Entertainment

RRR సినిమా విడుదల మళ్లీ వాయిదా : అందరినీ నిరాశపరిచిన రాజమౌళి

Sandeep ThatlaSandeep Thatla  |  Feb 6, 2020
RRR సినిమా విడుదల మళ్లీ వాయిదా :  అందరినీ నిరాశపరిచిన రాజమౌళి

Jr NTR, Ram Charan & Ajay Devgn starrer Rajmouli’s RRR movie to be postponed

బాహుబలి 1, 2 చిత్రాలతో ప్రపంచ సినిమానే తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న తరువాత, ఆయన నుండి వచ్చే ప్రతి చిత్రం పై ప్రేక్షకులలో అదేస్థాయి ఆసక్తి ఏర్పడడం సహజం. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న RRR చిత్రం పై కూడా అంతర్జాతీయ దృష్టి పడింది. అందుకు ప్రధానం కారణం బాహుబలి తీసిన దర్శకుడు.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి హాలీవుడ్ నటి ఒలీవియా మారిస్‌ని తీసుకోవడం.

30 ఏళ్ళ గ్యాప్ తరువాత కలిసి నటించబోతున్న.. మెగాస్టార్ చిరంజీవి & కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

అయితే ఈమధ్యకాలంలో RRR చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో.. ప్రేక్షకుల్లో అసహనం బాగా పెరిగిపోయింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల్లో అయితే అదే అసహనం పాళ్ళు మరింత పెరిగి ట్విట్టర్ వేదికగా.. RRR చిత్రం పేజీని టార్గెట్ చేస్తూ వారు విమర్శలకు సైతం దిగడం జరిగింది. దీనంతటిని గమనించిన రాజమౌళి & కో.. ఈ విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో ఇటీవలే RRR కి సంబంధించి ఓ కీలక ప్రకటనను చేశారు.

RRR చిత్రాన్ని ముందుగా ప్రకటించిన జులై 20, 2020 తేదిన కాకుండా.. జనవరి 8, 2021 తేదిన విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి #RRRonJan8th అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో చిత్రం విడుదల తేదీని మార్చడానికి గల కారణాన్ని తెలియచేస్తూ.. “ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని సినిమాని అభిమానుల ముందుకి తీసుకువచ్చే క్రమంలో .. అలాగే క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించే క్రమంలో … ముందుగా అనుకున్న తేదీ ప్రకారం విడుదల చేసేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా… #RRR చిత్రం విడుదల తేదిని మార్చడం జరిగింది” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన మరుక్షణం.. అభిమానులు అనుమానించినదే నిజమవ్వడంతో వారు ఒకింత అసహనానికి గురయ్యారనే చెప్పాలి. అయితే మళ్ళీ వెంటనే.. దర్శకుడు రాజమౌళి  స్టైల్ ఆఫ్ మేకింగ్ తెలుసు కాబట్టి.. ఆయన మెల్లగా తీసినా మంచి సినిమానే తీస్తారు అనే నమ్మకంతో.. తమ హీరోలు కూడా వారి కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే ఒక చిత్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు అని భావిస్తూ.. సినిమా కోసం మరో ఏడాది పాటు నిరీక్షించేందుకు సిద్ధమేనని ట్వీట్లు చేశారు.

Thappad Trailer Talk : భర్త చెంపదెబ్బ కొట్టినందుకు.. విడాకులు కోరిన భార్య కథ

ఇక RRR సినిమాలో కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్  .. ఇటీవలే RRR షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో దర్శకులు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు  తమ సోషల్ మీడియా వేదికల ద్వారా సదరు ఫోటోలని పోస్ట్ చేసి ఆయనకి స్వాగతం పలికారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… RRR చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయిందని.. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్,  అలాగే మరొక షెడ్యూల్‌తో.. RRR చిత్రం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.  ఇక ఈ RRR చిత్రంలో ఒలీవియా మారిస్‌తో పాటుగా ప్రముఖ హాలీవుడ్ నటులు – రే స్టీవెన్ సన్, అలీసన్ డూడిలు కీలక పాత్రల్లో మనకి కనిపిస్తున్నారు.

మరి అనుకున్న సమయానికి రిలీజ్ చేయకుండా.. చిత్రం విడుదల తేదిని వాయిదా వేయడానికి అసలైన కారణాలు రాజమౌళికి మాత్రమే తెలియాలి. అయితే రాజమౌళి మనల్ని ఎంతలా నిరీక్షింపజేసినా సరే… ఆ చిత్రం విడుదలయ్యాక మాత్రం.. ఇదంతా మరిచిపోయి ఆ సినిమాని ఆస్వాదించగలమనే నమ్మకం మాత్రం మనలో చాలామందికి ఉందనేది అక్షర సత్యం.     

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు