Advertisement

Beauty

ఈ స‌మ్మ‌ర్ హెయిర్ స్టైల్స్.. మీరూ ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.. – (Summer Haircuts For Girls In Telugu)

Lakshmi SudhaLakshmi Sudha  |  Jan 28, 2019
ఈ స‌మ్మ‌ర్ హెయిర్ స్టైల్స్.. మీరూ ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.. – (Summer Haircuts For Girls In Telugu)

కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో అమ్మాయిలు అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! నూనె రాసుకోవడం దగ్గర నుంచి దువ్వుకోవడం వరకు.. షాంపూ నుంచి కండిషనింగ్ వరకు ఉపయోగించే ప్రతి ఉత్పత్తిని చాలా శ్రద్ధగా ఎంచుకొంటారు. అంతేనా మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకొంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎలాంటి జడ వేసుకొన్నా అంత ఇబ్బందేమీ అనిపించదు. కానీ రాబోతున్నది వేసవి కాలం (summer).

ఈ సమయంలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, చెమట కారణంగా.. కాస్త చికాగ్గా ఉంటుంది. మరి, వెంట్రుకలు భుజం, మెడపై పడుతుంటే ఈ చిరాకు మరింత ఎక్కువ అవుతుంది. అందుకే సమ్మర్ సీజన్ వచ్చేసరికి చాలామంది హెయిర్ కట్ (hair cut) చేయించుకొంటూ ఉంటారు. స్ట్రెయిట్, కర్లీ, వేవీ – ఇలా చాలా రకాల హెయిర్ కట్స్ ఉన్నాయి. మరి, ఈ సమ్మర్ సీజన్కి  తగినట్లుగా.. సౌకర్యవంతంగా ఉండే 50+ haircuts మీకు పరిచయం చేస్తున్నాం. మీరు హెయిర్ కట్‌కి వెళ్లినప్పుడు ఏదో ఒకటిలే అన్నట్టుగా కాకుండా మీకు నచ్చిన.. మీకు నప్పే హెయిర్ కట్ వేయించుకోండి.

ఈ ఏడాది 10 రకాల ట్రెండీ హెయిర్ కట్స్..

పొట్టి జుట్టున్న వారికి నప్పే హెయిర్ కట్స్

జుట్టు పొడవు మధ్యస్థంగా ఉండేవారికి నప్పే సమ్మర్ హెయిర్ స్టైల్స్

పొడవు జుట్టున్న అమ్మాయిలకు నప్పే హెయిర్ కట్స్

ముఖాకృతికి తగిన హెయిర్ కట్స్

ఈ ఏడాది 10 రకాల ట్రెండీ హెయిర్ కట్స్.. (Trendy Summer Haircuts For Girls In Telugu)

కొత్త ఏడాదితో పాటే.. కొత్త హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ కూడా వస్తాయి. ఫ్యాషన్ షోల నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు ట్రెండ్ సృష్టిస్తాయి. 2018లో ‘బిగ్’ హెయిర్ స్టైల్స్ బాగా పాపులర్ అయ్యాయి. 2019లో నేచురల్ ఫినిష్ హెయిర్ కట్స్ స్టైల్ ప్రత్యేకంగా మన ముందుకు వచ్చేశాయి. ఫ్రెష్ టెక్స్చర్స్.. ఇంట్రస్టెంగ్ స్టైల్తో  మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకొంటాయి. 2018లో హెయిర్ కట్ చేయించుకొంటే.. దాన్ని మెయింటెన్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది కాదు. 2019లో అలాంటి కొన్ని ట్రెండింగ్ హెయిర్ కట్స్ గురించి మీకోసం..

నో – ఫస్ బాబ్ (Know-Fuss Bob Haircut)

పేరుకి తగ్గట్టుగానే ఈ హెయిర్ కట్ చాలా సులువుగా ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. దీనిలో లేయర్స్ ఉండవు. స్టైలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా తలస్నానం చేసి జుట్టును బ్లో డ్రై చేసుకొంటే సరిపోతుంది. దీనికోసం జుట్టుని పొట్టిగా ఉండేలా కత్తిరించుకోవాలి. అంటే చెవులు దిగేలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ మీరు కొత్తగా ప్రయత్నిస్తుంటే.. మరికాస్త పొడవుగా ఉండేలా చూసుకొంటే సరిపోతుంది.

లో మెయింటెనెన్స్ బ్యాంగ్స్ (Low Maintain Bangs)

1-50plus-hair-styles-low-maintain-bangs

Image: Pinterest

ముఖంపై ముంగురులు పడుతున్నట్టుగా ఉండే ఈ హెయిర్ కట్ మీ వయసుని తక్కువ చేసి చూపిస్తుంది. ఇలా తల ముందు భాగంలో ముఖంపై ముంగురులు పడేలా కత్తరించుకోవడమే బ్యాంగ్స్. ఈ హెయిర్ కట్ వేయించుకొంటే సందర్భానికి తగిన లుక్ తెచ్చుకోవచ్చు. ఈ బ్యాంగ్స్‌ను రెండుగా విడదీసి అటూ ఇటూ దువ్వుకోవచ్చు. ఫెదర్స్ మాదిరిగా స్టైల్ చేసుకోవచ్చు. లేదంటే దువ్వకుండా అలానే వదిలేయచ్చు. బ్యాంగ్స్ కట్ చేయించుకొన్నప్పడు.. జుట్టు ముడివేసుకోవచ్చు. కురచగా కత్తిరించుకోవచ్చు.

లాంగ్ పిక్సీ హెయిర్ కట్ (Long Pixie Hair Cut)

2-50plus-hair-styles-long-pixie

Image: Glamour 

సూపర్ షార్ట్ పిక్సీ హెయిర్ కట్స్ గతంలో చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం లాంగర్ పిక్సీ హెయిర్ కట్స్ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. మీకు కర్లీ హెయిర్ లేదా వేవీ హెయిర్ ఉంటే.. మీకు పిక్సీ హెయిర్ కట్ బాగా సూటవుతుంది. ఈ హెయిర్ కట్ మీకు సరికొత్త లుక్ ఇస్తుంది. మీ జుట్టు స్ట్రెయిట్ హెయిర్ అయితే సైడ్-స్వెప్ట్(ఓ పక్క జుట్టు బాగా పొట్టిగా కత్తిరించుకోవడం) స్టైల్ ఫాలో అయితే బాగుంటుంది.

మెర్మాయిడ్ షాగ్ హెయిర్ కట్ (Mermaid Shag Haircut)

3-50plus-hair-styles-Mermaid-Shag-Haircut

Image: Glamour 

ఈ హెయిర్ స్టైల్ 2017లో బాగా పాపులర్ అయింది. ఈ హెయిర్ కట్ మిమ్మల్ని జలకన్య అంత అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ ఏడాది ఈ హెయిర్ స్టైల్‌ని ఫాలో అవ్వడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హెయిర్ కట్ కోసం జుట్టుని లేయర్స్ మాదిరిగా కత్తిరించుకొంటే బాగుంటుంది. కాబట్టి మీ హెయిర్ స్టైలిష్ట్‌తో ఈ విషయం చెప్పి లేయర్డ్ మెర్మాయిడ్ షాగ్ హెయిర్ కట్ చేయించుకోండి.

షాండ్లియర్ లేయర్స్ (Chandler Layers)

జుట్టు పొడవుతో సంబంధం లేకుండా అన్ని రకాల ముఖాకృతుల‌కు ఈ షాండ్లియర్ లేయర్స్ కట్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ హెయిర్ కట్‌లో కురుల వరుసలను చూస్తే షాండ్లియర్ అమరిక గుర్తొస్తుంది. మీ జుట్టు బాగా ఒత్తుగా ఉంటే ఈ హెయిర్ స్టైల్ పాటించకపోవడమే మంచిది.

ఎస్సెమిట్రికల్ అండర్ కట్ ( Asymmetrical Undercut haircut)

4-50plus-hair-styles-Asymmetrical-Undercut

Image: Pinterest

ప్రస్తుతం ఎక్కువ మంది అమ్మాయిలు అండర్ కట్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతున్నారు. బాబ్, పిక్సీ హెయిర్ కట్స్ సమ్మిళితంగా ఉండే ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే.. ఓ వైపు ఒత్తుగా ఉండే కర్లీ హెయిర్ లేదా అలల మాదిరిగా ఉంటే అండర్ కట్ స్టైల్ ఉంటుంది. ఈ హెయిర్ కట్ గురించి మీ హెయిర్ స్టైలిష్ట్‌కి మీరు వివరించడం కష్టం కావచ్చు. అందుకే ఈ హెయిర్ స్టైల్ ఫొటోలు తీసుకెళ్లండి. వీటితో పాటు.. మీరు వద్దనుకొంటున్న హెయిర్ స్టైల్స్ ఫొటోలు కూడా చూపించండి.

స్ట్రాంగ్ బాబ్ (Strong Bob Haircut)

కూల్‌గా ఉండటమే నేటి స్టైల్. అలాంటి కూల్ హెయిర్ స్టైల్ స్ట్రాంగ్ బాబ్. దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. కాలేజీకెళ్లే అమ్మాయైనా.. ఉద్యోగిని అయినా.. ఎంట్రప్రెన్యూర్ అయినా.. ఈ హెయిర్ స్టైల్ అనుస‌రించ‌వ‌చ్చు. మీ జుట్టు తత్వం, రంగు ఏదైనా సరే స్ట్రాంగ్ బాబ్ వేసుకోవచ్చు. మీ జుట్టు ఒత్తుగా ఉంటే కనుక దాన్ని స్ట్రాంగ్ బాబ్‌కి అనుగుణంగా మార్చమని మీ హెయిర్ స్టైలిస్ట్‌ని అడగండి.

ది షాగ్ (Shag Haircut)

5-50plus-hair-styles-the-shag

Image: Pinterest

మీకు బాబ్ గురించి తెలుసా? అదేనండీ లాంగ్ బాబ్. దాన్ని మరింత కుదిస్తే షాగ్ అన్నమాట. కాకపోతే.. దీనిలో లేయర్ కట్ కూడా మిళితమై ఉంటుంది. కురులు సైతం చెదిరినట్టుగా ఉంటాయి. జుట్టు రంగుతో సంబంధం లేకుండా దీన్ని ఫాలో అవ్వొచ్చు. ఈ హెయిర్ స్టైల్‌ను వేసవిలోనే కాదు.. వర్షాకాలం, శీతాకాలంలో కూడా వేసుకోవచ్చు. షాగ్ హెయిర్ కట్ పాటించే వారు క్యాప్ పెట్టుకొంటే చాలా అందంగా ఉంటుంది.

కర్టెన్ బ్యాంగ్స్ (Curtain Bangs Haircut)

ముందువైపు జుట్టుని కాస్త పొడవుగా నుదురుపైకి వచ్చేలా కత్తరించి రెండు పాయలుగా విడదీసి అటూ ఇటూ దువ్వడమే కర్టెన్ బ్యాంగ్స్. ఇలా కత్తిరించిన వెంట్రుకలు పొడవుగానే ఉంటాయి కాబట్టి.. అవసరమైతే.. జుట్టుని వెనక్కు పెట్టి.. పిన్ను పెట్టుకోవచ్చు.

డ్రమాటిక్ పిక్సీ కట్ (Dramatic Pixie Cut)

6-50plus-hair-styles-Dramatic-Pixie-Cut

Image: Pinterest

ఈ షార్ట్ హెయిర్ కట్ మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. దీన్ని మెయింటైన్ చేయడం చాలా సులభమే అయినా.. మీకు తగినట్టుగా హెయిర్ కట్ చేయడం చాలా కష్టం. ఈ హెయిర్ కట్ చేయించుకొనే విషయంలో మీ హెయిర్ స్టైలిస్ట్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

ఈ హెయిర్ కట్స్ మీకు నప్పుతాయా? లేదా? అనే సందేహం మీకుందా? మీ జుట్టు పొడవుని బట్టి మీకు ఏ హెయిర్ స్టైల్ బాగుంటుందో తెలుసుకోవాలనుందా? అయితే చదవండి.

పొట్టి జుట్టున్న వారికి నప్పే హెయిర్ కట్స్ (Haircuts For Short Hair)

పొట్టి జుట్టున్నవారికి హెయిర్ స్టైల్ ఎంచుకొనేటప్పుడు చాలానే ఆప్షన్లుంటాయి. పైగా కేశసంరక్షణ కోసం వీరు పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. హెయిర్ కేర్ ఉత్పత్తుల కోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. మరి, వీరికి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో ఓసారి చూద్దాం.

సైడ్ – స్వెప్ట్ పిక్సీ కట్ (Side – Swept Pixie Cut)

7-50plus-hair-styles-Side-Swept-Pixie-Cut

Image: Pinterest

మీ ముఖం కోలగా, గుండ్రంగా, చదరంగా ఎలా ఉన్నా సరే ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది. జుట్టు పక్కకు దువ్వినట్టుగా ఉండే స్టైల్ ఎవ్వరికైనా అందంగానే ఉంటుంది.

బాబ్-మీట్స్-పిక్సీ (Pop-Meets-Disney Haircut)

సగం బాబ్ స్టైల్, మరో సగం పిక్సీ స్టైల్ మాదిరిగా కనిపించే ఈ హెయిర్ కట్ కురుల పొడవు తక్కువగా ఉన్నవారు పాటించదగినది. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ హెయిర్ స్టైల్ తమ జుట్టు పొడవు తగ్గించుకోవాలనుకొనేవారికి సైతం మంచి ఎంపిక.

సిగ్నేచర్ బాబ్ (Signature Bob Haircut)

8-50plus-hair-styles-signature-bob

Image: Glamour

షార్ట్ హెయిర్ ఉన్న అమ్మాయిలకు ఈ హెయిర్ కట్ క్లాస్ లుక్ ఇస్తుంది. 80-90ల నాటి ఈ హెయిర్ స్టైల్ నేటి తరం అమ్మాయిల మనసు దోచుకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

లాంగ్ పిక్సీ (Lonf Pixie Haircut)

మీకు నో ఫస్ పిక్సీ కట్ బాగా నచ్చిందా? కానీ మరీ అంత పొట్టిగా జుట్టు కత్తిరించుకోవడం ఇష్టం లేదా? అయితే మీరు లాంగ్ పిక్సీని ప్రయత్నించవచ్చు. ఈ హెయిర్ స్టైల్ కోల ముఖం కలిగినవారికి చాలా బాగుంటుంది.

గ్రాడ్యుయేటెడ్ బాబ్ (Graduated Bob Haircut)

9-50plus-hair-styles-graduated-bob

Image: Pinterest

ముఖాకృతి, జుట్టు తత్వం ఏదైనా సరే ఈ హెయిర్ కట్ చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ హెయిర్ స్టైల్‌లో వెంట్రుకలు ముందుకీ వెనక్కీ వేలాడుతూ.. కొంత పొడవుగా, కొంత పొట్టిగా ఉండటంతో డిఫరెంట్ లుక్ వస్తుంది.

బ్లంట్ బ్యాంగ్స్ విత్ బాబ్ (Blunt Bangs With Bob)

బ్యాంగ్స్, బాబ్ హెయిర్ స్టైల్స్ కలయికే బ్లంట్ బ్యాంగ్స్ విత్ బాబ్. బాబ్ హెయిర్ కట్ సాదాసీదాగా ఉందనే భావన ఉన్నవారు వాటికి బ్యాంగ్స్ సొగసులను జోడిస్తే చాలా బాగుంటుంది. దీనికి తగిన హెయిర్ కలర్ కూడా ఉంటే మరింత అందంగా ఉంటుంది.

జుట్టు పొడవు మధ్యస్థంగా ఉండేవారికి నప్పే సమ్మర్ హెయిర్ స్టైల్స్ (Summer Haircuts)

సందర్భానికి తగినట్లుగా కురులను స్లైల్ చేసుకోవడానికి వీలుగా వీరి కురులుంటాయి. వారికి తగిన హెయిర్ స్టైల్ లభిస్తే.. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. అందంగానూ కనిపిస్తారు.

ది మెస్సీ లాబ్ (The Messy Lob Haircut)

10-50plus-hair-styles-messy-lob

Image: Pinterest

మీకు బాబ్ గురించి తెలుసా? అదేనండీ లాంగ్ బాబ్.. జుట్టు పొడవు మధ్యస్థంగా ఉండేవారికి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.

ఎక్స్ట్రీమ్ లేయర్స్ (Extreme Layers)

మీడియం పొడవులో ఉన్న మీ జుట్టును ఒత్తుగా కనిపించేలా చేసుకోవాలనుకొంటున్నారా? అయితే ఈ ఎక్స్ట్రీమ్ లేయర్ హెయిర్ కట్ ప్రయత్నించండి.

సైడ్ బ్యాంగ్స్ విత్ ఎ లాబ్ (Side Bangs With Lob)

11-50plus-hair-styles-sidebangs-with-lob

Image: Pinterest

జుట్టు పొడవు మధ్యస్థంగా ఉండే అమ్మాయిల్లో ఎక్కువ మంది పాటించడానికి ఇష్టపడే హెయిర్ స్టైల్ ఇది. ఈ హెయిర్ స్టైల్ ప్రత్యేకత ఏంటో తెలుసా? తల ముందు భాగంలో ఉన్న జుట్టు పొడవుగా, వెనకున్న జుట్టు పొట్టిగా ఉంటుంది.

సింగిల్ లెంగ్త్ హెయిర్ (Single Length Hair)

11-50plus-hair-styles-single-length

Image: Pinterest

జుట్టు సాఫ్ట్‌గా ఉండి.. పొడవు భుజాల వరకు ఉంటే.. ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చు. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు ఈ హెయిర్ స్టైల్ ఫాలో అవ్వడానికే ఇష్టపడుతున్నారు.

బ్లంట్ బ్యాంగ్స్ విత్ ఎ లాబ్ (Blunt Bangs)

వేసవిలో ఉండే ఉక్కపోత కారణంగా చెమట అధికంగా పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కాస్త చికాగ్గా ఉండటమూ సహజమే. కానీ ఈ హెయిర్ స్టైల్ పాటిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. బ్లంట్ బ్యాంగ్స్‌కి లాంగ్ బాబ్ జోడిస్తే మరింత అందంగా ఉంటుంది.

పొడవు జుట్టున్న అమ్మాయిలకు నప్పే హెయిర్ కట్స్ (Haircuts For Long Hair)

పొడవు జుట్టున్నప్పటికీ తమకు నచ్చిన హెయిర్ స్టైల్ ఫాలో అవ్వాలనుకొనే లాంగ్ హెయిర్ గర్ల్స్ కోసమే ఈ హెయిర్ స్టైల్స్.

ఫ్రంట్ లేయర్స్ (Front Layers)

సింపుల్‌గా ఉన్నా స్లైలిష్‌గా కనిపించేలా చేసే ఈ హెయిర్ కట్ పొడవు జుట్టున్నవారికి చాలా బాగుంటుంది. కురులు భుజాలను దాటి ఉన్నవారు ఈ హెయిర్ స్టైల్ పాటించవచ్చు. ముఖంపైకి ముంగురులు పడుతున్నట్టుగా కేశాలను ట్విస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీ ముఖం స్క్వేర్ షేప్‌లో ఉన్నట్లయితే… జుట్టు చివరలు మాత్రమే ట్విస్ట్ చేస్తే బాగుంటుంది.

మిడ్ వే లేయర్స్ (Midway Layers)

12-50plus-hair-styles-midway-Layers

Image: Pinterest

పొడవుజుట్టున్న అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్న స్టైల్ ఇది. కిమ్ కర్దాషియాన్ కూడా ఇదే హెయిర్ కట్ ఫాలో అవుతోంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా కనబడాలనుకొనేవారికి ఇది సరైన ఎంపిక. మీ జుట్టు స్ట్రైట్, లాంగ్ హెయిర్ మీదైతే.. మిడ్ లేయర్ కట్ చాలా బాగుంటుంది.

లాంగ్ హెయిర్ విత్ బ్యాంగ్స్ (Long Hair With Bangs)

60ల నాటి క్లాసిక్ హెయిర్ కట్ ఇది. ఈ హెయిర్ కట్ చేయించుకొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ హెయిర్ స్టైల్ ఫాలో అవ్వాలనుకొనేవారు వైడ్ బ్యాంగ్స్‌కి దూరంగా ఉండాలి. త్రికోణాకృతిలో ఉండేలా జుట్టు కత్తిరిస్తే బాగుంటుంది. లేదా మీ ముఖాకృతికి తగినట్టుగా బ్యాంగ్స్ కత్తిరించమని మీ హెయిర్ స్టైలిస్ట్ కి చెప్పండి.

ఆల్ ఎరౌండ్ లేయర్స్ (Layers All Around)

13-50plus-hair-styles-All-Around-Layers

Image Source: Pinterest

అలల మాదిరిగా ఉండే ఈ హెయిర్ స్టైల్ ఎవరికైనా నప్పుతుంది. మీ హెయిర్ స్టైలిస్ట్ మీ జుట్టును పాయలుగా విడదీసి అక్కడక్కడా రెండు అంగుళాల మేర కత్తిరిస్తారు. ఆపై షాంపూ చేసి బ్లోడ్రై చేసుకొంటే సరిపోతుంది.

ముఖాకృతికి తగిన హెయిర్ కట్స్ (Haircuts According To Your Face)

ముఖం గుండ్రంగా ఉండేవారికి నప్పే హెయిర్ కట్స్: స్ట్రెయిట్ బాబ్, నేచురల్ వేవ్స్, లాంగ్ అండ్ స్ట్రెయిట్, లాంగ్ హెయిర్ విత్ పిక్సీ, టెక్స్చర్డ్ పిక్సీ, టెక్స్చర్డ్ బాబ్

హార్ట్ షేప్ ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ కట్స్: ది లాబ్, లాంగ్ పీసీ బ్యాంగ్స్, బ్లంట్ బ్యాంగ్స్ విత్ లేయర్స్, ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్, స్లీక్ క్రాప్

స్క్వేర్ షేప్ ముఖం ఉన్నవారికి నప్పే హెయిర్ కట్స్: లాబ్ విత్ సైడ్ బ్యాంగ్స్, ఎసెమిట్రిక్ బాబ్స్, లాంగ్ లేయర్డ్ అండ్ స్ట్రెయిట్, లాంగ్ పిక్సీ, రౌండెడ్ బాబ్

 

Featured Image: Samantha Ruth Prabhu Instagram

ఇవి కూడా చ‌ద‌వండి

టీనేజ్ అమ్మాయిలను ఫిదా చేస్తున్నా.. దీపిక స్టైల్ “స్మోకీ ఐ మేకప్”

హెల్త్ సరిగ్గా లేకున్నా ఆఫీసుకి వెళ్లాల్సొస్తే.. ఏం చేయాలి..?

నూనె కాని నూనె.. జొజోబా నూనె అందించే సౌందర్య ప్రయోజనాలివే..!