చిన్నతనంలోనే తల్లి మరణిస్తే.. ఆ పసికూనల జీవితాల్లో నాన్నే ఓ వెలుగు, ఓ వారధి. అన్నం వండి పెట్టడం దగ్గర నుంచీ.. తల దువ్వడం, స్నానం చేయించడం, స్కూలుకి తీసుకెళ్లడం.. ఇలా దాదాపు పనులన్నీ నాన్నే చేస్తాడు. మరో తల్లిని మరిపిస్తాడు. నాన్నంటేనే ఓ తెలియని ధైర్యం… ఓ ఆనందం.. ఓ అద్వితీయమైన అనుబంధం. ఇటీవలే ఇటువంటి నాన్న ప్రేమ గురించి రష్యన్ ఆర్టిస్ట్ సూష్ (Soosh) 13 క్యారికేచర్లు గీశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అవి మీకోసం ప్రత్యేకం
1.తన బిడ్డకు తాను తల్లిగా మారిన వేళ
2.తనకు సేవకుడై.. తన వెన్నంటే తోడుగా ఉండే సంరక్షకుడు
3.తన కూతురి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తూ.. ప్యాన్ కేకులతో పాటు ఐస్ క్రీములూ తినిపించే సమయంలో
4.తన కోసం నలభీముడి అవతారమెత్తి.. వంట చేస్తున్నప్పుడు
5.తన బిడ్డకు దెబ్బ తగిలితే.. తానూ కన్నీళ్లు పెట్టుకుంటాడు
6.బిడ్డే తల్లిగా మారి.. తండ్రికి సేవ చేస్తున్న వేళ
7.తన బిడ్డ అల్లరికి రూమ్ అంతా చిందర వందరగా మారితే.. విసుక్కోకుండా సర్దడానికి రెడీ అయినప్పుడు
8.తన బిడ్డ పెయింటింగ్స్ ఎలా ఉన్నా.. అతనికి అమూల్యమైన వస్తువులే
9.తన బిడ్డ సంతోషం కోసం.. ఆమెకిష్టమైన పుస్తకాన్ని పదే పదే చదువుతాడు
10.తండ్రీ, బిడ్డలు ఇద్దరూ ఒకటై.. స్నేహితుల్లా బట్టలు ఉతుక్కుంటారు
11.చిన్నారి కూతుళ్లకు జడ వేయడం.. తండ్రులకు సవాలే
12.ఇద్దరికీ ఒకే అలవాట్లు ఉంటే..!
13.బిడ్డ ఎంత అల్లరి చేసినా.. మౌనమే తన సమాధానం