ADVERTISEMENT
home / Celebrity Style
రంజాన్ ఫ్యాషన్‌కు.. కాస్త సెలబ్రిటీ టచ్ ఇద్దాం..!

రంజాన్ ఫ్యాషన్‌కు.. కాస్త సెలబ్రిటీ టచ్ ఇద్దాం..!

ముస్లిం సోదరులు ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకొనే ఈద్-ఉల్-ఫితర్ పండగ వచ్చేసింది. దాదాపు నెల రోజుల పాటు రోజా (ఉపవాసాలు) ఆచరించిన వారు ఈ రోజు ఈద్ పండగను జరుపుకొంటారు. అంటే ఈ రోజుతో రంజాన్ (Ramadan) నెల ముగిసినట్లే. పేదవాడి ఆకలి బాధ తెలుసుకోవడం, ఇతరులకు తోచినంత సాయం చేయాలని చెప్పే ఈ రంజాన్ ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. హలీం, షీర్ ఖుర్మా, ఖుర్భానీ కా మీటా వంటి ఎన్నో అద్భుతమైన రుచులతో పాటు కళ్లు చెదిరే ఫ్యాషన్లు(fashions) మనకు కనిపిస్తాయి. చీరలు, లెహంగాలు, షరారాలతో మెరిసిపోతుంటారు. మరి దానికి కాస్త టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీ టచ్ ఇస్తే మరింత అందంగా కనిపిస్తారు.

1. రెజీనా కసాండ్ర

1-ramzan-dress

రెజీనా ధరించిన ఈ డ్రస్ చూడచక్కని కలర్ కాంబినేషన్లో చక్కగా ఉంది. ఎంబ్రాయిడరీకి చమ్కీల మెరుపులు తోడవడంతో డ్రస్ అందంగా మెరిసిపోతుంది. రెజీనా వేసుకొన్న యాక్సెసరీస్ సైతం ఆమె అందాన్ని పెంచుతున్నాయి. యాంటిక్ తరహా ముక్కెర, గాజులు, నెక్లెస్ ఆమె అందాన్ని మరింత పెంచుతున్నాయి.

ADVERTISEMENT

2. రాశి ఖన్నా

2-ramzan-dress

తెలుపు రంగు అనార్కలీ డ్రస్‌లో మెరిసిపోతోంది రాశీఖన్నా. ఈ డ్రస్ పై చేసిన గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ రిచ్ లుక్ అందిస్తుంది. ఈ హైనెక్, ఫుల్ హ్యాండ్స్ డ్రస్ ధరిస్తే ప్రత్యేకించి యాక్సెసరీస్ ధరించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా చేతికి ఉంగరం, చెవులకు జుంకాలు పెట్టుకొంటే సరిపోతుంది.

3. కాజల్

ADVERTISEMENT

3-ramzam-dress

ఎరుపు రంగు లెహంగాలో కాజల్ అచ్చం మహారాణిలా కనిపిస్తోంది కదా. లెహంగా, బ్లౌజ్‌తో దుపట్టాకి వాడిన హెవీ ఎంబ్రాయిడరీ రాయల్ లుక్ అందిస్తోంది. హైనెక్ బ్లౌజ్ ఆ రాజసాన్ని మరింత పెంచుతుంది. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. సాయేషా సైగల్

3-ramzan-dress

ADVERTISEMENT

పీచ్ కలర్ కాంబినేషన్‌లో రూపొందిన పంజాబీ డ్రస్‌లో మెరిసిపోతున్న సాయేషాను చూస్తే రంజాన్ పండగ ఆనందం ఆమె ముఖంలోనే కనిపిస్తుందా అనిపించక మానదు. చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ ఫెస్టివ్ లుక్ ఇస్తుంది ఈ డ్రస్. దుపట్టా అంచులకు చేసిన బోర్డర్ కారణంగా డ్రస్ మరింత అందంగా కనిపిస్తుంది. చెవులకు స్టోన్ ఇయర్ రింగ్స్, చేతులకు సన్నని బ్రేస్ లెట్ పెట్టుకొంటే మీరు కూడా మరింత అందంగా కనిపిస్తారు.

5. మెహరీన్

4-ramzan-dress

చూడముచ్చటైన లెహంగాలో దేవకన్యలా కనిపిస్తోన్న మెహరీన్‌ను చూస్తే మీకేమనిపిస్తుంది. నాకైతే రంజాన్ పండగ కోసం ఇలాగే సిద్ధమైతే బాగుంటుందనిపిస్తోంది. పీచ్ కలర్ నెట్టెడ్ లెహంగాపై చేసిన ఎంబ్రాయిడరీ ఆమెకు రాయల్ లుక్‌ను అందించింది. దానికి తోడు ఆమె అలంకరించుకొన్న యాక్సెసరీస్ మెహరీన్ అందాన్ని మరింత పెంచాయి.

ADVERTISEMENT

ఇది కూడా చదవండి: ఫ్యాషన్స్‌లో కూడా ‘హనీ ఈజ్ ది బెస్ట్’

ప్రగ్యా జైశ్వాల్

5-ramzan-dress

లేతరంగు హైనెక్ అనార్కలీ డ్రస్‌లో ‘కంచె’ భామ ప్రగ్యా చాలా అందంగా మెరిసిపోతుంది. ఈ డ్రస్ పై పూర్తిగా దారంతోనే చేసిన ఎంబ్రాయిడరీ అనార్కలీ డ్రస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. చేతికి కాస్త పెద్ద సైజులో ఉన్న ఉంగరం, ఇయర్ రింగ్స్ ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి.

ADVERTISEMENT

సమంత

6-ramzan-dress

సమంత ధరించిన డ్రస్ ఆమె మెడలోని ఆభరణాలను చూస్తే రంజాన్ పండగకు ఇలాగే సిద్ధమైతే బాగుంటుందనిపించడంలో  ఎలాంటి సందేహం లేదు. బాటమ్ సింపుల్‌గానే ఉన్నప్పటికీ హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్, దానిపై ఆమె ధరించిన కోట్‌కి చేసిన ఎంబ్రాయిడరీ రిచ్ లుక్ అందిస్తున్నాయి.

రష్మీ గౌతమ్

ADVERTISEMENT

7-ramzan-dress

పింక్ కలర్ అనార్కలీ టాప్ పై అదే రంగులోని షరారా ధరించిన రష్మీగౌతమ్ మనకు రంజాన్ ఫ్యాషన్ గోల్స్ నిర్దేశిస్తోంది. గోల్డెన్ కలర్ అంచు వల్ల డ్రస్ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ డ్రస్‌కు మ్యాచింగ్‌గా రష్మీ పెట్టుకొన్న ఇయర్ రింగ్స్ ఆమెను మరింత అందంగా మార్చేస్తున్నాయి.

శ్రీముఖి

8-ramzan-dress

ADVERTISEMENT

లేటెస్ట్ ఫ్యాషన్లను అనుసరించడంలో యాంకర్ శ్రీముఖి అందరికంటే ముందే ఉంటుంది. పీచ్ కలర్‌లోని భిన్నమైన షేడ్స్  ఉన్న ఈ లెహంగా చూడండి. ఎంత అద్భుతంగా ఉందో. చాలా సింపుల్‌గా ఉన్న నెట్టెడ్ లెహంగాకు మ్యాచింగ్‌గా హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్, దానిపై సింపుల్ ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ లాంగ్ కోట్ శ్రీముఖిని మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి. మ్యాచింగ్ చోకర్, ఇయర్ రింగ్స్, చేతికి వెడల్పుగా ఉన్న కడియం ఆమెను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

04 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT