Advertisement

Celebrity Weddings

చెల్లెలి ‘పెళ్లి’లో అక్క ‘సీమంతం’.. అద్భుత ఘట్టానికి వేదికైన ‘బబితా ఫొగాట్’ వివాహం..!

Soujanya GangamSoujanya Gangam  |  Dec 4, 2019
చెల్లెలి ‘పెళ్లి’లో అక్క ‘సీమంతం’.. అద్భుత ఘట్టానికి వేదికైన  ‘బబితా ఫొగాట్’ వివాహం..!

Advertisement

Wrestler Geeta Phogat Gets Surprise Baby Shower During Sister Babita Phogat’s Wedding Reception 

మరో రెజ్లర్ వివాహంతో తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. రెజ్లర్ బబితా ఫొగాట్ తన తోటి రెజ్లర్ వివేక్ సుహాగ్‌ని.. ఇటీవలే వివాహమాడింది. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాతో రెజ్లర్స్ గీతా ఫొగాట్, బబితా ఫొగాట్‌లు ఫేమ్ సంపాదించిన సంగతి తెలిసిందే. చిత్రమేంటంటే..  తండ్రి శిక్షణలో చిన్నతనం నుంచే రెజ్లర్లుగా మారిన.. ఈ ఇద్దరు సోదరీమణులు తమ తోటి రెజ్లర్లనే వివాహం చేసుకోవడం విశేషం. బబిత, వివేక్ సుహాగ్‌ల వివాహం ఎంతో ప్రత్యేకం. మరొక విషయం ఏంటంటే.. ఈ పెళ్లి వేడుక వధూవరులు  వివేక్, బబితలకు మాత్రమే కాదు.. అక్క గీతా ఫొగాట్, పవన్ కుమార్ సరోహాలకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. 

బబిత, వివేక్‌లు ఇద్దరూ తమ పెళ్లితో ఓ ప్రత్యేకమైన సందేశాన్ని కూడా అందించారు. పెళ్లిలో ప్రతి వధూవరుల్లా వీరు సప్తపదిలో భాగంగా ఏడు సార్లు హోమం చుట్టూ తిరగకుండా.. ఎనిమిది సార్లు తిరిగి ఒకరికొకరు ఎనిమిది వాగ్దానాలు చేసుకున్నారు. ఆ ఎనిమిదో వాగ్దానం ఏంటో తెలిస్తే.. వీరి వివాహం అందరికీ ఆదర్శమని కచ్చితంగా చెప్పగలం. మామూలుగా పెళ్లిలో వధూవరులు ఇచ్చిపుచ్చుకునే ఏడు వాగ్దానాలతో పాటు ఎనిమిదో వాగ్దానంగా వీరు.. “ఆడపిల్లను రక్షించడం, వారికి విద్యను అందించడం, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం చేస్తామని” వాగ్దానం చేశారు.

ఇలా ప్రతి జంట ముందుకు వెళ్లాలని చెబుతూ.. వీరు సమాజానికి సందేశాన్నిఅందించారు. అయితే వీరు ఇలా సందేశాన్నివ్వడం ఇదే తొలిసారి కాదు.. గతేడాది మరో రెజ్లర్ వినేష్ ఫొగాట్ సోమ్, వీర్ రాఠీల వివాహం సందర్భంగా కూడా వారు కూడా ఇలాంటి సందేశాన్నే అందించారు.

ఈ సందర్భంగా ఆడపిల్లల విద్య ఎంతో ప్రధానమైనది అని చెబుతూ.. “అమ్మాయిల పెళ్లిళ్లు చాలా తక్కువ వయసులోనే చేసేయడం వల్ల వారి భవిష్యత్తు పాడవుతోంది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చాటారు ఈ జంట. ఐదేళ్ల క్రితం దిల్లీలో ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో కలిసిన ఈ జంట.. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అందుకే పెళ్లిలోనూ తమ ప్రత్యేకతను చూపించుకున్నారు. తమ వివాహాన్ని ‘బేటీ బచావో.. బేటీ పడావో’కి అంకితమిచ్చారు. 

ఈ పెళ్లి వేడుకలో మరో ప్రత్యేకత కూడా ఉంది. వీరిద్దరి రిసెప్షన్‌లో భాగంగా గీతా ఫొగాట్ బేబీ షవర్‌ని నిర్వహించారు. డిసెంబర్ 2న ఫొగాట్, సుహాగ్ కుటుంబాలు కొత్తగా పెళ్లైన జంట కోసం రిసెప్షన్‌ని ఏర్పాటు చేశాయి. ఈ ఫంక్షన్‌లో భాగంగా గీతకు బేబీ షవర్ కూడా నిర్వహించడం వల్ల.. ఈ ఫంక్షన్ గీతా ఫొగాట్, పవన్ కుమార్ సరోహాలకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. ఫొగాట్ సిస్టర్స్‌కు మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్న నీతు అంటిల్.. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్టర్డ్ యెల్లో రంగులో ఉన్న గౌన్ ధరించి.. దానిపై ఎరుపు రంగు దుపట్టా వేసుకుంది గీతా ఫొగాట్.

ఈ వేడుకలో భాగంగా గీతకు కిరీటం పెట్టి, ‘మామ్ టు బి’ అంటూ సాష్ ధరింపజేశారు. కళ్లు మూసుకొని ఆ వేదిక వద్దకు తీసుకువచ్చినప్పుడు.. గీత ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆమె ఎంతగా సర్ ప్రైజ్ అయ్యారో చెప్పకనే చెబుతున్నాయి. ఆ తర్వాత పవన్ కుమార్‌కి కూడా ‘డాడ్ టు బి ‘ అనే సాష్‌ని ధరింపజేసి.. బేబీ షవర్ పార్టీని ఎంజాయ్ చేశారు ఫొగాట్ సిస్టర్స్, వారి బంధువులు, స్నేహితులు. ఈ పెళ్లి వేడుకల్లోనే సంగీత ఫొగాట్, భజ్ రంగ్ పూనియాల ఎంగేజ్‌మెంట్ కూడా జరగడం మరో విశేషం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.