ADVERTISEMENT
home / Education
ఆత్మహత్య యత్నం నుంచి ఆల్ ఇండియా రేడియో వరకూ.. ఓ మహిళ విజయగాథ ఇది..!

ఆత్మహత్య యత్నం నుంచి ఆల్ ఇండియా రేడియో వరకూ.. ఓ మహిళ విజయగాథ ఇది..!

జీవితంలో (Life)  ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగేవాళ్లు చాలామందే. అయితే జీవితంలోని విషాదకరమైన సంఘటనల్లో.. దాన్ని అధిగమించి ముందుకు సాగాలన్న ధైర్యం ఉండడం కూడా అవసరమేనని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. అయితే ఎదుటివారు అలా ఇబ్బందిపడుతుంటే వారికి తోడుగా నిలవడమే అసలైన మానవత్వం.

అలా తోడుగా నిలవకపోయినా.. ఎదుటివారు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం వారిని చిన్న చూపు చూడొద్దు అని చెబుతూ ఆత్మహత్య (suicide )చేసుకోవడానికి ప్రయత్నించిన స్థాయి నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సాధించే స్థాయి వరకూ ఎదిగిన వైనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో పంచుకుంది ఓ ముంబై వనిత. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఆ కథ తన మాటల్లోనే..

అప్పుడు జీవితమంటే నమ్మకం పోయింది.. చాలా రోజులు ఏడ్చా : పరిణీతి చోప్రా

నేను ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టి పెరిగాను. నా చిన్నతనం నుంచి మా అమ్మానాన్నలు ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవారు. మా నాన్నకు వేరే మహిళతో సంబంధం ఉండడం వల్ల.. మా అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. కొన్నాళ్లకు ఈ గొడవలు చాలా ఎక్కువయ్యాయి. మా నాన్న ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం కూడా మానేశాడు. ఓసారి బెల్ట్‌‌తో మా అమ్మ చర్మం వూడిపోయేలా కొట్టాడు.

ADVERTISEMENT

దీంతో అమ్మ ఇక సహించలేక సముద్రంలో మునిగి చనిపోదామనుకుంది. నన్ను బీచ్‌కి తీసుకెళ్లి.. సముద్రంలో ముంచి తాను కూడా మునిగిపోవాలనుకుంది. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో.. తనకు ఏమనిపించిందో.. అలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించకూడదు.. ఆత్మహత్య చేసుకోకూడదు.. ఎదురించాలి అనుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లింది.

Facebook

కొన్ని రోజుల తర్వాత.. తిరిగి మా నాన్న మరోసారి అమ్మను కొట్టాడు. దీంతో అమ్మ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్లు మా నాన్నను పిలిపించి.. వివరాలన్నీ కనుక్కొని తిరిగి పంపించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అలాగే జరిగింది. నాన్న మమ్మల్ని ఇబ్బందిపెట్టడం.. అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించడం ఇలా సాగిపోయింది.

ADVERTISEMENT

ప్రేమలో గాయపడ్డ మనసులకు… సాంత్వన కలిగించే సినిమాలివే..!

నేను కాలేజీలో చేరిన తర్వాత ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. తనతో ఉంటే నా కష్టాలన్నింటినీ మర్చిపోయేదాన్ని. తను నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడు. కానీ నా ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొనేలా నాలో ధైర్యాన్ని నింపాడు. అందుకే నేను చాలా తక్కువ సమయంలో.. అతడికి చాలా దగ్గరయ్యాను. అయితే కొన్ని రోజుల తర్వాత ఓరోజు సడన్‌గా తను నన్ను ప్రేమించట్లేదు.. నాతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేశాడు.

ఆకాశం విరిగి నా తలపై పడిపోయినట్లుగా అనిపించింది. ఆరోజు సాయంత్రమే మా నాన్నకి నాకు పెద్ద గొడవైంది. జీవితంలో నేను అన్నీ పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. అందుకే.. దాంతో బయటకు వెళ్లి ఫినైల్ బాటిల్ కొనుక్కొని తాగేశాను. ఆత్మహత్య చేసుకున్నా. కానీ చనిపోలేదు.

ADVERTISEMENT

Facebook

ఆ తర్వాత నాకు గుర్తున్నదేమిటంటే.. నాలుగు రోజుల తర్వాత ఐసీయూలో ఉన్నాను. నాకు మెలకువ వచ్చిన తర్వాత మా నాన్న వచ్చి.. ఒకవేళ నేను నిజంగా చనిపోవాలనుకుంటే.. మంచి పద్ధతులను వెతుక్కోవాలని చెప్పి వెళ్లారు. ఆ తర్వాత ఓ వారానికి డిశ్చార్జ్ అయ్యాను. కానీ ఆ తర్వాత నా స్నేహితులెవరూ.. నాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. నాలాంటి వ్యక్తితో వారు స్నేహం చేయాలనుకోలేదు. మా చుట్టు పక్కల వారందరికీ మాట్లాడేందుకు.. ఓ ముఖ్యమైన విషయంగా మారిపోయాను. నేను బతికి ఉండడం అనవసరం అని వారి భావన.

అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న

కానీ ఇలా ఆత్మహత్యా యత్నం చేసి ఓడిపోయిన నాకు.. జీవితంలో కొత్త మార్పు కనిపించింది. వైద్యులు నన్ను కౌన్సెలింగ్‌కి వెళ్లమన్నారు. మందులు వాడాను. వీటితో నేను జీవితాన్ని చూసే విధానాన్ని మార్చుకున్నా. నా గతాన్ని నేను అలాగే ఒప్పుకున్నా. దాని నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు.. నన్ను చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నేను, అమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చేశాం.

ADVERTISEMENT

Facebook

ఆపై జర్నలిజంలో పీజీ పూర్తి చేశాను. ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించాను. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నా. ఇప్పుడు నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. నా స్నేహితులతో కలిసి ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాను. దీని ద్వారా మేం అప్పుడప్పుడూ రాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులకు టీ అందించే పని చేస్తుంటాం. పాత రోజులు గుర్తొచ్చినప్పుడు నాకు చాలా బాధనిపిస్తుంది.

నా కథ ద్వారా అందరికీ నేను చెప్పాలనుకుంటోంది ఒకటే.. ఇతరులు జీవితంలో బాధపడుతున్నారనో.. వారి జీవితంలో సమస్యలు ఉన్నాయనో వారిని తప్పుబట్టే ముందు.. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. పెద్దవో.. చిన్నవో అందరికీ సమస్యలుంటాయి. అయితే దాన్ని ఎత్తి చూపించకుండా వారి పట్ల కాస్త మానవత్వం, జాలి, ప్రేమ చూపిద్దాం. అదే మనం బతికి ఉన్నందుకు ఇతరులకు చేయగలిగేది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

22 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT