ADVERTISEMENT
home / Dating
డేట్ కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి

డేట్ కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి

ఇష్టమైన వ్యక్తితో డేట్ కు వెళుతున్నామంటే.. ఎంతో సంతోషంగా, ఆత్రుతగా ఉంటుంది. అదే సమయంలో కాస్త ఆందోళనగానూ ఉంటుంది. డేట్ ఎలా జరుగుతుంది? అతడు నన్ను ఇష్టపడతాడా? మా ఆలోచనలు ఒకేలా ఉంటాయా? ఇలా రకరకాల ప్రశ్నలు మదిని తొలిచేస్తాయి. డేట్ కి వెళ్లేముందు ఇలాంటి భావనకు లోనవడం సహజం. అలా జరగకుండా ఉండాలంటే.. మేం చెప్పే ఈ టిప్స్ పాటించండి. ఒత్తిడి లేకుండా డేట్ చక్కగా ఎంజాయ్ చేయండి.

1.  అవుట్ ఫిట్ బాగుండాలి

‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు కదా.. అందుకని తొలిచూపులోనే మీ స్నేహితుడి మనసుని దోచుకోవాలంటే.. దానికి తగిన విధంగా మీరు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు పాటించే స్టయిల్ మీరంటే ఏంటో చెప్పకనే చెబుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యం దుస్తులకు ఇవ్వండి. మీరెంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త టైం తీసుకొని మీ వార్డ్ రోబ్ లో మీకు బాగా నప్పే దుస్తులను ఎంచుకోండి. అవసరమైతే మీ స్నేహితురాలి వస్త్రాలనైనా సరే ధరించి వెళ్లండి. మీ బాయ్ ఫ్రెండ్ తొలిచూపులోనే ఫిదా అయిపోతాడు.

 
2. లొకేషన్, లొకేషన్, అంతా లొకేషన్

డేట్ కోసం మీరెంచుకొనే ప్రదేశం గురించి ముందుగానే తెలుసుకోండి. డేట్ కోసం మీరెంచుకొనే రెస్టరెంట్ లేదా కెఫె పెద్ద శబ్ధంతో సంగీతం ప్లే చేసేది కాకూడదు. ఎందుకంటే అలాంటి చోటకి వెళితే గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది డేట్ కి వెళ్లామన్న మీ మూడ్ ను చెడగొట్టవచ్చు. అలాగే అక్కడ ఆహారం రుచి గురించి కూడా తెలుసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఆహారం తింటూ హాయిగా మాట్లాడుకొంటే ఈ సందర్బం మీ జీవితాంతం గుర్తుండిపోతుంది. లేదంటే నిరాశకు లోనవ్వాల్సి వస్తుంది. అందుకే ముందుగానే మీరెంచుకొనే రెస్టారెంట్ లేదా కాఫీషాప్ గురించి తెలుసుకోవడం మంచిది. దీనికోస ఇంటర్నెట్లో ఆయా ప్రదేశాల గురించి వెతకండి. అక్కడ వాటికున్న రివ్యూల ఆధారంగా ఓ మంచి చోటుని ఎంచుకోండి. అవసరమైతే టేబుల్ ని ముందుగానే రిజర్వ్ చేసి ఉంచండి.

ADVERTISEMENT

 

3. అతిగా మేకప్ వద్దు..

తొలిచూపులోనే బాయ్ ఫ్రెండ్ లేదా భాగస్వామి కాబోతున్న వ్యక్తిని ఆకట్టుకోవాలని భావిస్తున్నారు నేటితరం అమ్మాయిలు. దానికి అందంగా కనిపించడం ముఖ్యం. అయితే అందంగా కనిపించాలి కదా అని మేకప్ ఎక్కువ వేసుకొని వెళితే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు.. మీరు వెళ్లే ప్రదేశానికి అనుగుణంగా మీ మేకప్ ఉండాలని గుర్తుంచుకోండి. మేకప్ కంటే ఆత్మవిశ్వాసమే మీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకోండి.

4. ముఖం ప్రకాశవంతంగా

డేట్ కి వెళ్లే ముందు రోజు ఫేసియల్ వేసుకోండి. దానివల్ల మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చర్మం మెరిసిపోతూ ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికోసం పార్లర్ కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ముఖ సౌందర్యాన్ని పెంచే ఫారెస్ట్ ఎస్సెన్సియల్ ఫేషియల్ ఉపయోగించి ఇంట్లోనే మీ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. దీన్ని MyGlamm వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. ఇది మీ చర్మంపై ఉన్న మలినాలను తొలగించి పోషణ ఇస్తుంది. అంతేకాదు ఫారెస్ట్ ఎస్సెన్సియల్ ఉత్పత్తులు వంద శాతం సహజసిద్ధమైనవి. కాబట్టి చర్మానికి ఎలాంటి హాని చేయవు. ఈ సంస్థ ప్రస్తుతం మూడు రకాల ఫేసియల్స్ అందిస్తోంది. ముందు వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని ఉపయోగించండి. ఆ తర్వాత మీరు మాకు కచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతారు.

ADVERTISEMENT

5. సువాసనాభరితంగా..

మనం చూడటానికి అందంగా మాత్రమే ఉంటే సరిపోదు కదా.. మన శరీరం నుంచి చెమట వాసన రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చక్కని వాసనలు వెదజల్లే షవర్ జెల్తో స్నానం చేయండి. ఆ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ వల్ల పర్ఫ్యూమ్ సువాసన ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ స్ప్రే చేసుకోండి.

 
6. ఆహ్లాదకరమైన చిరునవ్వు..

మన చిరునవ్వుతో ఎదుటివారిని కట్టిపడేయచ్చు. మీరు కూడా మీ బాయ్ ఫ్రెండ్ ను మీ అందమైన చిరుదరహాసంతో మీ కొంగున కట్టేయండి. అలా జరగాలంటే నోటి శుభ్రత ముఖ్యం. కాబట్టి డేట్ కి వెళ్లేముందు బ్రష్ చేయండి. అవసరమైతే మౌత్ వాష్ కూడా ఉపయోగించండి. కొంతమందిలో దంతాలను శుభ్రం చేసినప్పటికీ దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు యాలకులను వెంట తీసుకెళ్లడం మంచిది. అవసరమైతే వాటిని నోట్లో వేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టవచ్చు.

7. సరైన నిద్ర ముఖ్యం..

చాలా మంది అమ్మాయిలు డేట్ కి వెళ్లే ముందు నిద్రకు దూరమవుతారు. ఆ రోజు ఎలా గడుస్తుందన్న ఆత్రుత దానికి కారణం. సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ సౌందర్యం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందుకే ఆందోళనలన్నీ పక్కన పెట్టి చక్కగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.  అది మీ అందాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ADVERTISEMENT

 

8. ఏదో ఒకటి మాట్లాడండి..

మనసుకి నచ్చిన వ్యక్తి మనకు ఎదురుగా ఉంటే ఏం మాట్లడాలో తెలియక మౌనంగా ఉండిపోతాం. కానీ డేట్ కి వెళ్లినప్పుడు అలా సిగ్గుపడుతూ కూర్చోవద్దు. అందులోనూ తొలిసారిగా అతన్ని కలుస్తున్నట్లయితే పెద్దగా కబుర్లు చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ ఆసక్తులు, అభిరుచులు తదితర విషయాల గురించి చర్చించుకోవచ్చు.అలా అలా ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకొంటారు.

9. స్టెప్పులేసి ఒత్తిడిని తరిమేయండి..

డేట్ అంటేనే సరదాగా సమయం గడిపే రోజు. కాబట్టి దానికోసం మీరు ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. అయినా మనసు కాస్తయినా ఆందోళనకు లోనవడం సహజమే. మరి దాన్నుంచి బయటపడాలంటే మీకు నచ్చిన పాట వింటూ చక్కగా స్టెప్పులేయండి.

ADVERTISEMENT

ఇది MyGlamm స్పాన్సర్ చేసిన పోస్ట్.

06 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT