logo
Logo
User
home / Diet
పుట్టగొడుగులతో చేసిన స్నాక్స్ తినండి.. మధుమేహాన్ని దూరం చేసుకోండి

పుట్టగొడుగులతో చేసిన స్నాక్స్ తినండి.. మధుమేహాన్ని దూరం చేసుకోండి

(Health Benefits of Mushroom)

పుట్టగొడుగులు.. అనేక సంవత్సరాలు ఈ వైవిధ్యమైన ఆహారం పై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా కుళ్లిన పదార్థాలున్న చోట ఇది పెరుగుతుంది కాబట్టి.. దీని మీద అనేక సంశయాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మంచిదా..? లేదా అనారోగ్య హేతువా..? అనే సందేహాలు కూడా జనాలకు గతంలో కలిగాయి. కానీ ఇవన్నీ పక్కనపెడితే.. మంచి ఔషధ గుణాలు కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు అనడంలో సందేహం లేదు. వర్షాకాలం వస్తే చాలు.. చాలామందికి ఇది ఫేవరెట్ ఫుడ్ కూడా.

అందంగా, ఆరోగ్యంగా మారిపోవాలా? అయితే డీటాక్స్ వాటర్ ప్రయత్నించి చూడండి..

మీకోసం విషయం తెలుసా.. పుట్టగొడుగులలో ఇర్గోథియైనైన్, సెలీనియం అనే రెండు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయట. మనలోని రోగాలకు కారకాలయ్యే ప్రీ రాడికల్స్‌‌ని ఇవి ఎదుర్కోవడమే కాకుండా… వాటిని నిర్మూలిస్తాయి కూడా. అలాగే పుట్టగొడుగులలో 80 నుండి 90 శాతం వరకూ నీరే ఉంటుంది. రోజుకి దాదాపు పావు కిలో చొప్పున.. పుట్టగొడుగులను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.

బాదం పప్పు తింటే.. ఉండదు మన ఆరోగ్యానికి ముప్పు 

పుట్టగొడుగులను చాలామంది మాంసాహారంతో సమానంగా చూస్తారు. ఇందులోని పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుందట. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ ముప్పును కూడా తొలిగిస్తాయి. పుట్టగొడుగుల వల్ల ఒక రకంగా భూమి కూడా సారవంతంగా మారుతుందట. దీనికి ఉండే చనిపోయే మొక్కలను రీసైకిల్ చేసే గుణం వల్ల.. విలువైన పోషకాలు భూమిలోకి ఇంకిపోతాయట. అలాగే పుట్టగొడుగులలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుందట. చైనా, జపాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ వారి సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది అగ్ర స్థానమే. 

 

అలాగే గుండె జబ్బులతో బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చట. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారం కావడం వల్ల.. అదేవిధంగా కొలెస్ట్రాల్ అసలు లేని కారణంగా పుట్టగొడుగులను వారికి అనువైన ఆహారంగా భావించవచ్చని పలువురు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరగుతుంది. అదేవిధంగా మొక్కల్లో కనిపించే క్లోరోఫిల్ ఇందులో కనిపించదు. అందుకే తెల్లగా ఉంటాయి. అందుకే వీటిని పూర్తి మొక్కలుగా పరిగణించలేం. 

గర్భిణులు ‘కుంకుమ పువ్వు’ కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా..?

అలాగే మొటిమలు, యాక్నె సమస్యలతో బాధపడేవారు.. పుట్టగొడుగుల పొడితో ఫేస్ ప్యాక్ కూడా తయారుచేసుకోవచ్చు. అందుకోసం పుట్టగొడుగులను తొలుత పొడి చేయాలి. తర్వాత ఓ టీస్పూన్ మష్రూమ్ పొడికి.. మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్, రెండు చుక్కల నూనె, అరటీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ మాదిరిగా కూడా వాడుకోవచ్చట. అలాగే చర్మం పొడిబారకుండా ఉండాలన్నా కూడా.. ఈ ప్యాక్‌ను వాడవచ్చు. దీని వల్ల చర్మం తేటగా మారడమే కాకుండా.. ముఖానికి సరికొత్త కాంతిని కూడా కలిగిస్తుంది. 

Images: Pixabay

2020 సంవత్సరాన్ని సరికొత్త2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి                                                                                                                                       
 

 

 

16 Jan 2020

Read More

read more articles like this

Read More

read more articles like this
good points logo

good points text