాయిడరీ చేసేస్తున్నారు. అయితే మరీ ఎక్కువగా ఉన్న ఎంబ్రాయిడరీవి కాకుండా.. చాలా సింపుల్ వర్క్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఎంపిక చేసుకొంటే బాగుంటుంది.

Image: Instagram

6. బకెట్ బ్యాగ్ (Bucket Bag)

6-bag-trends-in-summer
ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన బ్యాగ్ ట్రెండ్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ బ్యాగ్ సైజ్ చాలా పెద్దదే అయినప్పటికీ ..దాని ఆకారం కారణంగా అది అమ్మాయిలకు హాట్ ఫేవరెట్ బ్యాగ్‌గా మారిపోయింది.

ADVERTISEMENT

Image: Instagram

7. ఓవర్ సైజ్డ్ బ్యాగ్(Oversized Bag)

7-bag-trends-in-summer

కొన్ని సందర్భాల్ల ో మన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉన్నప్పటికీ దాంట్లో మనకు కావాల్సినవన్నీ సర్దుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వెంట మరో బ్యాగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే ఈ ఓవర్ సైజ్డ్ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర ఉంటే ఆ సమస్యే ఉండదు. పైగా ఈ బ్యాగ్స్ ఉఫయోగించడం హాట్ ట్రెండ్ కూడా.

ADVERTISEMENT

Image: Instagram

8. స్కార్ఫ్ డిటైల్డ్ బ్యాగ్(The Scarf Detailed Bag)

8-bag-trends-in-summer

కొత్త బ్యాగ్ కొనే ఆసక్తి లేదా? మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను మీరే అప్డేట్ చేసుకోవాలనుకొంటున్నారా? దానికి స్కార్ఫ్‌ను జోడించండి. స్కార్ఫ్‌ను అందంగా ముడివేసి దాన్ని బ్యాగ్‌కు అతికించండి. బ్యాగ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ADVERTISEMENT

Image: Instagram

9. స్లోగన్ బ్యాగ్స్ (Slogan Bags)

9-bag-trends-in-summer

స్లోగన్ హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. అవి స్పెషల్‌గా ఉండటం మాత్రమే కాదు.. మనల్ని సైతం ప్రత్యేకంగా మార్చేస్తాయి. కాబట్టి మీకు నచ్చిన స్లోగన్ ఉన్న బ్యాగ్ ఎంచుకొని ఫ్యాషనబుల్‌గా మెరిసిపోండి.

ADVERTISEMENT

Image: Instagram

ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్ అని చెప్పుకోదగిన బ్యాగ్‌ల గురించి తెలుసుకొన్నారు కదా. మరి  ఏ బ్యాగ్ ఎంచుకొన్నారు? వాటిని కొనుగోలు చేయాలనుకొంటున్నారా? అయితే కిందకు స్క్రోల్ చేయండి. మీకు నచ్చిన బ్యాగ్‌ను ఇక్కడే కొనుగోలు చేయండి.

10-bag-trends-in-summer

POPxo Recommends: Twilly Scarf Croc Embossed Satchel Bag (Rs 667) by Shein

ADVERTISEMENT

11-bag-trends-in-summer

POPxo Recommends: Vacation Calling Tote Bag (Rs 599) by POPxo

12-bag-trends-in-summer

POPxo Recommends: Clear Tote Bag With Snakeskin Inner Pouch (Rs 779) by Shein

ADVERTISEMENT

13-bag-trends-in-summer

POPxo Recommends: No Stopping Me Tote Bag (Rs 599) by POPxo

14-bag-trends-in-summer

POPxo Recommends: Tassel Detail Braided Satchel Bag (Rs 1738) by Shein

ADVERTISEMENT

15-bag-trends-in-summer

POPxo Recommends: Fries Before Guys Pouch (Rs 649) by POPxo

16-bag-trends-in-summer

POPxo Recommends: Bucket Bag With Pouch (Rs 1599) by Koovs

ADVERTISEMENT

17-bag-trends-in-summer

POPxo Recommends: Round Braided Satchel Bag (Rs 1663) by Shein

18-bag-trends-in-summer

POPxo Recommends: Strap Tote Bag-Beige (Rs1170) by FabAlley

ADVERTISEMENT

 

21 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT