Advertisement

Lifestyle

ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?

Lakshmi SudhaLakshmi Sudha  |  Feb 26, 2019
ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?

Advertisement

ఇంట్లో ఒంటరిగా(alone) ఉండే అవకాశం అమ్మాయిల‌కు ఎప్పుడో గానీ రాదు. అలా ఇంట్లో ఒక్కరమే ఉండే అవకాశం వచ్చిందంటే.. ఎగిరి గంతేస్తుంటాం. ఎందుకంటే.. మనకు నచ్చినట్టుగా మ‌నం ఉండేందుకు దొరికే అరుదైన అవకాశమది. పైగా మనతో మనం సమయం గడిపితే కలిగే ఆ ఆనందమే వేరు. అసలు ఆ సమయంలో అమ్మాయిలు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. మరి.. అవేంటో చూసేద్దామా..

1. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనుల్లో మొదటిది అద్దం ముందు సూపర్ డ్యాన్సర్ లెవెల్లో డ్యాన్స్ చేయడం. స్టెప్పులు ఎలా ఉన్నా సరే.. జోష్ ఏ మాత్రం తగ్గదు. పొరపాటున జారి పడ్డామనుకోండి ఓ సారి అటూ ఇటూ చూసి(ఎవరూ లేరని తెలిసినా) మళ్లీ డ్యాన్స్ కంటిన్యూ చేస్తారు.

1-dance

2. ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే మరో పని గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడటం. ఎక్కువ సమయం ఆడుతున్నారని మందలించే వారుండరు కదా..! విసుగొచ్చేంత వరకు అలా ఆడుతూనే ఉంటారు.

3. అద్దం ముందు నిల్చొని.. తనివితీరా అందాన్ని చూసుకొంటూ తమను తాము పొగుడుకొంటారు.

4.  ఇంట్లో నలుమూలలూ కలియతిరుగుతూ సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకొంటారు. ఎందుకంటే.. మందలించడానికి అప్పుడు అమ్మ ఇంట్లో ఉండదు కదా.

6-selfie 

5. గంటల తరబడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం బ్రౌజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫేస్బుక్ పేజీని కచ్చితంగా చెక్ చేస్తారు. యూట్యూబ్ లో రొమాంటిక్ వీడియోలు సెర్చ్ చేసి మరీ చూసేస్తుంటారు.

6. ఇంట్లో ఎవరూ లేకపోతే.. మనకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. అందుకే గట్టిగా పాటలు పాడేస్తుంటారు. ఎవరైనా ఉంటే మన గొంతు విని కళ్లు తిరిగిపడిపోతారనే భయమే ఉండదు. ఏమంటారు?

2-singing

7. ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే మరో పని హార్రర్ సినిమాలు చూడటం. ఓ వైపు భయపడిపోతూనే.. మరోవైపు సినిమా చూస్తుంటారు. నేనైతే.. నిద్రపోయే ముందు మంచం కింద ఓసారి చూసి ఆ తర్వాత పడుకొంటా.(మంచం కింద దెయ్యం ఉందేమోనని డౌట్).

8. నచ్చినంత ఐస్ క్రీం తినేయడం. ఐస్ క్రీం అనే కాదు.. ఇంట్లో ఎవరూ లేకపోతే అలా తింటూనే ఉంటాం. ఏమంటారు అమ్మాయిలు మేం చెప్పింది నిజమే కదా?

5-eating

9. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మనం ఫేసియల్ వేసుకొంటే.. అందరూ మనల్ని ఏడిపిస్తారు. అందుకే ఎవరూ లేనప్పడు కచ్చితంగా అమ్మాయిలు ఫేసియల్ వేసుకొంటారు. దాన్ని తీసేసిన తర్వాత తమ అందం ఎంత పెరిగిపోయిందో అనుకొంటూ అద్దంలో చూసుకొని తెగ‌ మురిసిపోతుంటారు.

10. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు అమ్మాయిలు చేసే మరో పని తమతో తాము మాట్లాడుకోవడం. గతంలో ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే తమను తాము మందలించుకోవడం, మంచి పని చేసిన సందర్భాలను గుర్తు తెచ్చుకొని తమ భుజం తామే తట్టుకోవడం వంటి పనులు చేస్తుంటారు.

చూశారుగా.. అమ్మాయిలు ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు చేసే ప‌నుల్లో ఇవి కొన్ని మాత్ర‌మే. మ‌రి, మీ సంగ‌తేంటి?? మీకు మీ ఇంట్లో ఒంట‌రిగా ఉండే అవ‌కాశం ల‌భిస్తే ఆ స‌మ‌యంలో మీరు ఏం చేస్తారు?? ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోండి.. భ‌లే స‌ర‌దాగా ఉంటుంది..

Featured Image: Pexels

GIFs: Giphy

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

స్కూల్ మెమ‌రీస్.. మ‌న‌ జీవితంలోనే ఉత్త‌మ‌మైన‌వి ఎందుకంటే..

అమ్మాయిలూ.. మీరే ఎందుకంత స్పెషల్

కూతురిపై ప్రేమ‌తో.. అమ్మ ఎక్కువ‌గా అడిగే ప్ర‌శ్న‌లు, ఇచ్చే సూచ‌న‌లు ఇవే..!